< 2 Samuel 18 >
1 David je preštel ljudstvo, ki je bilo z njim in nadnje postavil poveljnike nad tisočimi in poveljnike nad stotimi.
౧దావీదు తన దగ్గర ఉన్న మనుషులను లెక్కించాడు. వారిలో వెయ్యిమందిని, వందమందిని విభజించి వారిని మూడు భాగాలుగా చేశాడు.
2 David je poslal naprej tretjino izmed ljudstva pod Joábovo roko in tretjino pod roko Abišája, Cerújinega sina, Joábovega brata in tretjino pod roko Gitéjca Itája. Kralj je rekel ljudstvu: »Tudi sam bom zagotovo šel z vami naprej.«
౨ఒక భాగానికి యోవాబుకు, ఒక భాగాన్ని సెరూయా కుమారుడు, యోవాబు సోదరుడు అబీషైకు, మరో భాగాన్ని గిత్తీయుడు ఇత్తయికు నాయకత్వ బాధ్యతలు అప్పగించాడు. తరువాత దావీదు “నేను మీతోకూడా కలసి బయలుదేరుతున్నాను” అని వారితో చెప్పాడు.
3 Toda ljudstvo je odgovorilo: »Ne boš šel naprej, kajti če mi pobegnemo, jim ne bo mar za nas. Niti, če nas polovica umre, jim ne bo mar za nas. Toda ti si sedaj vreden deset tisoč nas. Zato je sedaj bolje, da nas okrepiš iz mesta.«
౩అందుకు వారు “నువ్వు మాతో రాకూడదు. మేము పారిపోయినా ప్రజలు దాన్ని పట్టించుకోరు, మాలో సగం మంది చనిపోయినా ఎవ్వరూ పట్టించుకోరు. మాలాంటి పది వేలమందితో నువ్వు ఒక్కడివి సమానం. కాబట్టి నీవు పట్టణంలోనే ఉండి మాకు సూచనలిస్తూ సహాయం చెయ్యి” అని చెప్పారు.
4 Kralj jim je rekel: »Storil bom, kar se vam zdi najbolje.« Kralj je stal ob strani velikih vrat, vse ljudstvo pa je prišlo ven po stotih in po tisočih.
౪అందుకు రాజు “మీ దృష్టికి ఏది మంచిదో దాన్ని చేస్తాను” అని చెప్పి, గుమ్మం పక్కన నిలబడినప్పుడు ప్రజలంతా గుంపులు గుంపులుగా వందల కొలదిగా, వేల కొలదిగా బయలుదేరారు.
5 Kralj je zapovedal Joábu, Abišáju in Itáju, rekoč: »Zaradi mene nežno postopajte z mladeničem, torej z Absalomom.« Vse ljudstvo je slišalo, ko je kralj vsem poveljnikom dal zadolžitev glede Absaloma.
౫అప్పుడు రాజు యోవాబు, అబీషై, ఇత్తయిలను పిలిచి “నా కోసం యువకుడైన అబ్షాలోము పట్ల దయ చూపించండి” అని ఆజ్ఞాపించాడు. అక్కడున్నవారంతా వింటూ ఉండగానే రాజు అబ్షాలోమును గూర్చి సైన్యాధిపతులకందరికీ ఈ ఆజ్ఞ ఇచ్చాడు.
6 Tako je ljudstvo odšlo ven na polje zoper Izrael. In bitka je bila v Efrájimskem gozdu,
౬దావీదు మనుషులు ఇశ్రాయేలు వారితో యుద్ధం చేయడానికి మైదానంలోకి బయలుదేరారు. ఎఫ్రాయిము అడవిలో పోరాటం జరిగింది.
7 kjer je bilo izraelsko ljudstvo pobito pred Davidovimi služabniki in tam je bil ta dan velik pokol dvajsetih tisočev mož.
