< Третья книга Царств 17 >
1 И рече Илиа пророк Фесвитянин, иже от фесвии Галаадския, ко Ахааву: жив Господь Бог сил, Бог Израилев, Емуже предстою пред Ним, аще будет в лета сия роса и дождь, точию от уст словесе моего.
౧గిలాదు ప్రాంతంలోని తిష్బీ గ్రామం వాడైన ఏలీయా అహాబుతో “ఇశ్రాయేలు ప్రజల దేవుడైన యెహోవా ప్రాణం తోడు, నేను ఆయన ఎదుట నిలబడి చెబుతున్నాను. నేను మళ్ళీ చెప్పే వరకూ, రాబోయే కొన్నేళ్ళు మంచు గానీ వాన గానీ పడదు” అన్నాడు.
2 И бысть глагол Господень ко Илии:
౨ఆ తరువాత యెహోవా అతనితో ఇలా చెప్పాడు.
3 иди отсюду на восток и скрыйся в потоце Хорафа прямо лицу Иорданову:
౩“నీవు ఇక్కడ నుంచి తూర్పు వైపుగా వెళ్లి యొర్దానుకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర దాక్కో.
4 и будеши пити от потока воду, и враном заповедах препитати тя тамо.
౪ఆ వాగు నీళ్ళు నీవు తాగాలి. అక్కడ నీకు ఆహారం తెచ్చేలా నేను కాకులకు ఆజ్ఞాపించాను” అని అతనికి చెప్పాడు.
5 И сотвори Илиа по глаголу Господню, и седе при потоце Хорафове прямо лицу Иорданову:
౫అతడు వెళ్లి యెహోవా చెప్పినట్టు యొర్దానుకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర నివసించాడు.
6 и вранове приношаху ему хлебы и мяса заутра, и хлебы и мяса к вечеру, и от потока пияше воду.
౬అక్కడ కాకులు ఉదయమూ సాయంత్రమూ రొట్టె, మాంసాలను అతని దగ్గరికి తెచ్చేవి. అతడు వాగు నీళ్ళు తాగాడు.
7 И бысть по днех, и изсше источник, яко не бе дождя на землю,
౭కొంతకాలమైన తరువాత దేశంలో వాన కురవక ఆ వాగు ఎండిపోయింది.
8 и бысть глагол Господень ко Илии глаголя:
౮యెహోవా అతనితో ఇలా చెప్పాడు. “నీవు సీదోను ప్రాంతంలోని సారెపతు అనే ఊరికి వెళ్లి అక్కడ ఉండు.
9 востани и иди в Сарепту Сидонскую, и пребуди тамо: се бо, заповедах тамо жене вдовице препитати тя.
౯నిన్ను పోషించడానికి అక్కడ ఉన్న ఒక విధవరాలికి నేను ఆజ్ఞాపించాను.”
10 И воста и иде в Сарепту Сидонскую, и прииде ко вратом града: и се, тамо жена вдова собираше дрова. И возопи Илиа вслед ея и рече ей: принеси ныне ми мало воды в сосуде, и испию.
౧౦కాబట్టి అతడు సారెపతు పట్టణ ద్వారం దగ్గరికి వెళ్ళి ఒక విధవరాలు అక్కడ కట్టెలు ఏరుకోవడం చూసి ఆమెను పిలిచాడు. “తాగడానికి గిన్నెలో కొంచెం మంచినీళ్ళు తెస్తావా?” అని అడిగాడు.
11 И иде взяти. И возопи вслед ея Илиа и рече ей: приими убо мне и укрух хлеба в руце своей, да ям.
౧౧ఆమె నీళ్లు తేబోతుంటే అతడామెను మళ్ళీ పిలిచి “నీ చేత్తో నాకొక రొట్టె ముక్క తీసుకు రా” అన్నాడు.
12 И рече жена: жив Господь Бог твой, аще есть у мене опреснок, но токмо горсть муки в водоносе и мало елеа в чванце: и се, аз соберу два поленца, и вниду, и сотворю е себе и детем моим, и снемы е, и умрем.
౧౨అందుకామె “నీ దేవుడు యెహోవా జీవం తోడు. గిన్నెలో కొద్దిగా పిండి, సీసాలో కొంచెం నూనె మాత్రం నా దగ్గర ఉన్నాయి. ఒక్క రొట్టె కూడా లేదు. చావబోయే ముందు నేను ఇంటికి వెళ్లి నాకూ నా కొడుక్కీ ఒక రొట్టె తయారు చేసుకుని తిని ఆపైన ఆకలితో చచ్చి పోవాలని, కొన్ని కట్టెపుల్లలు ఏరుకోడానికి వచ్చాను” అంది.
