< Четвертая книга Царств 12 >

1 В лето седмое Ииуа воцарися Иоас, и четыредесять лет царствова во Иерусалиме. Имя же матере его Савиа от Вирсавеи.
యెహూ పరిపాలనలో ఏడవ సంవత్సరంలో యోవాషు తన పరిపాలన మొదలుపెట్టి యెరూషలేములో 40 సంవత్సరాలు పాలించాడు. అతని తల్లి బెయేర్షెబా ప్రాంతానికి చెందిన జిబ్యా.
2 И сотвори Иоас правое пред Господем во вся дни, в няже просвети его Иодай иерей:
యోవాషుకు యాజకుడైన యెహోయాదా మార్గదర్శకుడుగా ఉన్నంత కాలం అతడు యెహోవా దృష్టిలో యోగ్యంగానే ప్రవర్తించాడు.
3 обаче высоких не преставиша, и тамо еще людие жряху и кадяху на высоких.
అయితే పూజా స్థలాలను తీసివేయలేదు. ప్రజలు ఇంకా అలాటి చోట్ల బలులు అర్పిస్తూ ధూపం వేస్తూ వచ్చారు.
4 И рече Иоас к жерцем: все сребро святых вносимое в дом Господень, сребро оценения, муж сребро взявый оценения, все сребро, еже аще взыдет на сердце мужа внести в дом Господень,
యోవాషు యాజకులతో ఇలా అన్నాడు. “యెహోవా మందిరంలోకి తెచ్చే ప్రతిష్ఠిత వస్తువుల వల్ల వచ్చే డబ్బును యెహోవా మందిరంలోకి తేవాలి. ప్రతి మనిషీ చెల్లించే పన్ను మొత్తాన్నీ, ప్రతి మనిషీ యెహోవా ప్రేరణ మూలంగా తన హృదయంలో నిర్ణయించుకుని ఆలయం పని కోసం చెల్లించిన డబ్బును తేవాలి.
5 да возмут себе жерцы, муж от продания своего, и тии да укрепят ведек дому во всех, идеже аще обрящется ведек.
యాజకులు ప్రజలు కట్టిన ఆ పన్ను మొత్తాన్ని సేకరించాలి. మందిరం మరమ్మత్తు పని కోసం ఆ డబ్బు వినియోగిస్తూ, మందిరాన్ని మంచి స్థితిలో ఉంచాలి.”
6 И бысть в двадесять третие лето царя Иоаса, не укрепиша жерцы ведека храма:
అయితే యోవాషు పరిపాలనలో 23 వ సంవత్సరం దాకా యాజకులు మందిరం మరమ్మత్తులను చేపట్టనే లేదు.
7 и призва царь Иоас Иодая жерца и жерцы, и рече к ним: что яко не укреписте ведека храма? И ныне не приимайте сребра от продажей ваших, яко на ведек храма дасте е.
అప్పుడు యోవాషు యాజకుడైన యెహోయాదాను, మిగిలిన యాజకులను పిలిపించి “మందిరంలో శిథిలమైన భాగాలను మీరెందుకు బాగు చేయలేదు? ఇకపై పన్ను చెల్లించే వారి దగ్గర డబ్బు తీసుకోకండి. మందిరం మరమ్మత్తుల కోసం ఇంత వరకూ సేకరించిన మొత్తాన్ని ఆ పని చేసే వారికే అప్పగించండి” అని ఆజ్ఞ ఇచ్చాడు.
8 И совещашася жерцы не приимати сребра от людий и не укрепляти ведека храма.
కాబట్టి యాజకులు మందిరం మరమ్మత్తు పనులు వారు చూడడం లేదు గనక ఇకపై ప్రజల దగ్గర డబ్బు తీసుకోవడం మానుకున్నారు.
9 И взя Иодай жрец кивот един, и сотвори в нем скважню, и положи его при олтари одесную входящих мужей в дом Господень: и влагаху тамо жерцы хранящии дверь все сребро приносимое в дом Господень.
యాజకుడు యెహోయాదా ఒక పెట్టె తెచ్చి దాని మూతకు కన్నం పెట్టి, బలిపీఠం పక్కన అంటే ఆలయంలో ప్రవేశించే వారికి కుడి వైపుగా దాన్నిఉంచాడు. మందిరంలోకి ప్రజలు తెచ్చే డబ్బంతా ద్వారపాలకులైన యాజకులు అందులో వేశారు.
10 И бысть егда увидеша, яко много сребра в ковчезе, и взыде писчий царев, и жрец великий, и сребросечцы и открыша, и сочтоша сребро обретшееся в дому Господни:
౧౦పెట్టె నిండి పోయిన ప్రతిసారీ రాజు కార్యదర్శి, ప్రధాన యాజకుడు వచ్చి యెహోవా ఆలయంలోని డబ్బు లెక్క చూసి సంచుల్లో ఉంచారు.
