< Књига о Рути 4 >

1 А Воз изиђе на врата градска, и седе онде. И гле, наиђе онај осветник, за ког Воз говораше, и рече му Воз: Ходи овамо, седи овде. И он дође и седе.
బోయజు బేత్లెహేము పురద్వారం దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. ఇంతకు ముందు బోయజు ప్రస్తావించిన బంధువు అటుగా వెళ్తున్నాడు. బోయజు అతణ్ణి పేరు పెట్టి పిలిచాడు “ఏమయ్యా, ఇలా వచ్చి కూర్చో” అన్నాడు. అతడు ఆ పిలుపు విని వచ్చి కూర్చున్నాడు.
2 Потом узе Воз десет људи између старешина градских и рече: Поседајте овде. И поседаше.
బోయజు ఆ ఊరి పెద్దల్లో పదిమందిని పిలుచుకు వచ్చాడు. వారిని అక్కడ కూర్చోబెట్టాడు.
3 Тада рече оном осветнику: Њиву која је била брата нашег Елимелеха продала је Нојемина, која се вратила из земље моавске.
తరువాత అతడు “మోయాబు దేశంనుండి తిరిగి వచ్చిన నయోమి మన సోదరుడైన ఎలీమెలెకు భార్య. ఆమె తన భర్తకు చెందిన భూమిని అమ్మివేస్తోంది. కాబట్టి నువ్వు శ్రద్ధగా వినాలని నేను ఒక విషయం చెబుతున్నాను.
4 Зато рекох: Да јавим теби, и кажем ти: Узми њиву пред овима што седе овде и пред старешинама народа мог; ако ћеш откупити, откупи; ако ли нећеш откупити, кажи ми да знам; јер осим тебе нема другог који би откупио, а после тебе идем ја. А он рече: Ја ћу откупити.
ఈ ఊరి పెద్దల సమక్షంలో, నా కుటుంబ పెద్దల సాక్షిగా నువ్వు ఆ భూమిని విడిపించుకో. ఒకవేళ విడిపించడానికి నువ్వు సిద్ధపడితే నాకు స్పష్టంగా చెప్పు. దాన్ని నువ్వు విడిపించుకోలేకపోతే అది కూడా స్పష్టంగా చెప్పు. నువ్వు కాకపోతే దాన్ని విడిపించే దగ్గర బంధువు వేరే ఎవరూ లేరు. నీ తరువాత దగ్గర బంధువుని నేనే” అని అతనితో చెప్పాడు. అందుకతడు “నేను విడిపిస్తాను” అన్నాడు.
5 А Воз рече: У који дан узмеш њиву из руке Нојеминине, треба да узмеш и Руту Моавку жену умрлога, да подигнеш име умрлом у наследству његовом.
అప్పుడు బోయజు “నువ్వు నయోమి దగ్గర నుండి ఆ భూమిని కొనుగోలు చేసినప్పుడు ఆ భూమితో పాటుగా చనిపోయిన వాడి భార్యను, మోయాబుకు చెందిన రూతును కూడా స్వీకరించాలి. చనిపోయిన వాడి ఆస్తిపై అతని పేరు నిలబెట్టాలంటే ఇదే మార్గం” అన్నాడు.
6 Тада рече онај осветник: Не могу откупити, да не распем своје наследство; откупи ти шта би требало да ја откупим, јер ја не могу откупити.
దానికి ఆ బంధువు “నేను దాన్ని విడిపిస్తే నా సొంత వారసత్వం పాడవుతుంది. కాబట్టి దాన్ని విడిపించే ఆ హక్కు నువ్వే తీసుకో. ఎందుకంటే నేను ఆ భూమిని విడిపించుకోలేను” అన్నాడు.
7 А беше од старине обичај у Израиљу о откупљивању и промењивању, да би свака ствар била тврда, да један изује обућу своју и да другом, и то беше сведоџба у Израиљу.
ఆ రోజుల్లో ఇశ్రాయేలీయులో ఒక కట్టుబాటు ఉంది. బంధు ధర్మానికీ, క్రయ విక్రయాలకూ ఏదైనా విషయాన్ని ఖరారు చేయడానికీ ఒక సంప్రదాయం ఉంది. ఆ సంప్రదాయం ఏమిటంటే ఒక వ్యక్తి తన చెప్పు తీసి అవతలి వాడికివ్వడమే. ఈ పనిని ఇశ్రాయేలీయుల్లో ప్రమాణంగా ఎంచారు.
8 Кад дакле онај осветник рече Возу: Узми ти, изу обућу своју.
ఆ బంధువు “నువ్వే దాన్ని సంపాదించుకో” అని బోయజుతో చెప్పి తన చెప్పు తీసివేశాడు.
9 А Воз рече старешинама и свему народу: Ви сте сведоци данас да сам откупио из руке Нојеминине шта је год било Елимелехово и шта је год било Хелеоново и Малоново;
అప్పుడు బోయజు “ఎలీమెలెకుకు కలిగిన సమస్తం-కిల్యోను, మహ్లోనులకు చెందినదంతా నయోమి దగ్గర నుండి సంపాదించాను అని నేను పలికిన దానికి మీరు ఈ రోజు సాక్షులుగా ఉన్నారు.
