< Числа 15 >
1 И рече Господь к Моисею, глаголя:
౧తరువాత యెహోవా మోషేతో మాట్లాడుతూ,
2 глаголи сыном Израилевым и речеши к ним: егда внидете в землю вселения вашего, юже Аз даю вам,
౨“నువ్వు ఇశ్రాయేలీయులతో చెప్పు, ‘యెహోవా మీకిస్తున్న ఆ ప్రదేశంలోకి మీరు వెళ్ళినప్పుడు,
3 и сотворите принос Господу во всесожжение или жертву, еже возвеличити мольбу, или благовольну, или в праздники вашя в воню благовония Господу, аще убо от волов, или от овец:
౩యెహోవాకు ఇష్టమైన సువాసన కలిగేలా మందలోని పశువుల్లో, దహనబలిగానైనా, బలిగానైనా తెచ్చి, మొక్కుబడి చెల్లించడానికి గాని, స్వేచ్ఛార్పణగా గాని, నియామక కాలంలో అర్పించేదిగా గాని, దేనినైనా మీరు అర్పించాలనుకున్నారనుకోండి.
4 и да принесет приносяй дар свой Господу жертву, муки пшеничны десятую часть ефи (меры), вмешены в елей четвертыя части ина (меры):
౪యెహోవాకు ఆ అర్పణ అర్పించే వాడు ముప్పావు నూనెతో కలిపిన రెండున్నర కిలోల పిండిని నైవేద్యంగా తేవాలి.
5 и вина на возлияние четвертую часть ина сотворите во всесожжение или в жертву: агнцу единому да сотвориши толико, принос воню благовония Господу.
౫ఒక్కొక్క గొర్రెపిల్లతో పాటు దహనబలి మీద గాని, బలి మీద గాని పొయ్యడానికి ముప్పావు లీటర్ల ద్రాక్షారసం పానార్పణగా సిద్ధం చెయ్యాలి.
6 И овну, егда творите его во всесожжение или в жертву, да сотвориши жертву муки пшеничны две десятины вмешаны в елеи, третию часть ина (меры):
౬పొట్టేలుతో పాటు ఒక పడి నూనెతో కలిపిన నాలుగు లీటర్ల పిండిని నైవేద్యంగా సిద్ధం చెయ్యాలి
7 и вина на возлияние третию часть ина принесете в воню благовония Господу.
౭ఒక లీటరు ద్రాక్షారసం పానార్పణగా తేవాలి. అది యెహోవాకు ఇష్టమైన సువాసన.
8 Аще же творите от волов во всесожжение или в жертву, еже возвеличити мольбу, или во спасителное Господу,
౮మొక్కుబడి చెల్లించడానికైనా, యెహోవాకు సమాధానబలి అర్పించడానికైనా, నువ్వు దహనబలిగానైనా, బలిగానైనా లేత దున్నపోతును సిద్ధం చేస్తే,
9 и принесет с телцем принос муки пшеничны три десятины вмешаны в елей, пол ина (меры):
౯దానితో పాటు, లీటరున్నర నూనె కలిపిన ఏడున్నర కిలోల గోదుమపిండిని నైవేద్యంగా అర్పించాలి.
10 и вина на возлияние пол ина (меры), принос в воню благовония Господу.
౧౦ఇంకా, యెహోవాకు ఇష్టమైన సువాసన కలిగిన దహన బలిగా మీరు తేవలసినవి.
11 Тако да сотвориши телцу единому, или овну единому, или агнцу единому от овец или от коз:
౧౧లీటరున్నర ద్రాక్షారసం పానీయార్పణగా తేవాలి. ఒక్కొక్క కోడెతోపాటు, ఒక్కొక్క పొట్టేలుతోపాటు, గొర్రెల్లోనైనా, మేకల్లోనైనా ఒక్కొక్క పిల్లతో పాటు ఆ విధంగా చెయ్యాలి.
12 по числу их, яже аще сотворите, тако сотворите единому по числу их.
౧౨మీరు సిద్ధపరిచే వాటి లెక్కను బట్టి వాటి లెక్కలో ప్రతి దానికీ ఆ విధంగా చెయ్యాలి.
13 Всяк туземец да сотворит тако сицевая принести приношения в воню благовония Господу:
౧౩దేశంలో పుట్టిన వారందరూ యెహోవాకు ఇష్టమైన సువాసన కలిగిన దహనబలి అర్పణ తెచ్చేటప్పుడు ఆ విధంగానే చెయ్యాలి.
14 аще же пришлец в вас прибудет в земли вашей, или иже аще будет в вас в родех ваших, и сотворит принос в воню благовония Господу, якоже творите вы, тако да сотворит.
౧౪మీ దగ్గర నివాసం ఉన్న పరదేశిగాని, మీ తరతరాల్లో మీ మధ్య ఉన్నవాడు ఎవడైనా గాని యెహోవాకు ఇష్టమైన సువాసన కలిగిన దహనబలి అర్పించాలని అనుకున్నప్పుడు, మీరు చేసినట్టే అతడు కూడా చెయ్యాలి.
