< 2 Мојсијева 29 >
1 Учинићеш им ово кад их станеш освештавати да ми врше службу свештеничку: узми теле и два овна здрава,
౧“నాకు యాజకులయ్యేలా వాళ్ళను ప్రతిష్ట చేయడానికి నువ్వు ఈ విధంగా చెయ్యి.
2 И хлебове пресне и колаче пресне замешене с уљем, и погаче пресне намазане уљем, од брашна пшеничног умеси их.
౨ఒక కోడెదూడను, లోపం లేని రెండు పొట్టేళ్లను తీసుకో. పొంగకుండా కాల్చిన రొట్టెను, పొంగకుండా వండిన నూనెతో కలిసిన వంటకాలను, నూనె పూసిన పలచని అప్పడాలు తీసుకో.
3 И метни их у једну котарицу, и принеси их у котарици с телетом и с два овна.
౩వాటిని గోదుమపిండితో చెయ్యాలి. వాటిని ఒక గంపలో ఉంచి ఆ గంపను, ఆ కోడెదూడను, ఆ రెండు పొట్టేళ్లను తీసుకు రావాలి.
4 И доведи Арона и синове његове пред врата шатора од састанка, и умиј их водом.
౪అహరోనును అతని కొడుకులను సన్నిధి గుడారం గుమ్మం దగ్గరికి తీసుకువచ్చి వాళ్లకు నీళ్లతో స్నానం చేయించాలి.
5 И узевши хаљине обуци Арону кошуљу и плашт испод оплећка и оплећак и напрсник, и опаши га појасом од оплећка.
౫అహరోనుకు దుస్తులు తొడిగి ఏఫోదు నిలువుటంగీని, ఏఫోదు వక్షపతకాన్ని వేసి, అల్లిక పని గల నడికట్టును అతనికి కట్టాలి.
6 И метни му капу на главу и свету плочу на капу.
౬అతని తలమీద పాగా పెట్టి ఆ పాగా మీద పవిత్ర కిరీటం నిలబెట్టాలి.
7 И узми уље за помазање, и излиј му на главу, и помазаћеш га.
౭తరువాత అభిషేక తైలం తీసుకుని అతని తల మీద పోసి అతణ్ణి అభిషేకించాలి.
8 И синове његове доведи и обуци им кошуље;
౮తరువాత అతని కొడుకులను రప్పించి వారికి అంగీలు తొడిగించాలి.
9 И опаши их појасима, Арона и синове његове, и метни им капе на главе, да имају свештенство уредбом вечном. Тако ћеш посветити руке Арону и синовима његовим.
౯అహరోనుకు, అతని కొడుకులకూ నడికట్లు కట్టి వారికి టోపీలు పెట్టాలి. ఈ విధంగా అహరోనును, అతని కొడుకులను ప్రతిష్టించాలి. యాజకత్వ నిర్వహణ పదవి వారికి చెందుతుంది. ఇది ఎప్పటికీ నిలిచి ఉండే కట్టుబాటు.
10 И доведи теле пред шатор од састанка, а Арон и синови његови нека метну руке телету на главу.
౧౦నువ్వు సన్నిధి గుడారం ఎదుటికి ఆ కోడెదూడను తెప్పించాలి. అహరోను, అతని కొడుకులు ఆ కోడెదూడ తలపై తమ చేతులు ఉంచాలి.
11 И закољи теле пред Господом на вратима шатора од састанка.
౧౧సన్నిధి గుడారం ద్వారం దగ్గర యెహోవా సన్నిధానంలో ఆ కోడెదూడను వధించాలి.
12 И узевши крви од телета помажи рогове олтару прстом својим, а осталу крв сву пролиј на подножје олтару.
౧౨వధించిన ఆ కోడెదూడ రక్తంలో కొంచెం తీసుకుని నీ వేలుతో బలిపీఠం కొమ్ముల మీద పూయాలి. మిగిలిన రక్తమంతా బలిపీఠం కింద పారబోయాలి.
13 И узми све сало по цревима, и мрежицу на јетри, и оба бубрега и сало око њих, и запали на олтару.
౧౩దాని పేగులకు, కాలేయానికి, రెండు మూత్రపిండాలకు పట్టిన కొవ్వు అంతటినీ తీసివేసి బలిపీఠంపై కాల్చివెయ్యాలి.
14 А месо од телета и кожу и балегу спали огњем изван логора; то је жртва за грех.
౧౪ఆ దూడ మాంసం, చర్మం, దాని పేడ అంతటినీ శిబిరం బయట కాల్చివెయ్యాలి. అది పాప పరిహారం కోసం అర్పించే బలి.
