< Proverbios 15 >
1 Una respuesta blanda calma el furor, una palabra áspera excita la ira.
౧సున్నితమైన మాట కోపాన్ని తగ్గిస్తుంది. నొప్పించే మాట కోపం రేపుతుంది.
2 La lengua de los sabios hace amable la sabiduría, la boca de los fatuos profiere sandeces.
౨జ్ఞానుల నోరు మనోహరమైన జ్ఞానాంశాలు పలుకుతుంది. మూర్ఖుల నోరు తెలివి తక్కువతనాన్ని కుమ్మరిస్తుంది.
3 En todo lugar están los ojos de Yahvé, observando a malos y buenos.
౩యెహోవా కళ్ళు లోకమంతా చూస్తూ ఉంటాయి. చెడ్డవాళ్ళని, మంచివాళ్ళని అవి చూస్తూ ఉంటాయి.
4 Mansedumbre de lengua, árbol de vida; lengua perversa, quebranto del corazón.
౪మృదువైన మాటలు పలికే నాలుక జీవవృక్షం వంటిది. కుటిలమైన మాటలు ఆత్మను క్రుంగదీస్తాయి.
5 El necio desprecia la corrección de su padre; mas quien acepta la amonestación se hace más sabio.
౫మూర్ఖుడు తన తండ్రి చేసే క్రమశిక్షణను ధిక్కరిస్తాడు. బుద్ధిమంతుడు దిద్దుబాటును స్వీకరిస్తాడు.
6 En la casa del justo abunda la hacienda; en tanto que en las empresas del impío hay pérdidas.
౬నీతిమంతుల ఇల్లు గొప్ప ధనాగారం వంటిది. మూర్ఖునికి కలిగే సంపద బాధలపాలు చేస్తుంది.
7 La lengua de los sabios difunde la sabiduría; no así el corazón del insensato.
౭జ్ఞానుల మాటలు తెలివిని వ్యాప్తి చేస్తాయి. మూర్ఖుల మనస్సు స్థిరంగా ఉండదు.
8 Yahvé detesta el sacrificio de los malos, y le agrada la oración de los buenos.
౮భక్తిహీనులు అర్పించే బలులంటే యెహోవాకు అసహ్యం. నీతిమంతుల ప్రార్థన ఆయనకు ఎంతో ఇష్టం.
9 El camino del malvado es abominación para Yahvé, el cual ama a aquel que sigue la justicia.
౯దుర్మార్గుల మార్గాలు యెహోవాకు హేయమైనవి. నీతిని అనుసరించి నడుచుకునే వారిని ఆయన ప్రేమిస్తాడు.
10 Lección dura recibe el que abandona el camino; halla la muerte, quien aborrece la corrección.
౧౦సన్మార్గం విడిచిపెట్టిన వాడు తీవ్ర కష్టాలపాలౌతాడు. దిద్దుబాటును వ్యతిరేకించే వారు మరణిస్తారు.
11 El scheol y el abismo están (patentes) ante Yahvé, ¡cuánto más los corazones de los hombres! (Sheol )
౧౧మృత్యులోకం, నాశనకరమైన అగాధం యెహోవాకు తేటగా కనబడుతున్నాయి. మనుషుల హృదయాలు ఆయనకు మరింత తేటగా కనబడతాయి గదా? (Sheol )
12 El burlador no ama al que le reprende, ni se junta con sabios.
౧౨అపహాసకుడు తనకు బుద్ధి చెప్పే వాళ్ళను ప్రేమించడు. వాడు జ్ఞానుల మంచి మాటల కోసం వారి దగ్గరికి వెళ్లడు.
13 El corazón alegre hace el rostro amable; mas la tristeza del corazón quebranta el espíritu.
౧౩ఆనందంగా ఉండే హృదయం వదనాన్ని వికసించేలా చేస్తుంది. మనోవేదన ఆత్మను కృంగదీస్తుంది.
14 El corazón inteligente busca la sabiduría, la boca del necio se pace con sandeces.
౧౪తెలివి గలవారి మనస్సు జ్ఞానం కోసం వెదుకుతుంది. మూర్ఖులు మూఢత్వంతోనే తమ జీవనం సాగిస్తారు.
15 Los días del pobre son todos malos; pero la alegría del corazón es un banquete sin fin.
౧౫దీనస్థితిలో ఉన్నవారి కాలమంతా దుర్భరం. మానసిక ఆనందం గల వారికి నిత్యం విందే.
16 Más vale poco con temor de Yahvé, que grandes tesoros con inquietud.
౧౬విస్తారమైన సంపద కలిగి నెమ్మది లేకుండా ఉండడం కంటే యెహోవా పట్ల భయభక్తులు కలిగి ఉన్నదానితో జీవించడం ఉత్తమం.
