< Книга Неемии 8 >
1 И прииде месяц седмый, сынове же Израилевы бяху во градех своих: и собрашася вси людие яко муж един на пространство, еже пред враты Водными, и рекоша Ездре писарю, да принесет книгу закона Моисеова, егоже заповеда Господь Израилю.
౧అప్పుడు ప్రజలంతా ఒకే ఉద్దేశంతో నీటి ద్వారం ఎదురుగా ఉన్న మైదానంలో సమకూడారు. యెహోవా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్ర గ్రంథాన్ని తీసుకు రమ్మని ఎజ్రాశాస్త్రితో చెప్పారు.
2 И принесе Ездра священник закон пред множество от мужей даже до жен, и всем, иже можаху разумети слышаще, в день первый месяца седмаго,
౨ఎజ్రా ఏడవ నెల మొదటి రోజున గ్రంథాన్ని చదువుతుండగా అర్థం చేసుకోగలిగే స్త్రీ పురుషులు కలసి ఉన్న సమూహం ఎదుటికి ఆ ధర్మశాస్త్ర గ్రంథం తెచ్చాడు.
3 и чте в нем (явно на пространстве, еже пред враты Водными), от утра даже до полудне, пред мужи и женами, и сии бяху разумеюще, и уши всех людий ко книзе закона.
౩అతడు నీటి ద్వారం ఎదురుగా ఉన్న మైదానంలో ఉదయం నుండి మధ్యాహ్నం దాకా నిలబడి ఉన్న ఆ స్త్రీ పురుషులకు, అంటే జ్ఞానంతో దాన్ని అర్థం చేసుకోగల వారందరికీ వినిపించాడు. ప్రజలంతా ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని శ్రద్ధగా విన్నారు.
4 И ста Ездра писец на степени древянем, егоже сотвориша к народовещанию, и сташа близ его Матфафиа и Самеа, и Ананиа и Уриа, и Хелкиа и Маасиа одесную его, ошуюю же Фадаиа и Мисаил, и Мелхиа и Осам, и Асавадма и Захариа и Месоллам.
౪ఆ పని కోసం చెక్కతో చేసిన ఎత్తయిన వేదిక మీద ఎజ్రా నిలబడ్డాడు. అతని కుడివైపు మత్తిత్యా, షెమ, అనాయా, ఊరియా, హిల్కీయా, మయశేయా అనేవాళ్ళు. ఎడమవైపు పెదాయా, మిషాయేలు, మల్కీయా, హాషుము, హష్బద్దానా, జెకర్యా, మెషుల్లాము అనేవాళ్ళు నిలబడ్డారు.
5 И разгну Ездра книгу пред всеми людьми, яко той бе над людьми, и бысть егда разгибаше ю, сташа вси людие.
౫అప్పుడు అందరికంటే ఎత్తయిన వేదికపై ఎజ్రా నిలబడి ప్రజలంతా చూస్తుండగా గ్రంథం తెరిచాడు. ప్రజలంతా లేచి నిలబడ్డారు.
6 И благослови Ездра Господа Бога великаго, и отвещаша вси людие и реша аминь, воздвигше руце свои, и преклонишася и поклонишася Господеви лицем на землю.
౬ఎజ్రా గొప్ప దేవుడైన యెహోవాను స్తుతించినప్పుడు ప్రజలంతా తమ చేతులు పైకెత్తి ఆమేన్, ఆమేన్ అని కేకలు వేస్తూ, క్రిందికి నేల వైపుకు తమ తలలు వంచుకుని యెహోవాకు నమస్కరించారు.
7 Иисус же и Ванаиа и Саравиа, Акан, Саватей, Камптас, Азариа, Иозавадан, Анифанес и левити бяху вразумляюще людий в законе: людие же стояху на стоянии своем.
౭ప్రజలు ఇలా నిలబడి ఉన్న సమయంలో యేషూవ, బానీ, షేరేబ్యా, యామీను, అక్కూబు, షబ్బెతై, హోదీయా, మయశేయా, కెలీటా, అజర్యా, యోజాబాదు, హానాను, పెలాయా, లేవీయులు ధర్మశాస్త్రం అర్థాన్ని, భావాలను వారికి తెలియజేశారు.
8 И чтоша в книзе закона Божия, и поучаше Ездра и изясняше ко разумению Господню, и разумеша людие чтение.
౮ఆ విధంగా ప్రజలు మరింత స్పష్టంగా అర్థం చేసుకుని గ్రహించగలిగేలా గ్రంథాన్ని చదివి వినిపించి వాటి సారాంశం తెలియజేసారు.
9 Рече же Неемиа и Ездра священник и писец, и левити и толкующии людем, и реша всем людем: день свят есть Господу Богу нашему, не рыдайте и не плачите. Понеже плакаша вси людие, егда услышаша словеса закона.
౯ధర్మశాస్త్ర గ్రంథంలోని విషయాలు గ్రహించిన ప్రజలు బిగ్గరగా ఏడవడం మొదలుపెట్టారు. అధికారి నెహెమ్యా, యాజకుడు, శాస్త్రి అయిన ఎజ్రా, ప్రజలకు వివరించే లేవీయులు వారితో “మీరు ఏడవ్వద్దు. ఈ రోజు మీ దేవుడైన యెహోవాకు కేటాయించిన రోజు” అని చెప్పారు.
