< Числа 2 >
1 И рече Господь к Моисею и Аарону, глаголя:
౧యెహోవా మరోసారి మోషే, అహరోనులతో మాట్లాడాడు. ఆయన ఇలా అన్నాడు.
2 человек держайся по чину своему, по знамениям, по домом отечеств своих, да ополчаются сынове Израилевы пред Господем, окрест скинии свидения да ополчаются сынове Израилевы.
౨“ఇశ్రాయేలు ప్రజల్లో ప్రతి ఒక్కరూ సైన్యంలో తమ దళానికి చెందిన పతాకం చుట్టూ, తన గోత్రాన్ని సూచించే చిన్నజెండా చుట్టూ తమ గుడారాలు వేసుకోవాలి. సన్నిధి గుడారానికి అభిముఖంగా వారి గుడారాలు ఉండాలి.
3 И ополчающиися первии на восток чин полка Иудина с силою их, и князь от сынов Иудиных Наассон сын Аминадавль:
౩యూదా శిబిరానికి చెందిన వారు తమ సైనిక దళంతో యూదా పతాకం చుట్టూ తమ గుడారాలు వేసుకోవాలి. ఇవి సన్నిధి గుడారానికి తూర్పు దిక్కున సూర్యుడు ఉదయించే వైపున ఉండాలి. యూదా సైనిక దళానికి అమ్మీనాదాబు కొడుకు నయస్సోను నాయకత్వం వహించాలి.
4 сила его согляданая седмьдесят и четыри тысящы и шесть сот.
౪యూదా దళంలో నమోదైన వారు 74, 600 మంది పురుషులు.
5 И ополчающиися близ от племене Иссахарова, и князь сынов Иссахаровых Нафанаил сын Согаров:
౫యూదా గోత్రం సమీపంలో ఇశ్శాఖారు గోత్రం వారు తమ శిబిరం ఏర్పాటు చేసుకోవాలి. సూయారు కొడుకు నెతనేలు ఇశ్శాఖారు గోత్రం వారి నాయకుడు.
6 сила его согляданая пятьдесят и четыри тысящы и четыре ста.
౬నెతనేలుతో ఉన్న సైన్యంలో 54, 400 మంది పురుషులు నమోదయ్యారు.
7 И ополчающиися близ от племене Завулоня, и князь сынов Завулоних Елиав сын Хелонь:
౭ఇశ్శాఖారు గోత్రం వారి తరువాత జెబూలూను గోత్రం వారుండాలి. హేలోను కొడుకు ఏలీయాబు జెబూలూను గోత్రం వారి నాయకుడు.
8 сила его согляданая пятьдесят седмь тысящ и четыре ста.
౮అతని దళంలో నమోదైన వారు 57, 400 మంది పురుషులు.
9 Всех сочтеных от полка Иудина сто осмьдесят шесть тысящ и четыре ста, с силою их первии да воздвизаются.
౯యూదా వారితో కలసి శిబిరం ఏర్పాటు చేసుకున్న వారు మొత్తం లెక్కిస్తే 1, 86, 400 మంది పురుషులు ఉన్నారు. వీరు మొదటగా శిబిరం నుండి కదిలి వెళ్ళాలి.
10 Чины полка Рувимля к югу с силою его, и князь сынов Рувимлих Елисур сын Седиуров:
౧౦దక్షిణ దిక్కున రూబేను దళం తమ పతాకం చుట్టూ గుడారాలు వేసుకోవాలి. షెదేయూరు కొడుకు ఏలీసూరు రూబేను సైనిక దళాలకు నాయకుడు.
11 сила его согляданая четыредесять и шесть тысящ и пять сот.
౧౧అతని సైన్యంలో నమోదైన వారు 46, 500 మంది పురుషులు.
12 И ополчающиися близ его от племене Симеоня, и князь сынов Симеоних Саламииль сын Сурисадаин:
౧౨రూబేను గోత్రం వారి పక్కనే షిమ్యోను గోత్రం వారు తమ గుడారాలు వేసుకోవాలి. సూరీషద్దాయి కొడుకు షెలుమీయేలు షిమ్యోను గోత్రం వాళ్లకు నాయకుడు.
