< Jeremías 30 >
1 Fue dirigida a Jeremías la palabra de Yahvé, que decía:
౧ఇది యెహోవా నుంచి యిర్మీయాకు వచ్చిన వాక్కు,
2 “Así habla Yahvé, el Dios de Israel: Escribe en un libro todas las palabras que te he dicho.
౨“ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా అంటున్నాడు,
3 Porque he aquí que vendrán días, dice Yahvé, en que trocaré el cautiverio de mi pueblo, Israel y Judá, dice Yahvé, y los haré regresar al país que di a sus padres y lo poseerán.”
౩‘రాబోయే రోజుల్లో నేను ఇశ్రాయేలు వాళ్ళూ, యూదా వాళ్ళైన నా ప్రజలను చెరనుంచి విడిపించి, వాళ్ళ పితరులకు నేనిచ్చిన దేశాన్ని వారు స్వాధీనం చేసుకునేలా వాళ్ళను తిరిగి రప్పిస్తాను,’ అని యెహోవానైన నేను చెప్పాను. కాబట్టి, నేను నీతో చెప్పిన మాటలన్నీ ఒక రాతచుట్టలో రాయి.”
4 Y estas son las palabras que Yahvé dirige a Israel y a Judá:
౪యెహోవా ఇశ్రాయేలు వాళ్ళ గురించి, యూదా వాళ్ళ గురించి చెప్పిన మాటలివి.
5 “Así dice Yahvé: Hemos oído voces de terror, de espanto, y no de paz.
౫“యెహోవా ఇలా అంటున్నాడు, ‘భయంతో వణుకుతున్న స్వరం మేం విన్నాం. ఆ స్వరంలో శాంతి లేదు.
6 Preguntad y ved si dan a luz los varones. ¿Cómo es que veo a todos los varones con las manos sobre sus lomos, como parturientas? ¿Y por qué se han vuelto pálidos todos los rostros?
౬ప్రసూతి వేదనతో ఒక పురుషుడు బిడ్డను కనగలడా? మీరు అడిగి తెలుసుకోండి. ప్రతి యువకుడు తన నడుము మీద చేతులెందుకు పెట్టుకుంటున్నాడు? ప్రసవ వేదన పడే స్త్రీలా వాళ్ళ ముఖాలు ఎందుకు పాలిపోయాయి?
7 ¡Ay! porque grande es aquel día, no hay otro que le sea igual. Es el tiempo de angustia para Jacob; mas será librado de ella.
౭అయ్యో, ఎంత భయంకరమైన రోజు! అలాంటి రోజు ఇంకొకటి రాదు. అది యాకోబు సంతతి వాళ్లకు ఆందోళన కలిగించే సమయం. అయినా దానిలోనుంచి అతనికి రక్షణ దొరుకుతుంది.’”
8 En aquel día, dice Yahvé de los ejércitos, quebraré el yugo del (enemigo) sobre tu cerviz, y romperé tus coyundas. No lo sojuzgarán más los extranjeros,
౮సేనల ప్రభువు అయిన యెహోవా ఇలా అంటున్నాడు “ఆ రోజు, నీ మెడ మీద ఉన్న నీ కాడి విరిచి, నేను నీ బంధకాలు తెంపుతాను. ఇంక విదేశీయులు నీ చేత దాస్యం చేయించుకోరు.
9 pues servirá a Yahvé su Dios, y a David su rey, que Yo les suscitaré.
౯కాని, వాళ్ళు తమ దేవుడైన యెహోవాను ఆరాధించి, నేను వాళ్ళ మీద రాజుగా చేసే తమ రాజైన దావీదును సేవిస్తారు.
10 Y tú, siervo mío Jacob, no temas, dice Yahvé, ni te amedrentes, oh Israel, que Yo te sacaré de una tierra lejana, y a tus hijos del país de su cautiverio. Jacob volverá, y vivirá quieto y tranquilo, sin que nadie lo espante.