10 И рече им: идите и ядите тучная и пийте сладкая, и послите части не имущым, яко свят есть день Господеви нашему, и не печалитеся, ибо радость Господня сия есть сила наша.
౧౦అప్పుడు నెహెమ్యా “బయలు దేరండి. కొవ్విన మాంసం తినండి. ఏదైనా తియ్యటిది తాగండి. ఇప్పటి దాకా తమ కోసం ఏమీ సిద్ధం చేసుకోని వాళ్లకు వాటాలు పంపించండి. ఎందుకంటే ఈ రోజు పరిశుద్ధమైనది. మీరు దుఃఖపడొద్దు. యెహోవాలో ఆనందమే మీ బలం” అని చెప్పాడు.
11 Левити же молчание творяху во всех людех, глаголюще: молчите, яко день свят есть, и не тужите.
౧౧ఈ విధంగా లేవీయులు ప్రజలందరినీ ఓదార్చారు. “మీరు దుఃఖించడం ఆపండి. చింతించకండి. ఇది పవిత్రమైన రోజు” అన్నారు.
12 И отидоша вси людие ясти и пити, и послати части, и сотворити веселие велико, яко разумеша словеса, имже научиша их.
౧౨ఆ తరువాత ప్రజలు తాము విన్న మాటలన్నీ గ్రహించి, తినడానికీ, తాగడానికీ, లేని వారికి వాటాలు పంపించడానికీ, సంతోషంగా గడపడానికీ ఎవరి ఇళ్ళకు వాళ్ళు వెళ్లారు.
13 И в день вторый собрашася князие отечеств со всеми людьми, священницы и левити ко Ездре писцу, да протолкует всем словеса законная.
౧౩రెండవ రోజు ప్రజల పెద్దల్లో ప్రముఖులు, యాజకులు, లేవీయులు ధర్మశాస్త్ర గ్రంథంలోని విషయాలు తెలుసుకోవాలని ఆచార్యుడు ఎజ్రా దగ్గర సమకూడారు.
14 И обретоша писано в законе, егоже заповеда Господь рукою Моисеовою, да обитают сынове Израилевы в кущах в праздник месяца седмаго,
౧౪యెహోవా మోషేకు అనుగ్రహించిన గ్రంథం పరిశీలించినప్పుడు ఏడవ నెలలో జరిగే పండగ సమయంలో పర్ణశాలల్లో గడపాలని రాసి ఉన్నట్టు వారు కనుగొన్నారు.
15 и да проповедят трубами во всех градех их и во Иерусалиме. И рече Ездра: изыдите на гору, и принесите ветви масличны, и ветви древес кипарисных, и ветви мирсинныя, и ветви финиковы, и ветви древес дубравных, сотворити кущы по писаному.
౧౫వాళ్ళు యెరూషలేంలో, తమ పట్టణాల్లో ఈ విధంగా చాటింపు వేయించారు. “గ్రంథంలో రాసి ఉన్నట్టు, మీరు కొండలకు వెళ్లి ఒలీవచెట్ల కొమ్మలు, అడవి ఒలీవచెట్ల కొమ్మలు, గొంజి చెట్ల కొమ్మలు, ఈతచెట్ల కొమ్మలు, గుబురుగా ఉండే రకరకాల చెట్ల కొమ్మలు తీసుకువచ్చి పర్ణశాలలు కట్టాలి.”
16 И изыдоша людие, и принесоша, и сотвориша себе кущы кийждо на крове своем и во дворех своих, и во дворех дому Божия и на пространстве врат Водных и на пространстве врат Ефремлих.
౧౬కాబట్టి ప్రజలు వెళ్లి కొమ్మలు తెచ్చి అందరూ తమ తమ ఇళ్ళ మీద, వాకిళ్ళలో, మందిరం పరిసరాల్లో, నీటి ద్వారం వీధిలో, ఎఫ్రాయీం ద్వారం వీధిలో పర్ణశాలలు కట్టారు.
17 И сотвориша весь сонм возвративыйся от пленения кущы, и седоша в кущах, яко не сотвориша от дний Иисуса сына Навина тако сынове Израилевы даже до дне того. И бысть веселие велико.
౧౭చెర నుండి తిరిగి వచ్చినవాళ్ళంతా పర్ణశాలలు కట్టుకుని వాటిలో ఉన్నారు. అందరూ ఆనందించారు. నూను కొడుకు యెహోషువ జీవిత కాలం తరువాత నుండి ఇప్పటి వరకూ ఇశ్రాయేలీయులు ఈ విధంగా చేయలేదు.
18 И читаху в книзе закона Божия на всяк день, от дне перваго даже до дне последняго. И сотвориша праздник седмь дний, и в день осмый собрание по обычаю.
౧౮అంతే కాకుండా, మొదటి రోజు నుండి ఏడవ రోజు వరకూ ప్రతిరోజూ ఎజ్రా దేవుని ధర్మశాస్త్ర గ్రంథం చదివి, వినిపిస్తూ వచ్చాడు. వాళ్ళు ఇలా వారం పాటు ఈ పండగ రోజులు ఆచరించారు. తరువాత ఎనిమిదవ రోజున నిర్ణయించిన క్రమం ప్రకారం పవిత్ర సమావేశంలో సమకూడారు.