< Ozej 7 >
1 Ko sem hotel ozdraviti Izraela, takrat je bila odkrita krivičnost Efrájima in zlobnost Samarije, kajti zagrešili so neresnico. In tat vstopa in krdelo roparjev pleni zunaj.
౧నేను ఇశ్రాయేలును బాగు చేద్దామని కోరినప్పుడల్లా ఎఫ్రాయిము దోషం కనిపిస్తూ ఉంది. షోమ్రోను దుష్కార్యాలు బయటపడుతున్నాయి. వారు మోసం అభ్యాసం చేస్తారు. దొంగతనానికి చొరబడతారు. బంది పోటు దొంగల్లా వీధుల్లో దోచుకుంటారు.
2 V svojih srcih pa ne preudarijo, da se spominjam vse njihove zlobnosti. Sedaj so jih njihova lastna dejanja obkrožila; pred mojim obrazom so.
౨తమ క్రియలు వారి చుట్టూ ఉన్నప్పటికీ, అవి నా ఎదుటనే జరిగినప్పటికీ, వారి దుర్మార్గత నేను జ్ఞాపకం చేసుకోనని తమలో తాము అనుకుంటారు.
3 Kralja razveseljujejo s svojo zlobnostjo in prince s svojimi lažmi.
౩వారి దుష్టత్వానికి, వారి అధికారుల అబద్ధాలకు వారి రాజు సంతోషిస్తాడు.
4 Vsi so zakonolomci, kakor peč, ki jo segreje pek, ki preneha kuriti, potem ko je pregnetel testo, dokler to ni vzhajano.
౪వారంతా కాముకులే. రొట్టెలు కాల్చే వాడు ముద్ద పిసికిన తరువాత. ముద్దంతా పొంగే దాకా పొయ్యిని బాగా వేడిచేసి. ఊరుకున్నట్టు వారంతా కాముకులే.
5 Na dan našega kralja so ga princi naredili bolnega z vinskimi mehovi; svojo roko podaja s posmehljivci.
౫మన రాజు ఉత్సవ దినాన అధికారులు అతని ద్రాక్షారసం కాకతో మత్తెక్కి జబ్బుపడిపోయారు. రాజు తానే అపహాసకులతో చెయ్యి కలిపాడు.
6 Kajti svoje srce so pripravili kakor peč, medtem ko prežijo v zasedi. Njihov pek spi vso noč; zjutraj ta gori kakor plameneč ogenj.
౬పొయ్యి లాంటి తమ హృదయాలతో కపటపు ఆలోచనలు చేస్తారు. వారి క్రోధం రాత్రంతా మండుతూనే ఉంటుంది. ఉదయాన అది తీవ్రమైన జ్వాలగా మండుతుంది.
7 Vsi so vroči kakor peč in požrli so svoje sodnike; vsi njihovi kralji so padli; tam ni nobenega izmed njih, ki kliče k meni.
౭వారంతా పొయ్యిలాగా కాలుతూ ఉంటారు. తమపై పరిపాలన చేసే వారిని వారు మింగేస్తారు. వారి రాజులంతా కూలిపోయారు. నన్ను స్మరించే వాడు ఒక్కడు కూడా లేడు.
8 Efrájim se je pomešal med ljudstvo, Efrájim je neobrnjen kolač.
౮ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయాడు. ఎఫ్రాయిము రెండో వైపుకు తిప్పని అట్టు వంటి వాడయ్యాడు.
9 Tujci so požrli njegovo moč, on pa tega ne spoznava. Da, sivi lasje so tu in tam na njem, vendar ne spoznava.
౯పరాయి వారు అతని బలాన్ని మింగేసినా అది అతనికి తెలియలేదు. తలమీద నెరసిన జుట్టు కనబడుతున్నా అది అతనికి తెలియదు.
10 Izraelov ponos pričuje v njegov obraz, oni pa se ne vrnejo h Gospodu, svojemu Bogu niti ga zaradi vsega tega ne iščejo.
౧౦ఇశ్రాయేలువారి ప్రతిష్టే అతని మీద సాక్ష్యం పలుకుతుంది. ఇంత జరిగినా వారు తమ దేవుడైన యెహోవా వైపు తిరుగడం లేదు. ఆయనను వెతకడం లేదు.
11 Tudi Efrájim je podoben neumni golobici brez srca; kličejo k Egiptu, hodijo v Asirijo.
౧౧ఎఫ్రాయిము బుద్ధిలేని పిరికి గుండె గల గువ్వ అయిపోయింది. అది ఐగుప్తీయులను పిలుస్తుంది. తరువాత అష్షూరీయుల దగ్గరికి ఎగిరిపోతుంది.
12 Ko bodo šli, bom nadnje razširil svojo mrežo. Sklatil jih bom dol kakor perjad neba, kaznoval jih bom, kakor je slišala njihova skupnost.
౧౨వారు వెళ్ళినప్పుడు నేను వారిపై నా వల వేస్తాను. పక్షులను కొట్టినట్టు వారిని పడగొడతాను. వారు గుమిగూడిన చోట వారిని శిక్షిస్తాను.
13 Gorje jim! Kajti zbežali so od mene. Naj jim bo namenjeno uničenje! Ker so se prekršili zoper mene. Čeprav sem jih odkupil, so oni kljub temu zoper mene govorili laži.
౧౩వారికి బాధ! వారు నన్ను విడిచిపెట్టి తప్పిపోయారు. వినాశం వారి మీదికి ముంచుకు వస్తోంది. వారు నా మీద తిరుగుబాటు చేశారు. వారిని రక్షించేవాడినే. కానీ వారు నా మీద అబద్ధాలు చెప్పారు.
14 In niso klicali k meni s svojim srcem, ko so tulili na svojih posteljah; zbrali so se zaradi žita in vina in se uprli zoper mene.
౧౪హృదయ పూర్వకంగా నన్ను బతిమాలుకోలేదు గానీ. మంచాల మీద పడుకుని ఆక్రోశిస్తారు. ధాన్యం, కొత్త సారాయి కావాలని తమను కత్తితో గాయపరచుకుంటారు. కానీ నా నుండి దూరంగా వెళ్ళిపోతారు.
15 Čeprav sem utrdil in okrepil njihove lakte, so zoper mene še vedno domišljali vragolijo.
౧౫నేను వారి చేతులు బలపరచి శిక్షణ ఇచ్చినా వారు నా మీద కుట్రలు చేస్తారు.
16 Vračajo se, toda ne k Najvišjemu; so kot varljiv lok; njihovi princi bodo padli pod mečem zaradi besa njihovega jezika. To bo v njihov posmeh v egiptovski deželi.
౧౬వారు తిరిగి వస్తారు గానీ, సర్వోన్నతుని దేవుని వైపుకు తిరగరు. వారు పనికిరాని విల్లులాగా ఉన్నారు. వారి అధికారులు తాము పలికిన గర్వపు మాటల మూలంగా కత్తి పాలవుతారు. ఇలా వారు ఐగుప్తుదేశంలో ఎగతాళికి గురి అవుతారు.