౧౦కాబట్టి, నా సేవకుడవైన యాకోబూ, భయపడకు, యెహోవా చేప్పేదేమంటే, ‘ఇశ్రాయేలూ, దిగులు పడకు. దూరంగా ఉన్న నిన్ను, బందీలుగా ఆ దేశంలో ఉన్న నీ సంతతి వాళ్ళను, నేను రక్షించబోతున్నాను. యాకోబు సంతతి తిరిగి వచ్చి, శాంతి కలిగి ఉంటుంది. అతడు సురక్షితంగా ఉంటాడు, భయభీతులు ఇంక ఉండవు.
11 Porque Yo estoy contigo, dice Yahvé, para librarte; acabaré con todas las naciones donde te he dispersado. A ti, empero no te exterminaré, aunque te castigaré con equidad y no te dejaré del todo impune.
౧౧ఎందుకంటే, నేను నీతో ఉన్నాను,’ యెహోవా వాక్కు ఇదే, ‘నిన్ను రక్షించడానికి నేను నీకు తోడుగా ఉన్నాను, నిన్ను ఏ దేశాల్లోకైతే చెదరగొట్టానో, ఆ దేశాలన్నిటినీ నేను సమూల నాశనం చేస్తాను. కాని, నిన్ను మాత్రం పూర్తిగా నాశనం చెయ్యను. అయితే నిన్ను తగిన క్రమశిక్షణలో పెడతాను. శిక్ష లేకుండా మాత్రం నిన్ను విడిచిపెట్టను.’
12 Porque así dice Yahvé: Tu llaga es incurable, y sin remedio tu herida.
౧౨యెహోవా ఇలా అంటున్నాడు, ‘నీ దెబ్బ నయం కాదు. నీ గాయం మానని పుండుగా అయ్యింది.
13 No hay quien tome tu causa para (vendar) tu herida; no hay medicamentos para curarte.
౧౩నీ పక్షంగా వాదించేవాళ్ళు ఎవరూ లేరు. నీ పుండు నయం చేసే మందు లేదు.
14 Todos tus amantes te han olvidado, no preguntan ya por ti, porque yo te he herido como hiere un enemigo, con pena cruel, en castigo de tus muchas iniquidades, pues son graves tus pecados.
౧౪నీ ప్రేమికులంతా నిన్ను మరిచిపోయారు. వాళ్ళు నీ కోసం చూడరు. ఎందుకంటే, అధికమైన నీ పాపాలనుబట్టి, నీ గొప్ప దోషాన్నిబట్టి, ఒక కఠినమైన యజమాని పెట్టే క్రమశిక్షణ కింద నిన్ను ఉంచి, ఒక శత్రువు గాయపరిచినట్టు నేను నిన్ను గాయపరిచాను.
15 ¿Por qué gritas a causa de tu quebranto? Es incurable tu mal; por la muchedumbre de tus iniquidades, y por la gravedad de tus pecados, te he hecho esto.
౧౫నీ గాయాన్నిబట్టి నువ్వు సాయం కోసం అడుగుతున్నావా? నీ బాధ తీరనిది. విస్తారమైన నీ పాపాలనుబట్టి, అనేకమైన నీ దోషాలను బట్టి నేను నీకు ఇలా చేశాను.
16 Mas cuantos te devoran serán devorados, y todos tus opresores serán llevados cautivos; los que te despojan serán despojados, y todos los que te saquean serán saqueados.
౧౬కాబట్టి, నిన్ను దిగమింగే వాళ్ళెవరో, వాళ్ళనే దిగమింగడం జరుగుతుంది. నీ ప్రత్యర్దులందరూ బందీలుగా చెరలోకి వెళ్తారు. నిన్ను దోచుకున్నవాళ్ళు దోపుడు సొమ్ము అవుతారు. నిన్ను కొల్లగొట్టిన వాళ్ళను కొల్లసొమ్ముగా చేస్తాను.
17 Pues yo cicatrizaré tu llaga y curaré tus heridas, dice Yahvé; porque te han llamado la «Desechada»; «esta es aquella Sión, por la cual nadie ya pregunta».