13 сила его сочтеная пятьдесят и девять тысящ и три ста.
౧౩అతని దళంలో నమోదైన వారు 59, 300 మంది పురుషులు.
14 И ополчающиися близ его от племене Гадова, и князь сынов Гадовых Елисаф сын Рагуиль:
౧౪తరువాత గాదు గోత్రం ఉండాలి. రగూయేలు కుమారుడు ఏలీయాసాపు గాదు గోత్రానికి నాయకత్వం వహించాలి.
15 сила его согляданая четыредесять и пять тысящ и шесть сот и пятьдесят.
౧౫అతని సైన్యంలో నమోదైన వారు 45, 650 మంది పురుషులు.
16 Всех же сочтеных полка Рувимля сто пятьдесят едина тысяща и четыре ста и пятьдесят, с силою их втории да воздвизаются.
౧౬కాబట్టి రూబేను గోత్రం వారితో కలసి శిబిరం ఏర్పాటు చేసుకున్న వారి మొత్తం లెక్కిస్తే 1, 51, 450 మంది పురుషులు ఉన్నారు. వీళ్ళంతా రెండో వరుసలో ముందుకు నడవాలి.
17 И да воздвигнется скиния свидения и полк левитский посреде полков: якоже ополчатся, тако и да воздвигнутся, кийждо держася по чину своему.
౧౭సన్నిధి గుడారం శిబిరం నుండి మిగిలిన గోత్రాలన్నిటి మధ్యలో లేవీయులతో కలసి ముందుకు కదలాలి. వారు శిబిరంలోకి ఏ క్రమంలో వచ్చారో అదే క్రమంలో శిబిరం నుండి బయటకు వెళ్ళాలి. ప్రతి ఒక్కడూ తన స్థానంలో ఉండాలి. తన పతాకం దగ్గరే ఉండాలి.
18 Чин полка Ефремля к морю с силою их, и князь сынов Ефремлих Елисама сын Емиудов:
౧౮ఎఫ్రాయిము గోత్రం సన్నిధి గుడారానికి పడమటి వైపున ఉండాలి. అమీహూదు కొడుకు ఎలీషామా ఎఫ్రాయిము సైన్యాలకు నాయకత్వం వహించాలి.
19 сила его сочтеная четыредесять тысящ и пять сот.
౧౯ఎఫ్రాయిము సైన్యంగా నమోదైన వారు 40, 500 మంది పురుషులు.
20 И ополчающиися близ племя Манассиино, и князь сынов Манассииных Гамалиил сын Фадассуров:
౨౦మనష్షే గోత్రం వారు ఎఫ్రాయిము గోత్రం వారి పక్కనే ఉండాలి. పెదాసూరు కొడుకు గమలీయేలు మనష్షే సైన్యాలకు నాయకుడుగా ఉండాలి.
21 сила его согляданая тридесять две тысящы и двести.
౨౧అతని సైన్యంగా నమోదైన వారు 32, 200 మంది పురుషులు.
22 И ополчающиися близ от племене Вениаминя, и князь сынов Вениаминих Авидан сын Гадеониев:
౨౨మనష్షే గోత్రం వాళ్లకు దగ్గర్లోనే బెన్యామీను గోత్రం వారుండాలి. గిద్యోనీ కొడుకు అబీదాను బెన్యామీను సైన్యాలకు నాయకుడుగా ఉండాలి.
23 сила его сочтеная тридесять пять тысящ и четыре ста.
౨౩అతని సైన్యంగా నమోదైన వారు 35, 400 మంది పురుషులు.
24 Всех сочтеных полка Ефремля сто осмь тысящ и сто, с силою их гретии да воздвизаются.