౭ఇశ్రాయేలు వారు దావీదు సైనికుల ముందు నిలబడలేక ఓడిపోయారు. ఆ రోజున ఇరవై వేలమందిని అక్కడ చంపేశారు.
8 Kajti tam je bila bitka razpršena preko obličja vse dežele. In gozd je ta dan požrl več ljudstva, kakor jih je požrl meč.
౮ఆ ప్రాంతమంతా యుద్ధం వ్యాపించింది. ఆ రోజున కత్తి వాత చనిపోయిన వారికంటే ఎక్కువమంది అడవిలో చిక్కుకుని నాశనమయ్యారు.
9 Absalom je srečal Davidove služabnike. In Absalom je jahal na muli in mula je šla pod debelimi vejami velikega hrasta in njegova glava se je ujela v hrast in vzet je bil gor med nebo in zemljo. Mula, ki je bila pod njim, pa je odšla proč.
౯అబ్షాలోము కంచరగాడిద ఎక్కి వస్తూ దావీదు సేవకులకు ఎదురు పడ్డాడు. ఆ కంచరగాడిద ఒక బాగా గుబురుగా ఉన్న పెద్ద సింధూర వృక్షం కొమ్మల కిందనుండి వెళ్తున్నప్పుడు అబ్షాలోము తల చెట్టుకు తగులుకుంది. అతడు పైకి ఎత్తబడి ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుతున్నాడు. అతని కింద ఉన్న కంచర గాడిద ముందుకు వెళ్ళిపోయింది.
10 Nek mož je to videl in povedal Joábu ter rekel: »Glej, videl sem Absaloma, visečega na hrastu.«
౧౦ఒక సైనికుడు అది చూసి, యోవాబు దగ్గర కు వచ్చి “అబ్షాలోము సింధూర వృక్షానికి చిక్కుకుని వేలాడుతూ ఉండడం నేను చూశాను” అని చెప్పాడు.
11 Joáb je rekel možu, ki mu je povedal: »Glej, videl si ga in zakaj ga nisi tam udaril k tlom? In jaz bi ti dal deset šeklov srebra in pas.«
౧౧అప్పుడు యోవాబు ఆ వార్త తెచ్చినవాడితో “నువ్వు చూశావు గదా, నేలమీద పడేలా అతణ్ణి ఎందుకు కొట్టలేదు? నువ్వు గనక అతణ్ణి చంపి ఉంటే పది తులాల వెండి, ఒక నడికట్టు నీకు ఇచ్చి ఉండేవాణ్ణి” అన్నాడు.
12 Mož je rekel Joábu: »Čeprav bi v svojo roko prejel tisoč šeklov srebra, vendar svoje roke ne bi iztegnil zoper kraljevega sina, kajti slišali smo, da je kralj zadolžil tebe, Abišája in Itája, rekoč: ›Pazite, da se nihče ne dotakne mladeniča Absaloma.‹
౧౨అప్పుడు వాడు “యువకుడైన అబ్షాలోమును ఎవ్వరూ తాకకుండా జాగ్రత్తపడమని రాజు నీకూ, అబీషైకీ, ఇత్తయికీ ఆజ్ఞ ఇస్తున్నప్పుడు నేను విన్నాను. వెయ్యి తులాల వెండి నా చేతిలో పెట్టినా రాజు కొడుకుని నేను చంపను.
13 Sicer bi storil hinavstvo zoper svoje lastno življenje, kajti nobena stvar ni skrita pred kraljem in ti sam bi se postavil zoper mene.«
౧౩మోసం చేసి అతని ప్రాణానికి హాని తలపెడితే ఆ సంగతి రాజుకు తెలియకుండా ఉండదు. రాజు సమక్షంలో నువ్వే నాకు విరోధివౌతావు” అని యోవాబుతో అన్నాడు.
14 Potem je Joáb rekel: »Ne morem se tako muditi s teboj.« V svojo roko je vzel tri puščice in jih zabodel skozi Absalomovo srce, medtem ko je bil še živ v sredi hrasta.
