< Psalmi 122 >
1 Bil sem vesel, ko so mi rekli: »Pojdimo v Gospodovo hišo.«
౧దావీదు రాసిన యాత్రల కీర్తన పదండి, యెహోవా మందిరానికి వెళ్దాం, అని ప్రజలు నాతో చెప్పినప్పుడు నేను సంతోషించాను.
2 Naša stopala bodo stala znotraj tvojih velikih vrat, oh Jeruzalem.
౨యెరూషలేమా, మా పాదాలు నీ ప్రవేశ ద్వారాల వద్ద నిలబడుతున్నాయి.
3 Jeruzalem je zgrajen kakor mesto, ki je stisnjeno skupaj,
౩యెరూషలేమును కుదురైన నగరంగా కట్టారు.
4 kamor se vzpenjajo rodovi, Gospodovi rodovi, v pričevanje Izraelu, da dajejo zahvalo Gospodovemu imenu.
౪యెహోవా నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి యెహోవా గోత్రాలు అక్కడికి ఎక్కిపోవాలని వారికి శాసనం ఉంది.
5 Kajti tam so postavljeni sodni prestoli, prestoli Davidove hiše.
౫నాయకులు అక్కడ సింహాసనాలపై కూర్చుంటారు. అవి దావీదు రాజవంశం సింహాసనాలు.
6 Mólite za mir v Jeruzalemu. Tisti, ki te ljubijo, bodo uspevali.
౬యెరూషలేము క్షేమంగా ఉండాలని ప్రార్థన చేయండి. యెరూషలేమా, నిన్ను ప్రేమించేవాళ్ళు వృద్ది చెందుతారు.
7 Mir bodi znotraj tvojih zidov in uspevanje v tvojih palačah.
౭నీ సరిహద్దులు ప్రశాంతంగా ఉండాలి. నీ పట్టణాల్లో శాంతి వర్ధిల్లుతూ ఉండాలి.
8 Zaradi mojih bratov in zaradi družabnikov bom torej rekel: »Mir bodi znotraj tebe.«
౮మీకు శాంతి సమాధానాలు కలుగుతాయి, అని నా సహోదరులను, నా స్నేహితులను దీవిస్తాను.
9 Zaradi hiše Gospoda, našega Boga, bom iskal tvoje dobro.
౯మన దేవుడైన యెహోవా మందిరం కోసం, నీకు మేలు కలగడం కోసం ప్రార్థన చేస్తాను.