13 И рече к ней Илиа: дерзай, вниди и сотвори но глаголу твоему: но сотвори ми оттуду опреснок мал прежде, и принеси ми, себе же и чадом своим да сотвориши послежде,
౧౩అప్పుడు ఏలీయా ఆమెతో అన్నాడు. “భయపడవద్దు, వెళ్లి నీవు చెప్పినట్టే చెయ్యి. అయితే అందులో ముందుగా నాకొక చిన్న రొట్టె చేసి, నా దగ్గరికి తీసుకురా. తరువాత నీకూ నీ కొడుక్కీ రొట్టెలు చేసుకో.
14 яко тако глаголет Господь Бог Израилев: водонос муки не оскудеет, и чванец елеа не умалится до дне, дондеже даст Господь дождь на землю.
౧౪భూమి మీద యెహోవా వాన కురిపించే వరకూ ఆ గిన్నెలో ఉన్న పిండి తగ్గదు, సీసాలో నూనె అయిపోదని ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా చెప్పాడు.”
15 И иде жена, и сотвори по глаголу Илиину, и даде ему, и яде той, и та, и чада ея.
౧౫అప్పుడు ఆమె వెళ్లి ఏలీయా చెప్పిన మాట ప్రకారం చేసింది. అతడూ, ఆమె, ఆమె కొడుకు చాలా రోజులు భోజనం చేస్తూ వచ్చారు.
16 И от того дне водонос муки не оскуде, и чванец елеа не умалися, по глаголу Господню, егоже глагола рукою Илииною.
౧౬యెహోవా ఏలీయా ద్వారా చెప్పినట్టు, గిన్నెలోని పిండి తక్కువ కాలేదు, సీసాలోని నూనె అయిపోలేదు.
17 И бысть по сих, и разболеся сын жены госпожи дому, и бе болезнь его крепка зело, дондеже не остася в нем дух его.
౧౭కొంతకాలం తరువాత ఆ వితంతువు కొడుక్కి జబ్బు చేసింది. జబ్బు ముదిరి, అతడు చనిపోయాడు.
18 И рече ко Илии: что мне и тебе, человече Божий? Вшел еси ко мне воспомянути неправды моя и уморити сына моего.
౧౮ఆమె ఏలీయాతో “దేవుని మనిషీ, మీరు నా దగ్గరికి రావడం దేనికి? నా పాపాన్ని నాకు గుర్తు చేసి నా కొడుకుని చంపడానికా?” అంది.
19 И рече Илиа к жене: даждь ми сына твоего. И взят его от недра ея, и вознесе его в горницу, идеже сам почиваше, и положи его на одре своем.
౧౯అతడు “నీ కొడుకును ఇలా తీసుకురా” అని చెప్పాడు. ఆమె చేతుల్లో నుంచి వాణ్ణి తీసుకు తానున్న పై అంతస్తు గదిలోకి వెళ్లి తన మంచం మీద వాణ్ణి పడుకోబెట్టాడు.
20 И возопи Илиа ко Господу и рече: увы мне, Господи, свидетелю вдовы, у неяже аз ныне пребываю, Ты озлобил еси еже уморити сына ея.
౨౦“యెహోవా నా దేవా, నన్ను చేర్చుకున్న ఈ విధవరాలి కొడుకుని చనిపోయేలా చేసి నీవు కూడా ఆమె మీదికి కీడు తెచ్చావా?” అని యెహోవాకు మొర్రపెట్టాడు.
21 И дуну на отрочища трижды, и призва Господа и рече: Господи Боже мой, да возвратится убо душа отрочища сего в онь.
౨౧ఆ బాలుడి మీద మూడుసార్లు బోర్లా పండుకుని “యెహోవా నా దేవా, నా మొర్ర ఆలకించి ఈ బాలుడికి మళ్ళీ ప్రాణం ఇవ్వు” అని యెహోవాకు ప్రార్థించాడు.
22 И бысть тако: и возопи отрочищь,
౨౨యెహోవా ఏలీయా చేసిన ప్రార్థన ఆలకించి ఆ బాలుడికి ప్రాణం పోశాడు. వాడు బతికాడు.
23 и сведе его с горницы в дом, и даде его матери его. И рече Илиа: виждь, жив есть сын твой.
౨౩ఏలీయా ఆ అబ్బాయిని ఎత్తుకుని గదిలోనుంచి దిగి ఇంట్లోకి తీసుకు వచ్చి వాడి తల్లికి అప్పగించి “చూడు, నీ కొడుకు బతికే ఉన్నాడు” అని చెప్పాడు.
24 И рече жена ко Илии: се, уразумех, яко человек Божий еси ты, и глагол Господень во устех твоих истинен.
౨౪ఆ స్త్రీ ఏలీయాతో “నీవు దైవసేవకుడివని, నీవు పలుకుతున్న యెహోవా మాట వాస్తవమని దీని వల్ల నాకు తెలిసింది” అంది.