< Jueces 18 >
1 En aquel tiempo no había rey en Israel; y en esos mismos días la tribu de los danitas buscaba una posesión donde habitar; porque hasta aquel día no les había tocado posesión entre los hijos de Israel.
౧ఆ రోజుల్లో ఇశ్రాయేలు ప్రజలకు రాజు లేడు. ఇశ్రాయేలీయుల గోత్రాల్లో దాను గోత్రం వారు తాము నివసించడానికి ఒక స్థలం కోసం వెదుకుతూ ఉన్నారు. ఎందుకంటే అప్పటి వరకూ దాను గోత్రం వారు వారసత్వంగా భూమిని పొందలేదు.
2 Enviaron, por lo tanto, los hijos de Dan cinco hombres de su estirpe y de su territorio, hombres valientes, de Saraá y Estaol, para recorrer el país y para explorarlo, diciéndoles: “Id y explorad el país.” Llegaron ellos a la montaña de Efraím, hasta la casa de Micas, donde pasaron la noche.
౨దాను వంశీకులు తమలో ఐదుగురు శూరులను ఎన్నుకుని, ఆ దేశమంతా తిరిగి దాన్ని పరిశోధించడానికి జొర్యా నుండీ ఎష్తాయోలు నుండీ “మీరు వెళ్లి దేశమంతా చూసి రండి” అని చెప్పి పంపారు.
3 Estando ya cerca de la casa de Micas, reconocieron la voz del joven levita; por lo cual desviándose hacia allá, le dijeron: “¿Quién te ha traído aquí? ¿Qué haces en este lugar? ¿Y qué tienes aquí?”
౩వాళ్ళు ప్రయాణిస్తూ ఎఫ్రాయిమీయుల కొండ ప్రాంతానికి వచ్చారు. అక్కడ మీకా ఇంట్లో ఆ రాత్రి ఆతిథ్యం పొందారు. వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు ఆ లేవీ యువకుని మాట గుర్తు పట్టారు. అతణ్ణి చూసి “నిన్ను ఇక్కడికి ఎవరు రప్పించారు? ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? ఇక్కడ ఎందుకున్నావు?” అంటూ అడిగారు.
4 Les contestó: “Esto y esto ha hecho Micas por mí, y me tiene asalariado para que sea su sacerdote.”
౪అతడు మీకా తనకు చేసిందంతా చెప్పాడు. “నేను మీకాకు పూజారిగా ఉన్నాను. అతడు నాకు జీతం ఇస్తున్నాడు” అని చెప్పాడు.
5 Entonces le rogaron: “Háganos el favor de consultar a Dios, para que sepamos si el viaje que hemos emprendido tendrá buen éxito.”
౫అప్పుడు వాళ్ళు “మేము చేయబోయే పని సఫలమౌతుందో లేదో దేవుణ్ణి అడిగి మాకు చెప్పు” అన్నారు.
6 El sacerdote les respondió: “Id en paz. Yahvé os mira en el camino por donde andáis.”
౬దానికా యాజకుడు “క్షేమంగా వెళ్ళండి. మీరు వెళ్ళాల్సిన మార్గంలో యెహోవాయే మిమ్మల్ని నడిపిస్తాడు.” అన్నాడు.
7 Se fueron los cinco hombres y llegaron a Lais, donde vieron que la gente que había en ella seguía las costumbres de los sidonios, viviendo en seguridad, tranquilos y confiados, porque no había en aquella tierra nadie que les molestara; eran ricos, vivían lejos de los sidonios, y no tenían trato con nadie.
౭అప్పుడు ఆ ఐదుగురు మనుష్యులు వెళ్లి లాయిషుకు వచ్చారు. అక్కడ జనం, సీదోనీయుల్లా భద్రంగా, నిర్భయంగా నివసించడం చూశారు. ఆ దేశాన్ని ఆక్రమించుకుని అధికారం చెలాయించేవాళ్ళు గానీ, బాధలు పెట్టేవాళ్ళు గానీ లేకపోవడం చూసారు. వాళ్ళు సీదోనీయులకు దూరంగా నివసించడమూ, వాళ్ళకు ఎవరితోనూ ఎలాంటి సంబంధాలు లేకపోవడమూ చూశారు.
