< 3 Mojzes 19 >
1 Gospod je spregovoril Mojzesu, rekoč:
౧యెహోవా మోషేకు ఇంకా ఇలా ఆజ్ఞాపించాడు. ఇశ్రాయేలీయుల సమాజమంతటితో ఇలా చెప్పు.
2 »Spregovori vsej skupnosti Izraelovih otrok in jim reci: ›Vi bodite sveti, kajti jaz, Gospod, vaš Bog, sem svet.
౨“మీరు పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకంటే మీ దేవుడైన యెహోవా అనే నేను పరిశుద్ధుడిని.
3 Bojte se vsak mož svoje matere in svojega očeta in se držite mojih šabat. Jaz sem Gospod, vaš Bog.
౩మీలో ప్రతివాడూ తన తల్లిని తన తండ్రిని గౌరవించాలి. నేను నియమించిన విశ్రాంతి దినాలను ఆచరించాలి. నేను మీ దేవుడైన యెహోవాను.
4 Ne obračajte se k malikom niti si ne delajte ulitih bogov. Jaz sem Gospod, vaš Bog.
౪మీరు పనికిమాలిన దేవుళ్ళ వైపు తిరగకూడదు. మీరు పోత విగ్రహాలను చేసుకోకూడదు. నేను మీ దేవుడైన యెహోవాను.
5 Če darujete žrtvovanje mirovnih daritev Gospodu, jo darujte po lastni volji.
౫మీరు యెహోవాకు సమాధాన బలి అర్పించేటప్పుడు అది అంగీకారయోగ్యమయ్యేలా అర్పించాలి.
6 Jejte jo isti dan, kot jo darujete in naslednji dan. Če pa kaj ostane do tretjega dne, naj bo to sežgano v ognju.
౬మీరు బలిమాంసాన్ని బలి అర్పించిన రోజైనా, మరునాడైనా దాన్ని తినాలి. మూడో రోజు దాకా మిగిలి ఉన్న దాన్ని పూర్తిగా కాల్చివేయాలి.
7 Če bo karkoli pojedeno na tretji dan, je to gnusno; to ne bo sprejeto.
౭మూడో రోజున దానిలో కొంచెం తిన్నా సరే, అది అసహ్యం. అది ఆమోదం కాదు.
8 Zatorej bo vsakdo, ki to jé, nosil svojo krivičnost, ker je oskrunil posvečeno Gospodovo stvar in ta duša bo iztrebljena izmed svojega ljudstva.
౮మూడో రోజున దాన్ని తినేవాడు తన దోషశిక్షను భరిస్తాడు. వాడు యెహోవాకు పరిశుద్ధమైన దాన్ని అపవిత్ర పరిచాడు కదా. వాడిని ప్రజల్లో లేకుండా చెయ్యాలి.
9 Ko žanješ žetev svoje dežele, ne požanji v celoti vogalov svojega polja niti ne zbiraj paberkovanja svoje žetve.
౯మీరు మీ పొలం పంట కోసేటప్పుడు నీ పొలం మూలల్లొ పూర్తిగా కోయకూడదు. నీ కోతలో పరిగె ఏరుకోకూడదు. నీ పండ్ల చెట్ల పరిగెను సమకూర్చుకోకూడదు.
10 Svojega vinograda [po trgatvi] ne boš paberkoval niti ne obiraj vsakega grozda svojega vinograda. Pusti jih za revnega in tujca. Jaz sem Gospod, vaš Bog.
౧౦నీ ద్రాక్ష తోటలో పండ్లన్నిటినీ సేకరించుకో కూడదు. ద్రాక్ష తోటలో రాలిన పండ్లను ఏరుకోకూడదు. పేదలకు, పరదేశులకు వాటిని విడిచిపెట్టాలి.
11 Ne kradite, niti ne ravnajte napačno, niti ne lažite drug drugemu.
౧౧నేను మీ దేవుడైన యెహోవాను. మీరు దొంగతనం చేయకూడదు. అబద్ధం ఆడకూడదు. ఒకడినొకడు దగా చెయ్యకూడదు.
12 Pri mojem imenu ne prisegajte lažnivo niti ne skrunite imena svojega Boga. Jaz sem Gospod.
౧౨నా నామం పేరిట అబద్ధంగా ఒట్టు పెట్టుకోకూడదు. నీ దేవుని పేరును అపవిత్ర పరచకూడదు. నేను యెహోవాను.
13 Svojega soseda ne goljufaj niti ga ne ropaj. Plačila tistega, ki je najet, naj ne ostanejo s teboj vso noč do jutra.
౧౩నీ పొరుగు వాణ్ణి పీడించకూడదు. అతణ్ణి దోచుకోకూడదు. కూలివాడి కూలీ డబ్బు మరునాటి వరకూ నీ దగ్గర ఉంచుకోకూడదు.
