< Nehemías 7 >
1 Cuando el muro quedó reconstruido y coloqué las hojas de las puertas, los porteros, los cantores y los levitas se encargaron de sus funciones.
౧నేను సరిహద్దు గోడలు కట్టి, తలుపులు నిలబెట్టిన తరువాత కాపలా కాసేవాళ్లను, గాయకులను, లేవీయులను నియమించాను.
2 Entonces puse al frente de Jerusalén a mi hermano Hanani, y a Hananías, jefe de la ciudadela, pues éste era un hombre fiel y temía a ʼElohim más que muchos.
౨తరువాత నా సహోదరుడు హనానీ, కోట అధికారి హనన్యాలకు యెరూషలేం బాధ్యతలు అప్పగించాను. హనన్యా అందరికంటే ఎక్కువగా దేవుడంటే భయం గల నమ్మకమైన వ్యక్తి.
3 Les dije: Las puertas de Jerusalén no serán abiertas hasta que caliente el sol. Aunque los porteros estén presentes, las puertas permanecerán cerradas y trancadas. Sean designados vigías de entre los habitantes de Jerusalén, cada cual en su vigilia, y cada uno frente a su propia casa.
౩అప్పుడు నేను “బాగా పొద్దెక్కే దాకా యెరూషలేం ద్వారాలు తెరవ వద్దు. ప్రజలంతా దగ్గరగా నిలబడి ఉన్నప్పుడు ద్వారపాలకులు తలుపులు మూసి వాటికి అడ్డగడియలు పెట్టాలి. అంతేకాక, యెరూషలేంలో నివాసముండే వారంతా తమ వంతుల ప్రకారం తమ ఇళ్ళకు ఎదురు కాపలా కాసేలా నియమించుకోవాలి” అని చెప్పాను.
4 Porque la ciudad era espaciosa y grande, pero la gente que vivía allí era poca, y las casas aún no estaban reconstruidas.
౪ఇప్పుడు పట్టణం విశాలంగా పెద్దదిగా ఉంది. జనాభా కొద్దిమందే ఉన్నారు. ఎవరూ ఇంకా ఇళ్ళు కట్టుకోలేదు.
5 Mi ʼElohim puso en mi corazón reunir a los notables, los jefes y el pueblo, para que fueran reconocidos por genealogía, pues yo encontré el rollo de la genealogía de los que subieron primero, donde hallé escrito:
౫ప్రధానులను, అధికారులను, ప్రజలను వంశాల వారీగా సమకూర్చి జనాభా లెక్క సేకరించాలని నా దేవుడు నా హృదయంలో ఆలోచన పుట్టించాడు. ఆ సమయంలో మొదట తిరిగి వచ్చిన వారి గురించి రాసిన వంశావళి ఉన్న గ్రంథం నాకు కనబడింది. అందులో రాసి ఉన్న వంశావళులు ఇవి.
6 Estos son hijos de la provincia que subieron del cautiverio de los que fueron deportados, a quienes Nabucodonosor, rey de Babilonia, se llevó, y que regresaron a Jerusalén y Judá, cada uno a su ciudad,
౬బబులోను రాజు నెబుకద్నెజరు చెరలోకి తీసుకు పోగా తిరిగి యెరూషలేం, యూదా దేశంలోని తమ తమ పట్టణాలకు తిరిగి వచ్చిన జెరుబ్బాబెలు, యేషూవ, నెహెమ్యా, అజర్యా, రయమ్యా, నహమానీ, మొర్దెకై, బిల్షాను, మిస్పెరేతు, బిగ్వయి, నెహూము, బయనా అనే వాళ్ళతోపాటు
7 quienes vinieron con Zorobabel, Jesuá, Nehemías, Azarías, Raamías, Nahamani, Mardoqueo, Bilsán, Misperet, Bigvay, Nehum, Baana. El número de los varones del pueblo de Israel fue:
౭తిరిగి వచ్చిన ఇశ్రాయేలీయుల జనసంఖ్య యిదే.
