< Habacuc 2 >

1 Me pondré sobre mi torre de vigilante. Me plantaré en mi muro y observaré desde arriba para ver lo que Él me dice y qué responde a mi queja.
ఆయన నాకు ఏమి సెలవిస్తాడో, నా వాదం విషయమై నేనేమి చెబుతానో చూడడానికి నేను నా కావలి స్థలంపైనా గోపురంపైనా కనిపెట్టుకుని ఉంటాననుకున్నాను.
2 Y Yavé me respondió: Escribe la visión y escúlpela en tablillas, para que cualquiera la pueda leer con rapidez.
యెహోవా నాకు ఇలా చెప్పాడు. చదివేవాడు పరిగెత్తేలా, నీవు ఆ దర్శన విషయాన్ని పలక మీద స్పష్టంగా రాయి.
3 Porque aún es visión para el tiempo señalado. Ella se apresura hacia la meta y no fallará. Aunque demore, espérala, porque ciertamente vendrá y no tardará.
ఆ దర్శన విషయం రాబోయే కాలంలో జరుగుతుంది. అది ఎంత మాత్రం విఫలం కాదు. అది ఆలస్యమైనా తప్పక నెరవేరుతుంది. దాని కోసం కనిపెట్టు. అది ఆలస్యం చేయక వస్తుంది.
4 Mira, aquel cuya alma no es recta está envanecido, pero el justo vivirá por su fe.
మనిషి ఆత్మ తనలో తాను ఉప్పొంగుతుంది. అది యథార్థంగా ఉండదు. అయితే నీతిమంతుడు తన విశ్వాసమూలంగా బ్రదుకుతాడు.
5 Además, el vino traiciona al arrogante, de manera que no se queda en casa. Ensancha su apetito como el Seol, y es como la muerte que nunca está satisfecha. Además, reúne a todos los pueblos y apila a todas las naciones para él. (Sheol h7585)
ద్రాక్షారసం గర్విష్టి యువకుణ్ణి మోసం చేసి నిలవననీయకుండా చేస్తుంది. అతని ఆశలను పాతాళమంతగా విస్తరింప జేస్తుంది. మరణం లాగా అది తృప్తినొందదు. అతడు సకలజనాలను వశపరచుకుంటాడు. ప్రజలందరినీ తన కోసం సమకూర్చుకుంటాడు. (Sheol h7585)
6 ¿Todos ellos no levantarán refranes y sarcasmos contra él? Dirán: ¡Ay del que multiplica lo que no es suyo! ¿Hasta cuándo acumula prenda tras prenda?
తనది కాని దాన్ని ఆక్రమించి అభివృద్ధి పొందిన వాడికి బాధ. తాకట్టు సొమ్మును నీవు ఎంతకాలం పట్టుకుంటావు? వాడు ఎన్నాళ్లు నిలుచును అని చెప్పుకుంటూ వీరంతా ఇతని విషయం ఉపమానరీతిగా అపహాస్యపు సామెత ఎత్తుతారు గదా.
7 ¿Sus acreedores no se levantarán de pronto? ¿No se despertarán los burladores, los que lo oprimen con violencia? Será objeto de su rapiña.
పళ్ళు కొరికే వారు హటాత్తుగా వస్తారు. నిన్ను హింస పెట్టబోయేవారు లేస్తారు. నీవు వారికి దోపుడు సొమ్ముగా ఉంటావు.
8 Porque despojaste a muchas naciones, las demás naciones te despojarán, por causa de la sangre humana derramada y de la violencia hecha a la tierra, a la ciudad y a sus habitantes.
నువ్వు అనేక రాజ్యాలను దోచుకున్నావు కాబట్టి మిగిలిన ప్రజలంతా నిన్ను దోచుకుంటారు. పట్టణాలకు వాటిలోని నివాసులకు నీవు చేసిన హింసాకాండను బట్టి, బలాత్కారాన్ని బట్టి, నిన్ను కొల్లగొడతారు.
9 ¡Ay del que obtiene ganancia injusta para su casa y pone en alto su nido para escapar de la calamidad!
తనకు అపాయం రాకుండా తన నివాసాన్ని ఎత్తుగా చేసుకుని, తన యింటివారి కోసం అన్యాయంగా లాభం సంపాదించుకొనే వాడికి బాధ.
