< Salmos 132 >
1 Acuérdate, oh Yavé, de David, Y de toda su aflicción.
౧యాత్రల కీర్తన యెహోవా, దావీదుకు దాపురించిన బాధలన్నిటినీ అతడి తరపున జ్ఞాపకం చేసుకో.
2 De cómo juró a Yavé, Y prometió al Fuerte de Jacob:
౨అతడు ఏ విధంగా యెహోవాకు ప్రమాణం చేశాడో, పరాక్రమశాలి అయిన యాకోబు దేవుడికి ఏమి వాగ్దానం చేశాడో మనసుకు తెచ్చుకో.
3 Ciertamente no entraré en mi tienda, Ni subiré a mi cama.
౩నేను యెహోవా కోసం ఒక స్థలం చూసే దాకా,
4 No concederé sueño a mis ojos, Ni a mis párpados calma,
౪యాకోబు పరాక్రమశాలికి ఒక నివాస స్థలం సమకూర్చేదాకా నా ఇంట్లో అడుగు పెట్టను.
5 Hasta que halle lugar para Yavé, Tabernáculo para el Fuerte de Jacob.
౫నా కళ్ళకు నిద్ర, నా కనురెప్పలకు విశ్రాంతి రానివ్వను.
6 Ciertamente oímos de ello en Efrata. Lo hallamos en el campo del bosque.
౬ఆ స్థలం ఎఫ్రాతాలో ఉన్నట్టు విన్నాం. యాయరు పొలంలో అది దొరికింది.
7 Entremos en su Tabernáculo, Postrémonos ante el estrado de sus pies.
౭యెహోవా మందిరానికి వెళ్దాం పదండి. రండి, ఆయన పాదపీఠం ఎదుట సాష్టాంగపడదాం.
8 Oh Yavé, levántate [y ven] al lugar de tu reposo, Tú y el Arca de tu poder.
౮యెహోవా, లే. నీ విశ్రాంతి స్థలానికి రా.
9 Que tus sacerdotes se vistan de justicia, Y se regocijen tus santos.
౯నీ యాజకులు న్యాయాన్ని ధరించుకుంటారు గాక. నీ భక్తులు జయజయ ధ్వానాలు చేస్తారు గాక.
10 Por amor a David tu esclavo, No vuelvas el rostro de tu ungido.
౧౦నీ సేవకుడైన దావీదు మొహం చూసి నీ అభిషిక్తునికి విముఖత చూపించకు.
11 En verdad Yavé juró a David, Y no se retractará de ello: De tu descendencia sentaré en tu trono.
౧౧నీ సంతానాన్ని నీ సింహాసనానికి శాశ్వత వారసులుగా చేస్తాను అనీ, దావీదు పట్ల నమ్మకంగా ఉంటాననీ ఆయన శపథం చేశాడు.
12 Si tus hijos observan mi Pacto, Y mi testimonio que Yo les enseño, Tus hijos también se sentarán en tu trono para siempre.
౧౨నీ కొడుకులు నా నిబంధన పాటిస్తే నేను నేర్పిన నా శాసనాలు అనుసరిస్తే ఇలా జరుగుతుంది, అన్నాడు.
13 Porque Yavé escogió a Sion. La deseó para morada suya:
౧౩తప్పనిసరిగా యెహోవా సీయోనును ఎన్నుకున్నాడు. దాన్ని తన నివాసస్థలంగా కోరుకున్నాడు.
14 Este es el lugar de mi reposo para siempre. Aquí moraré, porque lo deseé.
౧౪ఇది నేను కోరుకున్న స్థలం. ఇది శాశ్వతంగా నా విశ్రాంతి స్థలంగా ఉంటుంది. ఇక్కడే నేను నివసిస్తాను.
15 Con abundancia bendeciré su provisión, Y saciaré de pan a sus necesitados.
౧౫దానిలో ఆహారం సమృద్ధిగా ఉండేలా దీవిస్తాను. దానిలోని పేదలను చాలినంత ఆహారంతో తృప్తి పరుస్తాను.
16 Vestiré con salvación a sus sacerdotes, Y sus santos darán voces de júbilo.
౧౬దాని యాజకులకు రక్షణ ధరింపజేస్తాను. దానిలో భక్తులు ఎలుగెత్తి హర్ష ధ్వానాలు చేస్తారు.
17 Allí retoñará el poder de David. Dispuse una lámpara para mi ungido.
౧౭అక్కడే దావీదు వంశానికి చిగురు మొలకెత్తేలా చేస్తాను. అక్కడే నా అభిషిక్తుని కోసం నేను ఒక దీపం సిద్ధం చేసి ఉంచాను.
18 A sus enemigos vestiré de vergüenza, Pero sobre él resplandecerá su corona.
౧౮అతని శత్రువులు అవమానం ధరించుకునేలా చేస్తాను. అతని కిరీటం మాత్రం ప్రకాశిస్తుంది.