15 Сонме Господнь, закон един да будет вам и пришелцем прилежащым в вас, закон вечный в роды вашя: якоже вы, (тако) и пришлец да будет пред Господем:
౧౫సమాజానికి, అంటే మీకూ, మీలో నివాసం ఉన్న పరదేశికీ ఒకే కట్టడ. అది మీ తరతరాలకు ఉండే శాశ్వతమైన కట్టుబాటు. యెహోవా సన్నిధిలో మీరున్నట్టే పరదేశి కూడా ఉండాలి.
16 закон един да будет и оправдание едино да будет вам и пришелцу прилежащему в вас.
౧౬మీకూ, మీ దగ్గర నివాసం ఉండే పరదేశికీ ఒకే ఏర్పాటు, ఒకే న్యాయవిధి ఉండాలి’” అన్నాడు.
17 И рече Господь к Моисею, глаголя:
౧౭యెహోవా మోషేతో మళ్ళీ మాట్లాడుతూ “ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు,
18 глаголи сыном Израилевым и речеши к ним: егда внидете в землю, в нюже Аз ввожду вас тамо,
౧౮నేను మిమ్మల్ని తీసుకెళ్తున్న దేశంలో మీరు ప్రవేశించిన తరువాత
19 и будет егда ясте от хлебов земли (тоя), отложите участие во отделение Господу: начаток теста вашего,
౧౯మీరు ఆ దేశపు ఆహారం తిన్నప్పుడు యెహోవాకు ప్రతిష్ట అర్పణ అర్పించాలి.
20 хлеб отлучите участие оное: якоже участие от гумна,
౨౦మీరు మీ మొదటి పిండిముద్ద రొట్టెను ప్రతిష్టార్పణగా అర్పించాలి. కళ్లపు అర్పణలా దాన్ని అర్పించాలి.
21 тако отделите той хлеб, начаток теста вашего, и дадите Господу участие в роды вашя.
౨౧మీ తరతరాలకు మీ మొదటి పిండిముద్దలోనుంచి ప్రతిష్ఠార్పణను యెహోవాకు అర్పించాలి” అన్నాడు.
22 Егда же согрешите и не сотворите всех заповедий сих, ихже глагола Господь Моисею,
౨౨“యెహోవా మోషేతో చెప్పిన ఈ ఆజ్ఞలన్నిట్లో, అంటే
23 якоже повеле Господь Бог к вам рукою Моисеовою, от дне в оньже повеле Господь к вам, и потом в роды вашя,
౨౩యెహోవా ఆజ్ఞాపించిన రోజు మొదలుకుని ఆ తరువాత మీ తరతరాలకు యెహోవా మోషే ద్వారా మీకు ఆజ్ఞాపించిన వాటిలో పొరపాటున దేనినైనా మీరు చెయ్యనప్పుడు, అది సమాజానికి తెలియజేస్తే,
24 и будет аще от очес сонма сотворится неволею, и да сотворит весь сонм телца единаго непорочна от волов во всесожжение, в воню благовония Господу, и жертву сего, и возлияние его по уставлению, и козла единаго от коз греха ради:
౨౪సమాజమంతా యెహోవాకు ఇష్టమైన సువాసనగా ఉండడానికి దహనబలిగా ఒక లేత దున్నపోతును ఆజ్ఞప్రకారం దాని నైవేద్యాన్ని, దాని పానీయార్పణను, పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను సిద్ధం చెయ్యాలి.
25 и да помолится жрец от всем сонме сынов Израилевых, и оставится им, яко нехотение есть: и сии принесоша дар свой, принесение Господу греха ради своего пред Господем, нехотений ради своих,
౨౫యాజకుడు ఇశ్రాయేలీయుల సర్వసమాజం కోసం ప్రాయశ్చిత్తం చెయ్యాలి. తెలియక దాన్ని చేశారు గనక క్షమాపణ దొరుకుతుంది. వారు పొరపాటున చేసిన పాపాలను బట్టి తమ అర్పణ, అంటే యెహోవాకు చెందవలసిన దహనబలి, పాపపరిహారార్థబలి యెహోవా సన్నిధికి తీసుకు రావాలి.
26 и оставится всему сонму сынов Израилевых и пришелцу прилежащему в вас, яко всем людем нехотенное.
౨౬అప్పుడు ఇశ్రాయేలీయుల సర్వసమాజానికి గాని, వారి మధ్య నివాసం ఉంటున్న పరదేశికి గాని, క్షమాపణ దొరుకుతుంది. ఎందుకంటే, ప్రజలందరూ తెలియక దాన్ని చెయ్యడం జరిగింది.
27 Аще же душа едина не хотящи согрешит, да приведет козу едину единолетну греха ради:
౨౭ఒకడు పొరపాటున పాపం చేస్తే, అతడు పాపపరిహారార్థ బలిగా ఒక సంవత్సరం వయస్సు ఉన్న ఆడమేక పిల్లను తీసుకురావాలి.
28 и да помолится жрец о души нехотевшей и согрешшей нехотением пред Господем, и да помолится о ней, и оставится ей.
