< Psalmi 103 >
1 Blagosiljaj, dušo moja, Gospoda, i sve što je u meni sveto ime njegovo.
౧దావీదు కీర్తన. నా ప్రాణమా, యెహోవాను స్తుతించు. నా అంతరంగమా, ఆయన పవిత్ర నామాన్ని స్తుతించు.
2 Blagosiljaj, dušo moja, Gospoda, i ne zaboravljaj nijednoga dobra što ti je uèinio.
౨నా ప్రాణమా, యెహోవాను స్తుతించు, ఆయన చేసిన ఉపకారాలన్నీ మరచిపోవద్దు.
3 On ti prašta sve grijehe i iscjeljuje sve bolesti tvoje;
౩ఆయన నీ పాపాలన్నీ క్షమిస్తాడు. నీ జబ్బులన్నీ బాగుచేస్తాడు.
4 Izbavlja od groba život tvoj, vjenèava te dobrotom i milošæu;
౪నాశనాన్నుంచి నీ ప్రాణాన్ని విడుదల చేస్తాడు. కృప, వాత్సల్యం నీకు కిరీటంగా ఉంచాడు.
5 Ispunja dobrim želje tvoje, ponavlja se kao u orla mladost tvoja.
౫నీ యవ్వనం గరుడ పక్షిలాగా కొత్తదనం సంతరించుకున్నట్టు మేలైన వాటితో నీ జీవితాన్ని తృప్తిపరుస్తాడు.
6 Gospod tvori pravdu i sud svima kojima se krivo èini.
౬యెహోవా న్యాయమైన దాన్ని జరిగిస్తాడు. అణగారిన వారందరికీ న్యాయం చేస్తాడు.
7 Pokaza putove svoje Mojsiju, sinovima Izrailjevim djela svoja.
౭ఆయన మోషేకు తన విధానాలూ ఇశ్రాయేలు వంశస్థులకు తన కార్యాలూ తెలియచేశాడు.
8 Milostiv je i dobar Gospod, spor na gnjev i veoma blag.
౮యెహోవా దయాళువు, కృపాభరితుడు. ఆయన సహనశీలి, నిబంధన సంబంధమైన నమ్మకత్వం ఆయనలో ఉంది.
9 Ne gnjevi se jednako, niti se dovijeka srdi.
౯ఆయన ఎప్పుడూ అదుపులో పెట్టేవాడు కాదు. ఆయన అస్తమానం కోపంగా ఉండడు.
10 Ne postupa s nama po grijesima našim, niti nam vraæa po nepravdama našim.
౧౦మన పాపాలకు తగినట్టు ఆయన మనతో వ్యవహరించలేదు. మన పాపాలకు సరిపోయినంతగా మనకు ప్రతీకారం చేయలేదు.
11 Nego koliko je nebo visoko od zemlje, tolika je milost njegova k onima koji ga se boje.
౧౧భూమికంటే ఆకాశం ఎంత ఉన్నతమో తనను గౌరవించేవారి పట్ల ఆయన కృప అంత ఉన్నతం.
12 Koliko je istok daleko od zapada, toliko udaljuje od nas bezakonja naša.
౧౨పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన పాపాల అపరాధ భావన కూడా మననుంచి అంత దూరం చేశాడు.
13 Kako otac žali sinove, tako Gospod žali one koji ga se boje.
౧౩తండ్రి తన పిల్లలను జాలితో చూసినట్టు, యెహోవా తనను గౌరవించే వాళ్ళను జాలితో చూసుకుంటాడు.
14 Jer zna graðu našu, opominje se da smo prah.
౧౪మనం ఎలా సృష్టి అయ్యామో ఆయనకు తెలుసు, మనం మట్టి అని ఆయనకు తెలుసు.
15 Dani su èovjeèiji kao trava; kao cvijet u polju, tako cvjeta.
౧౫మనిషి రోజులు గడ్డి మొక్కలాంటివి. పొలంలో పూసే పువ్వులాగా అతడు పూస్తాడు.
16 Dune vjetar na nj, i nestane ga, niti æe ga više poznati mjesto njegovo.
౧౬దానిమీద గాలి వీస్తే అది ఇక ఉండదు.
17 Ali milost Gospodnja ostaje od vijeka i do vijeka na onima koji ga se boje, i pravda njegova na sinovima sinova,
౧౭యెహోవాను గౌరవించే వారి పట్ల ఆయన కృప తరతరాలకూ ఉంటుంది. ఆయన నీతి వారి వారసులకు కొనసాగుతుంది.
18 Koji drže zavjet njegov, i pamte zapovijesti njegove, da ih izvršuju.
౧౮వాళ్ళు ఆయన నిబంధన పాటిస్తారు. ఆయన ఆదేశాలను మనసులో ఉంచుకుంటారు.
19 Gospod na nebesima postavi prijesto svoj, i carstvo njegovo svijem vlada.
౧౯యెహోవా పరలోకంలో తన సింహాసనాన్ని సుస్థిరం చేశాడు. ఆయన రాజ్యం అందరినీ పాలిస్తూ ఉంది.
20 Blagosiljajte Gospoda anðeli njegovi, koji ste silni krjepošæu, izvršujete rijeè njegovu slušajuæi glas rijeèi njegove.
౨౦యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన మాట వినే బలాశాలురైన మీరంతా, ఆయనను స్తుతించండి.
21 Blagosiljajte Gospoda sve vojske njegove, sluge njegove, koje tvorite volju njegovu.
౨౧యెహోవా సేనలారా, ఆయన సంకల్పం నెరవేర్చే సేవకులైన మీరంతా ఆయనను స్తుతించండి.
22 Blagosiljajte Gospoda sva djela njegova, po svijem mjestima vlade njegove! Blagosiljaj, dušo moja, Gospoda!
౨౨యెహోవా చేసిన జీవులారా, ఆయనను స్తుతించండి. ఆయన రాజ్యంలోని ప్రతి ప్రదేశంలో ఉన్న మీరంతా ఆయనను స్తుతించండి. నా ప్రాణమా, యెహోవాను స్తుతించు.