< Второзаконие 14 >
1 Сынове есте Господа Бога вашего: да не нарезуетеся и не возложите плеши между очима вашима над мертвым:
౧“మీరు మీ యెహోవా దేవుని ప్రజలు కాబట్టి ఎవరైనా చనిపోతే మిమ్మల్ని మీరు కోసుకోవడం, మీ ముఖంలో ఏ భాగాన్నైనా గొరుక్కోవడం చేయకూడదు.
2 яко людие святи есте Господеви Богу вашему, и вас избра Господь Бог ваш быти вам людем избранным Ему от всех языков иже на лицы земли.
౨ఎందుకంటే మీ దేవుడైన యెహోవాకు మీరు ప్రతిష్టితమైన ప్రజలు. భూమి మీద ఉన్న అన్ని జాతుల ప్రజల నుండి ప్రత్యేకంగా తన స్వంత ప్రజలుగా యెహోవా మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు.
3 Да не снесте всякия мерзости.
౩మీరు హేయమైనది ఏదీ తినకూడదు. మీరు ఈ జంతువులను తినవచ్చు.
4 Сия скоты ядите: телца от говяд и агнца от овец и козла от коз:
౪ఎద్దు, గొర్రె, మేక.
5 еленя и серну, и буйвола и ланя, и зубря и онагра и сайгака.
౫దుప్పి, ఎర్ర చిన్న జింక, దుప్పి, కారు మేక, కారు జింక, లేడి, కొండ గొర్రె.
6 Всяк скот на двое деля пазнокти, и копыто на двое копыта, и отрыгая жвание в скотех, да ясте.
౬జంతువుల్లో రెండు డెక్కలు ఉండి నెమరు వేసే వాటిని తినవచ్చు.
7 И сих да не снесте от отрыгающих жвание и от делящих пазнокти на двое, но копыт не раздвояющих: велблюда и заяца и хирогрилля: яко отрыгают жвание сии, но копыт не раздвояют, нечиста сия вам суть.
౭నెమరు వేసేవైనా రెండు డెక్కలు గలదైనా నెమరు వేసి ఒక్కటే డెక్క కలిగిన ఒంటె, కుందేలు, పొట్టి కుందేలు అనే జంతువులను తినకూడదు. అవి మీకు నిషిద్ధం.
8 И свинии, яко на двое делит пазнокти и копыта раздвояет, и сия жвания не отрыгает, нечиста сия вам есть: от мяс их да не ясте, и мертвечинам их да не прикоснетеся.
౮అలాగే పంది రెండు డెక్కలు కలిగినదైనా నెమరు వేయదు కాబట్టి అది మీకు నిషిద్ధం. వాటి మాంసం తినకూడదు, వాటి శవాలను తాకకూడదు.
9 И сия да ясте от всех яже в воде: вся, имже суть перие и чешуя, ядите.
౯నీటిలో నివసించే వాటిలో రెక్కలు, పొలుసులు గలవాటినన్నిటినీ తినవచ్చు.
10 И всех, имже несть перия, на чешуи, да не ясте: нечиста суть вам.
౧౦రెక్కలు, పొలుసులు లేని దాన్ని మీరు తినకూడదు. అది మీకు నిషిద్ధం.
11 Всяку птицу чисту да ясте.
౧౧పవిత్రమైన ప్రతి పక్షినీ మీరు తినవచ్చు.
12 И сих да не ясте от них:
౧౨మీరు తినరాని పక్షులు ఏవంటే, పక్షిరాజు, రాబందు, గద్ద.
13 орла и грифа и орла морскаго,
౧౩ఎర్ర గద్ద, నల్ల గద్ద, డేగ.
14 и неясыти и иктина и подобных сим:
౧౪అన్ని రకాల కాకులు.
15 и врана и врабия, и выпелицы и сухолапля, и ястреба и подобных сим:
౧౫నిప్పు కోడి, నిశి డేగ, అన్ని రకాల డేగలు.
16 и врана нощнаго и лилика и подобных сим:
౧౬చిన్న గుడ్లగూబ, పెద్ద గుడ్లగూబ, తీతువు పిట్ట,
17 и еродиа и лебедя, и ивина и катаракта, и вдода
౧౭గూడబాతు, బోడి రాబందు, గండ భేరుండం.
18 и нощнаго нетопыря, и сыча и теслоноса, и харадриона и подобных сим, и порфириона.
౧౮కొంగ, అన్ని రకాల బకాలు, కూకుడు గువ్వ, గబ్బిలం.
19 Вся гады птичия нечиста суть вам: да не ясте от них.
౧౯ఎగిరే ప్రతి పురుగూ మీకు నిషిద్ధం. వాటిని తినకూడదు.
