< Génesis 48 >
1 Después de esto recibió José la noticia: “He aquí, tu padre está enfermo.” Tomó, pues, consigo a sus dos hijos, Manasés y Efraím;
౧ఈ సంగతులైన తరువాత “ఇదిగో, మీ నాన్నకు ఒంట్లో బాగాలేదు” అని ఒకడు యోసేపుతో చెప్పాడు. అప్పుడతడు మనష్షే, ఎఫ్రాయిము అనే తన ఇద్దరు కొడుకులను వెంటబెట్టుకుని వెళ్ళాడు.
2 y se lo anunciaron a Jacob, diciendo: “Mira que viene a ti tu hijo José.” Entonces Israel esforzándose se sentó en su lecho.
౨“ఇదిగో నీ కొడుకు యోసేపు నీ దగ్గరికి వస్తున్నాడు” అని యాకోబుకు తెలిసింది. అప్పుడు ఇశ్రాయేలు బలం తెచ్చుకుని తన మంచం మీద కూర్చున్నాడు.
3 Y dijo Jacob a José: “El Dios Todopoderoso se me apareció en Luz, en la tierra de Canaán, y me bendijo,
౩అతడు యోసేపుతో “కనాను దేశంలో ఉన్న లూజులో సర్వశక్తిగల దేవుడు నాకు కనబడి నన్ను ఆశీర్వదించి
4 diciéndome: ‘He aquí que Yo te haré crecer y te multiplicaré, y haré de ti una muchedumbre de pueblos y daré esta tierra en posesión perpetua a tu descendencia después de ti’.
౪‘ఇదిగో నిన్ను ఫలవంతంగా చేసి, విస్తరింపజేస్తాను. నువ్వు జన సమూహమయ్యేలా చేస్తాను. నీ వారసులకు ఈ దేశాన్ని నిత్య స్వాస్థ్యంగా ఇస్తాను’ అన్నాడు.
5 Ahora bien, tus dos hijos que te han nacido en tierra de Egipto antes de mi venida a ti a Egipto, serán míos. Como Rubén y Simeón, así serán míos Efraím y Manasés.
౫నేను ఐగుప్తుకు నీ దగ్గరికి రాకముందు ఐగుప్తు దేశంలో నీకు పుట్టిన నీ ఇద్దరు కొడుకులు నా బిడ్డలే. రూబేను షిమ్యోనుల్లాగే ఎఫ్రాయిము, మనష్షే నా కొడుకులే.
6 Mas tus hijos que has engendrado después de ellos, son tuyos, y en cuanto a la herencia llevarán el nombre de sus hermanos.
౬వారి తరువాత నీకు పుట్టిన సంతానం నీదే. వారి పేర్లు వారి సోదరుల స్వాస్థ్యం జాబితాల ప్రకారం నమోదు అవుతాయి.
7 Al volver yo de Mesopotamia, se me murió Raquel en la tierra de Canaán, en el camino a poca distancia de Efrata; y la enterré allí en el camino de Efrata, que es Betlehem.”
౭పద్దనరాము నుండి నేను వస్తున్నపుడు, ఎఫ్రాతాకు ఇంకా కొంత దూరాన ఉన్నపుడు ప్రయాణంలో రాహేలు కనాను దేశంలో చనిపోయింది. అక్కడ బేత్లెహేము అనే ఎఫ్రాతా దారిలో నేను ఆమెను పాతిపెట్టాను” అని యాకోబు చెప్పాడు.
8 Viendo entonces Israel a los hijos de José, preguntó: “¿Quiénes son estos?”
౮ఇశ్రాయేలు, యోసేపు కొడుకులను చూసి “వీరెవరు?” అని అడిగాడు.
9 Respondió José a su padre: “Son mis hijos, los que Dios me ha dado aquí.” Y él dijo: “Acércamelos, te ruego, para que los bendiga.”
౯యోసేపు “వీళ్ళు నా కొడుకులు. వీరిని ఈ దేశంలో దేవుడు నాకిచ్చాడు” అని తన తండ్రితో చెప్పాడు. అందుకతడు “నేను వారిని దీవించడానికి నా దగ్గరికి వారిని తీసుకు రా” అన్నాడు.
10 Pues los ojos de Jacob se habían nublado por la vejez y no podía ya ver. Entonces José se los acercó, y él los besó y los abrazó.
౧౦ఇశ్రాయేలు కళ్ళు వృద్ధాప్యం వలన మసకబారి చూడలేక పోయాడు. కాబట్టి, యోసేపు వారిని అతని దగ్గరికి తీసుకు వచ్చాడు. అతడు వారిని ముద్దు పెట్టుకుని కౌగిలించుకున్నాడు.
11 Después dijo Israel a José: “Yo no pensaba ya ver más tu rostro, y he aquí que Dios me ha concedido ver también a tus hijos.”
౧౧ఇశ్రాయేలు యోసేపుతో “నీ ముఖాన్ని మళ్ళీ చూస్తానని నేను అనుకోలేదు. అయితే, నీ సంతానాన్ని కూడా దేవుడు నన్ను చూడనిచ్చాడు” అన్నాడు.
12 Y sacándolos de entre las rodillas de Jacob se postró José delante de él en tierra.
౧౨యోసేపు అతని మోకాళ్ళ మధ్య నుండి వారిని తీసుకు అతనికి సాగిలపడ్డాడు.