౧౪యోవాబు “నువ్వు చంపకపోతే నేను చూస్తూ ఊరుకుంటానా?” అని చెప్పి, మూడు బాణాలు చేతిలోకి తీసుకుని వెళ్లి సింధూర వృక్షానికి వ్రేలాడుతూ ఇంకా ప్రాణంతో ఉన్న అబ్షాలోము గుండెకు గురి చూసి కొట్టాడు.
15 Deset mladeničev, ki so nosili Joábovo bojno opremo, je obdalo Absaloma in ga usmrtilo.
౧౫యోవాబు ఆయుధాలు మోసేవారు పదిమంది చుట్టుముట్టి అబ్షాలోమును కొట్టి చంపారు.
16 Joáb je zatrobil s šofarjem in ljudstvo se je vrnilo od zasledovanja za Izraelom, kajti Joáb je zadržal ljudstvo.
౧౬అప్పుడు ఇశ్రాయేలీయులను తరమడం ఇక ఆపమని యోవాబు బాకా ఊదించాడు. దావీదు సైనికులు తిరిగి వచ్చారు.
17 Vzeli so Absaloma, ga vrgli v veliko jamo v gozdu in nanj položili zelo velik kup kamenja in ves Izrael je zbežal, vsak k svojemu šotoru.
౧౭ప్రజలు అబ్షాలోము మృతదేహాన్ని ఎత్తి అడవిలో ఉన్న పెద్ద గోతిలో పడవేశారు. పెద్ద రాళ్లకుప్పను దానిమీద పేర్చిన తరువాత ఇశ్రాయేలీయులంతా తమ తమ ఇళ్ళకు పారిపోయారు.
18 Torej Absalom si je [še] v svojem življenju vzel in si postavil steber, ki je v kraljevi dolini, kajti rekel je: »Nobenega sina nimam, da ohrani moje ime v spominu.« Steber je poimenoval po svojem lastnem imenu in tako se imenuje do današnjega dne, Absalomov kraj.
౧౮అబ్షాలోము జీవించి ఉన్నప్పుడు తన పేరు నిలబెట్టడానికి తనకు కొడుకులు లేరు గనక అతడు బ్రదికి ఉన్నప్పుడే ఒక స్తంభం తెచ్చి దాన్ని తన పేరట నిలబెట్టి ఆ స్తంభానికి అతని పేరు పెట్టాడు. ఇప్పటికీ అది అబ్షాలోము స్తంభం అని పిలువబడుతూ ఉంది.
19 Potem je Cadókov sin Ahimáac rekel: »Naj sedaj stečem in kralju prinesem novice, kako se je Gospod maščeval nad njegovimi sovražniki.«
౧౯సాదోకు కొడుకు అహిమయస్సు “నేను పరుగెత్తుకుంటూ వెళ్ళి యెహోవా తన శత్రువులను ఓడించి రాజుకు న్యాయం చేకూర్చాడన్న సమాచారం రాజుతో చెబుతాను” అన్నాడు.
20 Joáb mu je rekel: »Danes ne boš nosil novic, temveč boš novice nosil drug dan. Toda danes ne boš nosil nobenih novic, ker je kraljev sin mrtev.«
౨౦యోవాబు “ఈ రోజున ఈ కబురు చెప్పకూడదు. మరో రోజు చెప్పవచ్చు. ఎందుకంటే రాజు కుమారుడు చనిపోయాడు కనుక నేడు ఈ కబురు రాజుకు చెప్పడం భావ్యం కాదు” అని అతనితో చెప్పాడు.
21 Potem je Joáb rekel Kušíju: »Pojdi, povej kralju, kar si videl.« Kuší se je priklonil Joábu in stekel.
౨౧తరువాత కూషువాడిని పిలిచి “నువ్వు వెళ్లి నువ్వు చూసినదంతా రాజుకు తెలియజెయ్యి” అని చెప్పాడు. అప్పుడు కూషువాడు యోవాబుకు నమస్కారం చేసి పరుగెత్తుకుంటూ వెళ్ళాడు.
