< 2 Књига Самуилова 19 >

1 И јавише Јоаву: Ево цар плаче и тужи за Авесаломом.
రాజు తన కొడుకు గురించి విలపిస్తూ, విచారంగా ఉన్నాడన్న సంగతి ప్రజలందరికీ తెలిసింది. ఆనాటి విజయం ప్రజలందరి దుఃఖానికి కారణమయ్యింది.
2 И победа оног дана претвори се у жалост свему народу, јер народ чу у онај дан где говоре: Жали цар сина свог.
యుద్ధ సమయంలో భయపడి పారిపోయిన ప్రజలు దొంగలవలె తిరిగి పట్టణంలో ప్రవేశించారు.
3 И народ се у онај дан крио улазећи у град као што се крије народ који се стиди кад побегне из боја.
రాజు తన ముఖం కప్పుకుని “అబ్షాలోమా నా బిడ్డా, అబ్షాలోమా నా బిడ్డా” అంటూ కేకలువేస్తూ ఏడుస్తున్నాడని, అబ్షాలోమును గూర్చి విలపిస్తున్నాడన్న విషయం యోవాబు విన్నాడు.
4 А цар покри лице своје; и викаше гласно: Сине мој Авесаломе! Авесаломе сине мој, сине мој!
అతడు ఉన్న నగరంలోని భవనానికి వచ్చాడు.
5 Тада уђе Јоав к цару у кућу, и рече: Посрамио си данас све слуге своје, које ти данас душу сачуваше, и синовима твојим и кћерима твојим и женама твојим и иночама твојим.
“నీ ప్రాణాన్ని, నీ కొడుకుల, కూతుళ్ళ ప్రాణాలను, నీ భార్యల, నీ ఉపపత్నుల ప్రాణాలను రక్షించిన నీ సేవకులనందరినీ నువ్వు సిగ్గుపరుస్తున్నావు.
6 Јер љубиш оне који мрзе на те, а мрзиш на оне који те љубе; јер си показао данас да не мариш за војводе и за слуге; и видим данас да би ти мило било да је Авесалом жив, а ми сви да смо изгинули.
నీ సన్నిహితులను, అభిమానులను ద్వేషిస్తూ, నీ శత్రువులపై ప్రేమ చూపిస్తున్నావు. ఈనాడు నీ రాజ్య అధిపతులు, సేవకులు నీకు ఇష్టమైనవారు కారని చెబుతున్నావు. మేమంతా చనిపోయి అబ్షాలోము మాత్రం జీవించి ఉన్నట్టయితే అది నీకు సంతోషం కలిగించేది అని నేను గ్రహిస్తున్నాను. వెంటనే లేచి బయటికివచ్చి నీ సేవకులను ధైర్యపరచు.
7 Зато устани сада, и изиђи и проговори лепо слугама својим; јер заклињем се Господом, ако не изиђеш, неће ниједан остати код тебе ову ноћ, и то ће бити горе по те неголи сва зла која су те сналазила од младости твоје до сада.
నువ్వు గనుక ఇప్పుడు బయటికి రాకపోతే ఈ రాత్రి ఒక్కడు కూడా నీ దగ్గర ఉండడని యెహోవా పేరట ఒట్టు పెట్టి చెబుతున్నాను. నీ చిన్నప్పటినుండి ఇప్పటివరకూ నీకు కలిగిన కీడులన్నిటికంటే అది నీకు మరీ కష్టంగా ఉంటుంది” అని రాజుతో చెప్పినప్పుడు రాజు లేచి బయటకు వచ్చి గుమ్మంలో కూర్చున్నాడు.
8 Тада уста цар, и седе на вратима; и казаше свему народу говорећи: Ево, седи цар на вратима. И дође сав народ пред цара. Али Израиљци беху побегли, свак у свој шатор.
రాజు గుమ్మం దగ్గర కూర్చున్నాడన్న సంగతి ప్రజలంతా విని రాజును దర్శించేందుకు వచ్చారు. ఇశ్రాయేలువారంతా తమ తమ ఇళ్ళకు పారిపోయారు.
9 И сав се народ свађаше међу собом по свим племенима Израиљевим говорећи: Цар нас је избавио из руку непријатеља наших, и избавио нас је из руку филистејских; а сада је побегао из земље од Авесалома.
