< Књига о Јову 3 >

1 Потом отвори уста своја Јов и стаде клети дан свој.
ఆ తరువాత యోబు మాట్లాడడం మొదలుపెట్టాడు. తాను పుట్టిన దినాన్ని శపించాడు.
2 И проговоривши Јов рече:
యోబు ఇలా అన్నాడు.
3 Не било дана у који се родих, и ноћи у којој рекоше: Роди се детић!
నేను పుట్టిన రోజు లేకుండా ఉంటే బాగుండేది. “మగ పిల్లవాడు పుట్టాడు” అని చెప్పే రాత్రి సమయం లేకపోయినట్టయితే బాగుండేది. నా తల్లి గర్భాన్ని ఆ రోజు మూసి ఉంచితే బాగుండేది. ఆ రోజు నా కళ్ళకు బాధను మరుగు చేయలేకపోయింది.
4 Био тај дан тама, не гледао га Бог озго, и не осветљавала га светлост!
ఆ రోజు చీకటిమయం కావాలి. దాని మీద వెలుగు ప్రకాశించకూడదు. పైన ఉన్న దేవుడు ఆ రోజును లెక్కించకూడదు.
5 Мрак га запрзнио и сен смртни, облак га обастирао, био страшан као најгори дани!
చీకటి, గాఢాంధకారం మళ్ళీ దాన్ని తమ దగ్గరికి తీసుకోవాలి. దాన్ని మేఘాలు ఆవరించాలి. పగటివేళ చీకటి కమ్మినట్టు దానికి భయాందోళన కలగాలి.
6 Ноћ ону освојила тама, не радовала се међу данима годишњим, не бројала се у месеце!
కటిక చీకటి ఆ రాత్రిని ఒడిసి పట్టాలి. సంవత్సరం రోజుల్లో నేనూ ఒకదాన్నని అది చెప్పుకోకుండా ఉండాలి. ఏ నెలలోనూ అది భాగం కాకూడాదు.
7 Гле, ноћ она била пуста, певања не било у њој!
ఆ రాత్రి ఎవ్వరూ పుట్టకపోతే బాగుండేది. అప్పుడు ఎవ్వరూ హర్ష ధ్వానాలు చెయ్యకపోతే బాగుండేది.
8 Клели је који куну дане, који су готови пробудити крокодила!
శపించేవాళ్ళు ఆ రోజును శపించాలి. సముద్ర రాక్షసిని రెచ్చగొట్టే వాళ్ళు దాన్ని శపించాలి.
9 Потамнеле звезде у сумрачје њено, чекала видело и не дочекала га, и не видела зори трепавица;
ఆ దినాన సంధ్యవేళలో ప్రకాశించే నక్షత్రాలకు చీకటి కమ్మాలి. వెలుగు కోసం అది ఎదురు చూసినప్పుడు వెలుగు కనబడకూడదు.
10 Што ми није затворила врата од утробе и није сакрила муку од мојих очију.
౧౦అది ఉదయ సూర్య కిరణాలు చూడకూడదు. పుట్టిన వెంటనే నేనెందుకు చనిపోలేదు?
11 Зашто не умрех у утроби? Не издахнух излазећи из утробе?
౧౧తల్లి గర్భం నుండి బయటపడగానే నా ప్రాణం ఎందుకు పోలేదు?
12 Зашто ме прихватише кољена? Зашто сисе, да сем?
౧౨నన్నెందుకు మోకాళ్ల మీద పడుకోబెట్టుకున్నారు? నేనెందుకు తల్లి పాలు తాగాను?
13 Јер бих сада лежао и почивао; спавао бих, и био бих миран,
౧౩లేకపోతే ఇప్పుడు నేను పడుకుని ప్రశాంతంగా ఉండేవాణ్ణి. నేను చనిపోయి విశ్రాంతిగా ఉండేవాణ్ణి.
14 С царевима и саветницима земаљским, који зидаше себи пустолине,
౧౪శిథిలమైపోయిన భవనాలు తిరిగి కట్టించుకునే భూరాజుల్లాగా, మంత్రుల్లాగా నేను కూడా చనిపోయి ప్రశాంతంగా ఉండేవాణ్ణి.
15 Или с кнезовима, који имаше злата, и куће своје пунише сребра.
౧౫బంగారం సంపాదించుకుని, తమ ఇంటినిండా వెండిని నింపుకున్న అధికారుల్లాగా నేను కన్నుమూసి ఉండేవాణ్ణి.
16 Или зашто не бих као недоношче сакривено, као дете које не угледа видела?
౧౬భూమిలో పాతిపెట్టబడిన పిండంలాగా వెలుగు చూడని పసికందులాగా నాకిప్పుడు ఉనికి ఉండేది కాదు.
17 Онде безбожници престају досађивати, и онде почивају изнемогли,
౧౭అక్కడ దుర్మార్గులు ఇక బాధపెట్టరు, బలహీనులై అలసిన వారు విశ్రాంతి పొందుతారు.
18 И сужњи се одмарају и не чују глас настојников.
౧౮అక్కడ బంధితులైన వారు కలసి విశ్రమిస్తారు. వాళ్ళ చేత పనులు చేయించేవాళ్ళ ఆజ్ఞలు వాళ్లకు వినిపించవు.
19 Мали и велики онде је, и роб слободан од свог господара.
౧౯పేదవారు, గొప్పవారు అంతా అక్కడ ఉన్నారు. దాసులు తమ యజమానుల చెర నుండి తప్పించుకుని స్వతంత్రులయ్యారు.
20 Зашто се даје видело невољнику и живот онима који су тужног срца,
౨౦దుర్దశలో ఉన్నవారికి వెలుగు ఎందుకు? దుఃఖాక్రాంతులైన వారికి జీవం ఎందుకు?
21 Који чекају смрт а ње нема, и траже је већма него закопано благо,
౨౧వారు మరణం కోరుకుంటారు. దాచిపెట్టిన నిధి కోసం వాళ్ళు లోతుగా తవ్వుతున్నారు గాని అది వారికి దొరకడం లేదు.
22 Који играју од радости и веселе се кад нађу гроб?
౨౨వాళ్ళు సమాధికి చేరినప్పుడు వారు ఆనందిస్తారు, ఎంతో సంబరపడతారు.
23 Човеку, коме је пут сакривен и ког је Бог затворио одсвуда?
౨౩మార్గం కనుగొనలేని వాడికి, దేవుడు చుట్టూ కంచె వేసిన వాడికి జీవం ఎందుకు?
24 Јер пре јела мог долази уздах мој, и као вода разлива се јаук мој.
౨౪భోజనం చేయడానికి బదులు నాకు నిట్టూర్పులు కలుగుతున్నాయి. నేను చేసే ఆక్రందనలు నీళ్లలాగా పారుతున్నాయి.
25 Јер чега се бојах дође на мене, и чега се страшах задеси ме.
౨౫ఏమి జరుగుతుందని నేను భయపడ్డానో అదే నాకు జరిగింది. నేను భయపడినదే నా మీదికి వచ్చింది.
26 Не почивах нити имах мира нити се одмарах, и опет дође страхота.
౨౬నాకు శాంతి లేదు, సుఖం లేదు, విశ్రాంతి లేదు. వీటికి బదులు కష్టాలే వచ్చాయి.

< Књига о Јову 3 >