11 и даша сребро уготованное в руце творящих дела на сосуды дому Господня: и раздаша древоделем и делателем зиждущым в дому Господни,
౧౧తరువాత వారు ఆ డబ్బును తూచి యెహోవా మందిరం వ్యవహారాలు చూసుకునే వారికి ఇచ్చారు. వారు యెహోవా మందిరం మరమ్మత్తు పని చేసే వడ్రంగులకు, కట్టే పనివారికి ఆ డబ్బు ఇచ్చారు.
12 и стеноделателем, и художником, и секущым камения на купление древес, и камения тесанаго на строение ведека дому Господня, на вся елика иждивена быша на утверждение храма.
౧౨ఇంకా తాపీ పని వాళ్ళకి, రాళ్లు చెక్కే వారికీ యెహోవా మందిరం మరమ్మత్తుకై కలప, చెక్కిన రాళ్ళూ కొనడానికి ఇంకా మందిరం బాగు చేయడానికి అయ్యే ఖర్చు కోసం ఆ డబ్బు ఇస్తూ వచ్చారు.
13 Обаче не творишася храму Господню двери сребряны, гвоздие, фиалы и трубы, ни вси сосуды златы, и сосуды сребряны от сребра принесеннаго в дом Господень:
౧౩యెహోవా మందిరం కోసం వెండి పాత్రల కోసం గానీ, కత్తెరలు, గిన్నెలు, బాకాలు, బంగారు వెండి వస్తువులు మొదలైన వాటి కోసం గానీ ఆ డబ్బు వాడలేదు.
14 понеже творящым дела дадеся сие, и утвердиша тем дом Господень.
౧౪కేవలం యెహోవా మందిరాన్ని మరమ్మతు పని చేసే వారికి మాత్రమే ఆ డబ్బు ఇచ్చారు.
15 И не сочитаху мужей, имже даяху сребро в руки, даяти творящым дела, зане верно творяху.
౧౫మరమ్మత్తుల కోసం ఆ డబ్బు తమ దగ్గర ఉంచి పనివారికి ఇస్తూ ఉండే వారు నమ్మకస్థులు గనక ఎవరూ వారిని లెక్క అడగలేదు.
16 Сребро за грехи и сребро за преступление, елико внесено бысть в дом Господень, жерцем бысть.
౧౬అపరాధ పరిహార బలుల మూలంగా పాప పరిహార బలుల మూలంగా జమ అయిన డబ్బు యెహోవా మందిరానికి ఉపయోగించాలి. ఎందుకంటే అది యాజకులది.
17 Тогда взыде Азаил царь Сирский и воева на Геф, и взя его Азаил и разби его: и обрати Азаил лице свое взыти на Иерусалим.
౧౭అటు తరువాత సిరియా రాజు హజాయేలు గాతు పట్టణంపై దాడి చేసి దాన్ని వశపరచుకున్న తరువాత అతడు యెరూషలేము మీదికి రావాలని ఉన్నాడు.
18 И взя Иоас царь Иудин вся святая, елика освяти Иосафат и Иорам и Охозиа, отцы его и царие Иудины, и святая его, и все злато обретшееся в сокровищих дому Господня и дому царева, и посла Азаилу царю Сирску, и отиде от Иерусалима.
౧౮యూదా రాజు యోవాషు తన పూర్వీకులైన యెహోషాపాతు, యెహోరాము, అహజ్యా మొదలైన యూదా రాజులు యెహోవాకు ప్రతిష్ఠించిన పవిత్ర వస్తువులనూ తాను ప్రతిష్ఠించిన వస్తువులనూ, యెహోవా మందిరం గిడ్డంగుల్లో, రాజ భవనంలో కనిపించిన బంగారమంతా పోగు చేసి సిరియా రాజు హజాయేలుకు పంపాడు. అప్పుడు హజాయేలు యెరూషలేము నుండి వెళ్ళిపోయాడు.
19 И прочая словес Иоасовых, и вся елика сотвори, не се ли, сия писана в книзе словес дний царей Иудиных?
౧౯యోవాషు గురించిన మిగతా విషయాలు, అతని యితర కార్యాలను గూర్చి యూదా రాజుల వృత్తాంత గ్రంథంలో రాసి ఉన్నాయి కదా.
20 И восташа отроцы его, и совещаша всяк совет, и убиша Иоаса в доме Маллони, иже в Саале.
౨౦అతని సేవకులు లేచి కుట్ర చేసి సిల్లాకు దిగి వెళ్ళే దారిలో మిల్లో అని పేరున్న అంతఃపురంలో యోవాషును చంపారు.
21 И Иезехар сын Иемуафов, и Иезевуф сын Сомиров, раби его убиша его, и умре, и погребоша его со отцы его во граде Давидове. И воцарися Амессиа сын его вместо его.
౨౧షిమాతు కొడుకు యోజాకారు షోమేరు కొడుకు యెహోజాబాదు అనే అతని సేవకులు అతనిపై దాడి చేయగా అతడు మరణించాడు. ప్రజలు దావీదు పురంలో అతని పూర్వీకుల సమాధిలో అతణ్ణి పాతిపెట్టారు. అతని కుమారుడు అమజ్యా అతని స్థానంలో రాజయ్యాడు.

< Четвертая книга Царств 12 >