8 Regresaron los exploradores a sus hermanos a Saraá y Estaol. Y les preguntaron sus hermanos: “¿Qué decís?”
౮వాళ్ళు జొర్యాలోనూ ఎష్తాయోలులోనూ ఉన్న తమ వాళ్ళ దగ్గరికి వచ్చారు. వాళ్ళు “మీరిచ్చే నివేదిక ఏమిటి?” అని అడిగారు.
9 Respondieron: “Adelante, subamos contra ellos; pues hemos visto el país; he aquí que es muy bueno. ¡Y vosotros estáis sin hacer nada! No seáis perezosos. Poneos en camino e id a tomar posesión de aquella tierra.
౯దానికి వాళ్ళు “రండి! మనం వాళ్ళపై దాడి చేద్దాం. ఆ దేశాన్ని మేము చూశాం. అది ఎంతో బాగుంది. చేతులు ముడుచుకుని కూర్చోకండి. వాళ్ళపై దాడి చేసి ఆ దేశాన్ని ఆక్రమించుకోవడంలో ఇక ఆలస్యం చేయవద్దు.
10 Cuando lleguéis, encontraréis un pueblo que vive seguro; la tierra es amplia y Dios la ha entregado en vuestras manos; es un lugar donde no falta nada de cuanto hay en la tierra.”
౧౦మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ‘మేము భద్రంగా ఉన్నాం’ అని భావిస్తున్న వారిని మీరు చూస్తారు. ఆ దేశం విశాలమైనది. భూమి మీద ఎలాంటి కొరతా అక్కడ లేదు. దేవుడు దాన్ని మీకిచ్చాడు,” అన్నారు.
11 Partieron de allí, de Saraá y Estaol, seiscientos hombres de la tribu de los danitas, armados para la guerra.
౧౧అప్పుడు జొర్యాలోనూ ఎష్తాయోలులోనూ ఉన్న దాను గోత్రం వాళ్ళలో ఆరు వందలమంది ఆయుధాలు ధరించి బయలుదేరి యూదా దేశం లోని కిర్యత్యారీములో ఆగారు.
12 Y subieron y acamparon en Kiryatyearim, en Judá; por lo cual se llama aquel lugar Mahané-Dan hasta el día de hoy. Ese lugar está al occidente de Kiryatyearim.
౧౨అందుకే ఆ స్థలానికి ఇప్పటికీ మహానేదాన్ అని పేరు. దాను గోత్రం వాళ్ళ సైన్యం అని దాని అర్థం. అది కిర్యత్యారీముకు పడమరగా ఉంది.
13 De allí pasaron a la montaña de Efraím y llegaron a la casa de Micas.
౧౩అక్కడనుండి వాళ్ళు ఎఫ్రాయిమీయుల కొండ ప్రాంతానికి వచ్చి అక్కడే ఉన్న మీకా ఇంటికి వచ్చారు.
14 Entonces los cinco hombres que habían ido a explorar la tierra de Lais, dirigieron a sus hermanos estas palabras: “¿Sabéis que en aquellas casas hay un efod, con terafim, y una imagen, una estatua de fundición? Ved ahora lo que habéis de hacer.”
౧౪అప్పుడు లాయిషు దేశాన్ని చూడటానికి వెళ్ళిన ఆ ఐదుగురు శూరులు తమ వారిని చూసి “ఈ ఇంట్లో ఎఫోదూ, గృహ దేవుళ్ళూ, చెక్కిన ప్రతిమా, పోత విగ్రహమూ ఉన్నాయని మీకు తెలుసా? మీరేం చేయాలో ఆలోచించుకోండి” అన్నారు.
15 Se desviaron hacia allá, y entraron a la casa del joven levita, la casa de Micas para saludarle.
౧౫వారు ఆ వైపుకు తిరిగి ఆ లేవీ యువకుడు ఉన్న మీకా ఇంటికి వచ్చి అతణ్ణి కుశల ప్రశ్నలడిగారు.
16 Entretanto, los seiscientos hombres de los hijos de Dan, armados para la guerra, se apostaron a la entrada de la puerta.
