< Књига пророка Наума 3 >
1 Тешко граду крвничком, сав је пун лажи и отимања, грабеж не избива из њега.
౧నరహత్య చేసిన పట్టణమా, నీకు బాధ తప్పదు. అది నిరంతరం అబద్ధాలతో దొంగిలించి తెచ్చిన వస్తువులతో నిండి ఉంది. దాని చేతుల్లో హతమైన వారు దానిలో ఉన్నారు.
2 Пуцају бичеви, и точкови праште, и коњи топоћу, и кола скачу.
౨రథసారధి చేసే కొరడా శబ్దం, రథ చక్రాల ధ్వని, గుర్రాల అడుగుల శబ్దం, వేగంగా పరిగెత్తే రథాల శబ్దం వినబడుతున్నాయి.
3 Коњаници поскакују, и мачеви се сјају, и копља севају, и мноштво је побијених и сила мртвих телеса, нема броја мртвацима, и пада се преко мртваца.
౩రౌతులు వేగంగా పరుగెత్తుతున్నారు, కత్తులు, ఈటెలు తళతళ మెరుస్తున్నాయి. శవాలు కుప్పలుగా పడి ఉన్నాయి. కూలిన శవాలకు లెక్కే లేదు, శవాలు కాళ్ళకు తగిలి దాడి చేసే వారు తొట్రుపడుతున్నారు.
4 За мноштво курварства љупке курве, веште бајачице, која продаје народе својим курвањем и племена врачањем својим.
౪ఇందుకు కారణం, అది మంత్ర విద్యలో ఆరితేరిన అందమైన వేశ్య జరిగించిన కామ క్రీడలే. ఆమె తన జారత్వంతో జాతులను అమ్మేసింది. తన ఇంద్రజాలంతో మనుషులను వశపరచుకుంది.
5 Ево ме на те, говори Господ над војскама, и узгрнућу ти скуте твоје на лице, и показаћу народима голотињу твоју и царствима срамоту твоју.
౫సేనల ప్రభువు యెహోవా చెప్పేదేమిటంటే “నేను నీకు విరోధిని. నీ బట్టలు నీ ముఖం పైకి ఎత్తి ప్రజలకు నీ మర్మాంగాలను చూపిస్తాను. రాజ్యాలకు నీ అవమానాన్ని బట్టబయలు చేస్తాను.
6 И бацићу на тебе гадове и наружићу те, и начинићу од тебе углед.
౬నీ ముఖంపై పెంట విసిరి చూసేవారు నిన్ను ఏవగించుకునేలా చేస్తాను.
7 И ко те год види, бежаће од тебе, и говориће: Опусте Ниневија; ко ће је жалити? Где ћу тражити оне који би те тешили?
౭అప్పుడు నిన్ను చూసేవారంతా నీ దగ్గర నుండి పారిపోతారు. ‘నీనెవె పాడైపోయింది. దాని కోసం ఎవరు విలపిస్తారు? నిన్ను ఓదార్చేవాళ్ళు ఎక్కడ దొరుకుతారు’ అంటారు.”
8 Јеси ли боља од Но-Амона, који лежаше међу рекама, опточен водом, коме предња кула беше море и зидови му беху море?
౮చుట్టూ నీటితో సముద్రాన్నే తనకు కావలిగా, సరిహద్దుగా చేసుకుని, నైలు నది దగ్గర ఉన్న తేబేసు పట్టణం కంటే నువ్వు గొప్పదానివా?
9 Јачина му беше хуска земља и Мисир и народи без броја; Футеји и Ливеји беху ти помоћници.
౯ఇతియోపియా, ఈజిప్టు దేశాలు దానికి అండ. పూతు, లిబియా దాని మిత్ర పక్షాలు.
10 И он би пресељен, отиде у ропство, и деца његова бише размрскана по угловима свих улица; и за главаре његове бацаше жреб, и сви властељи његови бише оковани у пута.
౧౦అయినప్పటికీ దాని నివాసులు బందీలయ్యారు. పురవీధుల్లో శత్రువులు దానిలోని చిన్నపిల్లలను బండలకు కొట్టి చంపారు. ప్రముఖుల మీద చీట్లు వేశారు, దాని ప్రధానులనందరినీ సంకెళ్లతో బంధించారు.