ఆ సమయంలో ఇశ్రాయేలు గోత్రాలకు చెందిన ప్రజల మధ్య గందరగోళం బయలుదేరింది. వారు “మన శత్రువుల చేతిలో నుండి, ఫిలిష్తీయుల చేతిలో నుండి మనలను విడిపించిన రాజు అబ్షాలోముకు భయపడి దేశం వదలి పారిపోయాడు.
10 Авесалом пак, ког помазасмо за цара над собом, погибе у боју. Сада дакле зашто оклевате те не доведете натраг цара?
౧౦మనం రాజుగా పట్టాభిషేకం చేసికొన్న అబ్షాలోము యుద్ధంలో చనిపోయాడు. కనుక మనం రాజును తిరిగి ఎందుకు తీసుకు రాకూడదు?” అనుకున్నారు.
11 Зато цар Давид посла к Садоку и Авијатару свештеницима и поручи: Говорите старешинама Јудиним и реците: Зашто ви да будете последњи који ће цара натраг довести у кућу његову? Јер говор свега Израиља дође до цара у кућу његову.
౧౧రాజైన దావీదుకు ఈ సంగతి వినబడింది. యాజకులైన సాదోకు, అబ్యాతారుకులను పిలిపించి “ఇశ్రాయేలు వారంతా మాట్లాడుకొంటున్న విషయం రాజుకు తెలిసింది. రాజును నగరానికి మళ్ళీ తీసుకు వెళ్లేందుకు ఎందుకు ఆలస్యం చేస్తున్నారు?
12 Ви сте моја браћа, ви сте кост моја и тело моје. Зашто бисте дакле били последњи који ће натраг довести цара?
౧౨మీరు నాకు రక్త సంబంధులు, సోదరులు. రాజును తీసుకు వచ్చేందుకు మీరెందుకు ఆలస్యం చేస్తున్నారని యూదావారి పెద్దలతో చెప్పండి” అని వారికి ఆజ్ఞాపించాడు.
13 Реците и Амаси: Ниси ли кост моја и тело моје? Бог нека ми учини тако и тако нека дода, ако ми не будеш војвода док си жив наместо Јоава.
౧౩తరువాత అమాశా దగ్గరికి మనుషులను పంపి “నువ్వు నా రక్త సంబంధివి, సోదరుడివి కాదా? యోవాబుకు బదులు నిన్ను సైన్యాధిపతిగా ఖాయం చేయకపోతే దేవుడు నాకు గొప్ప కీడు కలుగజేస్తాడు గాక” అని చెప్పమన్నాడు.
14 И склони срца свих људи од рода Јудина као једног човека, те послаше к цару говорећи: Врати се са свим слугама својим.
౧౪అతడు వెళ్లి యూదా వారిలో ప్రతి ఒక్కరూ ఇష్టపూర్వకంగా రాజుకు లోబడేలా చేశాడు. యూదావారు రాజు దగ్గరికి “నువ్వు, నీ సేవకులంతా తిరిగి రావాలి” అన్న కబురు పంపించారు. రాజు బయలుదేరి యొర్దాను నది దగ్గరికి వచ్చినప్పుడు
15 И тако се цар врати, и дође до Јордана; а Јуда дође до Галгала да срете цара и да га преведе преко Јордана.
౧౫యూదావారు రాజును ఎదుర్కొవడానికి, నది ఇవతలకు వెంటబెట్టుకు రావడానికి గిల్గాలుకు వచ్చారు.
16 Похита и Симеј, син Гирин, од Венијамина, који беше из Ваурима, и сиђе с људима рода Јудиног на сусрет цару Давиду;
౧౬అంతలో బహూరీములో ఉంటున్న బెన్యామీనీయుడైన గెరా కొడుకు షిమీ త్వరత్వరగా రాజైన దావీదును ఎదుర్కొనడానికి యూదావారితో కలసి వచ్చాడు.
17 И хиљаду људи беше с њим од рода Венијаминовог; такође и Сива слуга дома Сауловог с петнаест синова својих и двадесет слуга својих; и пређоше преко Јордана пред цара.
౧౭అతనితోపాటు వెయ్యిమంది బెన్యామీనీయులు ఉన్నారు. సౌలు కుటుంబం సేవకుడు సీబా, అతని పదిహేనుమంది కొడుకులు, ఇరవైమంది సేవకులు వచ్చారు.