14 Ne preklinjaj gluhega niti ne polagaj kamna spotike pred slepega, temveč se boj svojega Boga. Jaz sem Gospod.
౧౪చెవిటివాణ్ణి తిట్ట కూడదు. గుడ్డివాడి దారిలో అడ్డంకులు వేయకూడదు. నీ దేవునికి భయపడాలి. నేను యెహోవాను.
15 Na sodbi ne stori nobene nepravičnosti. Ne spoštuj revne osebe niti ne časti mogočne osebe, temveč svojega bližnjega sodi v pravičnosti.
౧౫అన్యాయ తీర్పు తీర్చకూడదు. బీదవాడని పక్షపాతం చూపకూడదు. గొప్పవాడని అభిమానం చూపకూడదు. నీ పొరుగువాడి పట్ల న్యాయంగా ప్రవర్తించాలి.
16 Ne hodi gor in dol med svojim ljudstvom kakor tožljivec niti ne stoj zoper kri svojega bližnjega. Jaz sem Gospod.
౧౬నీ ప్రజల మధ్య కొండేలు చెబుతూ ఇంటింటికి తిరగకూడదు. ఎవరికైనా ప్రాణ హాని కలిగించేది ఏదీ చెయ్యవద్దు. నేను యెహోవాను.
17 V svojem srcu ne sovraži svojega brata. Vsekakor pograjaj svojega bližnjega in ne trpi greha na njem.
౧౭నీ హృదయంలో నీ సోదరుణ్ణి అసహ్యించుకోకూడదు. నీ పొరుగువాడి పాపం నీ మీదికి రాకుండేలా నీవు తప్పకుండా అతణ్ణి గద్దించాలి.
18 Ne maščuj se niti ne goji nobene zamere zoper otroke svojega ljudstva, temveč ljubi svojega bližnjega kakor samega sebe. Jaz sem Gospod.
౧౮పగ సాధించ వద్దు. ఎవరిమీదా కక్ష పెట్టుకోవద్దు. నిన్ను నీవు ప్రేమించుకున్నట్టే నీ సాటి మనిషిని ప్రేమించాలి. నేను యెహోవాను.
19 Držite se mojih zakonov. Svoji živini ne dovoli, da se pari z različno vrsto. Svoje polje ne posej s pomešanim semenom niti naj nate ne pride obleka [hkrati] stkana iz lanu in volne.
౧౯మీరు నా శాసనాలను పాటించాలి. నీ జంతువులకు ఇతర జాతి జంతువులతో సంపర్కం చేయకూడదు. నీ పొలంలో వేరు వేరు జాతుల విత్తనాలు చల్లకూడదు. రెండు రకాల దారాలతో నేసిన బట్టలు ధరించకూడదు.
20 Kdorkoli meseno leži z žensko, ki je sužnjica, zaročena k soprogu in sploh ni odkupljena niti ji ni dana svoboda; ona naj bo bičana. Ne bosta usmrčena, ker ona ni bila svobodna.
౨౦ఒక బానిస పిల్లలు ఒకడితో నిశ్చితార్థం జరిగాక ఆమెను వెల ఇచ్చి విడిపించకుండా, లేదా ఆమెకు విముక్తి కలగక ముందు ఎవరైనా ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకుంటే అలాటి వాణ్ణి శిక్షించాలి. ఆమెకు విడుదల కలగలేదు గనక వారికి మరణశిక్ష విధించ కూడదు.
21 On bo k vratom šotorskega svetišča skupnosti privedel svojo daritev za prestopek Gospodu, namreč ovna za daritev za prestopek.
౨౧అతడు అపరాధ పరిహార బలిని, అంటే అపరాధ పరిహార బలిగా ఒక పొట్టేలును ప్రత్యక్ష గుడార ద్వారానికి యెహోవా సన్నిధికి తీసుకు రావాలి.
22 Duhovnik naj zanj pred Gospodom za njegov greh opravi spravo z ovnom daritve za prestopek, ki ga je storil, in greh, ki ga je storil, mu bo odpuščen.
౨౨అప్పుడు యాజకుడు అతడు చేసిన పాపాన్నిబట్టి పాప పరిహార బలిగా ఆ పొట్టేలు మూలంగా యెహోవా సన్నిధిలో అతని కోసం ప్రాయశ్చిత్తం చేయాలి. ఈ విధంగా అతడు చేసిన పాపం విషయమై అతనికి క్షమాపణ కలుగుతుంది.
23 Ko boste prišli v deželo in boste za hrano sadili vse vrste dreves, potem štejte njihov sad kot neobrezan. Tri leta vam bo ta kot neobrezan, ta naj ne bo pojeden.
౨౩మీరు ఆ దేశానికి వచ్చి తినడానికి రకరకాల చెట్లు నాటినప్పుడు వాటి పండ్లను నిషేధంగా ఎంచాలి. మూడు సంవత్సరాల పాటు అవి మీకు అపవిత్రంగా ఉండాలి. వాటిని తినకూడదు.