10 И да сам узео за жену Руту Моавку жену Малонову да подигнем име умрлом у наследству његовом, да не би погинуло име умрлом међу браћом његовом и у месту његовом; ви сте сведоци данас.
౧౦అలాగే చనిపోయినవాడి పేరట అతని వారసత్వాన్ని స్థిరపరచడానికీ, చనిపోయినవాడి పేరును అతని సోదరుల్లోనుండీ, అతని నివాస స్థలం నుండీ సమసి పోకుండా ఉండటానికి నేను మహ్లోను భార్య రూతు అనే మోయాబీ స్త్రీని సంపాదించుకుని పెళ్ళి చేసుకుంటున్నాను. దీనికీ మీరు ఈ రోజున సాక్షులుగా ఉన్నారు” అని పెద్దలతో, ప్రజలందరితో చెప్పాడు.
11 И сав народ који беше на вратима градским и старешине рекоше: Сведоци смо; да да Господ да жена која долази у дом твој буде као Рахиља и Лија, које обе сазидаше дом Израиљев; богати се у Ефрати, и прослави име своје у Витлејему!
౧౧అందుకు ఆ ఊరి ద్వారం దగ్గర ఉన్న ప్రజలూ, పెద్దలూ “మేము సాక్షులం. నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని యెహోవా ఇశ్రాయేలు వంశాన్ని అభివృద్ధి చేసిన రాహేలు, లేయాల వలే చేస్తాడు గాక!
12 И од семена које ти Господ да од те жене, да постане дом твој као дом Фареса ког роди Тамара Јуди.
౧౨ఎఫ్రాతాలో నీకు క్షేమం, అభివృద్ధీ కలిగి బేత్లెహేములో పేరు ప్రఖ్యాతులు పొందుతావు గాక! యెహోవా ఈ యువతి వల్ల నీకు అనుగ్రహించే సంతానం, నీ కుటుంబం తామారు యూదాకు కనిన పెరెసు కుటుంబంలా ఉండుగాక!” అన్నారు.
13 И тако узе Воз Руту и би му жена, и он леже с њом, и Господ јој даде те затрудне, и роди сина.
౧౩బోయజు రూతును పెళ్ళి చేసుకున్నాడు. ఆమెను ప్రేమించాడు. యెహోవా ఆమెను దీవించాడు. ఆమె గర్భవతి అయి ఒక కొడుకును కన్నది.
14 И рекоше жене Нојемини: Да је благословен Господ који те није оставио данас без осветника, да се име Његово слави у Израиљу!
౧౪అప్పుడు అక్కడి స్త్రీలు “ఈ రోజు నీవు బంధువులు లేని దానిగా మిగిలిపోకుండా చేసిన యెహోవాకు స్తుతులు. ఆయన పేరు ఇశ్రాయేలీయుల్లో ప్రఖ్యాతి చెందుతుంది గాక.
15 Он ће ти утешити душу и биће потпора старости твојој, јер га роди снаха твоја која те љуби и која ти је боља него седам синова.
౧౫నిన్ను ప్రేమించి ఏడుగురు కొడుకుల కంటే మించిన నీ కోడలు వీణ్ణి కన్నది. ఇతడు నీ ప్రాణాన్ని ఉద్ధరిస్తాడు. వృద్ధాప్యంలో నిన్ను పోషిస్తాడు” అని నయోమితో చెప్పారు.
16 И узе Нојемина дете, и метну га на крило своје, и беше му дадиља.
౧౬అప్పుడు నయోమి ఆ బిడ్డను తన కౌగిట్లోకి తీసుకుని వాడికి సంరక్షకురాలు అయింది.
17 И суседе наденуше му име говорећи: Роди се син Нојемини, и прозваше га Овид. Он би отац Јесеја, оца Давидовог.
౧౭ఆమె ఇరుగు పొరుగు స్త్రీలు నయోమికి కొడుకు పుట్టాడని చెప్పి అతనికి ఓబేదు అని పేరు పెట్టారు. ఇతడు దావీదు తండ్రి అయిన యెష్షయికి తండ్రి.
18 А ово је племе Фаресово: Фарес роди Есрома;
౧౮పెరెసు వంశక్రమం ఇది. పెరెసు కుమారుడు హెస్రోను.
19 А Есром роди Арама; а Арам роди Аминадава;
౧౯హెస్రోను కుమారుడు రము. రము కుమారుడు అమ్మీనాదాబు.
20 А Аминадав роди Насона; а Насон роди Салмона;
౨౦అమ్మీనాదాబు కుమారుడు నయస్సోను. నయస్సోను కుమారుడు శల్మాను.
21 А Салмон роди Воза; а Воз роди Овида;
౨౧శల్మాను కుమారుడు బోయజు. బోయజు కుమారుడు ఓబేదు.
22 А Овид роди Јесеја; а Јесеј роди Давида.
౨౨ఓబేదు కుమారుడు యెష్షయి. యెష్షయి కుమారుడు దావీదు.

< Књига о Рути 4 >