18 Претурише и лађу да превезу чељад цареву и да учине шта би му било угодно. А Симеј, син Гирин, паде пред царем, кад хтеде да пређе преко Јордана,
౧౮వారంతా రాజు ఎదురుగా నది దాటారు. రాజు, అతని పరివారం నది దాటడానికి, రాజుకు అనుకూలంగా చేయడానికి పడవను ఇవతలకు తెచ్చి పెట్టారు. రాజు యొర్దాను నది దాటి వెళ్ళగానే గెరా కుమారుడు షిమీ వచ్చి అతనికి సాష్టాంగపడ్డాడు.
19 И рече цару: Не прими ми безакоња, господару мој, и не помињи пакости коју је учинио слуга твој у онај дан кад је цар господар мој изашао из Јерусалима; нека цар не мисли о томе.
౧౯“నా యజమానీ, నేను చేసినదాన్ని బట్టి నాపై నేరం మోపవద్దు. రాజువైన నువ్వు యెరూషలేము విడిచివెళ్తున్నప్పుడు నేను మూర్ఖత్వంతో చేసిన తప్పును జ్ఞాపకం పెట్టుకోవద్దు.
20 Јер слуга твој види да је згрешио; и ево дошао сам данас први из свега дома Јосифовог да сретнем цара, господара свог.
౨౦నేను పాపం చేశానని నాకు తెలుసు. కనుక రాజువైన నిన్ను కలుసుకోవడానికి యోసేపు వంశం వారందరికంటే ముందుగా వచ్చాను” అన్నాడు.
21 Али одговори Ависај син Серујин и рече: Еда ли тога ради неће погинути Симеј што је псовао помазаника Господњег?
౨౧అప్పుడు సెరూయా కుమారుడు అబీషై వచ్చి “యెహోవా అభిషేకించిన రాజును శపించిన ఈ షిమీకి మరణ శిక్ష విధించాలి” అన్నాడు.
22 А Давид рече: Шта је вама до мене, синови Серујини, те сте ми данас противници? Зар ће данас ко погинути у Израиљу, јер зар не знам да сам данас постао цар над Израиљем?
౨౨దావీదు “సెరూయా కొడుకుల్లారా, మీకూ, నాకూ ఏమి సంబంధం? ఇలాంటి సమయంలో మీరు నాకు విరోధులవుతారా? ఈ రోజు ఇశ్రాయేలు వారిలో ఎవరికైనా మరణశిక్ష విధించడం సమంజసమా? ఇప్పుడు నేను ఇశ్రాయేలు వారిమీద రాజునయ్యానన్న సంగతి తెలుసుకున్నాను” అన్నాడు. తరువాత
23 И рече цар Симеју: Нећеш погинути. И закле му се цар.
౨౩“నీకు మరణశిక్ష విధించను” అని షిమీకి వాగ్దానం చేశాడు.
24 Тако и Мефивостеј, син Саулов, дође цару на сусрет; он, пак, не опра ногу својих, нити браде своје очешља, ни опра хаљине своје од оног дана кад отиде цар до дана кад се врати с миром.
౨౪సౌలు మనవడు మెఫీబోషెతు రాజును కలుసుకోవడానికి వచ్చాడు. రాజు పారిపోయిన రోజునుండి అతడు క్షేమంగా తిరిగి వచ్చేంత వరకూ అతడు కాళ్లు కడుక్కోలేదు, గడ్డం కత్తిరించుకోలేదు, బట్టలు కూడా ఉతుక్కోలేదు.
25 И срете цара кад се враћаше у Јерусалим; и рече му цар: Зашто не пође са мном, Мефивостеју?
౨౫అతడు యెరూషలేములో రాజును కలిసినప్పుడు రాజు “మెఫీబోషెతూ, నీవు నాతో కలసి ఎందుకు రాలేదు?” అని అడిగాడు.
26 А он рече: Цару господару мој, превари ме слуга мој; јер слуга твој рече: Оседлаћу себи магарца и узјахаћу га и поћи ћу с царем; јер је хром слуга твој.
౨౬అప్పుడు అతడు “నా యజమానివైన రాజా, నీ దాసుడినైన నేను కుంటివాణ్ణి కనుక గాడిదను సిద్ధం చేసి రాజుతో కలసి వెళ్లిపోవాలని నేను అనుకున్నప్పుడు నా పనివాడు నన్ను మోసం చేశాడు.
