< Књига пророка Јеремије 40 >

1 Реч која дође Јеремији од Господа кад га Невузардан заповедник стражарски пусти из Раме узевши га пошто беше окован у вериге међу свим робљем јерусалимским и Јудиним, које се вођаше у Вавилон.
రాజదేహ సంరక్షకుల అధిపతి అయిన నెబూజరదాను యెరూషలేములో నుంచి, యూదాలో నుంచి బబులోనుకు బందీలుగా తీసుకెళ్ళిన ప్రజలందరి దగ్గర నుంచి, సంకెళ్లతో బంధించి ఉన్న యిర్మీయాను రమా నుంచి పంపించేసినప్పుడు యెహోవా నుంచి అతనికి వచ్చిన వాక్కు.
2 И узевши заповедник стражарски Јеремију рече му: Господ Бог твој изрече ово зло за ово место;
రాజదేహ సంరక్షకుల అధిపతి యిర్మీయాను పక్కకు తీసుకెళ్ళి, అతనితో “ఈ స్థలానికి ఈ విపత్తు తెస్తానని నీ దేవుడైన యెహోవా ప్రకటించాడు గదా,
3 И нанесе и учини како рече, јер згрешисте Господу и не слушасте глас Његов, зато вас снађе ово.
తాను చెప్పిన ప్రకారం యెహోవా ఆ విపత్తు రప్పించాడు. మీరు యెహోవాకు విరోధంగా పాపం చేసి ఆయన మాటలు వినలేదు కాబట్టి ఆయన చెప్పినట్టే చేశాడు. అందుకే మీకు ఇలా జరిగింది.
4 Али сада, ево, ја те опраштам данас верига што су ти на рукама; ако ти је воља поћи са мном у Вавилон, ходи, ја ћу се бринути за те; ако ли ти није воља поћи са мном у Вавилон, а ти немој; ево, сва ти је земља отворена, иди куда год хоћеш и куда ти је драго.
కాని ఇప్పుడు చూడు! ఈ రోజు నేను నీ చేతుల సంకెళ్లను తీసి నిన్ను విడిపించాను. నాతోబాటు బబులోను రావడం మంచిదని నీకు అనిపిస్తే నాతో రా. నేను నీ గురించి జాగ్రత్త తీసుకుంటాను. అయితే మంచిది కాదనిపిస్తే రావద్దు. దేశమంతా నీ ఎదుట ఉంది. ఎక్కడికి వెళ్ళడం నీ దృష్టికి అనుకూలమో అక్కడికి వెళ్ళు.”
5 Или кад се он још не враћа, отиди к њему, Годолији сину Ахикама, сина Сафановог, ког је поставио цар вавилонски над градовима Јудиним, и остани с њим међу народом, или иди куда ти је драго. И даде му заповедник стражарски брашњенице и дар, и отпусти га.
యిర్మీయా ఏ జవాబూ చెప్పకుండా ఉన్నప్పుడు, నెబూజరదాను అతనితో ఇలా అన్నాడు. “షాఫాను కొడుకైన అహీకాము కొడుకు గెదల్యాను యూదా పట్టణాల మీద అధికారిగా బబులోను రాజు నియమించాడు. అతని దగ్గరికి వెళ్లు. అతనితో ఉంటూ, ప్రజల మధ్య నివాసం ఉండు. లేదా, ఎక్కడికి వెళ్ళడం నీ దృష్టికి అనుకూలమో అక్కడికే వెళ్లు.” అప్పుడు రాజదేహ సంరక్షకుల అధిపతి అతనికి ఆహారం, ఒక బహుమానం ఇచ్చి పంపించాడు.
6 И тако дође Јеремија ка Годолији, сину Ахикамовом у Миспу, и оста с њим у народу, који још оста у земљи.
యిర్మీయా మిస్పాలో ఉన్న అహీకాము కొడుకు గెదల్యా దగ్గరికి వెళ్లి అతనితోబాటు దేశంలో మిగిలిన ప్రజల మధ్య కాపురం ఉన్నాడు.
7 А све војводе што беху у пољу и људи њихови кад чуше да је цар вавилонски поставио Годолију, сина Ахикамовог, над земљом, и да је на њему оставио људе и жене и децу између сиромашног народа у земљи, који не би одведен у Вавилон,
ఇప్పుడు, అక్కడ పల్లెటూళ్ళల్లో ఉన్న కొంతమంది యూదయ సేనల అధిపతులూ, వారి మనుషులూ, బబులోను రాజు అహీకాము కొడుకు గెదల్యాను దేశం మీద అధికారిగా నియమించాడనీ, బబులోనుకు బందీలుగా వెళ్ళకుండా అక్కడే మిగిలిన వాళ్ళలో ఉన్న స్త్రీలను, పురుషులను, పిల్లలను, దేశంలోని నిరుపేదలను అతనికి అప్పగించాడనీ విన్నారు.
8 Дођоше у Миспу ка Годолији Исмаило син Нетанијин и Јоанан и Јонатан синови Каријини, и Сераја син Тануметов и синови Јофије Нетофаћанина, и Језанија син неког Махаћанина, они и људи њихови.