24 Toda v četrtem letu bo vse njegovo sadje sveto, da s tem hvali Gospoda.
౨౪నాలుగో సంవత్సరంలో వాటి పండ్లన్నీ యెహోవాకు ప్రతిష్ఠితమైన స్తుతి అర్పణలుగా ఉంటాయి. ఐదో సంవత్సరంలో వాటి పండ్లను తినొచ్చు.
25 V petem letu boste jedli od njegovega sadja, da vam bo lahko obrodil svoj donos. Jaz sem Gospod, vaš Bog.
౨౫నేను మీ దేవుడైన యెహోవాను.
26 Nobene stvari ne jejte s krvjo niti ne izrekajte uroka niti ne obeležujte časov.
౨౬రక్తం కలిసి ఉన్న మాంసం తినకూడదు. శకునాలు చూడకూడదు. మంత్ర ప్రయోగం ద్వారా ఇతరులను వశపరచుకోడానికి చూడకూడదు.
27 Ne zaoblite robov svojih glav niti ne kazite robov svoje brade.
౨౭విగ్రహ పూజలు చేసే ఇతర జనాల్లాగా మీ తల పక్క భాగాలు గానీ నీ గడ్డం అంచులు గానీ గుండ్రంగా గొరిగించుకోకూడదు.
28 Na svojem mesu ne boste delali nobenih urezov za mrtve niti si nase ne vtisnite nobenih znamenj. Jaz sem Gospod.
౨౮చచ్చిన వారి కోసం మీ దేహాన్ని గాయపరచుకోకూడదు. ఒంటిపై పచ్చబొట్లు పొడిపించుకోకూడదు. నేను మీ దేవుడైన యెహోవాను.
29 Ne onečasti svoje hčere, da ji ne povzročiš, da postane vlačuga, da ne bi dežela padla v vlačugarstvo in bi dežela postala polna zlobnosti.
౨౯నీ కూతురిని వేశ్యగా చేసి ఆమెను హీనపరచకూడదు. అలా చేస్తే మీ దేశం వ్యభిచారంలో పడిపోతుంది. మీ ప్రాంతం కాముకత్వంతో నిండిపోతుంది.
30 Držite se mojih šabat in spoštujte moje svetišče. Jaz sem Gospod.
౩౦నేను నియమించిన విశ్రాంతి దినాలను మీరు ఆచరించాలి. నా పరిశుద్ధ మందిరాన్ని గౌరవించాలి. నేను యెహోవాను.
31 Ne obračajte se k tem, ki imajo osebne duhove niti ne povprašujte za čarovniki, da vas ne omadežujejo. Jaz sem Gospod, vaš Bog.
౩౧చచ్చిన ఆత్మలతో మాట్లాడుతామని చెప్పే వారి దగ్గరికి సోదె చెప్పేవారి దగ్గరికి పోకూడదు. అలా చేస్తే వారివలన మీరు అపవిత్రులౌతారు. నేను మీ దేవుడైన యెహోవాను.
32 Pred osivelo glavo vstani in spoštuj obraz starca in se boj svojega Boga. Jaz sem Gospod.
౩౨తల నెరసిన ముసలివాడి ఎదుట లేచి నిలబడి అతని ముఖాన్ని గౌరవించాలి. నీ దేవునికి భయపడాలి. నేను యెహోవాను.
33 Če tujec začasno prebiva s teboj v tvoji deželi, ga ne zatiraj.
౩౩మీ దేశంలో పరదేశి ఎవరైనా మీ మధ్య నివసించేటప్పుడు అతణ్ణి బాధ పెట్టకూడదు,
34 Temveč naj ti bo tujec, ki prebiva s teboj, kakor nekdo rojen med vami in ljubi ga kakor samega sebe, kajti bili ste tujci v egiptovski deželi. Jaz sem Gospod, vaš Bog.
౩౪మీ మధ్య నివసించే పరదేశిని మీలో పుట్టినవాడి లాగానే ఎంచాలి. నిన్ను నీవు ప్రేమించుకున్నట్టే అతణ్ణి ప్రేమించాలి. ఐగుప్తులో మీరు పరదేశులుగా ఉన్నారు గదా. నేను మీ దేవుడైన యెహోవాను.
35 Nobene nepravičnosti ne delajte pri sodbi, merilni palici, teži ali meri.
౩౫కొలతలోగాని తూనికలోగాని పరిమాణంలో గాని మీరు అన్యాయం చేయకూడదు.
36 Imejte pravične tehtnice, pravične uteži, pravičen škaf in pravičen vrč. Jaz sem Gospod, vaš Bog, ki sem vas privedel iz egiptovske dežele.
౩౬న్యాయమైన త్రాసులు న్యాయమైన బరువులు, న్యాయమైన కొల పాత్రలు న్యాయమైన పడి మీకుండాలి. నేను ఐగుప్తులోనుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడైన యెహోవాను.
37 Zato upoštevajte vse moje zakone in vse moje sodbe ter jih izvršujte. Jaz sem Gospod.‹«
౩౭మీరు నా శాసనాలన్నిటిని నా విధులన్నిటిని పాటించాలి. నేను యెహోవాను.”