27 И он опаде слугу твог код господара мог цара; али је цар господар мој као анђео Божји; зато чини шта ти је драго.
౨౭సీబా నా విషయంలో నీకు అబద్ధం చెప్పాడు. నువ్వు నా ఏలినవాడివి, రాజువు. నువ్వు దేవుని దూతవంటి వాడివి. నీకు ఏది మంచి అనిపిస్తే అది చెయ్యి.
28 Јер сав дом оца мог беху људи који заслужише смрт пред царем господарем мојим, а ти посади слугу свог међу оне који једу за столом твојим, па како имаш још право, и како се могу још тужити цару?
౨౮నా తండ్రి కుటుంబం వారంతా నీ దృష్టిలో చచ్చినవారమై ఉన్నప్పుడు, నువ్వు నీ భోజనం బల్ల దగ్గర నీతో భోజనం చేయడానికి దయ చూపించావు. కాబట్టి రాజవైన నిన్ను వేడుకోవడానికి నాకు వేరే అవసరం ఏముంటుంది?” అన్నాడు.
29 А цар му рече: Шта би ми више говорио? Казао сам: Ти и Сива поделите њиву.
౨౯అప్పుడు రాజు “నువ్వు ఆ విషయాలు ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వూ, సీబా భూమిని పంచుకొమ్మని నేను ఆజ్ఞ ఇచ్చాను గదా” అన్నాడు.
30 А Мефивостеј рече цару: Нека узме све, кад се цар господар мој вратио на миру у дом свој.
౩౦అందుకు మెఫీబోషెతు “నా ఏలినవాడవైన నువ్వు నీ నగరానికి క్షేమంగా తిరిగి వచ్చావు గనుక అతడు అంతా తీసుకోవచ్చు” అన్నాడు.
31 И Варзелај од Галада дође из Рогелима, и пође с царем преко Јордана да га прати преко Јордана.
౩౧గిలాదీయుడైన బర్జిల్లయి రోగెలీము నుండి యొర్దాను అవతల నుండి రాజును సాగనంపడానికి వచ్చాడు.
32 А беше Варзелај врло стар, беше му осамдесет година, и храњаше цара док беше у Маханајиму, јер беше врло богат човек.
౩౨ఇప్పుడు బర్జిల్లయి వయసు 80 ఏళ్ళు. వయసు పైబడి బాగా ముసలివాడైపోయాడు. అతడు అత్యంత ధనవంతుడు. రాజు మహనయీములో ఉన్నప్పుడు అతనికి ఆహార పదార్ధాలు పంపిస్తూ వచ్చాడు.
33 И рече цар Варзелају: Хајде са мном; ја ћу те хранити код себе у Јерусалиму.
౩౩రాజు “నువ్వు నాతోకూడ నది దాటి వచ్చి యెరూషలేములో నాతో కలసి ఉండిపో. నేను నిన్ను పోషిస్తాను” అని బర్జిల్లయితో చెప్పాడు.
34 Али Варзелај рече цару: Колико има века мог, да идем с царем у Јерусалим?
౩౪బర్జిల్లయి “రాజువైన నీతో కలసి యెరూషలేముకు వచ్చి ఉండడానికి ఇంకా నేనెంకాలం బతకగలను?
35 Има ми данас осамдесет година; могу ли распознавати добро и зло? Може ли слуга твој кусом разликовати шта ће јести и шта ће пити? Могу ли јоште слушати глас певачима и певачицама? И зашто би слуга твој још био на теготу цару, господару мом?
౩౫ఇప్పటికే నాకు 80 ఏళ్ళు నిండాయి. మంచి చెడ్డలకున్న తేడా నేను కనిపెట్టగలనా? భోజన పదార్ధాల రుచి నేను తెలుసుకో గలనా? గాయకుల, గాయకురాండ్ర పాటలు నాకు వినిపిస్తాయా? నీ దాసుడనైన నేను నీకు భారంగా ఎందుకు ఉండాలి?
36 Мало ће проћи слуга твој преко Јордана с царем; а зашто би ми цар тако наплатио?
౩౬రాజువైన నువ్వు నాపట్ల అంతటి మేలు చూపడానికి నేనెంతటివాణ్ణి? నీ దాసుడనైన నేను నీతో కలసి నది దాటి అవతలకు కొంచెం దూరం వస్తాను.