15 Потом узми овна једног, и на главу овну нека метну руке своје Арон и синови његови.
౧౫నువ్వు ఆ రెండు పొట్టేళ్లలో ఒకదాన్ని తీసుకోవాలి. అహరోను, అతని కొడుకులు ఆ పొట్టేలు తల మీద తమ చేతులుంచాలి.
16 И закољи овна и узми крви од њега и покропи олтар унаоколо.
౧౬ఆ పొట్టేలును వధించి దాని రక్తం తీసి బలిపీఠం చుట్టూ రక్తాన్ని చల్లాలి.
17 А овна изуди, и опери дроб и ноге, и метни их на удове његове и на главу.
౧౭తరువాత ఆ పొట్టేలును దాని అవయవాలను దేనికి అది విడదీసి దాని పేగులు, కాళ్ళు కడిగి, దాని అవయవాలను, తలను మొత్తంగా పేర్చాలి.
18 И свега овна запали на олтару; то је жртва паљеница Господу, мирис угодан, жртва огњена Господу.
౧౮పోట్టేలులోని ఆ భాగాలన్నిటినీ బలిపీఠంపై కాల్చివెయ్యాలి. అది యెహోవాకు హోమబలి. అది యెహోవాకు పరిమళం కలిగించే ఇష్టమైన హోమం.
19 Па узми и другог овна, и нека му метне Арон и синови његови руке своје на главу.
౧౯తరువాత రెండవ పొట్టేలును తీసుకోవాలి. అహరోను, అతని కొడుకులు ఆ పొట్టేలు తల మీద తమ చేతులుంచిన తరువాత
20 И закољи тог овна, и узми крви од њега и помажи њом крај од десног уха Арону и крај од десног уха синовима његовим, и палац у десне руке њихове и палац у десне ноге њихове, а осталом крвљу покропи олтар унаоколо.
౨౦ఆ పొట్టేలును వధించి దాని రక్తంలో కొంచెం తీసుకుని అహరోను కుడి చెవి అంచు మీద, అతని కొడుకుల కుడి చెవుల అంచుల మీద, వాళ్ళ కుడి చెయ్యి, కుడి కాలు బొటన వేళ్ళపై చిలకరించి మిగిలిన రక్తం బలిపీఠం మీద చుట్టూ చిలకరించాలి.
21 И узми крви која буде на олтару и уља за помазање, и покропи Арона и хаљине његове, и синове његове и хаљине њихове, и биће свет он и хаљине његове и синови његови и хаљине њихове.
౨౧బలిపీఠంపై ఉన్న రక్తంలో కొంచెం, అభిషేక తైలంలో కొంచెం తీసుకుని అహరోను మీదా, అతని వస్త్రాల మీదా, అతని కొడుకుల మీదా, వాళ్ళ వస్త్రాల మీదా చిలకరించాలి. అప్పుడు అతడూ అతని వస్త్రాలూ, అతని కొడుకులూ వాళ్ళ వస్త్రాలూ పవిత్రం అవుతాయి.
22 Потом узми сало од овна и реп и сало што је по цревима и мрежицу на јетри и оба бубрега и сало око њих, и десно плеће; јер је ован посветни;
౨౨ఆ పొట్టేలు సేవ కోసం ప్రతిష్ఠితమైనది గనక దాని కొవ్వునూ, కొవ్విన తోకనూ, పేగులపై ఉన్న కొవ్వునూ, కాలేయం, రెండు మూత్రపిండాల చుట్టూ ఉన్న కొవ్వునూ, కుడి తొడను వేరు చెయ్యాలి.
23 И један хлеб и један колач с уљем и једну погачу из котарице у којој буду пресни хлебови пред Господом.
౨౩వాటితోపాటు యెహోవా ఎదుట ఉన్న పొంగకుండా కాల్చిన గుండ్రని రొట్టెను, నూనెతో వండిన వంటకాలను, ఒక పలచని అప్పడాన్ని తీసుకోవాలి.
24 И то све метни у руке Арону и у руке синовима његовим, и обрћи тамо и амо, да буде жртва обртана пред Господом.
౨౪అహరోను, అతని కొడుకుల చేతుల్లో వాటినన్నిటినీ ఉంచాలి. కదలించే నైవేద్యంగా యెహోవా సన్నిధిలో వాటిని కదిలించాలి.
25 По том узми им то из руку, и запали на олтару сврх жртве паљенице, да буде мирис угодан пред Господом; то је жртва огњена Господу.