10 Tomaste consejo vergonzoso para tu casa, aniquilaste a muchos pueblos y pecaste contra tu vida.
౧౦నీవు చాలా మంది జనాలను నాశనం చేస్తూ నీ మీద నీవే అవమానం తెచ్చుకున్నావు. నీ దురాలోచన వలన నీకు వ్యతిరేకంగా నీవే పాపం చేశావు.
11 Por eso la piedra clamará desde el muro, y la viga del enmaderado le responderá.
౧౧గోడల్లోని రాళ్లు మొర్ర పెడుతున్నాయి. దూలాలు వాటికి జవాబిస్తాయి.
12 ¡Ay del que edifica la ciudad con derramamiento de sangre, y del que funda una ciudad con iniquidad!
౧౨రక్తపాతం మూలంగా పట్టణం కట్టించే వారికి బాధ. దుష్టత్వం మూలంగా ఊరిని స్థాపించే వారికి బాధ.
13 ¿No procede esto de Yavé de las huestes? Los pueblos trabajan para el fuego y las naciones se fatigan en vano.
౧౩జాతులు ప్రయాసపడతారు గాని అగ్ని పాలవుతారు. వ్యర్థమైన దాని కోసం కష్టపడి ప్రజలు క్షీణించిపోతారు. ఇది సేనల ప్రభువు యెహోవా చేతనే అవుతుంది.
14 Porque la tierra será llena del conocimiento de la gloria de Yavé como las aguas cubren el mar.
౧౪ఎందుకంటే సముద్రం జలాలతో నిండి ఉన్నట్టు భూమి యెహోవా మహాత్మ్యాన్ని గూర్చిన జ్ఞానంతో నిండి ఉంటుంది.
15 ¡Ay del que da de beber a su prójimo, y le añade su veneno, y lo embriaga para recrearse en su desnudez!
౧౫తమ పొరుగు వాణ్ణి నగ్నంగా చూడాలని విషం కలిపి వారికి తాగించి వారిని మత్తులుగా చేసేవారికి బాధ.
16 Te llenaste de deshonra más que de honra. ¡Bebe tú también, y deja al descubierto tu prepucio! La copa de la mano derecha de Yavé se volverá contra ti, y lo fétido caerá sobre tu resplandor.
౧౬ఘనతకు మారుగా అవమానంతో నిండిపోతావు. నీవు కూడా తాగి నీ నగ్నత కనపరచుకుంటావు. యెహోవా కుడిచేతిలోని పాత్ర నీ చేతికి వస్తుంది. అవమానకరమైన వాంతి నీ ఘనత మీద పడుతుంది.
17 Porque te cubrirá la violencia hecha al Líbano, la matanza de las bestias aterrorizadas, la sangre humana derramada y la violencia hecha a la tierra, a la ciudad y a todos los que viven en ella.
౧౭లెబానోనునకు నీవు చేసిన బలాత్కారం నీ మీదికే వస్తుంది. నీవు పశువులను చేసిన నాశనం నీ మీదే పడుతుంది. దేశాలకు, పట్టణాలకు, వాటి నివాసులకు, నీవు చేసిన హింసాకాండను బట్టి, ఇది సంభవిస్తుంది.
18 ¿De qué sirve la escultura que talla el artífice, si es una imagen, un maestro de mentiras? ¿De qué sirve al artífice confiar en su obra, cuando hace ídolos mudos?
౧౮చెక్కిన విగ్రహం వల్ల నీకు ప్రయోజనమేమిటి? బొమ్మను చెక్కిన శిల్పి, పోత పోసిన వాడు కేవలం అబద్ధాలు బోధించే వాడు. తాను చేసిన పోత విగ్రహాలపై నమ్మిక ఉంచడం వలన ప్రయోజనమేమిటి?
19 Ay del que dice al leño: ¡Despierta! Y a la piedra muda: ¡Levántate! ¿Podrá el ídolo enseñar? Ciertamente está recubierto de oro y plata, pero no hay espíritu en él.
౧౯కర్ర విగ్రహాలను చూసి మేలుకో అనీ, మూగరాతి ప్రతిమలను చూసి లే అనీ చెప్పేవాడికి బాధ. అవి ఏమైనా బోధించగలవా? దానికి బంగారంతో, వెండితో పూత పూశారు గానీ దానిలో శ్వాస ఎంత మాత్రం లేదు.
20 Pero Yavé está en su santo Templo: ¡Calle delante de Él toda la tierra!
౨౦అయితే యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. లోకమంతా ఆయన సన్నిధిలో మౌనంగా ఉండు గాక.

< Habacuc 2 >