౧౬దాను గోత్రానికి చెందిన ఆరు వందలమంది యుధ్ధానికై ఆయుధాలు ధరించి సింహద్వారం దగ్గర నిల్చున్నారు.
17 Entonces los cinco hombres que habían ido a explorar la tierra, subieron y penetrando allá dentro, tomaron la imagen de talla y el efod, con los terafim, y la imagen de fundición, mientras el sacerdote y los seiscientos hombres ceñidos de armas de guerra estaban a la entrada de la puerta.
౧౭అప్పుడు ఆ యాజకుడు ఆయుధాలు ధరించిన ఆరు వందలమందితో కలసి సింహద్వారం దగ్గర నిలిచి ఉండగా దేశాన్ని పరిశోధించడానికి వెళ్ళిన ఆ ఐదుగురు శూరులు లోపలికి వెళ్ళి ఆ ప్రతిమనూ, ఎఫోదునూ, గృహ దేవుళ్ళ విగ్రహాలనూ, పోత విగ్రహాన్నీ తీసుకున్నారు.
18 Cuando aquellos entraron en la casa de Micas para llevarse la imagen de talla, el efod, los terafim y la imagen de fundición, les preguntó el sacerdote: “¿Qué estáis haciendo?”
౧౮వీరు మీకా యింటిలోకి వెళ్ళి ఆ ప్రతిమనూ, ఎఫోదునూ, గృహ దేవుళ్ళ విగ్రహాలనూ, పోత విగ్రహాన్నీ పట్టుకున్నప్పుడు ఆ యాజకుడు “మీరేం చేస్తున్నారు?” అని అడిగాడు.
19 Ellos le dijeron: “¡Calla! Ponte la mano sobre la boca y ven con nosotros, y senos padre y sacerdote. ¿Qué es mejor: ser sacerdote de la casa de un solo hombre, o ser sacerdote de una tribu y familia en Israel?”
౧౯వాళ్ళు “నువ్వు నోరు మూసుకో. నీ చెయ్యి నోటి మీద ఉంచుకుని మాతో కలసి వచ్చి మాకు తండ్రిగా యాజకుడుగా ఉండు. ఒక ఇంటికి యాజకుడుగా ఉండటం గొప్ప సంగతా లేక ఇశ్రాయేలీయుల్లో ఒక గోత్రానికి యాజకుడుగా ఉండటం గొప్ప సంగతా” అని అడిగారు.
20 Se alegró el corazón del sacerdote, y él mismo tomó el efod, los terafim y la imagen de talla, y se juntó a la gente.
౨౦ఆ మాటలకు అ యాజకుడు హృదయంలో సంతోషించాడు. ఆ ఎఫోదునూ, గృహ దేవుళ్ళనూ చెక్కిన ప్రతిమనూ తీసుకుని వాళ్ళతో కలసి పోయాడు.
21 Se pusieron en marcha y partieron llevando delante de sí a los niños, los animales y las cosas preciosas.
౨౧అక్కడి నుంచి వాళ్ళు వెనక్కు తిరిగారు. చిన్నపిల్లలనూ, పశువులనూ, సామగ్రినీ తమకు ముందుగా తరలించుకు పోయారు.
22 Estaban ya lejos de la casa de Micas, cuando los hombres que estaban en las casas vecinas a la casa de Micas se reunieron y persiguieron a los hijos de Dan.
౨౨వాళ్ళు మీకా ఇంటి నుంచి కొంత దూరం వెళ్ళాక మీకా అతని పొరుగు వారూ సమకూడి దాను గోత్రం వారిని వెంటాడి వాళ్ళను కలుసుకుని కేకలు వేసి పిలిచారు.
23 Gritaron a los hijos de Dan, los cuales, volviendo el rostro, preguntaron a Micas: “¿Qué te pasa? ¿Por qué gritas tanto?”
౨౩దానీయులు తిరిగి చూసి “నీకేం కావాలి? ఇలా గుంపుగా వస్తున్నరేమిటి?” అని మీకాను అడిగారు.
