< Псалми 26 >
1 Суди ми, Господе, јер у простоти својој ходим и у Господа се уздам; нећу се поколебати.
౧దావీదు కీర్తన. యెహోవా, నేను నిజాయితీగా నడుచుకున్నాను. నాకు న్యాయం తీర్చు. ఊగిసలాడకుండా యెహోవాలో నా నమ్మకం ఉంచాను.
2 Испитај ме, Господе, и искушај ме; претопи шта је у мени и срце моје.
౨యెహోవా, నన్ను పరిశీలించు. నన్ను పరీక్షించు. నా అంతరంగంలో, నా హృదయంలో ఉన్న స్వచ్ఛతను పరీక్షించు.
3 Јер је милост Твоја пред очима мојим, и ходим у истини Твојој.
౩నీ నిబంధన నమ్మకత్వం నా కళ్ళెదుట ఉంది. నీ సత్యంలో నేను నడుచుకుంటున్నాను.
4 Не седим с безумницима, и с лукавима се не мешам.
౪మోసగాళ్లతో నేను సాంగత్యం చెయ్యను. నిజాయితీ లేని వాళ్ళతో నేను కలిసి ఉండను.
5 Ненавидим друштво безаконичко, и с безбожницима не седим.
౫దుష్టుల గుంపు నాకు అసహ్యం, దుర్మార్గులతో నేను సహవాసం చెయ్యను.
6 Умивам правдом руке своје, и идем око жртвеника Твог, Господе,
౬నేను నిర్దోషిగా నా చేతులు కడుక్కుంటాను. యెహోవా, నేను నీ బలిపీఠం వైపు తిరుగుతాను.
7 Да разглашујем хвалу Твоју и казујем сва чудеса Твоја.
౭అక్కడ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. నీ ఆశ్చర్యకార్యాలు వివరిస్తాను.
8 Господе! Омилео ми је стан дома Твог, и место насеља славе Твоје.
౮నీ మహిమ నిలిచే స్థలం, యెహోవా, నువ్వు నివాసం ఉంటున్న నీ ఇల్లు నాకెంతో ఇష్టం.
9 Немој душу моју погубити, ни живот мој с крвопиоцима,
౯పాపులతో పాటు నా ప్రాణం, క్రూరులతో పాటు నా జీవం ఊడ్చి వేయకు.
10 Којима је злочинство у рукама, и којима је десница пуна мита.
౧౦వాళ్ళ చేతుల్లో ఒక కుట్ర ఉంది. వాళ్ళ కుడిచెయ్యి లంచాలతో నిండి ఉంది.
11 А ја ходим у простоти својој, избави ме, и смилуј се на ме.
౧౧కాని నా వరకైతే నేను నిజాయితీగా నడుచుకుంటాను. నన్ను విమోచించి నన్ను కరుణించు.
12 Нога моја стоји на правом путу; на скупштинама ћу благосиљати Господа.
౧౨చదునైన చోట నా పాదం నిలిపాను. సభలలో నేను యెహోవాను స్తుతిస్తాను.