౨౫తరువాత వాళ్ళ చేతుల్లోనుంచి వాటిని తీసుకుని బలిపీఠంపై కాల్చివెయ్యాలి. అది యెహోవాకు హోమబలి. అది యెహోవాకు పరిమళం కలిగించే ఇష్టమైన హోమం.
26 И узми груди од овна посветног, који буде за Арона, и обртаћеш их тамо и амо, да буде жртва обртана пред Господом; и то ће бити твој део.
౨౬అహరోను సేవా ప్రతిష్ట కోసం నియమించిన ఆ పొట్టేలు బోరను తీసుకుని యెహోవా సన్నిధిలో కదిలించే అర్పణగా దాన్ని కదిలించాలి. ఆ భాగం నీది అవుతుంది.
27 Тако ћеш осветити груди од жртве обртане и плеће од жртве подизане, шта је обртано и шта је подизано од овна посветног за Арона и за синове његове.
౨౭ప్రతిష్టించిన ఆ పొట్టేలులో అంటే అహరోను, అతని కొడుకులకు చెందిన దానిలో కదిలించే బోరను, ప్రతిష్ఠితమైన తొడను నాకు ప్రతిష్ఠించాలి.
28 И то ће бити Арону и синовима његовим уредбом вечном од синова Израиљевих, јер је жртва подизана. Кад је жртва подизана синова Израиљевих од њихових жртава захвалних, жртва подизана биће Господу.
౨౮ఆ ప్రతిష్టార్పణ అహరోనుది, అతని కొడుకులది అవుతుంది. అది ఇశ్రాయేలు ప్రజలు ఇచ్చిన కానుక. అది నిత్యమూ నిలిచి ఉండే కట్టుబాటు. అది ఇశ్రాయేలు ప్రజలు అర్పించే శాంతి బలుల్లో నుండి యెహోవాకు అర్పించిన కానుక.
29 А свете хаљине Аронове нека буду синовима његовим након њега да се помазују у њима и да им се у њима посвећују руке.
౨౯అహరోను ధరించిన ప్రతిష్ఠిత వస్త్రాలు అతని తరువాత అతని కొడుకులకు చెందుతాయి. వాళ్ళ అభిషేకం, ప్రతిష్ట జరిగే సమయంలో వారు ఆ వస్త్రాలను ధరించాలి.
30 Седам дана нека их облачи који на његово место буде свештеник између синова његових, који ће улазити у шатор од састанка да служи у светињи.
౩౦అహరోను కొడుకుల్లో అతనికి బదులుగా యాజక వృత్తి ఎవరు చేపడతాడో అతడు పవిత్ర స్థలం లో సేవ చేయడానికి సన్నిధి గుడారంలోకి వెళ్ళే సమయానికి ముందు ఏడు రోజులపాటు ఆ వస్త్రాలు ధరించాలి.
31 А овна посветног узми и скувај месо од њега на месту светом.
౩౧నువ్వు ప్రతిష్ట అయిన పొట్టేలును తీసుకుని పవిత్రమైన చోట దాని మాంసం వండాలి.
32 И Арон и синови његови нека на вратима шатора од састанка једу месо од тог овна и хлеб што је у котарици.
౩౨అహరోను, అతని కొడుకులు సన్నిధి గుడారం గుమ్మం దగ్గర ఆ పొట్టేలు మాంసాన్నీ, గంపలో ఉన్న రొట్టెలనూ తినాలి.
33 Нека га једу они за које је било очишћење да би им се посветиле руке да би били посвећени; а други да не једе, јер је ствар света.
౩౩వారిని ప్రతిష్ఠ చేయడానికీ, పవిత్రపరచడానికీ వేటి ద్వారా ప్రాయశ్చిత్తం జరిగిందో వాటిని వాళ్ళు తినాలి. అవి పవిత్రమైనవి కాబట్టి యాజకుడు కానివాడు వాటిని తినకూడదు.
34 Ако ли би остало шта меса посветног или хлеба до јутра, онда што остане сажежи огњем, а да се не једе, јер је ствар света.
౩౪సేవ కోసం ప్రతిష్ఠి అయిన మాంసంలో గానీ, రొట్టెల్లో గానీ ఉదయం దాకా ఏమైనా మిగిలిపోతే వాటిని కాల్చివెయ్యాలి. అది ప్రతిష్ట అయినది గనక దాన్ని తినకూడదు.
35 И тако учини Арону и синовима његовим по свему што ти заповедих; седам дана светићеш им руке.