22 Potem je Cadókov sin Ahimáac ponovno rekel Joábu: »Toda kakorkoli, prosim te, naj tudi jaz prav tako stečem za Kušíjem.« Joáb pa je rekel: »Čemu bi tekel, moj sin, glede na to, da nimaš pripravljenih novic?«
౨౨సాదోకు కొడుకు అహిమయస్సు “కూషువాడితో నేను కూడా పరుగెత్తుకుంటూ వెళ్ళడానికి నాకు అనుమతి ఇవ్వు” అని అడిగాడు. యోవాబు “కుమారా, నువ్వెందుకు వెళ్ళాలి? నీకు బహుమానం వచ్చే ప్రత్యేకమైన సమాచారం ఏదీ లేదుకదా” అని అతనితో అన్నాడు.
23 »Toda kakorkoli, « je rekel, »naj stečem.« Rekel mu je: »Steci.« Potem je Ahimáac stekel po poti ravnine in prehitel Kušíja.
౨౩అప్పుడు అతడు “ఏమైనా సరే, నేను పరుగెత్తి వెళ్తాను” అన్నాడు. అందుకు యోవాబు “సరే వెళ్ళు” అని చెప్పాడు. అహిమయస్సు మైదానపు దారిలో పరుగెత్తుకుంటూ కూషీవాడి కంటే ముందుగా చేరుకున్నాడు.
24 David je sedel med dvemi velikimi vrati. Stražar pa je šel gor do strehe nad velikimi vrati k obzidju in povzdignil svoje oči in pogledal in glej, mož je tekel sam.
౨౪దావీదు రెండు గుమ్మాల మధ్య వరండాలో కూర్చుని ఉన్నాడు. కాపలా కాసేవాడు గుమ్మంపైనున్న గోడమీదికి ఎక్కి చూసినప్పుడు ఒంటరిగా పరుగెత్తుకుంటూ వస్తున్న ఒకడు కనబడ్డాడు. కాపలా కాసేవాడు గట్టిగా అరుస్తూ రాజుకు ఈ సంగతి చెప్పాడు.
25 Stražar je zaklical in povedal kralju. Kralj je rekel: »Če je sam, so novice v njegovih ustih.« Hitro je prišel in se približal.
౨౫రాజు “వాడు ఒంటరిగా వస్తున్నట్టైతే ఏదో కబురు తెస్తున్నాడు” అన్నాడు. వాడు పరుగెత్తుకొంటూ దగ్గరికి వచ్చాడు.
26 Stražar je zagledal teči drugega moža in stražar je zaklical vratarju ter rekel: »Glej, drug človek teče sam.« Kralj je rekel: »Tudi ta prinaša novice.«
౨౬కాపలా కాసేవాడికి పరుగెత్తుకుంటూ వస్తున్న మరొకడు కనబడ్డాడు. వాడు “అదిగో మరొకడు ఒంటరిగా పరుగెత్తుకొంటూ వస్తున్నాడు” అని గుమ్మం వైపు తిరిగి రాజుతో చెప్పాడు. రాజు “వాడు కూడా ఏదో కబురు తెస్తున్నాడు” అన్నాడు.
27 Stražar je rekel: »Mislim, da je tek sprednjega podoben teku Cadókovega sina Ahimáaca.« Kralj je rekel: »Dober človek je in prihaja z dobrimi novicami.«
౨౭కాపలా కాసేవాడు దగ్గరికి వస్తున్న మొదటివాణ్ణి చూసి “వాడు సాదోకు కొడుకు అహిమయస్సు అని నాకు అనిపిస్తుంది” అన్నాడు. అప్పుడు రాజు “వాడు మంచివాడు, మంచివార్తే తెచ్చి ఉంటాడు” అన్నాడు.