౮పరోషు వంశం వారు 2, 172 మంది.
9 hijos de Sefatías: 372;
౯షెఫట్య వంశం వారు 372 మంది.
౧౦ఆరహు వంశం వారు 652 మంది.
11 hijos de Pahat-moab, de los hijos de Jesuá y Joab: 2.818;
౧౧యేషూవ, యోవాబు వంశాల్లోని పహత్మోయాబు కుటుంబీకులు 2, 818 మంది.
౧౨ఏలాము వంశం వారు 1, 254 మంది.
౧౩జత్తూ వంశం వారు 845 మంది.
౧౪జక్కయి వంశం వారు 760 మంది.
౧౫బిన్నూయి వంశం వారు 648 మంది.
౧౬బేబై వంశం వారు 628 మంది.
17 hijos de Azgad: 2.322;
౧౭అజ్గాదు వంశం వారు 2, 322 మంది.
18 hijos de Adonicam: 667;
౧౮అదోనీకాము వంశం వారు 667 మంది.
19 hijos de Bigvay: 2.077;
౧౯బిగ్వయి వంశం వారు 2,067 మంది.
౨౦ఆదీను వంశం వారు 655 మంది.
21 hijos de Ater, de Ezequías: 98;
౨౧హిజ్కియా బంధువైన అటేరు వంశం వారు 98 మంది.
౨౨హాషుము వంశం వారు 328 మంది.
౨౩జేజయి వంశం వారు 324 మంది.
౨౪హారీపు వంశం వారు 112 మంది.
౨౫గిబియోను వంశం వారు 95 మంది.
26 varones de Belén y de Netofa: 188;
౨౬బేత్లెహేముకు చెందిన నెటోపా వంశం వారు 188 మంది.
27 varones de Anatot: 128;
౨౭అనాతోతు గ్రామం వారు 128 మంది.
28 varones de Bet-azmavet: 42;
౨౮బేతజ్మావెతు గ్రామం వారు 42 మంది.
29 de Quiriat-jearim, Cafira y Beerot: 743;
౨౯కిర్యత్యారీము, కెఫీరా, బెయేరోతు గ్రామాల వారు 743 మంది.
30 varones de Ramá y de Geba: 621;
౩౦రమా, గెబ గ్రామాల వారు 621 మంది.
31 varones de Micmás: 122;
౩౧మిక్మషు గ్రామం వారు 122 మంది.
32 varones de Bet-ʼEl y de Hai: 123;
౩౨బేతేలు, హాయి గ్రామాల వారు 123 మంది.
33 varones del otro Nebo: 52;
౩౩రెండవ నెబో గ్రామం వారు 52 మంది.
34 varones del otro Elam: 1.254;
౩౪రెండవ ఏలాము గ్రామం వారు 1, 254 మంది.
౩౫హారిము వంశం వారు 320 మంది.
౩౬యెరికో వంశం వారు 345 మంది.
37 hijos de Lod, Hadid y Ono: 721;
౩౭లోదు, హదీదు, ఓనో వంశాల వారు 721 మంది.
38 hijos de Senaa: 3.930.
౩౮సెనాయా వంశం వారు 3, 930 మంది.
39 Los sacerdotes: hijos de Jedaía, de la casa de Jesuá: 973;
౩౯యాజకుడు యేషూవ కుటుంబీకుడైన యెదాయా వంశం వారు 973 మంది.
౪౦ఇమ్మేరు వంశం వారు 1,052 మంది.
41 hijos de Pasur: 1.247;
౪౧పషూరు వంశం వారు 1, 247 మంది.
42 hijos de Harim: 1.017.
౪౨హారిము వంశం వారు 1,017 మంది.
43 Los levitas, hijos de Jesuá, de Cadmiel, de los hijos de Hodavías: 74.
౪౩లేవీ గోత్రికులైన యేషూవ, హోదవ్యా, కద్మీయేలు వంశాల వారు 74 మంది.