11 И ти ћеш се опити и крићеш се, и ти ћеш тражити заклон од непријатеља.
౧౧నీకు కూడా మత్తు ఎక్కుతుంది. నువ్వు దాక్కుంటావు. నీ మీదికి శత్రువు రావడం చూసి ఆశ్రయం కోసం వెదకుతావు.
12 Сви ће градови твоји бити као смокве с раним родом; кад се тресну, падају у уста ономе ко хоће да једе.
౧౨అయితే నీ కోటలన్నీ అకాలంలో పండిన కాయలున్న అంజూరపు చెట్లలాగా ఉన్నాయి. ఎవరైనా ఒకడు వాటిని ఊపితే చాలు, పండ్లు తిందామని వచ్చినవాడి నోట్లో పడతాయి.
13 Ето, народ су ти жене усред тебе; непријатељима ће твојим бити широм отворена врата од земље твоје, огањ ће прождрети преворнице твоје.
౧౩నీ నివాసులు స్త్రీల వంటి వారు. నీ దేశపు ద్వారాలు శత్రువులకు తెరిచి ఉన్నాయి. ద్వారాల అడ్డకర్రలు కాలిపోయాయి.
14 Нахватај себи воде за опсаду, утврди ограде своје; уђи у као и угази блато, оправи пећ за опеке.
౧౪వారు ముట్టడించే సమయానికి నీళ్లు చేదుకో. నీ కోటలను దిట్టపరచుకో. బంకమట్టిలోకి దిగి ఇటుకల కోసం బురద తొక్కు. కొలిమి సిద్ధం చేసుకో.
15 Онде ће те прождрети огањ, мач ће те исећи, изјешће те као хрушт; нека вас је много као хруштева, нека вас је много као скакаваца.
౧౫అక్కడే నిన్ను అగ్ని కాల్చివేస్తుంది. కత్తివాత పడి నువ్వు నాశనం అవుతావు. గొంగళిపురుగు తినివేసే విధంగా అది నిన్ను నాశనం చేస్తుంది. గొంగళిపురుగులంత విస్తారంగా, మిడతలంత విస్తారంగా నీ సంఖ్యను పెంచుకో.
16 Имаш трговаца више него што је звезда на небу; хруштеви падоше, па одлетеше.
౧౬నీ వర్తకుల సంఖ్య లెక్కకు ఆకాశ నక్షత్రాలకంటే ఎక్కువగా ఉన్నప్పటికీ వాళ్ళు మిడతల్లాగా వచ్చి దోచుకుని ఎగిరిపోతారు.
17 Главари су твоји као скакавци и војводе твоје као велики скакавци, који падају по плотовима кад је студено, а кад сунце гране, одлећу, и место им се не познаје где беху.
౧౭నీ వీరులు లెక్కకు మిడతలంత విస్తారంగా ఉన్నారు. నీ సేనానులు చలికాలంలో కంచెల్లో దిగిన మిడతల్లాగా ఉన్నారు. ఎండ కాసినప్పుడు అవన్నీ ఎగిరిపోతాయి. అవి ఎక్కడికి వెళ్లి వాలతాయో ఎవరికీ తెలియదు.
18 Задремаше твоји пастири, царе асирски, полегаше јунаци твоји, народ се твој распрша по горама, и нема никога да их збере.
౧౮అష్షూరు రాజా, నీ సంరక్షకులు నిద్రపోయారు. నీ ప్రధానులు విశ్రాంతిలో ఉన్నారు. నీ ప్రజలు పర్వతాల్లోకి చెదరిపోయారు. వారిని తిరిగి సమకూర్చేవాడు ఒక్కడు కూడా లేదు.
19 Нема лека полому твом, љута је рана твоја; ко год чује глас о теби, пљескаће рукама над тобом, јер кога није стизала злоћа твоја једнако?
౧౯నీకు తగిలిన దెబ్బ తీవ్రమైనది. నీ గాయాన్ని ఎవ్వరూ బాగు చెయ్యలేరు. నిన్ను గూర్చిన వార్త విన్న వాళ్ళంతా నీకు జరిగిన దానికి సంతోషంతో చప్పట్లు కొడతారు. ఎందుకంటే ప్రజలంతా నీచేత ఎడతెగకుండా హింసల పాలయ్యారు.