17 Mejor un plato de legumbres con amor, que buey cebado y odio a la mesa.
౧౭ద్వేషం నిండిన ఇంట్లో కొవ్విన ఎద్దు మాంసం తినడం కంటే ప్రేమ ఉన్న చోట ఆకుకూరల భోజనం తినడం మేలు.
18 La ira del hombre provoca contiendas, la mansedumbre apacigua las rencillas.
౧౮ముక్కోపి కలహాలు రేపుతాడు. ఓర్పు గలవాడు వివాదాలు శాంతింపజేస్తాడు.
19 El camino del perezoso es como un seto de espinas, la senda de los rectos es llana.
౧౯సోమరిపోతుల బాట ముళ్లకంచె వంటిది. నీతిమంతులు రాజమార్గంలో పయనిస్తారు.
20 El hijo sabio es la alegría de su padre, el necio desprecia a su propia madre.
౨౦జ్ఞానం ఉన్న కుమారుడు తండ్రికి సంతోషం కలిగిస్తాడు. మూర్ఖుడు తన తల్లిని తిరస్కరిస్తాడు.
21 Le gusta al fatuo la necedad, al prudente el marchar por el recto camino.
౨౧బుద్ధిలేని వాడు తన మూర్ఖత్వాన్ని బట్టి ఆనందం పొందుతాడు. వివేకవంతుడు ఋజుమార్గంలో నడుస్తాడు.
22 Fracasan los planes si no hay consejo, pero prosperan con numerosos consejeros.
౨౨సలహా చెప్పే వారు లేని చోట కార్యం వ్యర్థమైపోతుంది. ఎక్కువమంది సలహాలతో కొనసాగించే కార్యం స్థిరంగా ఉంటుంది.
23 Alegrase uno de la (buena) respuesta de su boca; ¡cuán buena una palabra dicha a tiempo!
౨౩సరియైన సమాధానం ఇచ్చినప్పుడు సంతోషం కలుగుతుంది. సమయోచితమైన మాట ఎంత మనోహరం!
24 El sabio va hacia arriba siguiendo la senda de la vida, para apartarse del scheol que está abajo. (Sheol )
౨౪వివేకం గల వాడు కింద ఉన్న మృత్యులోకంలో పడకుండా ఉండాలని పైకి వెళ్ళే జీవమార్గం వైపు చూస్తాడు. (Sheol )
25 Yahvé derriba la casa de los soberbios, y afirma la heredad de la viuda.
౨౫గర్విష్టుల ఇల్లు యెహోవా కూల్చి వేస్తాడు. విధవరాలి సరిహద్దును ఆయన స్థిరపరుస్తాడు.
26 Son abominables a Yahvé los pensamientos de los malos, pero son puras (ante Él) las palabras amables.
౨౬దుష్టుల తలంపులు యెహోవాకు అసహ్యం. దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రమైనవి.
27 Perturbador de su casa es el codicioso; el que aborrece las dádivas vivirá.
౨౭లోభి పిసినారితనంతో తన కుటుంబాన్ని కష్టపెడతాడు. లంచాన్ని అసహ్యించుకొనే వాడు బ్రతుకుతాడు.
28 El corazón del justo medita para responder, la boca de los impíos rebosa de maldades.
౨౮నీతిమంతుని మనస్సు జ్ఞానంతో కూడిన జవాబు ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. మూర్ఖుల నోటి వెంట చెడ్డ మాటలే వస్తాయి.
29 Lejos está Yahvé de los malvados, mas oye la oración de los justos.
౨౯భక్తిహీనులకు యెహోవా దూరంగా ఉంటాడు. నీతిమంతుల ప్రార్థన ఆయన వింటాడు.
30 La luz de los ojos alegra el corazón, y una buena nueva da fuerza a los huesos.
౩౦కన్నుల్లో కాంతి చూసి హృదయం సంతోషిస్తుంది. క్షేమకరమైన వార్తలు ఎముకలకు బలం కలిగిస్తాయి.
31 Quien escucha la amonestación saludable, morará entre los sabios.
౩౧జీవప్రదమైన బోధ అంగీకరించేవాడు జ్ఞానుల మధ్య నివసిస్తాడు.
32 El que rechaza la corrección desprecia su propia alma, quien escucha la amonestación adquiere entendimiento.
౩౨క్రమశిక్షణ అంగీకరించని వాడు తనను తాను ద్వేషించు కుంటున్నాడు. దిద్దుబాటును స్వీకరించేవాడు వివేకం గలవాడు.
33 El temor de Dios es escuela de sabiduría, y a la gloria precede la humildad.
౩౩యెహోవా పట్ల భయభక్తులు కలిగి ఉండడం జ్ఞానం వృద్ది చేసుకునే సాధనం. వినయం కలిగి ఉంటే గౌరవ ప్రతిష్టలు కలుగుతాయి.