< Књига пророка Језекиља 30 >

1 Опет ми дође реч Господња говорећи:
యెహోవా నాకీ విషయం తెలియచేశాడు.
2 Сине човечји пророкуј и реци: Овако вели Господ Господ: Ридајте: Јаох дана!
“నరపుత్రుడా, ప్రవచిస్తూ ఇలా చెప్పు, యెహోవా ప్రభువు తెలియజేసేది ఏమిటంటే, ‘అయ్యో! రాబోతున్న ఆ రోజు ఎంత భయంకరం.’
3 Јер је близу дан, близу је дан Господњи, облачан дан, време народима.
ఆ రోజు వచ్చేసింది! యెహోవా కోసం ఆ రోజు వచ్చింది! అది మబ్బులు కమ్మే రోజు. రాజ్యాలు పతనమయ్యే రోజు!
4 И мач ће доћи на Мисир, и страх ће бити у етиопској, кад стану падати побијени у Мисиру, кад се зароби мноштво његово и раскопају се темељи његови.
అప్పుడు ఐగుప్తు దేశం మీద కత్తి పడుతుంది. ఐగుప్తులో చనిపోయిన వాళ్ళు కూలిపోతుంటే కూషు దేశస్థులు వేదన పడతారు. శత్రువులు ఐగుప్తీయుల ఆస్తిని పట్టుకుని దేశపు పునాదులను పడగొడతారు!
5 Етиопљани и Путеји и Лудеји и сва мешавина и Хувеји и синови земаља међу којима је вера, пашће с њима од мача.
కూషీయులు, పూతీయులు, లూదీయులు, విదేశీయులు నిబంధన ప్రజలంతా కత్తితో కూలుతారు!
6 Овако вели Господ: Пашће који подупиру Мисир, и понос силе његове обориће се, од куле синске пашће у њему, говори Господ Господ.
యెహోవా తెలియజేసేది ఏమిటంటే, ఐగుప్తుకు అండగా ఉండే వాళ్ళు కూలుతారు. గర్వంతో కూడిన దాని బలం అణగిపోతుంది. మిగ్దోలు నుండి సెవేనే వరకూ ప్రజలు కత్తితో కూలుతారు.” ఇదే యెహోవా ప్రభువు సందేశం.
7 И биће пусти међу пустим земљама, и градови ће његови бити међу пустим градовима.
పాడైపోయిన దేశాల మధ్య వాళ్ళు దిక్కులేని వాళ్ళుగా ఉంటారు. శిథిలాల పట్టణాల మధ్య వారి పట్టణాలుంటాయి.
8 И познаће да сам ја Господ кад запалим огањ у Мисиру и сви се помоћници његови сатру.
ఐగుప్తు దేశంలో అగ్ని రగిలించి నేను దానికి సహాయకులు లేకుండా చేస్తే అప్పుడు నేను యెహోవానని వాళ్ళు తెలుసుకుంటారు.
9 У онај ће дан изаћи посланици од мене на лађама да уплаше етиопску безбрижну, и биће међу њима страх велик као дана мисирског; јер ево, иде.
ఆ రోజు వార్తాహరులు నా దగ్గర నుంచి ఓడల్లో బయలుదేరి సురక్షితంగా ఉన్న కూషును భయపెడతారు. ఐగుప్తు పతనమయ్యే రోజున వారికి భయభ్రాంతులు పుడతాయి. అదిగో! అది వస్తూ ఉంది.
10 Овако вели Господ Господ: Погубићу мноштво мисирско руком Навуходоносора цара вавилонског.
౧౦యెహోవా ప్రభువు తెలియజేసేది ఏమిటంటే “బబులోను రాజు నెబుకద్నెజరు వలన ఐగుప్తులో ఇక ఏ మాత్రం జనాభా ఉండరు.
11 Он и народ његов с њим, најљући између народа, биће доведени да затру земљу, и извући ће мачеве своје на Мисир и напуниће земљу побијених.
౧౧ఆ దేశాన్ని నాశనం చేయడానికి, అతడు తన సైన్యాన్ని తోడుకుని వస్తాడు. అతనికి రాజ్యాలన్నీ భయపడిపోతాయి. ఐగుప్తీయులను చంపడానికి వారు తమ కత్తులు దూసి చచ్చిన వాళ్ళతో దేశాన్ని నింపుతారు.
12 И исушићу реке, и предаћу земљу у руке злим људима; и опустећу земљу и шта је у њој руком туђинском. Ја Господ говорих.
౧౨నదులను ఎండగొట్టి ఆ నేను ఆ దేశాన్ని దుర్మార్గులకు అమ్మి వేస్తాను. విదేశీయులతో నేను ఆ దేశాన్ని, దానిలో ఉన్నదంతా పాడు చేయిస్తాను. ఇదే యెహోవా ప్రభువు సందేశం.”
13 Овако вели Господ Господ: и гадне ћу богове потрти, и истребићу ликове у Нофу, и неће више бити кнеза из земље мисирске, и пустићу страх у земљу мисирску.
౧౩యెహోవా ఇలా చెబుతున్నాడు. “విగ్రహాలను నేను నాశనం చేస్తాను. మెంఫిస్ పట్టణపు పనికిరాని విగ్రహాలను లేకుండా చేస్తాను. ఇక ఐగుప్తు దేశంలో రాజు ఉండడు. దేశమంతటా నేను భయం పుట్టిస్తాను.