37 Нека се слуга твој врати, да умрем у свом граду код гроба оца свог и матере своје. Него ево, слуга твој Химам нека иде с царем господарем мојим, и учини њему шта ти буде драго.
౩౭నేను నా ఊరిలోనే ఉండి, చనిపోయి నా తలిదండ్రుల సమాధిలో పాతిపెట్టబడడానికి అక్కడికి తిరిగి వెళ్ళడానికి నాకు అనుమతి ఇవ్వు. అయ్యా, విను. నీ దాసుడు కింహాము ఇక్కడ ఉన్నాడు. నా ఏలినవాడవు, రాజువు అయిన నీతో కలసి రావడానికి అనుమతి ఇవ్వు. నీకు ఏది మంచి అనిపిస్తే అది అతడిపట్ల చెయ్యి” అని మనవి చేశాడు.
38 А цар рече: Нека иде са мном Химам; ја ћу му учинити шта буде теби драго, и шта год заиштеш у мене, све ћу ти учинити.
౩౮అప్పుడు రాజు “కింహాము నాతో కలసి రావచ్చు. నీ దృష్టికి అనుకూలమైన దాన్ని నేను అతనికి చేస్తాను. ఇంకా నా వల్ల నువ్వు ఏమి కోరుతావో అంతా చేస్తాను” అని చెప్పాడు.
39 И кад пређе сав народ преко Јордана и цар пређе, целива цар Варзелаја и благослови га, и он се врати у место своје.
౩౯అప్పుడు రాజు, ప్రజలందరూ నది అవతలకు వచ్చారు. రాజు బర్జిల్లయిని ముద్దు పెట్టుకుని దీవించాడు. తరువాత బర్జిల్లయి తన స్వస్థలానికి వెళ్ళిపోయాడు.
40 Отуда цар отиде у Галгал, и Химам отиде с њим. И тако сав народ Јудин допрати цара, и половина народа Израиљевог.
౪౦రాజు కింహామును వెంటబెట్టుకుని గిల్గాలుకు వచ్చాడు. యూదావారు, ఇశ్రాయేలువారిలో సగంమంది రాజును వెంటబెట్టుకుని వచ్చారు.
41 А гле, сви људи Израиљци дођоше к цару и рекоше му: Зашто те украдоше браћа наша, људи Јудини, и преведоше преко Јордана цара и дом његов и све људе Давидове с њим?
౪౧ఇలా ఉన్నప్పుడు ఇశ్రాయేలువారు రాజు దగ్గరికి వచ్చారు. “మా సహోదరులైన యూదావారు నిన్ను, నీ ఇంటివారిని దొంగిలించుకుని యొర్దాను ఇవతలకు ఎందుకు తీసుకు వచ్చారు?” అని అడిగారు.
42 А сви људи од Јуде одговорише људима од Израиља: Јер је цар нама род; па што се срдите тога ради? Јесмо ли шта појели цару? Је ли нас даром даривао?
౪౨అందుకు యూదా వారు “రాజు మీకు సమీపబంధువు గదా, మీకు కోపం ఎందుకు? అలాగైతే మాలో ఎవరమైనా రాజు ద్వారా లాభం పొందామా? లేక మాకోసం ఏమైనా దొంగతనం చేశామా?” అని ఇశ్రాయేలు వారితో అన్నారు.
43 Тада одговорише људи од Израиља људима од Јуде, и рекоше: Ми имамо десет делова у цара, и Давиду смо више него ви; зашто дакле не маристе за нас? Нисмо ли ми први говорили да доведемо натраг цара свог? Али беседа људи од Јуде беше тврђа од беседе људи од Израиља.
౪౩ఇశ్రాయేలువారు “రాజులో మాకు పది వంతులు ఉన్నాయి. దావీదులో మీకంటే మాకే ఎక్కువ హక్కు ఉంది. మీరు మమ్మల్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? రాజును తీసుకువచ్చే విషయం గురించి మీతో ముందుగా మాట్లాడినది మేమే గదా” అని యూదావారితో అన్నారు. యూదావారు ఇశ్రాయేలువారి కంటే కఠినంగా మాట్లాడారు.

< 2 Књига Самуилова 19 >