13 Luego tomó José a ambos, a Efraím a su derecha, o sea a la izquierda de Israel, y a Manasés a su izquierda, o sea a la derecha de Israel, y los acercó a este.
౧౩తరువాత యోసేపు ఇశ్రాయేలు ఎడమచేతి వైపు తన కుడిచేత ఎఫ్రాయిమును, ఇశ్రాయేలు కుడిచేతి వైపు తన ఎడమ చేత మనష్షేను పట్టుకుని, వారిద్దరిని అతని సమీపంగా తీసుకు వచ్చాడు.
14 E Israel extendió su mano derecha y la puso sobre la cabeza de Efraím, que era el menor, y su izquierda (la puso) sobre la cabeza de Manasés, cruzando las manos, aunque Manasés era el primogénito.
౧౪ఇశ్రాయేలు, చిన్నవాడైన ఎఫ్రాయిము తల మీద తన కుడిచేతిని, మనష్షే తలమీద తన ఎడమచేతిని ఉంచాడు.
15 Y bendijo a José, diciendo: “El Dios en cuya presencia caminaron mis padre Abrahán e Isaac, el Dios que ha sido mi Pastor desde que existo hasta el día de hoy,
౧౫ఇశ్రాయేలు యోసేపును దీవించి “నా పూర్వీకులు అబ్రాహాము ఇస్సాకులు ఎవరి సమక్షంలో నడుచుకున్నారో ఆ దేవుడు, ఇప్పటి వరకూ నన్ను పోషించిన ఆ దేవుడు,
16 el Ángel que me ha librado de todo mal, bendiga a estos niños; sean llamados con mi nombre y con el nombre de mis padres Abrahán e Isaac, y multiplíquense más y más sobre la tierra.”
౧౬సమస్త కీడుల నుంచి నన్ను కాపాడిన దూత, ఈ పిల్లలను దీవించు గాక. నా పేరు, అబ్రాహాము ఇస్సాకులనే నా పితరుల పేరు వారికి కలుగు గాక. లోకంలో వారు విస్తార జనసమూహంగా అవుతారు గాక” అన్నాడు.
17 Cuando José vio que su padre tenía la mano derecha puesta sobre la cabeza de Efraím, no le pareció bien; tomando la mano de su padre para pasarla de la cabeza de Efraím a la cabeza de Manasés,
౧౭యోసేపు ఎఫ్రాయిము తల మీద తన తండ్రి కుడిచెయ్యి పెట్టడం చూశాడు. అది అతనికి నచ్చలేదు. అతడు మనష్షే తల మీద పెట్టించాలని తన తండ్రి చెయ్యి, ఎఫ్రాయిము తలమీద నుండి ఎత్తి,
18 dijo a su padre: “No así, padre mío, este es el primogénito; pon tu derecha sobre su cabeza.”
౧౮“నాన్నా, అలా కాదు. ఇతడే పెద్దవాడు. నీ కుడి చెయ్యి ఇతని తలమీద పెట్టు” అని చెప్పాడు.
19 Pero se negó su padre, diciendo: “Lo sé, hijo mío, lo sé; también él vendrá a ser un pueblo, también él será grande; pero su hermano menor será más grande que él, y su descendencia vendrá a ser una multitud de naciones.”
౧౯అతని తండ్రి ఒప్పుకోక “నాకు తెలుసు. కచ్చితంగా తెలుసు. ఇతడు కూడా ఒక జన సమూహమై గొప్పవాడవుతాడు. అయితే, ఇతని తమ్ముడు ఇతని కంటే గొప్పవాడవుతాడు. అతని సంతానం జన సమూహాలు అవుతారు” అన్నాడు.
20 Y los bendijo en aquel día, diciendo: “Por ti se bendecirá en Israel con las palabras: «¡Dios te haga como a Efraím y como a Manasés!»”
౨౦ఆ రోజు అతడు వారిని ఇలా దీవించాడు. “ఇశ్రాయేలీయులు ఎవరినైనా దీవించేటపుడు, ‘ఎఫ్రాయిములాగా మనష్షేలాగా దేవుడు మిమ్మల్ని చేస్తాడు గాక’ అని మీ పేరెత్తి దీవిస్తారు” అని చెప్పి మనష్షే కంటే ఎఫ్రాయిమును ముందుగా ఉంచాడు.
21 Después dijo Israel a José: “He aquí que yo me muero; mas Dios estará con vosotros y os hará volver al país de vuestros padres.
౨౧ఇశ్రాయేలు “ఇదిగో నేను చనిపోతున్నాను, అయినా దేవుడు మీకు తోడై ఉండి మీ పూర్వీకుల దేశానికి మిమ్మల్ని తిరిగి రప్పిస్తాడు.
22 Y a ti te doy una porción más que a tus hermanos, la que tomé al amorreo con mi espada y con mi arco.”
౨౨నేను నీ సోదరులకంటే నీకు ఒక భాగం ఎక్కువ ఇచ్చాను. దాన్ని, నా కత్తితో నా వింటితో, అమోరీయుల చేతిలో నుండి తీసుకున్నాను” అని యోసేపుతో చెప్పాడు.