< Књига проповедникова 8 >

1 Ко је као мудри? И ко зна шта значе ствари? Мудрост просветљује човеку лице, а тврдоћа лица његовог мења се.
జ్ఞానులంటే ఎవరు? జీవితంలో జరిగేవి ఏమిటి, ఎలా అనే విషయాలు ఎరిగినవారు. మనుషుల జ్ఞానం వారి ముఖానికి తేజస్సు నిస్తుంది. దాని వలన వారి కఠినత్వం మారుతుంది.
2 Ја ти кажем: извршуј заповест цареву, и то заклетве Божје ради.
నువ్వు దేవుని ఎదుట ఒట్టు పెట్టుకున్నట్టుగా రాజు ఆజ్ఞలకు లోబడి నడుచుకో.
3 Не буди брз да одеш испред њега; не стој у злој ствари, јер ће учинити шта год хоће.
రాజు సన్నిధి నుండి హడావుడిగా బయటికి వెళ్లకు. అతడు అనుకున్న దానంతటినీ జరిగించగలడు కాబట్టి చెడు కార్యాల్లో పాలు పుచ్చుకోకు.
4 Јер где је год реч царева онде је власт, и ко ће му рећи: Шта радиш?
రాజుల ఆజ్ఞ అధికారంతో కూడినది. “నువ్వు చేసేది ఏమిటి?” అని రాజును అడిగే వాడెవడు?
5 Ко извршује заповест, неће знати за зло, јер срце мудрога зна време и начин.
రాజుకు లోబడేవాడికి ఏ కీడూ జరగదు. ఏది ఎప్పుడు చేయాలో, ఎలా చేయాలో జ్ఞానుల హృదయాలకు తెలుసు.
6 Јер свачему има време и начин; али многа зла сналазе човека,
ప్రతి దానికీ ఒక స్పందన, ఒక సమయం నియామకమై ఉంది. అలా లేకపోతే మనుష్యులకు జరిగే కీడు అధికమైపోతుంది.
7 Што не зна шта ће бити; јер кад ће шта бити, ко ће му казати?
జరగబోయేది మనుషులకి తెలియదు. రాబోయే దాని గురించి ఎవరు చెప్పగలరు?
8 Човек није властан над духом да би зауставио дух, нити има власти над даном смртним, нити има одбране у тој борби; ни безбожност не избавља оног у кога је.
ఊపిరి విడవకుండా ఆపుచేయగల అధికారం ఎవరికీ లేదు. తన చావు రోజుపై ఎవరికీ అధికారం లేదు. యుద్దం జరిగే సమయంలో ఎవరికీ విడుదల దొరకదు. దుష్టత్వం దాన్ని వెంబడించే వారిని తప్పించలేదు.
9 Све ово видех, и управих срце своје на све што се ради под сунцем. Кад влада човек над човеком на зло његово.
సూర్యుని కింద జరిగే ప్రతి పని గురించి నేను తీవ్రంగా ఆలోచించినప్పుడు ఇదంతా నాకు తెలిసింది. ఒకడు మరొకడిపై ఉన్న అధికారంతో వాడికి కీడు జరిగిస్తాడు.
10 И тада видех безбожнике погребене, где се вратише; а који добро чињаху отидоше са светог места и бише заборављени у граду. И то је таштина.
౧౦దుష్టులను సక్రమంగా పాతిపెట్టడం, పరిశుద్ధ స్థలం నుండి తీసుకుపోవడం, వారు ఎక్కడ చెడ్డ పనులు చేశారో అదే పట్టణస్థులు వారిని పొగడడం నేను చూశాను. ఇది కూడా నిష్ప్రయోజనమే.
11 Што нема одмах осуде за зло дело, зато срце синова људских кипи у њима да чине зло.
౧౧చెడు పనికి తగిన శిక్ష వెంటనే కలగకపోవడం చూసి మనుషులు భయం లేకుండా చెడ్డ పనులు చేస్తారు.
12 Нека грешник сто пута чини зло и одгађа му се, ја ипак знам да ће бити добро онима који се боје Бога, који се боје лица његова.
౧౨ఒక దుర్మార్గుడు వంద సార్లు పాపం చేసి దీర్ఘకాలం జీవించినా, దేవునిలో భయభక్తులు కలిగి ఆయన సన్నిధిని గౌరవించేవారు క్షేమంగా ఉంటారని నాకు తెలుసు.
13 А безбожнику неће бити добро, нити ће му се продужити дани, него ће бити као сен ономе који се не боји лица Божијег.
౧౩దుర్మార్గులు దేవుని సన్నిధికి భయపడరు కాబట్టి వారికి క్షేమం ఉండదు. వారి జీవితకాలం అశాశ్వతమైన నీడలాగా ఉంటుంది.
14 Таштина је која бива на земљи што има праведника којима бива по делима безбожничким, а има безбожника којима бива по делима праведничким. Рекох: и то је таштина.
౧౪సూర్యుని కింద మరొక నిష్ప్రయోజనమైంది జరుగుతూ ఉంది. అదేమంటే భక్తిహీనులకు జరిగినట్టు నీతిమంతుల్లో కొందరికీ నీతిమంతులకు జరిగినట్టు భక్తిహీనుల్లో కొందరికీ జరుగుతున్నది. ఇది కూడా నిష్ప్రయోజనమే అని నేను అనుకున్నాను.
15 Зато ја хвалих весеље, јер нема ништа боље човеку под сунцем него да једе и пије и да се весели; и то му је од труда његовог за живота његовог, који му Бог да под сунцем.
౧౫అన్నపానాలు పుచ్చుకుని సంతోషించడం కంటే మనుషులకు మంచి విషయమేమీ లేదు. మనిషి పని చేసి కష్టపడాలని దేవుడు వారికి నియమించిన అతని జీవిత కాలమంతా వారికి తోడుగా ఉండేది వారి సంతోషమే.
16 Кад управих срце своје да познам мудрост и видим шта се ради на земљи, те дању ни ноћу не долази човеку сан на очи.
౧౬జ్ఞానాన్ని అభ్యసించడానికీ మనుషులు దివారాత్రులు నిద్ర లేకుండా చేసే వ్యాపారాలను పరిశీలించి చూశాను.
17 Видех на свим делима Божијим да човек не може докучити оно што се ради под сунцем, око чега се труди човек тражећи, али не налази, и ако и мудрац каже да зна, ипак не може докучити.
౧౭దేవుని పనులన్నిటినీ నేను గమనించాను. సూర్యుని కింద జరిగే సంగతులను మనుషులు ఎంత ప్రయత్నించినా గ్రహించలేరనీ, దాన్ని తెలుసుకోవాలని చివరికి జ్ఞానులు పూనుకున్నప్పటికీ వారు సైతం గ్రహించలేరనీ నేను తెలుసుకున్నాను.

< Књига проповедникова 8 >