౨౪కాబట్టి ఎఫ్రాయిము గోత్రం వారితో కలసి శిబిరం ఏర్పాటు చేసుకున్న వారి మొత్తం లెక్కిస్తే 1,08,100 మంది పురుషులు ఉన్నారు. వారింతా మూడో వరుసలో శిబిరం నుండి కదలాలి.
25 Чин полка Данова к северу с силою их, и князь сынов Дановых Ахиезер сын Амисадаин:
౨౫దాను శిబిరానికి చెందిన వారు తమ సైనిక దళంతో దాను పతాకం చుట్టూ తమ గుడారాలు వేసుకోవాలి. సన్నిధి గుడారానికి ఉత్తరం వైపున తమ గుడారాలు వేసుకోవాలి. అమీషదాయి కొడుకు అహీయెజెరు దాను గోత్రానికి నాయకత్వం వహించాలి.
26 сила его согляданая шестьдесят две тысящы и седмь сот.
౨౬దాను గోత్రానికి చెందిన సైన్యంగా నమోదైన వారు 62, 700 మంది పురుషులు.
27 И ополчающиися близ его племя Асирово, и князь сынов Асировых Фагаиил сын Ехранов:
౨౭అతనికి దగ్గరలోనే ఆషేరు గోత్రం వారు ఉండాలి. ఒక్రాను కొడుకు పగీయేలు ఆషేరు సైన్యానికి నాయకుడుగా ఉండాలి.
28 сила его согляданая четыредесять едина тысяща и пять сот.
౨౮అతని సైన్యంగా 41, 500 మంది పురుషులు నమోదయ్యారు.
29 И ополчающиися близ племя Неффалимле, и князь сынов Неффалимлих Ахирей сын Енань:
౨౯ఆషేరు గోత్రం వాళ్లకు దగ్గరలోనే నఫ్తాలి గోత్రం వారుండాలి. ఏనాను కొడుకు అహీర నఫ్తాలి గోత్రం వాళ్లకు నాయకుడిగా ఉండాలి.
30 сила его согляданая пятьдесят три тысящы и четыре ста.
౩౦నఫ్తాలి గోత్రం వారి సైన్యంగా నమోదైన వారు 53, 400 మంది పురుషులు.
31 Всех сочтеных полка Данова сто пятьдесят седмь тысящ и шесть сот, с силою их последнии да воздвизаются по чину своему.
౩౧కాబట్టి దాను గోత్రం వారితో కలసి శిబిరం ఏర్పాటు చేసుకున్న వారు మొత్తం లెక్కిస్తే 1, 57, 600 మంది పురుషులు ఉన్నారు. వీరు తమ ధ్వజాల ప్రకారం చివరి బృందంగా నడవాలి.”
32 Сие сочтение сынов Израилевых по домом отечеств их: вся соглядания полков с силами их шесть сот три тысящы и пять сот пятьдесят.
౩౨ఇశ్రాయేలు ప్రజల్లో తమ తమ పూర్వీకుల కుటుంబాల ప్రకారం మోషే, అహరోనులు వీళ్ళను లెక్కించారు. వీరు మొత్తం 6,03,550 మంది పురుషులు.
33 Левити же не соглядашася среди сынов Израилевых, якоже заповеда Господь Моисею.
౩౩అయితే యెహోవా మోషేకి ఆజ్ఞాపించిన ప్రకారం లేవీయుల సంఖ్య లెక్కపెట్టలేదు.
34 И сотвориша сынове Израилевы вся, елика заповеда Господь Моисею: тако ополчахуся по чином своим, и тако воздвизахуся кийждо близ по сонмом своим, по домом отечеств своих.
౩౪ఈ విధంగా ఇశ్రాయేలు ప్రజలు మోషేకి యెహోవా ఆజ్ఞాపించినదంతా చేసారు. వారు తమ తమ ధ్వజాల దగ్గర గుడారాలు వేసుకున్నారు. శిబిరం నుండి బయటకు వెళ్ళినప్పుడు తమ పూర్వీకుల కుటుంబాల క్రమంలో వెళ్ళారు.