28 Ahimáac je zaklical in kralju rekel: »Vse je dobro.« S svojim obrazom je padel dol na zemljo pred kraljem in rekel: »Blagoslovljen bodi Gospod, tvoj Bog, ki je izročil ljudi, ki so svojo roko dvignili zoper mojega gospoda kralja.«
౨౮అంతలో అహిమయస్సు “రాజా, జయహో” అని గట్టిగా రాజుతో చెప్పి, రాజు ముందు సాష్టాంగపడి నమస్కారం చేసి “నా యేలిన వాడవైన రాజా, నిన్ను చంపాలని చూసిన వారిని అప్పగించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రం” అన్నాడు.
29 Kralj je rekel: »Ali je mladenič Absalom varen?« Ahimáac je odgovoril: »Ko je Joáb poslal kraljevega služabnika in mene, tvojega služabnika, sem videl velik hrup, toda nisem vedel, kaj je to bilo.«
౨౯అప్పుడు రాజు “బాలుడు అబ్షాలోము క్షేమంగా ఉన్నాడా?” అని అడిగాడు. అహిమయస్సు “నీ దాసుడనైన నన్ను యోవాబు పంపుతున్నప్పుడు ఏదో గందరగోళం జరుగుతూ ఉండడం చూసాను గానీ అది ఏమిటో నాకు తెలియదు” అని చెప్పాడు.
30 Kralj mu je rekel: »Obrni se vstran in stoj tukaj.« Obrnil se je vstran in mirno stal.
౩౦అప్పుడు రాజు “నువ్వు అవతలికి వెళ్లి నిలబడు” అని ఆజ్ఞ ఇచ్చాడు. వాడు పక్కకు జరిగి నిలబడ్డాడు.
31 In glej, prišel je Kuší. Kuší je rekel: »Novice, moj gospod kralj, kajti Gospod te je ta dan maščeval pred vsemi tistimi, ki so se vzdignili zoper tebe.«
౩౧అంతలో కూషీవాడు వచ్చి “మా ఏలికవైన రాజా, నేను నీకు మంచి సమాచారం తెచ్చాను. ఈ రోజు యెహోవా నీ మీదికి దండెత్తిన వారందరినీ ఓడించి నీకు న్యాయం చేకూర్చాడు” అని చెప్పినప్పుడు
32 Kralj je rekel Kušíju: »Je mladenič Absalom varen?« Kuší je odgovoril: »Sovražniki mojega gospoda kralja in vsi, ki se vzdignejo zoper tebe, da ti škodijo, naj bodo, kakor je ta mladenič.«
౩౨రాజు “బాలుడు అబ్షాలోము క్షేమంగా ఉన్నాడా?” అని అడిగాడు. అప్పుడు కూషీవాడు “మా ఏలినవాడవు, రాజువు అయిన నీకు కీడు చేయాలని నీ మీదకు దండెత్తినవాళ్ళందరికీ ఏమి జరిగిందో ఆ బాలుడికి కూడా అదే జరిగింది” అన్నాడు.
33 Kralj je bil zelo pretresen in odšel gor v sobo nad velikimi vrati in jokal. Medtem ko je šel, je tako govoril: »Oh moj sin Absalom, moj sin, moj sin Absalom! Da bi Bog dal, da bi jaz umrl zate, oh Absalom, moj sin, moj sin!«
౩౩అప్పుడు రాజు తీవ్రంగా పరితాపం చెందాడు. పట్టణం గుమ్మానికి పైన ఉన్న గదికి వెళ్లి, ఏడుస్తూ అటూ ఇటూ తిరుగుతూ “అబ్షాలోమా, నా బిడ్డా, అబ్షాలోమా” అని కేకలు వేస్తూ “అయ్యో నా బిడ్డా, నీ బదులు నేను చనిపోయినా బాగుండేది. నా బిడ్డా, అబ్షాలోమా, నా బిడ్డా” అని విలపిస్తూ ఉన్నాడు.