౩౫నేను నీకు ఆజ్ఞాపించిన విషయాలన్నిటి ప్రకారం నువ్వు అహరోనుకు, అతని కొడుకులకూ జరిగించాలి. ఏడు రోజుల పాటు వాళ్ళను సేవా ప్రతిష్ట కోసం సిద్ధపరచాలి.
36 И сваки ћеш дан приносити на жртву теле за грех ради очишћења; и очистићеш олтар чинећи очишћење на њему, и помазаћеш га да се освети.
౩౬వారి పాపాలను కప్పివేయడానికి ప్రతిరోజూ ఒక కోడెదూడను పరిహార బలిగా అర్పించాలి. బలిపీఠానికి ప్రాయశ్చిత్తం చేయడానికి దానికి పాపపరిహార బలి అర్పించి దానికి అభిషేకం చేసి తిరిగి ప్రతిష్ఠించాలి.
37 Седам дана чинићеш очишћење на олтару и осветићеш га, те ће олтар бити светиња над светињама; шта се год дотакне олтара, биће свето.
౩౭ఏడు రోజులపాటు బలిపీఠం కోసం ప్రాయశ్చిత్తం చేస్తూ దాన్ని పవిత్రం చెయ్యాలి. ఆ బలిపీఠం అతి పవిత్రంగా ఉంటుంది. బలిపీఠానికి తగిలేదంతా పవిత్రం అవుతుంది.
38 И ово ћеш приносити на олтару: два јагњета од године сваки дан без прекида.
౩౮బలిపీఠం మీద ఎప్పుడూ అర్పణలు జరుగుతూ ఉండాలి. ఒక సంవత్సరం లోపు వయసున్న రెండు గొర్రెపిల్లలను ప్రతి రోజూ అర్పించాలి.
39 Једно јагње приноси јутром а друго приноси вечером,
౩౯ఉదయం ఒక గొర్రెపిల్ల, సాయంత్రం ఒక గొర్రెపిల్ల అర్పించాలి.
40 И још десетину ефе пшеничног брашна смешана с уљем цеђеним, ког да буде четврт ина, и налив вина, четврт ина на једно јагње.
౪౦ఉదయం అర్పించే గొర్రెపిల్లతోబాటు దంచి తీసిన నూనెతో కలిపిన ఒక కిలో పిండిని, పానార్పణగా లీటరు ద్రాక్షరసాన్నీ అర్పించాలి.
41 А друго јагње принеси увече; као са жртвом јутарњом и с наливом њеним тако и с овом чини да буде мирис угодан, жртва огњена Господу.
౪౧ఉదయం అర్పించినట్టు సాయంత్రం కూడా చెయ్యాలి. యెహోవాకు అర్పణనూ, పానార్పణనూ అర్పించాలి. అది యెహోవాకు హోమబలి. అది యెహోవాకు పరిమళంగా ఉండే ఇష్టమైన హోమం.
42 То нека буде жртва паљеница свагда од колена до колена вашег на вратима шатора од састанка пред Господом, где ћу се састајати с вама да говорим с тобом.
౪౨ఇది యెహోవా సన్నిధానంలో సన్నిధి గుడారం ద్వారం దగ్గర మీరు తరతరాలకు అర్పించవలసిన హోమబలి. నేను అక్కడకు వచ్చి మిమ్మల్ని కలుసుకుని మీతో మాట్లాడతాను.
43 И онде ћу се састајати са синовима Израиљевим, да се освећује славом мојом.
౪౩అక్కడ ఇశ్రాయేలు ప్రజలను కలుసుకుంటాను. ఆ స్థలం నా మహిమా ప్రకాశం వల్ల పవిత్రం అవుతుంది.
44 И осветићу шатор од састанка и олтар; и Арона и синове његове осветићу да су ми свештеници.
౪౪నేను సన్నిధి గుడారాన్ని, బలిపీఠాన్ని పవిత్రం చేస్తాను. నాకు యాజకులుగా ఉండేందుకు అహరోనును, అతని కొడుకులను పరిశుద్ధ పరుస్తాను.
45 И наставаћу међу синовима Израиљевим, и бићу им Бог.
౪౫నేను ఇశ్రాయేలు ప్రజల మధ్య నివసించి వారికి దేవుడుగా ఉంటాను.
46 И познаће да сам ја Господ Бог њихов, који сам их извео из земље мисирске да наставам међу њима, ја Господ Бог њихов.
౪౬వాళ్ళ మధ్య నివసించడానికి తమను ఐగుప్తు దేశం నుండి బయటకు రప్పించిన దేవుణ్ణి నేనే అని వాళ్ళు తెలుసుకుంటారు. వాళ్ళ దేవుడైన యెహోవాను నేనే.”