< Књига пророка Јеремије 27 >
1 У почетку царовања Јоакима сина Јосијиног цара Јудиног дође ова реч Јеремији од Господа говорећи:
౧యూదా రాజు యోషీయా కొడుకు యెహోయాకీము పరిపాలించడం మొదలు పెట్టినపుడు యెహోవా దగ్గరనుంచి ఈ సందేశం యిర్మీయాకు వచ్చింది.
2 Овако ми рече Господ: Начини себи свезе и јарам, и метни себи око врата.
౨యెహోవా నాకు ఇలా చెప్పాడు “నువ్వు కాడి, బేడీలూ చేయించుకుని నీ మెడకు కట్టుకో.
3 По том пошљи их цару едомском и цару моавском и цару синова Амонових и цару тирском и цару сидонском, по посланицима који ће доћи у Јерусалим к Седекији цару Јудином.
౩ఎదోం, మోయాబు, అమ్మోను, తూరు, సీదోను దేశాల రాజుల దగ్గర నుంచి యూదా రాజు సిద్కియా దగ్గరికి యెరూషలేముకు రాయబారులు వచ్చారు.
4 И наручи им нека кажу својим господарима: Овако вели Господ над војскама Бог Израиљев: овако реците својим господарима:
౪ఆ రాయబారులు తమ యజమానులకు తెలియచేయాలని ఈ ఆజ్ఞ వారితో చెప్పు, సేనల ప్రభువు ఇశ్రాయేలు దేవుడు చెప్పేదేమిటంటే, మీరు మీ యజమానులకు ఈ విషయం తెలియజేయండి.
5 Ја сам створио земљу и људе и стоку, што је по земљи, силом својом великом и мишицом својом подигнутом; и дајем је коме ми је драго.
౫‘నా గొప్ప బలంతో చాచిన చేతితో భూమిని చేశాను. భూమి మీద ఉన్న మట్టినీ జంతువులనూ నేనే చేశాను. వాటిని నా దృష్టిలో ఎవరు సరిగా ఉన్నారో వారికే ఇస్తాను.
6 И сада ја дадох све те земље у руке Навуходоносору цару вавилонском слузи свом, дадох му и зверје пољско да му служи.
౬ఇప్పుడు దేశాలన్నిటినీ నా సేవకుడూ బబులోను రాజు అయిన నెబుకద్నెజరుకు ఇస్తున్నాను. భూమి మీద తిరిగే జంతువులను కూడా అతణ్ణి సేవించడానికి ఇస్తున్నాను.
7 И сви ће народи служити њему и сину његовом и унуку његовом докле дође време и његовој земљи, и велики народи и силни цареви покоре га.
౭అతని స్వదేశానికి అంతం వచ్చే వరకూ రాజ్యాలన్నీ అతనికీ అతని కొడుకుకీ అతని మనుమడికీ సేవ చేస్తారు. ఆ తర్వాత అనేక రాజ్యాలూ గొప్ప రాజులూ అతనికి వ్యతిరేకంగా పనిచేస్తారు.
8 А који народ или царство не би хтео служити Навуходоносору цару вавилонском, и не би хтео савити врата свог у јарам цара вавилонског, такав ћу народ походити мачем и глађу и помором, говори Господ, докле их не истребим руком његовом.
౮ఏ దేశం, ఏ రాజ్యం బబులోను రాజు నెబుకద్నెజరు సేవ చేయదో, బబులోను రాజు కాడిని తన మెడ మీద పెట్టుకోదో ఆ దేశాన్ని నేను శిక్షిస్తాను. అతని చేత బొత్తిగా నాశనం చేయించే వరకూ ఆ దేశాన్ని కత్తితో కరువుతో అంటు రోగాలతో శిక్షిస్తాను.’ ఇది యెహోవా వాక్కు.
9 Не слушајте дакле пророка својих ни врача својих ни сањача својих ни гатара својих ни бајача својих, који вам говоре и веле: Нећете служити цару вавилонском.
౯కాబట్టి ‘మీరు బబులోను రాజుకు సేవ చేయవద్దు’ అని మీ ప్రవక్తలూ సోదెగాళ్ళూ, కలల అర్థం చెప్పేవాళ్ళూ, శకునాలు చూసేవాళ్ళూ, మాంత్రికులూ చెబుతుంటే వినొద్దు.
10 Јер вам они лаж пророкују, како бих вас далеко одвео из земље ваше и изагнао вас да изгинете.
౧౦మిమ్మల్ని మీ దేశం నుంచి దూరంగా పంపించడానికి వాళ్ళు అబద్ధ ప్రవచనాలు మీకు ప్రకటిస్తున్నారు. నేను మిమ్మల్ని వెళ్లగొడతాను. మీరు నాశనమవుతారు.
11 А народ који би савио врат свој под јарам цара вавилонског и служио му, оставићу га на земљи његовој, говори Господ, да је ради и станује у њој.
౧౧అయితే ఏ ప్రజలు బబులోను రాజు కాడి కిందికి తమ మెడను వంచి అతనికి సేవ చేస్తారో ఆ ప్రజలను తమ దేశంలో నెమ్మదితో ఉండనిస్తాను. వాళ్ళు తమ భూమిని సాగుచేసుకుంటూ దానిలోనే కాపురముంటారు.” ఇది యెహోవా వాక్కు.
12 И Седекији цару Јудином рекох све ово говорећи: Савијте врат свој под јарам цара вавилонског и служите њему и народу његовом, па ћете остати живи.