44 Los cantores, hijos de Asaf: 148.
౪౪పాటలు పాడే ఆసాపు వంశం వారు 148 మంది.
45 Los porteros, hijos de Salum, hijos de Ater, hijos de Talmón, hijos de Acub, hijos de Hatita, hijos de Sobay: 138.
౪౫ద్వారపాలకులైన షల్లూము, అటేరు, టల్మోను, అక్కూబు, హటీటా, షోబయి వంశాల వారు 138 మంది.
46 Los servidores, hijos de Ziha, hijos de Hasufa, hijos de Tabaot,
౪౬నెతీనీయులైన జీహా, హశూపా, టబ్బాయోతు వంశాల వారు.
47 hijos de Queros, hijos de Siaha, hijos de Padón,
౪౭కేరోసు, సీయహా, పాదోను వంశాల వారు.
48 hijos de Lebana, hijos de Hagaba, hijos de Salmai,
౪౮లెబానా, హగాబా, షల్మయి వంశాల వారు.
49 hijos de Hanán, hijos de Gidel, hijos de Gahar,
౪౯హానాను, గిద్దేలు, గహరు వంశాల వారు.
50 hijos de Reaía, hijos de Rezín, hijos de Necoda,
౫౦రెవాయ, రెజీను, నెకోదా వంశాల వారు.
51 hijos de Gazam, hijos de Uza, hijos de Paseah,
౫౧గజ్జాము, ఉజ్జా, పాసెయ వంశాల వారు.
52 hijos de Besai, hijos de Mehunim, hijos de Nefisesim,
౫౨బేసాయి, మెహూనీము, నెపూషేసీము వంశాల వారు.
53 hijos de Bacbuc, hijos de Hacufa, hijos de Harhur,
౫౩బక్బూకు, హకూపా, హర్హూరు వంశాల వారు.
54 hijos de Bazlut, hijos de Mehída, hijos de Harsa,
౫౪బజ్లీతు, మెహీదా, హర్షా వంశాల వారు.
55 hijos de Barcos, hijos de Sísara, hijos de Tema,
౫౫బర్కోసు, సీసెరా, తెమహు.
56 hijos de Nezía, hijos de Hatifa,
౫౬నెజీయహు, హటీపా వంశాల వారు.
57 hijos de los esclavos de Salomón, hijos de Sotay, hijos de Soferet, hijos de Perida,
౫౭సొలొమోను సేవకుల, దాసుల వంశాల వారు, సొటయి వంశం వారు. సోపెరెతు, పెరూదా వంశాల వారు.
58 hijos de Jaala, hijos de Darcón, hijos de Gidel,
౫౮యహలా, దర్కోను, గిద్దేలు వంశాల వారు.
59 hijos de Sefatías, hijos de Hatil, hijos de Poqueret-hazebaim, hijos de Amón:
౫౯షెఫట్య, హట్టీలు, జెబాయీం బంధువు పొకెరెతు, ఆమోను వంశాల వారు.
60 Todos los servidores y los hijos de los esclavos de Salomón eran 392.
౬౦దేవాలయ సేవకులందరూ, సొలొమోను దాసుల వంశాల వారు 392 మంది.
61 Y éstos son los que subieron de Telmela, Telharsa, Querub, Adón e Imer, y no pudieron indicar sus casas paternas, ni su linaje, ni si eran de Israel o no:
౬౧తేల్మెలహు, తేల్హర్షా, కెరూబు, అదోను, ఇమ్మేరు మొదలైన గ్రామాల నుండి కొందరు వచ్చారు. కానీ వాళ్ళు తమ పూర్వీకుల కుటుంబాలు, వంశాలు ఇశ్రాయేలు గోత్రాల్లో ఉన్నట్టు రుజువులు చూపించ లేకపోయారు.
62 Los hijos de Delaía, los hijos de Tobías, los hijos de Necoda: 642.
౬౨వీళ్ళెవరంటే, దెలాయ్యా, టోబీయా, నెరోదా వంశాల వారు 642 మంది,
63 Y de los sacerdotes: los hijos de Habaía, los hijos de Cos, los hijos de Barzilay, el cual tomó esposa de las hijas de Barzilay galaadita, con el nombre del cual fue llamado.
