< От Иоанна святое благовествование 11 >

1 Бе же некто боля Лазарь от Вифании, от веси Мариины и Марфы сестры ея.
బేతనియ గ్రామానికి చెందిన లాజరుకు జబ్బు చేసింది. మరియ, మార్త అతని సోదరీలు.
2 Бе же Мариа помазавшая Господа миром и отершая нозе Его власы своими, еяже брат Лазарь боляше.
ఈ మరియే ప్రభువు పాదాలకు అత్తరు పూసి తన తల వెంట్రుకలతో తుడిచిన మరియ.
3 Посласте убо сестре к Нему, глаголюще: Господи, се, егоже любиши, болит.
అప్పుడు ఆ అక్క చెల్లెళ్ళు, “ప్రభూ, నువ్వు ప్రేమించే వాడికి జబ్బు చేసింది” అని యేసుకు కబురు పంపించారు.
4 Слышав же Иисус рече: сия болезнь несть к смерти, но о славе Божии, да прославится Сын Божий ея ради.
యేసు అది విని, “ఈ జబ్బు చావు కోసం రాలేదు. దీని ద్వారా దేవుని కుమారుడికి మహిమ కలిగేలా దేవుని మహిమ కోసమే వచ్చింది” అన్నాడు.
5 Любляше же Иисус Марфу и сестру ея и Лазаря.
మార్తను, ఆమె సోదరిని లాజరును యేసు ప్రేమించాడు.
6 Егда же услыша, яко болит, тогда пребысть на немже бе месте два дни.
లాజరు జబ్బు పడ్డాడని యేసు విని కూడా తాను ఉన్న చోటనే ఇంకా రెండు రోజులు ఉండిపోయాడు.
7 Потом же глагола учеником: идем во Иудею паки.
దాని తరువాత ఆయన తన శిష్యులతో, “మనం మళ్ళీ యూదయకు వెళ్దాం పదండి” అన్నాడు.
8 Глаголаша Ему ученицы: Равви, ныне искаху Тебе камением побити Иудее, и паки ли идеши тамо?
ఆయన శిష్యులు ఆయనతో, “రబ్బీ, ఇంతకు ముందే యూదులు నిన్ను రాళ్ళతో కొట్టే ప్రయత్నం చేశారు కదా, అక్కడికి మళ్ళీ వెళ్తావా?” అని అన్నారు.
9 Отвеща Иисус: не два ли надесяте часа еста во дни? Аще кто ходит во дни, не поткнется, яко свет мира сего видит:
అందుకు యేసు జవాబిస్తూ, “పగలు పన్నెండు గంటల వెలుగు ఉండదా? ఒకడు పగటి వేళ నడిస్తే తడబడడు. ఎందుకంటే అతడు వెలుగులో అన్నీ చూస్తాడు.
10 аще же кто ходит в нощи, поткнется, яко несть света в нем.
౧౦అయితే ఒకడు రాత్రివేళ నడిస్తే అతనిలో వెలుగు లేదు కాబట్టి తడబడతాడు” అని చెప్పాడు.
11 Сия рече и посем глагола им: Лазарь друг наш успе: но иду, да возбужу его.
౧౧యేసు ఈ సంగతులు చెప్పిన తరువాత వారితో ఇలా అన్నాడు, “మన స్నేహితుడు లాజరు నిద్రపోయాడు. అతన్ని నిద్ర లేపడానికి వెళ్తున్నాను.”
12 Реша убо ученицы Его: Господи, аще успе, спасен будет.
౧౨అందుకు శిష్యులు ఆయనతో, “ప్రభూ, అతడు నిద్రపోతూ ఉంటే బాగుపడతాడు” అన్నారు.
13 Рече же Иисус о смерти его: они же мнеша, яко о успении сна глаголет.
౧౩యేసు అతని చావు గురించి మాట్లాడాడు గాని వారు నిద్రలో విశ్రాంతి తీసుకోవడం గురించి ఆయన మాట్లాడుతున్నాడు అని అనుకున్నారు.
14 Тогда рече им Иисус не обинуяся: Лазарь умре:
౧౪అప్పుడు యేసు వారితో స్పష్టంగా, “లాజరు చనిపోయాడు.
15 и радуюся вас ради, да веруете, яко не бех тамо: но идем к нему.
౧౫నేను అక్కడ లేకపోవడాన్ని బట్టి సంతోషిస్తున్నాను. ఇది మీ కోసమే. మీకు నమ్మకం కలగడానికే. అతని దగ్గరకి వెళ్దాం పదండి” అన్నాడు.
16 Рече же Фома, глаголемый Близнец, учеником: идем и мы, да умрем с ним.
౧౬దిదుమ అనే మారుపేరున్న తోమా, “యేసుతో చనిపోవడానికి మనం కూడా వెళ్దాం పదండి” అని తన తోటి శిష్యులతో అన్నాడు.
