< Књига пророка Осије 7 >

1 Кад лечим Израиља, тада се показује безакоње Јефремово и злоћа самаријска; јер чине лаж, и лупеж улази, и напољу удара чета.
నేను ఇశ్రాయేలును బాగు చేద్దామని కోరినప్పుడల్లా ఎఫ్రాయిము దోషం కనిపిస్తూ ఉంది. షోమ్రోను దుష్కార్యాలు బయటపడుతున్నాయి. వారు మోసం అభ్యాసం చేస్తారు. దొంగతనానికి చొరబడతారు. బంది పోటు దొంగల్లా వీధుల్లో దోచుకుంటారు.
2 И не говоре у срцу свом да ја памтим свако безакоње њихово; сада стоје око њих дела њихова, преда мном су.
తమ క్రియలు వారి చుట్టూ ఉన్నప్పటికీ, అవి నా ఎదుటనే జరిగినప్పటికీ, వారి దుర్మార్గత నేను జ్ఞాపకం చేసుకోనని తమలో తాము అనుకుంటారు.
3 Неваљалством својим веселе цара и лажима својим кнезове.
వారి దుష్టత్వానికి, వారి అధికారుల అబద్ధాలకు వారి రాజు సంతోషిస్తాడు.
4 Сви чине прељубу; као пећ су коју ужари хлебар, који престане стражити кад замеси тесто па докле ускисне.
వారంతా కాముకులే. రొట్టెలు కాల్చే వాడు ముద్ద పిసికిన తరువాత. ముద్దంతా పొంగే దాకా పొయ్యిని బాగా వేడిచేసి. ఊరుకున్నట్టు వారంతా కాముకులే.
5 На дан цара нашег разболеше се кнезови од меха вина, и он пружи руку своју подсмевачима.
మన రాజు ఉత్సవ దినాన అధికారులు అతని ద్రాక్షారసం కాకతో మత్తెక్కి జబ్బుపడిపోయారు. రాజు తానే అపహాసకులతో చెయ్యి కలిపాడు.
6 Јер на заседе своје управљају срце своје, које је као пећ; хлебар њихов спава целу ноћ, ујутру гори као пламен огњени.
పొయ్యి లాంటి తమ హృదయాలతో కపటపు ఆలోచనలు చేస్తారు. వారి క్రోధం రాత్రంతా మండుతూనే ఉంటుంది. ఉదయాన అది తీవ్రమైన జ్వాలగా మండుతుంది.
7 Сви су као пећ угрејани и прождиру своје судије; сви цареви њихови падају, ниједан између њих не виче к мени.
వారంతా పొయ్యిలాగా కాలుతూ ఉంటారు. తమపై పరిపాలన చేసే వారిని వారు మింగేస్తారు. వారి రాజులంతా కూలిపోయారు. నన్ను స్మరించే వాడు ఒక్కడు కూడా లేడు.
8 Јефрем се помешао с народима; Јефрем је погача непреврнута.
ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయాడు. ఎఫ్రాయిము రెండో వైపుకు తిప్పని అట్టు వంటి వాడయ్యాడు.
9 Иностранци једу му силу, а он не зна; седе косе попадају га, а он не зна.
పరాయి వారు అతని బలాన్ని మింగేసినా అది అతనికి తెలియలేదు. తలమీద నెరసిన జుట్టు కనబడుతున్నా అది అతనికి తెలియదు.
10 И поноситост Израиљева сведочи му у очи, али се не враћају ка Господу Богу свом нити Га траже уза све то.
౧౦ఇశ్రాయేలువారి ప్రతిష్టే అతని మీద సాక్ష్యం పలుకుతుంది. ఇంత జరిగినా వారు తమ దేవుడైన యెహోవా వైపు తిరుగడం లేదు. ఆయనను వెతకడం లేదు.
11 И Јефрем је као голуб, луд, безуман; зову Мисир, иду у Асирску.
౧౧ఎఫ్రాయిము బుద్ధిలేని పిరికి గుండె గల గువ్వ అయిపోయింది. అది ఐగుప్తీయులను పిలుస్తుంది. తరువాత అష్షూరీయుల దగ్గరికి ఎగిరిపోతుంది.
12 Кад отиду, разапећу на њих мрежу своју, као птице небеске свући ћу их, караћу их како је казивано у збору њиховом.
౧౨వారు వెళ్ళినప్పుడు నేను వారిపై నా వల వేస్తాను. పక్షులను కొట్టినట్టు వారిని పడగొడతాను. వారు గుమిగూడిన చోట వారిని శిక్షిస్తాను.
13 Тешко њима, јер зађоше од мене; погибао ће им бити, јер ме изневерише; ја их искупих, а они говорише на ме лаж.
౧౩వారికి బాధ! వారు నన్ను విడిచిపెట్టి తప్పిపోయారు. వినాశం వారి మీదికి ముంచుకు వస్తోంది. వారు నా మీద తిరుగుబాటు చేశారు. వారిని రక్షించేవాడినే. కానీ వారు నా మీద అబద్ధాలు చెప్పారు.
14 Нити ме призиваше из срца свог, него ридаше на одрима својим; жита и вина ради скупљајући се одступају од мене.
౧౪హృదయ పూర్వకంగా నన్ను బతిమాలుకోలేదు గానీ. మంచాల మీద పడుకుని ఆక్రోశిస్తారు. ధాన్యం, కొత్త సారాయి కావాలని తమను కత్తితో గాయపరచుకుంటారు. కానీ నా నుండి దూరంగా వెళ్ళిపోతారు.
15 Кад их карах, укрепих им мишице; али они мислише зло на ме.
౧౫నేను వారి చేతులు బలపరచి శిక్షణ ఇచ్చినా వారు నా మీద కుట్రలు చేస్తారు.
16 Враћају се, али не ка Вишњем, посташе као лук лажљив; кнезови ће њихови попадати од мача с обести језика свог; то ће им бити подсмех у земљи мисирској.
౧౬వారు తిరిగి వస్తారు గానీ, సర్వోన్నతుని దేవుని వైపుకు తిరగరు. వారు పనికిరాని విల్లులాగా ఉన్నారు. వారి అధికారులు తాము పలికిన గర్వపు మాటల మూలంగా కత్తి పాలవుతారు. ఇలా వారు ఐగుప్తుదేశంలో ఎగతాళికి గురి అవుతారు.

< Књига пророка Осије 7 >