< Job 35 >

1 Elihú je poleg tega spregovoril in rekel:
ఎలీహు ఇలా జవాబు ఇచ్చాడు.
2 »Mar misliš, da je to pravilno, da govoriš: ›Moja pravičnost je večja kakor Božja?‹
నువ్వు నిర్దోషివని అనుకుంటున్నావా? “నేను దేవుడి కన్నా నీతిపరుణ్ణి” అనుకుంటున్నావా?
3 Kajti praviš: ›Kakšna prednost ti bo to?‹ in ›Kakšno korist bom imel, če bom očiščen pred svojim grehom?‹
“నేను నీతిగా ఉంటే ప్రయోజనం ఏమిటి? పాపం చేస్తే నాకు కలిగిన లాభం కన్నా నా నీతి వలన నాకు కలిగిన లాభమేమిటి?” అని నువ్వు చెబుతున్నావే.
4 Odgovoril ti bom in tvojim družabnikom s teboj.
నీకూ నీ మిత్రులకు కూడా నేను సమాధానం చెబుతాను.
5 Poglej v nebo in glej. Ogleduj oblake, ki so višje kakor ti.
ఆకాశం వైపు తేరి చూడు. నీ కన్నా ఉన్నతమైన ఆకాశ విశాలం వైపు చూడు.
6 Če grešiš, kaj delaš zoper njega? Ali če so tvoji prestopki pomnoženi, kaj mu delaš?
నువ్వు పాపం చేసినా ఆయనకు నష్టమేమిటి? నీ అతిక్రమాలు పోగుపడినా ఆయనకి నువ్వు చేసిందేమిటి?
7 Če si pravičen, kaj mu daješ? Ali kaj on prejema iz tvoje roke?
నువ్వు నీతిమంతుడివైతే ఆయనకు నీవేమైనా ఇస్తున్నావా? ఆయన నీ దగ్గర నుండి ఏమైనా తీసుకుంటాడా?
8 Tvoja zlobnost lahko prizadene človeka, kakor si ti in tvoja pravičnost lahko koristi človeškemu sinu.
నువ్వు మనిషివి కాబట్టి నీ కీడు ఏమైనా మనిషికే తగులుతుంది. నీ నీతి ఫలం ఏదైనా మనుషులకే దక్కుతుంది.
9 Zaradi množice zatiranj povzročajo zatiranim, da kričijo. Vpijejo zaradi lakta mogočnega.
అనేకమైన అణచివేత క్రియల వలన ప్రజలు అక్రోశిస్తారు. బలవంతుల భుజబలానికి భయపడి సహాయం కోసం కేకలు పెడతారు.
10 Toda nihče ne pravi: ›Kje je Bog, moj stvarnik, ki daje pesmi ponoči,
౧౦అయితే “రాత్రిలో మనకు పాటలు ఇస్తూ,
11 ki nas uči več kakor zemeljske živali in nas dela modrejše kakor perjad neba?‹
౧౧భూజంతువుల కంటే మనకు ఎక్కువగా బుద్ధి నేర్పుతూ, ఆకాశపక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానం కలగజేస్తూ నన్ను సృష్టించిన దేవుడు ఎక్కడున్నాడు?” అనుకునే వారెవరూ లేరు.
12 Tam vpijejo, toda nihče ne daje odgovora zaradi ponosa zlobnežev.
౧౨వారు దుష్టుల గర్వాన్ని బట్టి మొర పెడతారు గాని ఆయన జవాబివ్వడం లేదు.
13 Bog zagotovo ne bo slišal prazne reči niti se Vsemogočni na to ne bo oziral.
౧౩దేవుడు ఒక్కనాటికీ వ్యర్థమైన మాటలు ఆలకించడు. సర్వశక్తుడు వాటిని లక్ష్యపెట్టడు.
14 Čeprav praviš, da ga ne boš videl, je vendar sodba pred njim, zato zaupaj vanj.
౧౪ఆయన కనిపించడం లేదని నువ్వు చెబితే మరి ఇంకెంతగా ఆయన పెడచెవిన పెడతాడు! వాదం ఆయన ఎదుటనే ఉంది. ఆయన కోసం నువ్వు కనిపెట్టవలసిందే.
15 Toda sedaj, ker to ni tako, je obiskal v svoji jezi, vendar on tega v veliki skrajnosti ne pozna.
౧౫“ఆయన ఎవరినీ కోపంతో దండించడు, మనుషుల అహంకారాన్ని ఆయన పట్టించుకోడు” అని నీవంటే మరి ఇంకెంతో నిశ్చయంగా ఆయన జవాబు చెప్పకుండా మౌనం దాలుస్తాడు గదా.
16 Job zato svoja usta zaman odpira. Besede množi brez spoznanja.«
౧౬కాబట్టి యోబు కేవలం బుద్ధితక్కువ మాటలు పలకడానికే తన నోరు తెరిచాడు. జ్ఞానం లేని మాటలనే రాసులు పోస్తున్నాడు.

< Job 35 >