< 2 Samuel 9 >

1 Preguntó David: “¿Queda todavía alguno de la casa de Saúl, a quien pueda yo hacer merced por amor a Jonatán?”
“సౌలు కొడుకు యోనాతానును బట్టి నేను ఏదైనా మేలు చేయడానికి అతని కుటుంబానికి చెందినవారు ఎవరైనా మిగిలి ఉన్నారా?” అని దావీదు అడిగాడు.
2 Y había un siervo de la casa de Saúl que se llamaba Sibá, al cual llamaron ante David, y el rey le preguntó: “¿Eres tú Sibá?” Él respondió: “Tu siervo.”
సౌలు కుటుంబానికి సీబా అనే సేవకుడు ఉండేవాడు. దావీదు మనుషులు అతణ్ణి దావీదు దగ్గరికి పిలుచుకు వచ్చారు. దావీదు రాజు “సీబావు నువ్వే కదా” అని అడిగాడు. అతడు “నీ సేవకుడినైన నేనే సీబాను” అన్నాడు.
3 Dijo el rey: “¿Queda aún persona alguna de la casa de Saúl para que pueda yo hacerle misericordia de Dios?” Sibá respondió al rey: “Vive todavía un hijo de Jonatán, lisiado de ambos pies.”
అప్పుడు దావీదు “యెహోవా నాపై దయ చూపించినట్టు నేను మేలు చేయడానికి సౌలు కుటుంబంలో ఒక్కడైనా మిగిలి ఉన్నాడా?” అని అతణ్ణి అడిగాడు. అప్పుడు సీబా “యోనాతానుకు కుంటివాడైన ఒక కొడుకు ఉన్నాడు” అని రాజుకు విన్నవించుకున్నాడు.
4 El rey le preguntó: “¿Dónde está?” Y dijo Sibá al rey: “He aquí que está en casa de Maquir, hijo de Amiel, en Lodebar.”
“అతడు ఎక్కడ ఉంటున్నాడు?” అని రాజు అడిగాడు. సీబా “అయ్యా, అతడు లోదెబారులో అమ్మీయేలు కొడుకు మాకీరు ఇంట్లో ఉన్నాడు” అని రాజుతో చెప్పాడు.
5 Entonces el rey David envió por él, y le trajeron de la casa de Maquir, hijo de Amiel, de Lodebar.
అప్పుడు రాజైన దావీదు తన మనుషులను పంపి లోదెబారులో ఉన్న అమ్మీయేలు కొడుకు మాకీరు ఇంటి నుండి అతణ్ణి తన దగ్గరికి రప్పించాడు.
6 Llegó, pues, Mefibóset, hijo de Jonatán, hijo de Saúl, a David, y prosternándose cayó sobre su rostro. Dijo David: “¿Mefibóset?” A lo cual él respondió: “Aquí tienes a tu siervo.”
సౌలు కొడుకు యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతు దావీదు దగ్గరికి వచ్చి సాగిలపడి నమస్కారం చేశాడు. అప్పుడు దావీదు “మెఫీబోషెతూ” అని అతణ్ణి పిలిచాడు. అతడు “అయ్యా, నీ దాసుణ్ణి. నేను ఇక్కడే ఉన్నాను” అన్నాడు.
7 “No temas, le dijo David, pues pienso hacerte merced, por amor a Jonatán, tu padre; te restituiré todas las heredades de tu abuelo Saúl y comerás siempre a mi mesa.”
దావీదు “నువ్వు భయపడవద్దు, నీ తండ్రి యోనాతానును బట్టి తప్పక నీకు మేలు కలిగేలా చేసి, నీ తాత సౌలు భూమి మొత్తాన్ని నీకు తిరిగి ఇప్పిస్తాను. ఇంకా నువ్వు జీవించినంత కాలం నా బల్ల దగ్గరే భోజనం చేస్తావు” అని చెప్పాడు.
8 Entonces él le hizo profunda reverencia, y exclamó: “¿Qué soy yo, siervo tuyo, para que vuelvas tu rostro hacia un perro muerto cual soy yo?”
అతడు నమస్కరించి “చచ్చిన కుక్కలాంటి నా పట్ల నువ్వు కనికరం చూపించడానికి నీ దాసుణ్ణి నేను ఎంతవాణ్ణి?” అన్నాడు.
9 Luego llamó el rey a Sibá, siervo de Saúl, y le dijo: “Todo cuanto era de Saúl y de toda su casa se lo doy al hijo de tu señor.
అప్పుడు రాజు సౌలు సేవకుడైన సీబాను పిలిపించి “సౌలు అతని కుటుంబం వారికి గతంలో ఉన్న ఆస్తి మొత్తాన్ని నీ యజమాని యోనాతాను కొడుకుకు తిరిగి ఇప్పించాను.
10 Labrarás para él las tierras, tú y tus hijos y tus siervos, y harás la cosecha para que la casa de tu señor tenga pan que comer; mas Mefibóset, hijo de tu señor, comerá siempre a mi mesa.” Tenía Sibá quince hijos y veinte siervos;
౧౦కాబట్టి నువ్వు, నీ కొడుకులు, దాసులు అతని కోసం ఆ భూమిని సాగు చెయ్యండి. నీ యజమాని కొడుకు తినేందుకు సరిపోయిన ఆహారం ఆ పంట నుండి తీసుకు రావాలి. నీ యజమాని కుమారుడు మెఫీబోషెతు ఎప్పుడూ నా బల్ల దగ్గరే భోజనం చేస్తాడు” అని చెప్పాడు. సీబాకు పదిహేనుమంది కొడుకులు, ఇరవైమంది సేవకులు ఉన్నారు.
11 y dijo Sibá al rey: “Tu siervo hará todo lo que mi señor, el rey, le ha mandado.” Comió, pues, Mefibóset a la mesa (de David), como uno de los hijos del rey.
౧౧అప్పుడు సీబా “నా యజమానివైన రాజా, నీ దాసుణ్ణి నాకు సెలవిచ్చినట్టు అంతా జరిగిస్తాను” అని రాజుతో చెప్పాడు. అప్పటి నుండి మెఫీబోషెతు రాజకుమారుల్లో ఒకడు అన్నట్టు రాజు బల్ల దగ్గరే భోజనం చేస్తూ వచ్చాడు.
12 Tenía Mefibóset un hijo pequeño, que se llamaba Micá; y todos los que vivían en la casa de Sibá eran siervos de Mefibóset.
౧౨మెఫీబోషెతుకు ఒక కొడుకు ఉన్నాడు. అతడు పసివాడు. అతని పేరు మీకా. సీబా కుటుంబం వారంతా మెఫీబోషెతుకు దాసులుగా ఉన్నారు.
13 Mefibóset habitaba en Jerusalén, porque comía siempre a la mesa del rey; era cojo de ambos pies.
౧౩మెఫీబోషెతు యెరూషలేములో నివసించి కలకాలం రాజు బల్ల దగ్గరే భోజనం చేస్తూ ఉన్నాడు. అతని రెండు కాళ్ళూ కుంటివి.

< 2 Samuel 9 >