౧౨నేను యూదా రాజు సిద్కియాతో మాట్లాడి ఈ విషయం చెప్పాను. “బబులోను రాజు కాడిని మీ మెడ మీద పెట్టుకుని, అతనికీ అతని ప్రజలకూ సేవ చేస్తే మీరు బతుకుతారు.
13 Зашто да погинете ти и народ твој од мача и од глади и од помора, како рече Господ за народ који не би служио цару вавилонском?
౧౩బబులోను రాజుకు సేవ చేయని ప్రజలు కత్తితో గానీ కరువుతో గానీ అంటురోగాలతోగానీ చస్తారు అని యెహోవా ఆజ్ఞ ఇచ్చాడు. నువ్వు, నీ ప్రజలు అలా ఎందుకు చావాలి?
14 Не слушајте, дакле, шта говоре пророци који вам кажу и веле: Нећете служити цару вавилонском, јер вам они пророкују лаж.
౧౪కాబట్టి ‘మీరు బబులోను రాజుకు సేవ చేయవద్దు’ అని మీతో చెప్పే ప్రవక్తలు అబద్దమే ప్రవచిస్తున్నారు. నేను వాళ్ళను పంపలేదు, వాళ్ళ మాటలు వినవద్దు.” ఇది యెహోవా వాక్కు.
15 Јер их ја нисам послао, говори Господ, него лажно пророкују у моје име, како бих вас прогнао да изгинете и ви и пророци који вам пророкују.
౧౫“మిమ్మల్ని మీ దేశం నుంచి దూరంగా పంపించడానికి వాళ్ళు అబద్ధ ప్రవచనాలు మీకు ప్రకటిస్తున్నారు. నేను మిమ్మల్ని వెళ్లగొడతాను. మీరూ మీకు ప్రవచించే మీ ప్రవక్తలు నాశనమవుతారు.”
16 И свештеницима и свему народу говорих и рекох: Овако вели Господ: не слушајте шта говоре ваши пророци који вам пророкују говорећи: Ево, посуђе дома Господњег вратиће се из Вавилона скоро. Јер вам они пророкују лаж.
౧౬యాజకులతో ప్రజలందరితో నేను ఈ మాటలు చెప్పాను. “యెహోవా చెప్పేదేమిటంటే, ‘యెహోవా మందిరపు పాత్రలను ఇప్పుడే త్వరగా బబులోను నుంచి మళ్ళీ తీసుకురావడం జరుగుతుంది.’ అని ప్రవచించే మీ ప్రవక్తలు మీతో అబద్ధాలు చెబుతున్నారు.
17 Не слушајте их; служите цару вавилонском, и остаћете живи; зашто тај град да опусти?
౧౭వాళ్ళ మాటలు వినవద్దు. బబులోను రాజుకు సేవ చేస్తే మీరు బతుకుతారు. ఈ పట్టణం ఎందుకు పాడైపోవాలి?
18 Ако ли су пророци и ако је реч Господња у њих, нека моле Господа над војскама да судови што су остали у дому Господњем и у дому цара Јудиног и у Јерусалиму не отиду у Вавилон.
౧౮వాళ్ళు ప్రవక్తలైతే యెహోవా సందేశం వాళ్ళతో ఉంటే యెహోవా మందిరంలో యూదా రాజు మందిరంలో యెరూషలేములో మిగిలిన పాత్రలు బబులోనుకు తరలి పోకుండా వాళ్ళు సేనల ప్రభువు యెహోవాను బతిమాలుకోవడం మంచిది.”
19 Јер овако вели Господ над војскама за ступове и за море и за подножја и за друге судове што су остали у том граду,
౧౯బబులోను రాజు నెబుకద్నెజరు యెరూషలేములోనుంచి యెహోయాకీము కొడుకు యెకొన్యాను యూదా యెరూషలేముల ప్రధానులందరినీ బబులోనుకు బందీలుగా తీసుకుపోయినప్పుడు,
20 Којих не узе Навуходоносор цар вавилонски кад одведе у ропство Јехонију сина Јоакимовог, цара Јудиног, из Јерусалима у Вавилон, и све главаре Јудине и јерусалимске;
౨౦అతడు విడిచి పెట్టిన స్థంభాలు, సముద్రం, పీఠాలు, ఈ పట్టణంలో మిగిలిన పాత్రలను గురించి సేనల ప్రభువు యెహోవా ఇలా సెలవిస్తున్నాడు.
21 Јер овако вели Господ над војскама, Бог Израиљев, за судове што осташе у дому Господњем и у дому цара Јудиног у Јерусалиму:
౨౧యెహోవా మందిరంలో యూదా రాజు రాజ భవనంలో యెరూషలేములోని మిగిలిన పాత్రలను గురించి ఇశ్రాయేలు దేవుడు సేనల అధిపతి అయిన యెహోవా ఇలా సెలవిస్తున్నాడు,
22 У Вавилон ће се однети и онде ће бити до дана кад ћу их походити, вели Господ, кад ћу их донети и вратити на ово место.
౨౨“వాటిని బబులోనుకు తెస్తారు. నేను వాటి కోసం అక్కడికి వెళ్ళే రోజు వరకు అవి అక్కడే ఉంటాయి. అప్పుడు నేను వాటిని మళ్ళీ తెప్పించి ఈ స్థలంలో ఉంచుతాను. ఇది యెహోవా వాక్కు.”