౬౩హబాయ్యా, హక్కోజు, బర్జిల్లయి వంశాల వారు. అంటే, గిలాదీయుడు బర్జిల్లయి కూతుళ్ళలో ఒకామెను పెళ్లి చేసుకోవడం ద్వారా ఆ పేరుతో పిలువ బడిన బర్జిల్లయి వంశస్థులు, యాజక సంతానం వారు.
64 Éstos buscaron su registro genealógico pero no fue hallado, por lo cual fueron excluidos del sacerdocio por estar impuros.
౬౪వారు వంశావళి గ్రంథంలో తమ పేర్లు వెదికారు గానీ అవి కనబడలేదు. కాబట్టి వారిని అపవిత్రమైన వారుగా ఎంచి యాజకుల జాబితా నుండి తొలగించారు.
65 Y el gobernador les dijo que no comieran de las cosas santas hasta que se levantara sacerdote con Urim y Tumim.
౬౫ఊరీం, తుమ్మీం, ధరించగల ఒక యాజకుణ్ణి నియమించేదాకా దేవునికి ప్రతిష్టితమైన పదార్ధాలను తినకూడదని ప్రజల అధికారి వాళ్ళకు ఆదేశించాడు.
66 Toda la congregación reunida era de 42.360,
౬౬అక్కడ సమకూడిన ప్రజలంతా మొత్తం 42, 360 మంది.
67 aparte de sus esclavos y sus esclavas, que eran 6.336; y entre ellos había 245 cantores y cantoras.
౬౭వీరు కాకుండా వీరి పనివారు, పనికత్తెలు 7, 337 మంది. గాయకుల్లో స్త్రీలు, పురుషులు కలిపి 245 మంది.
68 Sus caballos eran 736, y sus mulas 245.
౬౮వారి దగ్గర 736 గుర్రాలు, 245 కంచర గాడిదలు,
69 Sus camellos eran 435, y sus asnos 6.730.
౬౯435 ఒంటెలు, 6, 720 గాడిదలు ఉన్నాయి.
70 Algunos jefes de las casas paternas aportaron para la obra. El gobernador dio al tesoro 8 kilogramos de oro, 50 tazones y 530 túnicas sacerdotales.
౭౦వంశాల నాయకుల్లో కొందరు పని కోసం ఆర్ధిక సహాయం చేశారు. అధికారి 120 తులాల బంగారం, 50 పళ్ళాలు, 530 యాజక వస్త్రాలు ఖజానాలో జమ చేశాడు.
71 Algunos jefes de las casas paternas ofrendaron 160 kilogramos de oro y 1.210 kilogramos de plata para el tesoro de la obra.
౭౧వంశాల ప్రముఖుల్లో కొందరు 2, 400 తులాల బంగారం, 14 లక్షల తులాల వెండి ఖజానాలోకి ఇచ్చారు.
72 El resto del pueblo dio 160 kilogramos de oro, 1.100 kilogramos de plata y 67 túnicas sacerdotales.
౭౨మిగతా ప్రజలు ఇచ్చినవి 2, 400 తులాల బంగారం, 12, 72, 720 తులాల వెండి, 67 యాజక వస్త్రాలు.
73 Los sacerdotes y levitas, los porteros y cantores, algunos del pueblo, los servidores y todo Israel vivieron nuevamente en sus ciudades. Cuando llegó el mes séptimo los hijos de Israel estaban en sus ciudades.
౭౩అప్పుడు యాజకులు, లేవీ గోత్రం వారు, ద్వారపాలకులు, గాయకులు, దేవాలయ సేవకులు, ప్రజల్లో కొందరు, ఇశ్రాయేలీయులంతా ఏడవ నెలకల్లా తమ తమ గ్రామాల్లో కాపురం ఉన్నారు.