17 Пришед же Иисус, обрете его четыри дни уже имуща во гробе.
౧౭యేసు అక్కడికి చేరుకుని, అప్పటికే నాలుగు రోజులుగా లాజరు సమాధిలో ఉన్నాడని తెలుసుకున్నాడు.
18 Бе же Вифаниа близ Иерусалима, яко стадий пятьнадесять,
౧౮బేతనియ యెరూషలేముకు దగ్గరే. సుమారు మూడు కిలోమీటర్ల దూరం ఉంటుంది.
19 и мнози от Иудей бяху пришли к Марфе и Марии, да утешат их о брате ею.
౧౯చాలామంది యూదులు మార్త, మరియలను వారి సోదరుని విషయం ఓదార్చడానికి వచ్చి, అక్కడ ఉన్నారు.
20 Марфа убо егда услыша, яко Иисус грядет, срете Его: Мариа же дома седяше.
౨౦అప్పుడు మార్త, యేసు వస్తున్నాడని విని ఆయనను ఎదుర్కోడానికి వెళ్ళింది గాని మరియ ఇంట్లోనే ఉండిపోయింది.
21 Рече же Марфа ко Иисусу: Господи, аще бы еси зде был, не бы брат мой умерл:
౨౧అప్పుడు మార్త యేసుతో, “ప్రభూ, నువ్వు ఇక్కడ ఉండి ఉంటే, నా సోదరుడు చనిపోయేవాడు కాదు,
22 но и ныне вем, яко елика аще просиши от Бога, даст Тебе Бог.
౨౨ఇప్పుడైనా నువ్వు దేవుణ్ణి ఏమడిగినా దేవుడు నీకు ఇస్తాడని నాకు తెలుసు” అంది.
23 Глагола ей Иисус: воскреснет брат твой.
౨౩యేసు ఆమెతో, “నీ సోదరుడు మళ్ళీ బతికి లేస్తాడు” అన్నాడు.
24 Глагола Ему Марфа: вем, яко воскреснет в воскрешение, в последний день.
౨౪మార్త ఆయనతో, “చివరి రోజున పునరుత్థానంలో బతికి లేస్తాడని నాకు తెలుసు” అంది.
25 Рече (же) ей Иисус: Аз есмь воскрешение и живот: веруяй в Мя, аще и умрет, оживет:
౨౫అందుకు యేసు, “పునరుత్థానం, జీవం నేనే. నన్ను నమ్మినవాడు చనిపోయినా మళ్ళీ బతుకుతాడు,
26 и всяк живый и веруяй в Мя не умрет во веки. Емлеши ли веру сему? (aiōn g165)
౨౬బతికి ఉండి నన్ను నమ్మిన వారు ఎప్పుడూ చనిపోరు. ఇది నువ్వు నమ్ముతున్నావా?” అన్నాడు. (aiōn g165)
27 Глагола Ему: ей, Господи: аз веровах, яко Ты еси Христос Сын Божий, иже в мир грядый.
౨౭ఆమె, “అవును ప్రభూ, నువ్వు లోకానికి రావలసిన దేవుని కుమారుడవైన క్రీస్తువి అని నమ్ముతున్నాను” అని ఆయనతో చెప్పింది.
28 И сия рекши, иде и пригласи Марию сестру свою тай, рекши: Учитель пришел есть и глашает тя.
౨౮ఈ మాట చెప్పిన తరువాత ఆమె వెళ్ళి ఎవరికీ తెలియకుండా తన సోదరి మరియను పిలిచి, “బోధకుడు ఇక్కడ ఉన్నాడు, నిన్ను పిలుస్తున్నాడు” అంది.
29 Она (же) яко услыша, воста скоро и иде к Нему.
౨౯మరియ అది విన్నప్పుడు, త్వరగా లేచి యేసు దగ్గరికి వెళ్ళింది.
30 Не уже бо бе пришел Иисус в весь, но бе на месте, идеже срете Его Марфа.
౩౦యేసు ఇంకా గ్రామంలోకి రాలేదు. మార్తను కలుసుకున్న చోటే ఉన్నాడు.
31 Иудее (же) убо сущии с нею в дому и утешающе ю, видевше Марию, яко скоро воста и изыде, по ней идоша, глаголюще, яко идет на гроб, да плачет тамо.
౩౧మరియతో ఇంట్లో ఉండి ఆమెను ఓదారుస్తున్న యూదులు ఆమె త్వరగా లేచి బయటకు వెళ్ళడం చూసి ఆమె వెంట వెళ్ళారు. ఆమె ఏడవడానికి సమాధి దగ్గరికి వెళ్తూ ఉందని వారు అనుకున్నారు.
