< Salmos 98 >
1 Canten a Yavé un canto nuevo, Porque Él hizo maravillosas cosas. Su mano derecha y su santo brazo ganaron la victoria para Él.
౧ఒక కీర్తన. యెహోవాకు కొత్త పాట పాడండి. ఆయన అద్భుతాలు చేశాడు. ఆయన కుడి చెయ్యి, ఆయన పవిత్ర హస్తం మనకు విజయం తెచ్చాయి.
2 Yavé hizo notoria su salvación. Ha manifestado su justicia a la vista de las naciones.
౨యెహోవా తన రక్షణను వెల్లడిచేశాడు. రాజ్యాలన్నిటికీ తన న్యాయాన్ని కనపరిచాడు.
3 Ha recordado su misericordia y su fidelidad a la casa de Israel. Todos los confines de la tierra vieron la salvación de nuestro ʼElohim.
౩ఆయన ఇశ్రాయేలు వంశం పట్ల తన నిబంధన విశ్వసనీయత, తన నమ్మకత్వం గుర్తు చేసుకున్నాడు. భూదిగంతాలు మన దేవుని విజయాన్ని చూస్తారు.
4 ¡Aclamen a Yavé toda la tierra! ¡Prorrumpan y canten de gozo y canten salmos!
౪లోకమా, యెహోవాకు ఆనందంతో కేకలు వేయండి. ఉల్లాసంగా పాడండి. పాటలెత్తి ఆనందంగా పాడండి. ప్రస్తుతులు పాడండి.
5 Canten salmos a Yavé con arpa Y con voz de canto,
౫తీగ వాయిద్యంతో యెహోవాకు ప్రశంసలు పాడండి. తీగ వాయిద్యంతో మధురంగా పాడండి.
6 Con trompetas y al sonido de la corneta. ¡Aclamen con gozo ante el Rey Yavé!
౬బాకాలతో కొమ్ముబూర ధ్వనితో, రాజైన యెహోవా ఎదుట సంతోషంగా కేకలు వేయండి.
7 Brame el mar y los que moran en él, El mundo, y los que en él habitan.
౭సముద్రం, దానిలో ఉన్నదంతా ఘోషిస్తుంది గాక. లోకం, దాని నివాసులు కేకలు వేస్తారు గాక!
8 Batan sus manos los ríos. Que las montañas en conjunto se regocijen
౮నదులు చప్పట్లు కొట్టాలి. కొండలు ఆనందంతో కేకలు పెట్టాలి.
9 Delante de Yavé, Porque Él viene a juzgar la tierra. Juzgará al mundo con justicia, Y a los pueblos con equidad.
౯లోకానికి తీర్పు తీర్చడానికి, నీతితో ప్రపంచ ప్రజలందరికీ తీర్పు తీర్చడానికి యెహోవా రాబోతున్నాడు.