కాబట్టి నెతన్యా కొడుకు ఇష్మాయేలు, కారేహ కొడుకులైన యోహానాను, యోనాతాను, తన్హుమెతు కొడుకు శెరాయా, నెటోపాతీయుడైన ఏపయి కొడుకులు, మాయకాతీయుడి కొడుకు యెజన్యా, వాళ్ళ మనుషులు, మిస్పాలో ఉన్న గెదల్యా దగ్గరికి వచ్చారు.
9 И закле се Годолија син Ахикама сина Сафановог њима и људима њиховим говорећи: Не бојте се службе Халдејцима; останите у земљи, и служите цару вавилонском, и добро ће вам бити.
అప్పుడు షాఫాను కొడుకు అహీకాము కొడుకు గెదల్యా ప్రమాణంచేసి వాళ్ళతోనూ, వాళ్ళ మనుషులతోనూ ఇలా అన్నాడు. “మీరు కల్దీయులను సేవించడానికి భయపడవద్దు. దేశంలో కాపురం ఉండి, బబులోను రాజును సేవిస్తే మీకు మేలు కలుగుతుంది.
10 А ја ево ћу стајати у Миспи да дочекујем Халдејце који ће долазити к нама; а ви берите винограде и воће и уље, и остављајте у судове своје, и стојте у градовима својим које држите.
౧౦చూడండి, మన దగ్గరికి వచ్చే కల్దీయులను కలుసుకోడానికి నేను మిస్పాలో కాపురం ఉంటున్నాను. కాబట్టి ద్రాక్షారసం తయారుచేసుకోండి. వేసవికాల ఫలాలు, నూనె సమకూర్చుకుని, పాత్రల్లో నిల్వ చేసుకోండి. మీరు స్వాధీనం చేసుకున్న పట్టణాల్లో నివాసం ఉండండి.”
11 Тако и сви Јудејци, који беху међу Моавцима и синовима Амоновим и Едомцима и по свим земљама, чувши да је цар вавилонски оставио остатак у Јудеји и поставио над њима Годолију сина Ахикама сина Сафановог,
౧౧మోయాబులో, అమ్మోనీయుల ప్రజల మధ్య, ఎదోములో, ఇంకా మిగతా ప్రదేశాలన్నిటిలో ఉన్న యూదులందరూ, బబులోను రాజు యూదయలో కొంతమంది ప్రజలను విడిచిపెట్టాడనీ, షాఫాను కొడుకు అహీకాము కొడుకైన గెదల్యాను వాళ్ళ మీద అధికారిగా నియమించాడని విన్నారు.
12 Вратише се сви Јудејци из свих места куда беху разагнани, и дођоше у земљу Јудину ка Годолији у Миспу, и набраше вина и воћа врло много.
౧౨కాబట్టి యూదయ వాళ్ళందరూ తాము చెదిరిపోయి ఉన్న స్థలాలన్నిటినీ విడిచి, గెదల్యా దగ్గరికి మిస్పా తిరిగి వచ్చారు. వాళ్ళు ద్రాక్షారసం, వేసవికాలపు ఫలాలు అత్యంత సమృద్ధిగా సమకూర్చుకున్నారు.
13 А Јоанан, син Каријин и све војводе што беху у пољу дођоше ка Годолији у Миспу,
౧౩కారేహ కొడుకు యోహానాను, పల్లెటూళ్ళల్లో నున్న సేనల అధిపతులందరూ మిస్పాలో ఉన్న గెదల్యా దగ్గరికి వచ్చి,
14 И рекоше му: Знаш ли да је Валис цар синова Амонових послао Исмаила сина Нетанијиног да те убије? Али им не поверова Годолија, син Ахикамов.
౧౪“నిన్ను చంపడానికి అమ్మోనీయుల రాజైన బయలీను నెతన్యా కొడుకు ఇష్మాయేలును పంపాడని నీకు తెలియదా?” అన్నారు. కాని, అహీకాము కొడుకు గెదల్యా వాళ్ళ మాట నమ్మలేదు.
15 Тада Јоанан, син Каријин, рече Годолији насамо у Миспи говорећи: Идем да убијем Исмаила сина Нетанијиног, нико неће дознати. Зашто да те убије и да се расеју сви Јудејци који су се скупили око тебе и да пропадне остатак Јудин?
౧౫కారేహ కొడుకు యోహానాను మిస్పాలో గెదల్యాతో ఏకాంతంగా “నెతన్యా కొడుకు ఇష్మాయేలును నేను చంపుతాను. నన్ను ఎవరూ అనుమానించరు. అతడు నిన్నెందుకు చంపాలి? నీ దగ్గరికి కూడివచ్చిన యూదులందరూ ఎందుకు చెదిరిపోవాలి? మిగిలిన ప్రజలందరూ ఎందుకు నాశనం కావాలి?” అన్నాడు.
16 Али Годолија, син Ахикамов, рече Јоанану сину Каријином: Немој то чинити, јер није истина шта кажеш за Исмаила.
౧౬కాని అహీకాము కొడుకు గెదల్యా, కారేహ కొడుకు యోహానానుతో “నువ్వు ఈ పని చెయ్యొద్దు. ఎందుకంటే నువ్వు ఇష్మాయేలు గురించి అబద్ధాలు చెబుతున్నావు” అన్నాడు.

< Књига пророка Јеремије 40 >