32 Мариа же яко прииде, идеже бе Иисус, видевши Его, паде Ему на ногу, глаголющи Ему: Господи, аще бы еси был зде, не бы умерл мой брат.
౩౨అప్పుడు మరియ యేసు ఉన్న చోటికి వచ్చి, ఆయనను చూసి ఆయన కాళ్ళ మీద పడి, “ప్రభూ, నువ్వు ఇక్కడ ఉండి ఉంటే, నా సోదరుడు చనిపోయేవాడు కాదు” అంది.
33 Иисус убо, яко виде ю плачущуся и пришедшыя с нею Иудеи плачущя, запрети духу и возмутися Сам
౩౩ఆమె ఏడవడం, ఆమెతో వచ్చిన యూదులు కూడా ఏడవడం యేసు చూసినప్పుడు, ఆయన కలవరంతో ఆత్మలో మూలుగుతూ, “అతణ్ణి ఎక్కడ పెట్టారు?” అన్నాడు.
34 и рече: где положисте его? Глаголаша Ему: Господи, прииди и виждь.
౩౪వారు, “ప్రభూ, వచ్చి చూడు” అన్నారు.
35 Прослезися Иисус.
౩౫యేసు ఏడ్చాడు.
36 Глаголаху убо Жидове: виждь, како любляше его.
౩౬అప్పుడు యూదులు, “ఆయన లాజరును ఎంతగా ప్రేమించాడో చూడండి” అని చెప్పుకున్నారు.
37 Нецыи же от них реша: не можаше ли Сей, отверзый очи слепому, сотворити, да и сей не умрет?
౩౭వారిలో కొంతమంది, “ఆయన గుడ్డివారి కళ్ళు తెరిచాడు కదా, ఇతను చనిపోకుండా చెయ్యలేడా?” అన్నారు.
38 Иисус же паки претя в себе, прииде ко гробу. Бе же пещера, и камень лежаше на ней.
౩౮యేసు తనలో తాను మూలుగుతూ ఆ సమాధి గుహ దగ్గరికి వెళ్ళాడు. ఒక రాయి దానికి అడ్డంగా నిలబెట్టి ఉంది.
39 Глагола Иисус: возмите камень. Глагола Ему сестра умершаго Марфа: Господи, уже смердит: четверодневен бо есть.
౩౯యేసు, “ఆ రాయి తీసి వెయ్యండి” అన్నాడు. చనిపోయిన లాజరు సోదరి మార్త యేసుతో, “ప్రభూ, ఇప్పటికి నాలుగు రోజులయ్యింది. శరీరం కుళ్ళిపోతూ ఉంటుంది” అంది.
40 Глагола ей Иисус: не рех ли ти, яко аще веруеши, узриши славу Божию?
౪౦యేసు ఆమెతో, “నువ్వు నమ్మితే, దేవుని మహిమను చూస్తావని నేను నీతో చెప్పలేదా?” అన్నాడు.
41 Взяша убо камень, идеже бе умерый лежя. Иисус же возведе очи горе и рече: Отче, хвалу Тебе воздаю, яко услышал еси Мя:
౪౧కాబట్టి వారు ఆ రాయి తీసి వేశారు. యేసు పైకి చూస్తూ, “తండ్రీ, నా ప్రార్థన విన్నందుకు నీకు కృతజ్ఞతలు.
42 Аз же ведех, яко всегда Мя послушаеши: но народа ради стоящаго окрест рех, да веру имут, яко Ты Мя послал еси.
౪౨నువ్వు నా ప్రార్థన ఎప్పుడూ వింటావని నాకు తెలుసు. కాని, నా చుట్టూ నిలుచుని ఉన్న ఈ ప్రజలు నువ్వు నన్ను పంపించావని నమ్మాలని ఈ మాట పలికాను” అన్నాడు.
43 И сия рек, гласом великим воззва: Лазаре, гряди вон.
౪౩ఆయన ఈ మాట చెప్పిన తరువాత పెద్ద స్వరంతో కేక వేసి, “లాజరూ, బయటికి రా!” అన్నాడు.
44 И изыде умерый, обязан рукама и ногама укроем, и лице его убрусом обязано. Глагола им Иисус: разрешите его и оставите ити.
౪౪అప్పుడు చనిపోయినవాడు కాళ్ళు చేతులు సమాధి బట్టలతో చుట్టి ఉండగా బయటికి వచ్చాడు. అతని ముఖానికి ఒక బట్ట చుట్టి ఉంది. అప్పుడు యేసు వారితో, “అతని కట్లు విప్పి, అతణ్ణి వెళ్ళనివ్వండి” అన్నాడు.