24 Él contestó: “Os habéis tomado mis dioses, que yo me hice y también al sacerdote, y os habéis marchado. ¿Qué me queda todavía? ¿Cómo podéis decirme: Qué te pasa?”
౨౪దానికి అతడు “నేను చేయించిన నా దేవుళ్ళనూ, నా కుల పూజారినీ మీరు పట్టుకుపోతున్నారు. ఇక నాకేం మిగిలింది? ‘నీకేం కావాలి?’ అని నన్ను ఎలా అడుగుతున్నారు?” అన్నాడు.
25 Replicáronle los hijos de Dan: “Guárdate de seguir gritándonos, no sea que se arrojen sobre vosotros algunos hombres irritados y vengas a perecer tú y los de tu casa.”
౨౫దాను గోత్రం వారు అతనితో “జాగ్రత్త! నీ స్వరం మా వాళ్లకు ఎవరికీ వినపడనీయకు. వాళ్ళకు నీమీద కోపం వచ్చిందంటే నీమీద దాడి చేసి నిన్నూ నీ కుటుంబాన్నీ చంపేస్తారు” అన్నారు.
26 Y los hijos de Dan prosiguieron su camino; y viendo Micas que eran más fuertes que él, se volvió y regresó a su casa.
౨౬ఈ విధంగా దాను గోత్రం వారు తమ మార్గాన వెళ్ళిపోయారు. వాళ్ళు తన కంటే బలవంతులని అర్థం చేసుకున్న మీకా తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయాడు.
27 Ellos se llevaron lo que se había fabricado Micas, y también al sacerdote que tenía, y marcharon contra Lais, un pueblo que vivía tranquilo y confiadamente: y los pasaron a filo de espada y pegaron fuego a la ciudad.
౨౭దాను గోత్రం వాళ్ళు మీకా తయారు చేసుకున్న వాటినీ, అతని యాజకుడినీ పట్టుకున్న తరువాత లాయిషుకు వచ్చారు. అక్కడ నిర్భయంగా క్షేమంగా నివసిస్తున్న వారిని కత్తితో చంపేశారు. ఆ పట్టణాన్ని తగులబెట్టారు.
28 No había quien la librase, porque estaba lejos de Sidón, y les faltaban relaciones con otros hombres. La ciudad estaba en el valle que se extiende hacia Bet-Rehob. Y reedificándola habitaron en ella.
౨౮ఆ పట్టణం సీదోనుకు దూరంగా ఉండటం వల్లా, వాళ్లకు ఎవరితోనూ సంబంధం లేకపోవడం వల్లా వాళ్ళను రక్షించడానికి ఎవరూ రాలేదు. ఆ పట్టణం బెత్రేహోబు లోయకు దగ్గరగా ఉంది. దాను గోత్రం వాళ్ళు ఆ పట్టణాన్ని పునర్నిర్మాణం చేశారు.
29 Llamaron la ciudad Dan, del nombre de su padre Dan que fue hijo de Israel; pero anteriormente la ciudad se llamaba Lais.
౨౯తమ పూర్వీకుడైన దాను పేరును బట్టి ఆ పట్టణానికి దాను అని పేరు పెట్టారు. అంతకు ముందు ఆ పట్టణం పేరు లాయిషు.
30 Allí los hijos de Dan se erigieron la imagen de talla; y Jonatán, hijo de Gersón, hijo de Moisés, él y sus hijos, fueron sacerdotes de la tribu de los danitas hasta el tiempo del cautiverio del país.
౩౦దాను గోత్రం వాళ్ళు చెక్కిన ప్రతిమను పెట్టుకున్నారు. మోషే మనుమడూ, గెర్షోము కొడుకు అయిన యోనాతాను అనే వాడూ, అతని కుమారులూ ఆ దేశ ప్రజలు బందీలుగా వెళ్ళే వరకూ వారికి యాజకులుగా ఉన్నారు.
31 Así tuvieron la imagen fabricada por Micas todo el tiempo que estuvo la Casa de Dios en Silo.
౩౧దేవుని మందిరం షిలోహులో ఉన్నంత కాలం వాళ్ళు మీకా చేయించిన చెక్కిన విగ్రహాన్ని పూజించారు.