14 И опустошићу Патрос, и упалићу Соан, и извршићу суд на Нову.
౧౪పత్రోసును పాడు చేస్తాను. సోయనులో నిప్పు పెడతాను. తేబేస్ మీదికి శిక్ష పంపిస్తాను.
15 И излићу гнев свој на Син, град мисирски, и истребићу људство у Нову.
౧౫ఐగుప్తుకు కోటగా ఉన్న పెలుసియం మీద నా కోపాగ్ని కుమ్మరిస్తాను. తేబేస్ లోని అనేకమందిని నిర్మూలం చేస్తాను.
16 Кад запалим огањ у Мисиру, љуто ће се узмучити Син, и Нов ће се распасти, и Ноф ће бити у тескоби сваки дан.
౧౬ఆ తరువాత ఐగుప్తును కాల్చివేస్తాను. పెలుసియం వాళ్ళు వేదనతో అల్లాడిపోతారు. తేబిస్ చిన్నాభిన్నమవుతుంది. ప్రతిరోజూ మెంఫిస్ పై శత్రువులు దాడి చేస్తారు.
17 Младићи авински и пи-весетски пашће од мача, а девојке ће отићи у ропство.
౧౭హీలియోపోలిస్, బుబాస్తిస్ పట్టణాల్లోని యువకులు కత్తితో కూలుతారు. ఆ పట్టణ ప్రజలు బందీలుగా పోతారు.
18 И у Тафнесу ће помркнути дан кад поломим онде преворнице мисирске и нестане у њему поноса силе његове; облак ће га покрити; а кћери ће његове отићи у ропство.
౧౮ఐగుప్తు మోపిన కాడిని నేను తహపనేసులో విరిచే రోజున చీకటి కమ్ముకుంటుంది. గర్వంతో కూడిన ఐగుప్తీయుల బలం అక్కడ అంతమవుతుంది. దాన్ని మబ్బు కమ్ముకుంటుంది. దాని కూతుర్లు బందీలుగా పోతారు.
19 И извршићу судове на Мисиру, и они ће познати да сам ја Господ.
౧౯నేను ఐగుప్తీయులకు శిక్ష విధిస్తే నేను యెహోవానని వాళ్ళు తెలుసుకుంటారు.
20 Опет једанаесте године, првог месеца, седмог дана, дође ми реч Господња говорећи:
౨౦పదకొండవ ఏడు మొదటి నెల ఏడవ రోజు యెహోవా నాకీ విషయం తెలియచేశాడు.
21 Сине човечји, сломих мишицу Фараону цару мисирском, и ето неће се завити да се лечи, неће се метнути завој нити ће се завити да би се окрепила и могла држати мач.
౨౧నరపుత్రుడా, నేను ఐగుప్తు రాజు ఫరో చేతిని విరగ గొట్టాను. అది బాగుపడేలా ఎవరూ దానికి కట్టు కట్టరు. కత్తి పట్టుకునే బలం దానికి లేదు.”
22 Зато овако вели Господ Господ: Ево ме на Фараона цара мисирског, и сломићу му мишице, и здраву и сломљену, и избићу му мач из руке.
౨౨కాబట్టి యెహోవా ప్రభువు తెలియజేసేది ఏమిటంటే “నేను ఐగుప్తురాజు ఫరో చేతులను విరిచేస్తాను. అతని బలమైన చేతినీ, విరిగిన చేతినీ విరగ గొట్టి, అతని చేతిలోనుంచి కత్తి జారిపోయేలా చేస్తాను.
23 И расејаћу Мисирце по народима, и разасућу их по земљама.
౨౩అప్పుడు ఐగుప్తీయులను ఇతర రాజ్యాల్లోకి చెదరగొడతాను. వివిధ దేశాలకు వారిని వెళ్లగొడతాను.
24 И укрепићу мишицу цару вавилонском, и даћу му у руку свој мач, и поломићу мишице Фараону, и јечаће пред њим као што јечи човек рањен на смрт.
౨౪ఫరో చేతులను నేను విరగ గొట్టడానికి, బబులోను రాజు చేతులను బలపరచి నా కత్తి అతని చేతికిస్తాను. బబులోను రాజు చూస్తూ ఉండగా ఫరో చావు దెబ్బతిన్న వాడి లాగా మూలుగుతాడు.
25 Да, укрепићу мишице цару вавилонском, а Фараону ће мишице клонути, и познаће се да сам ја Господ, кад дам мач свој у руку цару вавилонском да њим замахне на земљу мисирску.
౨౫బబులోను రాజు చేతులను నేను బలపరుస్తాను. ఫరో చేతులు పడిపోతాయి. ఐగుప్తు దేశం మీద చాపడానికి నేను నా కత్తిని బబులోను రాజు చేతికిస్తే నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకుంటారు.
26 И расејаћу Мисирце међу народима и разасућу их по земљама, и познаће да сам ја Господ.
౨౬నేను యెహోవానని వాళ్ళు తెలుసుకునేలా నేను ఐగుప్తును రాజ్యాల్లో చెదర గొట్టి వివిధ దేశాలకు వారిని వెళ్లగొడతాను.”

< Књига пророка Језекиља 30 >