< Књига Исуса Навина 20 >

1 Потом рече Господ Исусу говорећи:
యెహోవా యెహోషువతో ఇలా చెప్పాడు,
2 Кажи синовима Израиљевим и реци: Одредите градове за уточишта, за које сам вам говорио преко Мојсија,
“నీవు ఇశ్రాయేలీయులతో ఈ విధంగా చెప్పాలి, తెలియక పొరపాటున ఎవరినైనా చంపిన హంతకుడు పారిపోడానికి నేను మోషే ద్వారా మీతో పలికించిన ఆశ్రయ పట్టణాలు మీరు ఏర్పరచుకోవాలి.
3 Да онамо утече крвник који убије кога нехотице, не мислећи, да вам буду уточишта од осветника.
హత్య విషయమై ప్రతిహత్య చేసేవాడు రాకుండా అవి మీకు ఆశ్రయ పట్టణాలవుతాయి.
4 Па кад ко утече у који од тих градова, нека стане пред вратима градским и нека каже старешинама оног града ствар своју, па нека га приме к себи, и дају му место да седи код њих.
ఒకడు ఆ పట్టణాల్లో ఒక దానికి పారిపోయి ఆ పట్టణ ద్వారం దగ్గర నిలబడి, ఆ పట్టణపు పెద్దలు వినేలా తన సంగతి చెప్పిన తరువాత, వారు పట్టణంలోకి అతనిని చేర్చుకుని తమ దగ్గర నివసించడానికి స్థలమివ్వాలి.
5 И ако дође за њим осветник, нека му не дају крвника у руке, јер је нехотице убио ближњег нити је пре мрзео на њега.
హత్య విషయంలో ప్రతి హత్య చేసేవాడు అతనిని తరిమితే అతని చేతికి ఆ నరహంతకుని అప్పగించకూడదు. ఎందుకంటే అతడు పొరపాటున తన పొరుగువాని చంపాడు గాని అంతకు మునుపు వాని మీద పగపట్టలేదు.
6 Него нека седи у граду оном докле не стане пред збор на суд, до смрти поглавара свештеничког који буде онда, тада нека се крвник врати и иде у свој град и својој кући, у град из ког је утекао.
అతడు సమాజం ముందు విచారణకు నిలబడే వరకూ, ఆ రోజుల్లో ఉన్న యాజకుడు చనిపోయే వరకూ ఆ పట్టణంలోనే నివసించాలి. తరువాత ఆ నరహంతకుడు ఏ పట్టణం నుండి పారిపోయాడో ఆ పట్టణంలోని తన ఇంటికి తిరిగి రావాలి.”
7 И оделише Кедес у Галилеји у гори Нефталимовој и Сихем у гори Јефремовој и Киријат-Арву, то је Хеврон, у гори Јудиној.
అప్పుడు వాళ్ళు గలిలీలోని నఫ్తాలి కొండ ప్రదేశంలో ఉన్న కెదెషు, ఎఫ్రాయిం కొండ ప్రదేశంలోని షెకెం, యూదా కొండ ప్రదేశంలోని హెబ్రోను అనే కిర్యతర్బాను ప్రతిష్ఠించారు.
8 А преко Јордана од Јерихона на исток одредише Восор у пустињи, у равни, од племена Рувимовог, и Рамот у Галаду од племена Гадовог, и Голан у Васану од племена Манасијиног.
తూర్పు వైపున యొర్దాను అవతల యెరికో దగ్గర రూబేను గోత్రం నుండి మైదానం మీద ఉన్న అరణ్యంలోని బేసెరు, గాదు గోత్రం నుండి గిలాదు లోని రామోతు, మనష్షే గోత్రం నుండి బాషానులోని గోలానులను నియమించారు.
9 То су градови одређени свим синовима Израиљевим и дошљаку који живи међу њима, да побегне код њих ко год убије кога нехотице и да не погине од руке осветникове док не стане пред збор.
పొరపాటున ఒకడి చంపినవాడు అక్కడికి పారిపోయి హత్యవిషయమై ప్రతిహత్య చేసేవాడు చంపకుండా ఉండేలా సమాజం ముందు నిలబడే వరకూ ఇశ్రాయేలీయులందరికీ వారిమధ్య నివసించే పరదేశులకూ నియమించిన పట్టణాలు ఇవి.

< Књига Исуса Навина 20 >