౧౭నీకు స్వస్థత తీసుకొస్తాను. నీ గాయాలను స్వస్థపరుస్తాను.’” ఇదే యెహోవా వాక్కు. “ఎందుకంటే వాళ్ళు ‘సీయోను వెలి వేయబడింది. దాన్ని పట్టించుకునే వాడు లేడు’ అని నీ గురించి అన్నారు గనుక, నేను ఈ విధంగా చేస్తాను.”
18 Así dice Yahvé: He aquí que restableceré los tabernáculos de Jacob, y tendré compasión de sus moradas; la ciudad será reedificada sobre su monte, y el palacio se levantará en su lugar antiguo.
౧౮యెహోవా ఇలా అంటున్నాడు “చూడు, యాకోబు నివాసస్థలాలను కరుణించి అతని గుడారాల మీద నేను కనికరం చూపిస్తాను. అప్పుడు శిథిలాల గుట్ట మీద ఒక పట్టణం నిర్మాణం అవుతుంది. ఇదివరకు ఉన్నట్టే ఒక స్థిరమైన నివాసం ఏర్పాటవుతుంది.
19 De allí saldrán alabanzas y voces de júbilo, los multiplicaré para que no sean pocos, y los honraré para que no sean despreciados.
౧౯అప్పుడు వాటిలోనుంచి ఒక స్తుతి కీర్తన, ఒక వేడుక శబ్దం బయటకు వస్తుంది. ప్రజలు తక్కువ సంఖ్యలో లేకుండా నేను వాళ్ళను విస్తరింపజేస్తాను. అల్పులు కాకుండా నేను వాళ్ళకు ఘనత కలుగజేస్తాను.
20 Serán sus hijos como al principio, su congregación tendrá estabilidad ante Mí; y castigaré a todos sus opresores.
౨౦వాళ్ళ ప్రజలు మునుపటిలా ఉంటారు. వాళ్ళను హింసించే వాళ్ళందరినీ నేను శిక్షించినప్పుడు, వాళ్ళ సమాజం నా ఎదుట స్థిరం అవుతుంది.
21 De ella procederá su príncipe, y de en medio de ella saldrá su dominador; Yo le haré venir, y él se acercará a Mí; pues ¿quién es el que osaría acercarse a Mí?, dice Yahvé.
౨౧వాళ్ళ నాయకుడు వాళ్ళల్లోనుంచే వస్తాడు. నేను వాళ్ళను ఆకర్షించినప్పుడు, వాళ్ళు నన్ను సమీపించినప్పుడు, వాళ్ళ మధ్య నుంచి అతడు బయలుదేరుతాడు. నేను ఇది చెయ్యకపోతే, నన్ను సమీపించే సాహసం ఎవడు చెయ్యగలడు?” ఇది యెహోవా వాక్కు.
22 Y vosotros seréis mi pueblo, y Yo seré vuestro Dios.
౨౨“అప్పుడు మీరు నా ప్రజలుగా ఉంటారు. నేను మీ దేవుడుగా ఉంటాను.
23 He aquí que se desata el torbellino de Yahvé, torbellino furioso que se precipita y descarga sobre la cabeza de los impíos.
౨౩చూడు, యెహోవా ఉగ్రత పెనుగాలిలా బయలుదేరింది. అది ఎల్లప్పుడూ వీచే పెనుగాలి. అది సుడిగాలిలా దుష్టుల తలల మీద గిరగిరా తిరుగుతుంది.
24 No cesará el ardor de la ira de Yahvé hasta realizar y cumplir los designios de su corazón. Al fin de los tiempos entenderéis esto.
౨౪తన కార్యం జరిగించే వరకూ, తన హృదయాలోచనలు నెరవేర్చే వరకూ యెహోవా కోపాగ్ని చల్లారదు. చివరి రోజుల్లో మీరు దీన్ని అర్థం చేసుకుంటారు.”