45 Мнози убо от Иудей пришедшии к Марии и видевше, яже сотвори Иисус, вероваша в Него:
౪౫అప్పుడు మరియ దగ్గరికి వచ్చిన యూదుల్లో చాలామంది యేసు చేసింది చూసి ఆయనను నమ్మారు.
46 нецыи же от них идоша к фарисеом и рекоша им, яже сотвори Иисус.
౪౬కాని, వారిలో కొంతమంది వెళ్ళి యేసు చేసిన పనులు పరిసయ్యులకు చెప్పారు.
47 Собраша убо архиерее и фарисее сонм и глаголаху: что сотворим? Яко Человек Сей многа знамения творит:
౪౭అప్పుడు ముఖ్య యాజకులు, పరిసయ్యులు, మహా సభను సమావేశపరిచి, “మనం ఏం చేద్దాం? ఈ మనిషి అనేక సూచక క్రియలు చేస్తున్నాడే,
48 аще оставим Его тако, вси уверуют в Него: и приидут Римляне и возмут место и язык наш.
౪౮మనం ఇతన్ని ఇలాగే వదిలేస్తే, అందరూ ఇతన్నే నమ్ముతారు. రోమీయులు వచ్చి మన భూమినీ, మన రాజ్యాన్నీ, రెంటినీ తీసుకుపోతారు” అన్నారు.
49 Един же некто от них Каиафа, архиерей сый лету тому, рече им: вы не весте ничесоже,
౪౯అయితే, వారిలో ఒకడు, ఆ సంవత్సరం ప్రధాన యాజకుడిగా ఉన్న కయప వారితో, “మీకేమీ తెలియదు.
50 ни помышляете, яко уне есть нам, да един человек умрет за люди, а не весь язык погибнет.
౫౦మన జాతి అంతా నాశనం కాకుండా ఉండాలంటే ఒక్క మనిషి ప్రజలందరి కోసం చనిపోవడం మీకు లాభం అన్నది మీరు అర్థం చేసుకోవడం లేదు” అన్నాడు.
51 Сего же о себе не рече, но архиерей сый лету тому, прорече, яко хотяше Иисус умрети за люди,
౫౧అతడు తనంతట తానే ఈ విధంగా చెప్పలేదు గానీ ఆ సంవత్సరం ప్రధాన యాజకుడిగా ఉన్నాడు కాబట్టి, జాతి అంతటి కోసం యేసు చనిపోవాలని అతడు ప్రవచించాడు.
52 и не токмо за люди, но да и чада Божия расточеная соберет во едино.
౫౨ఆ జాతి కోసం మాత్రమే కాకుండా, వివిధ ప్రాంతాల్లోకి చెదరిపోయిన దేవుని పిల్లలను ఒకటిగా సమకూర్చేలా యేసు చనిపోవాలని అతడు ప్రవచించాడు.
53 От того убо дне совещаша, да убиют Его.
౫౩కాబట్టి, ఆ రోజు నుండి యేసును ఎలా చంపాలా అని వారు ఆలోచన చేస్తూ వచ్చారు.
54 Иисус же ктому не яве хождаше во Иудеех, но иде оттуду во страну близ пустыни, во Ефрем нарицаемый град, и ту хождаше со ученики Своими.
౫౪అందుచేత యేసు అప్పటినుంచి యూదుల్లో బహిరంగంగా తిరగకుండా, అక్కడనుంచి వెళ్ళి అరణ్య ప్రాంతానికి దగ్గరగా ఉన్న ఎఫ్రాయిము అనే గ్రామంలో తన శిష్యులతో కలిసి ఉన్నాడు.
55 Бе же близ Пасха Иудейска, и взыдоша мнози во Иерусалим от стран прежде Пасхи, да очистятся.
౫౫యూదుల పస్కా పండగ దగ్గర పడింది. చాలా మంది ప్రజలు తమను తాము శుద్ధి చేసుకోడానికి పండగకు ముందే గ్రామాలనుంచి యెరూషలేముకు వచ్చారు.
56 Искаху убо Иисуса и глаголаху к себе, в церкви стояще: что мнится вам, яко не имать ли приити в праздник?
౫౬వారు యేసు కోసం చూస్తున్నారు. దేవాలయంలో నిలబడి, ఒకరితో ఒకరు ఇలా మాట్లాడుకుంటున్నారు, “మీరేమంటారు? ఆయన పండగకు రాడా?”
57 Даша же архиерее и фарисее заповедь, да аще кто ощутит (Его), где будет, повесть, яко да имут Его.
౫౭యేసు ఎక్కడ ఉన్నది ఎవరికైనా తెలిస్తే, తాము ఆయనను పట్టుకోవడం కోసం, వారికి తెలియజేయాలని ముఖ్య యాజకులు, పరిసయ్యులు, ఒక ఆజ్ఞ జారీ చేశారు.

< От Иоанна святое благовествование 11 >