< Josué 16 >

1 La suerte salió para los hijos de José desde el Jordán en Jericó, en las aguas de Jericó al oriente, hasta el desierto, subiendo desde Jericó por la región montañosa hasta Betel.
యోసేపు సంతతి వారికి వచ్చిన వంతు యెరికో దగ్గర యొర్దాను నుండి
2 Salía de Betel a Luz, y pasaba por el límite de los arquitas hasta Atarot;
తూర్పున ఉన్న యెరికో నీటి ఊటలు వరకూ, యెరికో నుండి బేతేలు కొండ సీమ వరకూ ఉంది.
3 y descendía hacia el oeste hasta el límite de los jafletitas, hasta el límite de Bet Horón el inferior, y seguía hasta Gezer; y terminaba en el mar.
అది బేతేలు నుండి లూజు వరకూ పోయి అతారోతు అర్కీయుల సరిహద్దు వరకూ సాగి కింద బేత్‌హోరోను వరకూ గెజెరు వరకూ పడమటివైపుగా యప్లేతీయుల సరిహద్దు వరకూ వ్యాపించింది. దాని సరిహద్దు సముద్రం దగ్గర అంతం అయింది.
4 Los hijos de José, Manasés y Efraín, tomaron su herencia.
అక్కడ యోసేపు కుమారులు, మనష్షే ఎఫ్రాయిం సంతతి వారు స్వాస్థ్యాన్ని పొందారు.
5 Este fue el límite de los hijos de Efraín según sus familias. El límite de su herencia hacia el este era Atarot Addar, hasta Bet Horón el superior.
ఎఫ్రాయిమీయుల సరిహద్దు, అంటే వారి వంశాల ప్రకారం వారికి ఏర్పడిన సరిహద్దు అతారోతు అద్దారు నుండి ఎగువ బేత్‌ హోరోను వరకూ తూర్పుగా వ్యాపించింది.
6 La frontera salía hacia el oeste en Micmetat, al norte. La frontera giraba hacia el este hasta Taanat Silo, y pasaba por ella al este de Janoa.
వారి సరిహద్దు మిక్మెతాతు దగ్గర ఉన్న సముద్రం వరకూ పశ్చిమోత్తరంగా వ్యాపించి ఆ సరిహద్దు తానాత్ షిలోహు వరకూ తూర్పువైపుగా చుట్టూ తిరిగి యానోహా వరకూ తూర్పున దాని దాటి
7 Bajaba de Janoa a Atarot, a Naarah, llegaba a Jericó y salía al Jordán.
యానోహా నుండి అతారోతు వరకూ, నారా వరకూ యెరికోకు తగిలి యొర్దాను దగ్గర అంతమయింది.
8 Desde Tappua, el límite se extendía hacia el oeste hasta el arroyo de Caná, y terminaba en el mar. Esta es la herencia de la tribu de los hijos de Efraín según sus familias;
తప్పూయ మొదలు ఆ సరిహద్దు కానా వాగు వరకూ పశ్చిమంగా వ్యాపించింది. అది వారి వంశాల ప్రకారం ఎఫ్రాయిమీయుల గోత్ర స్వాస్థ్యం.
9 junto con las ciudades que fueron apartadas para los hijos de Efraín en medio de la herencia de los hijos de Manasés, todas las ciudades con sus aldeas.
ఎఫ్రాయిమీయులకు అక్కడక్కడ ఇవ్వబడిన పట్టణాలు పోతే ఆ పట్టణాలన్నీ వాటి పల్లెలు మనష్షీయుల స్వాస్థ్యంలో ఉన్నాయి.
10 No expulsaron a los cananeos que vivían en Gezer; pero los cananeos habitan en el territorio de Efraín hasta el día de hoy, y se han convertido en siervos para realizar trabajos forzados.
౧౦అయితే గెజెరులో నివసించిన కనానీయులను వారు వెళ్ళగొట్ట లేదు. ఇప్పటి వరకూ ఆ కనానీయులు ఎఫ్రాయిమీయుల మధ్య నివసిస్తూ వారికి దాస్యం చేస్తూ ఉన్నారు.

< Josué 16 >