20 Всяку птицу чисту да ясте.
౨౦ఎగిరే పవిత్రమైన ప్రతి దాన్నీ తినవచ్చు.
21 Всякия мертвечины да не ясте: приселнику, иже во градех твоих, да дасте, и да яст, или да продасте страннику: яко людие святи есте Господеви Богу вашему. Да не свариши ягняте во млеце матере его.
౨౧దానికదే చచ్చిన దాన్ని మీరు తినకూడదు. అయితే దాన్ని మీ ఇంటి ఆవరణంలో ఉన్న పరదేశికి తినడానికి ఇయ్యవచ్చు. లేక అన్యునికి దాన్ని అమ్మవచ్చు. ఎందుకంటే మీ దేవుడైన యెహోవాకు మీరు ప్రతిష్ఠితమైన ప్రజలు. మేకపిల్లను దాని తల్లి పాలతో కలిపి వండకూడదు.
22 Десятины да даси от всего плода семене своего, плод нив твоих от года до года,
౨౨ప్రతి సంవత్సరం, మీ విత్తనాల పంటలో దశమ భాగాన్ని తప్పనిసరిగా వేరు చెయ్యాలి.
23 и да снеси я пред Господем Богом твоим на месте, идеже изберет Господь Бог твой призывати имя Его тамо: да принесеши десятину пшеницы твоея и вина твоего и елеа твоего, и первенцы волов твоих и овец твоих, да научишися боятися Господа Бога твоего вся дни.
౨౩మీ జీవితమంతటిలో మీ దేవుడైన యెహోవాను మీరు గౌరవించాలంటే ఆయన తన నామానికి నివాస స్థానంగా ఏర్పాటు చేసుకొన్న స్థలంలో, ఆయన సన్నిధిలో మీ పంటలో, ద్రాక్షారసంలో, నూనెలో పదో పంతును, మీ పశువుల్లో గొర్రెల్లో మేకల్లో తొలిచూలు వాటిని తినాలి.
24 Аще же далече будет путь от тебе и не возможеши донести их, яко далече место от тебе, еже изберет Господь Бог твой призывати имя Его тамо, яко да благословит тя Господь Бог твой:
౨౪యెహోవా తన సన్నిధి కోసం ఏర్పాటు చేసుకున్న స్థలం దూరంగా ఉంటే, మీరు వాటిని మోయలేరు కాబట్టి మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించినప్పుడు,
25 и продаси сие на цене, и возмеши сребро в руку твою, и пойдеши на место, иже изберет Господь Бог твой,
౨౫వాటిని వెండిగా మార్చి దాన్ని తీసుకుని మీ యెహోవా దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలానికి వెళ్లి,
26 и даси сребро за все, на неже пожелает душа твоя, на волы и овцы, или на вино, или на сикеру, или на все, егоже желает душа твоя, и да снеси тамо пред Господем Богом твоим, и возвеселишися ты и дом твой.
౨౬ఎద్దులు, గొర్రెలు, ద్రాక్షారసం, మద్యం, వీటిలో మీరు కోరిన దానికి ఆ వెండిని ఇచ్చి, అక్కడ మీ దేవుడు యెహోవా సన్నిధిలో భోజనం చేసి, మీరు, మీ ఇంటివారు, మీ ఇంట్లో ఉండే లేవీయులు సంతోషించాలి.
27 И левит иже во градех твоих, не оставивши его, яко несть ему части ни жребия с тобою:
౨౭లేవీయులను విడిచిపెట్టకూడదు. ఎందుకంటే మీ మధ్యలో వారికి వంతు గాని, స్వాస్థ్యం గాని లేదు.
28 по трех летех да изнесеши всю десятину жит твоих в лето оно, да положиши ю во градех твоих:
౨౮మీ దేవుడు యెహోవా మీరు చేసే పని అంతటిలో మిమ్మల్ని ఆశీర్వదించేలా మూడు సంవత్సరాల కొకసారి, ఆ సంవత్సరం మీకు కలిగిన పంటలో పదో వంతుని బయటికి తెచ్చి మీ ఇంట్లో ఉంచాలి.
29 и приидет левит, яко несть ему части ни жребия с тобою, и пришлец, и сирота и вдова, яже во градех твоих, да ядят и насытятся: да благословит тя Господь Бог твой во всех делех твоих, яже аще сотвориши.
౨౯అప్పుడు మీ మధ్యలో వంతు గాని, స్వాస్థ్యం గాని లేని లేవీయులు, మీ ఇంట్లో ఉన్న పరదేశులు, అనాథలు, విధవరాళ్ళు వచ్చి భోజనం చేసి తృప్తి పొందుతారు.”