౨౮పొరపాటుగా యెహోవా సన్నిధిలో దాన్ని చేశాడు గనక తెలియక పాపం చేసిన అతని కోసం యాజకుడు ప్రాయశ్చిత్తం చేస్తాడు. అతని కోసం ప్రాయశ్చిత్తం చేయడం వల్ల అతడు క్షమాపణ పొందుతాడు.
29 Населнику (земли) сынов Израилевых и пришелцу прилежащему в них, закон един да будет им, иже аще сотворит не хотящь.
౨౯ఇశ్రాయేలీయుల్లో పుట్టినవాడు గాని వారి మధ్య నివాసం ఉంటున్న పరదేశి గాని పొరపాటున ఎవరైనా పాపం చేస్తే, అతనికీ, మీకూ ఒక్కటే చట్టం ఉండాలి.
30 И душа яже сотворит рукою гордости от туземец или от пришелцев, Бога сия разгневает, и потребится душа та от людий своих:
౩౦కాని, దేశంలో పుట్టినవాడు గాని పరదేశి గాని ఎవరైనా కావాలని పాపం చేస్తే,
31 яко слово Господне презре и заповеди Его разсыпа, сотрением да сотрется душа та: и грех ея на ней.
౩౧అతడు యెహోవాను తృణీకరించిన వాడు గనక అలాంటి వాడు కచ్చితంగా ప్రజల్లో ఉండకుండాా కొట్టివేయాలి. అతని పాపం అతని మీద ఉంటుంది. అతడు యెహోవా మాటను అలక్ష్యం చేసి ఆయన ఆజ్ఞను అతిక్రమించిన కారణంగా అతడు తన ప్రజల్లో లేకుండా పోతాడు” అన్నాడు.
32 И бяху сынове Израилевы в пустыни, и обретоша мужа собирающа дрова в день субботный,
౩౨ఇశ్రాయేలీయులు అరణ్యంలో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతి దినాన కట్టెలు ఏరడం గమనించారు.
33 и приведоша его обретшии собирающа дрова в день субботный к Моисею и Аарону и ко всему сонму сынов Израилевых,
౩౩అతడు కట్టెలు ఏరడం చూసిన వారు మోషే అహారోనుల దగ్గరికి, సమాజం ఎదుటికి అతన్ని తీసుకొచ్చారు.
34 и ввергоша его в темницу: не совещаша бо, что сотворят ему.
౩౪అతని పట్ల ఏం చెయ్యాలో అది వాళ్లకు తెలియ లేదు గనక అతన్ని అదుపులోకి తీసుకుని ఉంచారు.
35 И рече Господь к Моисею, глаголя: смертию да умрет человек сей, да побиете его камением весь сонм вне полка.
౩౫తరువాత యెహోవా మోషేతో “ఆ వ్యక్తికి మరణ శిక్ష విధించాలి.
36 И изведоша его весь сонм вне полка, и побиша его камением весь сонм вне полка, якоже глагола Господь Моисею.
౩౬సర్వసమాజం శిబిరం బయట అతన్ని రాళ్లతో కొట్టి చంపాలి” అన్నాడు. కాబట్టి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు సర్వ సమాజం శిబిరం బయటకు అతన్ని తీసుకెళ్ళి, రాళ్లతో కొట్టి చంపారు.
37 И рече Господь к Моисею, глаголя:
౩౭ఇంకా యెహోవా మోషేతో మాట్లాడుతూ,
38 глаголи сыном Израилевым и речеши им: и да сотворят себе рясны на воскрилиих риз своих в роды своя: и возложите на рясны воскрилий прядение синее,
౩౮“నువ్వు ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు, వారు తమ తరతరాలకు తమ బట్టల అంచులకు కుచ్చులు చేసుకుని, అంచుల కుచ్చుల మీద నీలిరంగు దారం తగిలించాలి.
39 и будет вам на ряснах: и узрите их, и воспомянете вся заповеди Господни и сотворите я, и не развратитеся вслед мыслей своих и вслед очес ваших, имиже вы соблудисте вслед их:
౩౯మీరు నా ఆజ్ఞలన్నిటినీ జ్ఞాపకం చేసుకుని, మీ దేవునికి ప్రతిష్ఠితులై ఉండేలా ఇదివరకు కోరిన వాటిని బట్టి, చూసిన వాటిని బట్టి ఆధ్యాత్మిక వ్యభిచారం చెయ్యకుండా ఉండాలి.
40 яко да помянете и сотворите вся заповеди Моя, и будете святи Богу вашему:
౪౦మీరు నా కోసం ప్రత్యేకపరచిన వారు గనక, మీరు పవిత్రులుగా ఉండేందుకు యెహోవా ఆజ్ఞలన్నిటినీ జ్ఞాపకం చేసుకుని వాటిని అనుసరించడానికి జాగ్రత్త తీసుకోండి.
41 Аз Господь Бог ваш, изведый вас из земли Египетския, быти вам Бог: Аз Господь Бог ваш.
౪౧నేను మీకు దేవుడుగా ఉండాలని ఐగుప్తు దేశంలో నుంచి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడనైన యెహోవాను. మీ దేవుడనైన యెహోవాను నేనే.”