< Amós 8 >
1 Yahvé, el Señor, me mostró esto: Veía un canasto de fruta madura;
౧యెహోవా ప్రభువు నాకిది చూపించాడు. అదిగో ఎండాకాలపు పళ్ళ గంప!
2 Y Él dijo: “¿Qué es lo que ves, Amós?” Respondí: “Un canasto de fruta madura.” Y Yahvé me dijo: “Ha llegado el fin de Israel, mi pueblo; ya no lo perdonaré.
౨ఆయన “ఆమోసూ, నువ్వేం చూస్తున్నావు?” అని అడిగాడు. నేను “ఎండాకాలపు పళ్ళ గంప” అన్నాను. అప్పుడు యెహోవా నాతో, నా ప్రజలైన ఇశ్రాయేలీయులకు అంతం వచ్చేసింది. ఇక నేను వాళ్ళను వదిలిపెట్టను.
3 En aquel día los cantares en el palacio se convertirán en aullidos —oráculo de Yahvé—, habrá muchos cadáveres, y en todo lugar se los arrojará en silencio.
౩యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే, “మందిరంలో వాళ్ళు పాడే పాటలు ఏడుపులవుతాయి. ఆ రోజు శవాలు విపరీతంగా పడి ఉంటాయి. నిశ్శబ్దంగా వాటిని అన్ని చోట్లా పడేస్తారు” అన్నాడు.
4 ¡Oíd esto, los que os tragáis al pobre, y hacéis perecer a los humildes de la tierra,
౪దేశంలోని పేదలను తీసేస్తూ దీనులను అణిచేసే మీరు ఈ విషయం వినండి.
5 diciendo: «¿Cuándo pasará el novilunio para que vendamos el trigo, y el sábado, para que abramos los graneros? Achicaremos la medida y agrandaremos el peso, y falsearemos la balanza para engañar.
౫వారిలా అంటారు, “మనం ధాన్యం అమ్మడానికి అమావాస్య ఎప్పుడు వెళ్ళిపోతుందో? గోదుమల వ్యాపారం చేసుకోడానికి సబ్బాతు ఎప్పుడు పోతుందో? మనం కొలపాత్రను చిన్నదిగా చేసి, వెల పెంచుదాం. తప్పుడు తూకాలతో మనం మోసం చేద్దాం.
6 Así compraremos por dinero al pobre, y al menesteroso por un par de sandalias, y venderemos hasta las ahechaduras del trigo».
౬పాడైపోయిన గోదుమలను అమ్మి, వెండికి పేదవారిని కొందాం. దీనులను, ఒక జత చెప్పులకు కొందాం.”
7 Ha jurado Yahvé por la gloria de Jacob: Jamás me olvidaré de cuanto ha hecho.
౭యాకోబు అతిశయాస్పదం తోడని యెహోవా ఇలా ప్రమాణం చేశాడు. “వారు చేసిన పనుల్లో దేన్నీ నేను మరచిపోను.”
8 ¿No ha de estremecerse por esto la tierra, y no se enlutarán todos sus moradores? ¿No se alzará toda ella como el Nilo, se levantará y se abajará como el río de Egipto?
౮దీన్ని బట్టి భూమి కంపించదా? అందులో నివసించే వారంతా దుఃఖపడరా? నైలునది లాగా అదంతా పొంగుతుంది. ఐగుప్తుదేశపు నదిలాగా అది పైకి లేచి, మళ్ళీ అణిగి పోతుంది.
9 En aquel día, dice Yahvé, el Señor, haré que se ponga el sol al mediodía, y en pleno día cubriré de tinieblas la tierra.
౯యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే, ఆ రోజు నేను మధ్యాహ్నమే పొద్దు గుంకేలా చేస్తాను. పట్టపగలే భూమికి చీకటి కమ్ముతుంది.
10 Convertiré en duelo vuestras fiestas, y en llantos todos vuestros cantares; echaré el cilicio sobre todos los lomos, y haré calvas todas las cabezas; traeré sobre el (país) luto, como por un hijo único, y su fin será como un día amargo.
౧౦మీ పండగలను దుఃఖదినాలుగా మీ పాటలన్నిటినీ విషాద గీతాలుగా మారుస్తాను. మీరంతా గోనెపట్ట కట్టుకొనేలా చేస్తాను. మీ అందరి తలలు బోడిచేస్తాను. ఒక్కడే కొడుకు చనిపోతే శోకించినట్టుగా నేను చేస్తాను. దాని ముగింపు ఘోరమైన రోజుగా ఉంటుంది.
11 He aquí que vienen días, dice Yahvé, el Señor, en que enviaré hambre sobre la tierra; no hambre de pan, ni sed de agua, sino de oír las palabras de Yahvé.
౧౧యెహోవా ప్రకటించేది ఇదే, “రాబోయే రోజుల్లో దేశంలో నేను కరువు పుట్టిస్తాను. అది తిండి కోసం, మంచినీళ్ళ కోసం కరువు కాదు కానీ యెహోవా మాటలు వినకపోవడం వలన కలిగేదిగా ఉంటుంది.
12 Andarán errantes de mar a mar, y discurrirán del norte al oriente, en busca de la palabra de Yahvé, mas no la hallarán.
౧౨యెహోవా మాట వినడానికి ఒక సముద్రం నుంచి మరొక సముద్రం వరకూ, ఉత్తర దిక్కు నుంచి తూర్పు దిక్కు వరకూ తిరుగుతారు కానీ అది వారికి దొరకదు.
13 En aquel día desfallecerán de sed las hermosas doncellas y los jóvenes,
౧౩ఆ రోజు అందమైన కన్యలూ యువకులూ దాహంతో సోలిపోతారు.
14 que juran por el pecado de Samaria diciendo: “¡Por la vida de tu dios, oh Dan!”, y: “¡Por el camino de Bersabee!” Caerán y no se levantarán nunca jamás.
౧౪సమరయ పాపంతో ఒట్టు పెట్టుకునే వారు, ‘దాను, నీ దేవుని ప్రాణం మీద ఒట్టు.’ ‘బెయేర్షెబా, దేవుని ప్రాణం మీద ఒట్టు’ అనేవారు ఇంకా ఎన్నడూ లేవలేకుండా కూలిపోతారు.”