< Amós 4 >
1 Escuchen este mensaje, vacas de Basán que habitan en el Monte de Samaria, que oprimen a los pobres y a los necesitados, y dan órdenes a sus esposos, diciéndoles: “¡tráigannos bebidas!”
౧సమరయ పర్వతం మీద ఉన్న బాషాను ఆవులారా, పేదలను అణిచేస్తూ దిక్కులేని వాళ్ళని బాధిస్తూ, మీ భర్తలతో “మాకు సారాయి తీసుకు రా” అనే మీరు, ఈ మాట వినండి.
2 El Señor Dios ha Jurado por su santidad: ¡Tengan cuidado! Porque vendrá el tiempo en el que las sacarán con anzuelos; cada uno de ustedes será como un pez enganchado a un anzuelo.
౨యెహోవా ప్రభువు తన పరిశుద్ధత తోడని చేసిన ప్రమాణం ఇదే, “మిమ్మల్ని కొక్కేలతో పట్టుకుని తీసుకుపోయే రోజు వస్తూ ఉంది. మీలో మిగతావారిని చేపల గాలాలతో పట్టుకుపోతారు.
3 Saldrán por las brechas de los muros de la ciudad, arrojadas en dirección al Monte Harmón.
౩మీరంతా ప్రాకారాల్లో పగుళ్ళగుండా దూరి వెళ్లిపోతారు. మిమ్మల్ని హెర్మోను పర్వతం బయట పారవేస్తారు.” యెహోవా ప్రకటించేది ఇదే.
4 ¿Por qué no van a Betel y pecan? ¿Irán a Guilgal para multiplicar sus pecados? Ofrezcan sacrificios en la mañana, y traigan diezmos después de tres dias.
౪బేతేలుకు వచ్చి తిరుగుబాటు చేయండి. గిల్గాలుకు వెళ్లి ఇంకా ఎక్కువగా తిరుగుబాటు చేయండి. ప్రతి ఉదయం బలులు తీసుకు రండి. మూడు రోజులకు ఒకసారి మీ పదో భాగాలు తీసుకురండి.
5 Quemen pan sin levadura como ofrenda de agradecimiento, y anuncien sus ofrendas voluntarias para que todos lo sepan. ¡Porque eso es lo que les gusta los Israelitas! Declara el Señor Dios.
౫రొట్టెతో కృతజ్ఞత అర్పణ అర్పించండి. స్వేచ్ఛార్పణలు ప్రకటించండి. వాటి గురించి చాటించండి. ఇశ్రాయేలీయులారా, ఇలా చేయడం మీకిష్టం గదా. యెహోవా ప్రకటించేది ఇదే.
6 Yo me aseguré de que no tuvieran nada que comer en sus ciudades, y que hubiera escasez de dinero en donde habitaban, pero aún así no volvieron a mi, dice el Señor.
౬మీ పట్టణాలన్నిటిలో మీకు తినడానికి ఏమీ లేకుండా చేశాను. మీరున్న స్థలాలన్నిటిలో మీకు ఆహారం లేకుండా చేశాను. అయినా మీరు నా వైపు తిరుగలేదు. యెహోవా ప్రకటించేది ఇదే.
7 Yo detuve la Lluvia cuando faltaban tres meses antes de la cosecha. La lluvia caía en una ciudad y no en otra. Así mismo caía en un campo y no en otro.
౭కోతకాలానికి మూడు నెలలు ముందే వానలేకుండా చేశాను. ఒక పట్టణం మీద వాన కురిపించి మరొక పట్టణం మీద కురిపించలేదు. ఒక చోట వాన పడింది, వాన పడని పొలం ఎండిపోయింది.
8 La gente andaba de ciudad en ciudad buscando agua, pero seguían sedientos. Y aún así no volvieron a mi, dice el Señor.
౮రెండు మూడు ఊర్లు మంచినీళ్ళ కోసం మరొక ఊరికి ఆత్రంగా పోతే అక్కడ కూడా వాళ్లకి సరిపోయినంత నీళ్ళు దొరకలేదు. అయినా మీరు నా వైపు తిరగలేదు. యెహోవా ప్రకటించేది ఇదే.
9 Golpeé sus granjas y viñedos con pestes y moho; las langostas devoraron sus higueras y sus árboles de olivo. Pero aún así no volvieron a mi, dice el Señor.
౯విస్తారమైన మీ తోటలన్నిటినీ తెగుళ్ళతో నేను పాడు చేశాను. మీ ద్రాక్షతోటలనూ అంజూరపు చెట్లనీ ఒలీవచెట్లనూ మిడతలు తినేశాయి. అయినా మీరు నావైపు తిరగలేదు. యెహోవా ప్రకటించేది ఇదే.
10 Les envié una plaga como lo hice en Egipto. Maté a sus hombres más jóvenes en batalla; tomé sus caballos e hice que soportaran la pestilencia de los cuerpos muertos en sus campos. Pero aún así no volvieron a mi, dice el Señor.
౧౦నేను ఐగుప్తీయుల మీదికి తెగుళ్లు పంపించినట్టు మీ మీదికి తెగుళ్లు పంపాను. మీ యువకులను కత్తితో చంపేశాను. మీ గుర్రాలను తీసుకుపోయారు. మీ శిబిరాల్లో పుట్టిన చెడ్డ వాసన మీ ముక్కుల్లోకి ఎక్కింది. అయినా మీరు నా వైపు తిరగలేదు. యెహోవా ప్రకటించేది ఇదే.
11 A algunos de ustedes los destruí como destruí a Sodoma y Gomorra. Ustedes fueron como un tizón arrebatado del fuego. Pero aún así no volvieron a mi, dice el Señor.
౧౧దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేసినట్టు నేను మీలో కొంతమందిని నాశనం చేశాను. మీరు మంటలోనుంచి లాగేసిన కట్టెల్లాగా తప్పించుకున్నారు. అయినా మీరు నా వైపు తిరగలేదు. యెహోవా ప్రకటించేది ఇదే.
12 Por ello, esto es lo que haré contigo, Israel. ¡Prepárate para el encuentro con tu Dios!
౧౨కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీపట్ల కఠినంగా ఇలా చేస్తాను. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీ దేవుణ్ణి కలుసుకోడానికి సిద్ధపడండి.
13 Él fue quien hizo las montañas, quien creó el viento, quien reveló sus pensamientos a la humanidad, quien convirtió el sol en oscuridad, quien camina en los lugares altos de la tierra. ¡El Señor, Dios de poder es su nombre!
౧౩పర్వతాలను రూపించే వాడూ గాలిని పుట్టించేవాడూ ఆయనే. ఆయన తన ఆలోచనలను మనుషులకు వెల్లడి చేస్తాడు. ఉదయాన్ని చీకటిగా మారుస్తాడు. భూమి ఉన్నత స్థలాల మీద నడుస్తాడు. ఆయన పేరు సేనల ప్రభువు యెహోవా.