< Postanak 11 >
1 A bijaše na cijeloj zemlji jedan jezik i jednake rijeèi.
౧అప్పుడు భూమిపై అందరూ ఒకే భాష మాట్లాడేవారు.
2 A kad otidoše od istoka, naðoše ravnicu u zemlji Senarskoj, i naseliše se ondje.
౨వాళ్ళు తూర్పుకు ప్రయాణం చేస్తున్నప్పుడు షీనారు ప్రాంతంలో వాళ్లకు ఒక మైదానం కనబడింది. వాళ్ళు అక్కడ స్థిరపడ్డారు.
3 Pa rekoše meðu sobom: hajde da pravimo ploèe i da ih u vatri peèemo. I bjehu im opeke mjesto kamena i smola zemljana mjesto kreèa.
౩వాళ్ళు ఒకరితో ఒకరు “మనం ఇటుకలు తయారు చేసి, చక్కగా కాల్చుదాం రండి” అని మాట్లాడుకున్నారు. రాళ్ళకు బదులు ఇటుకలు, అతకడానికి తారు కీలు వాళ్లకు అందుబాటులో ఉన్నాయి.
4 Poslije rekoše: hajde da sazidamo grad i kulu, kojoj æe vrh biti do neba, da steèemo sebi ime, da se ne bismo rasijali po zemlji.
౪వాళ్ళు “మనం భూమి అంతటా చెదిరిపోకుండా ఉండేలా ఒక పట్టణాన్ని, ఆకాశాన్ని అంటే శిఖరం ఉన్న ఒక గోపురం కట్టుకుని పేరు సంపాదించుకుందాం రండి” అని మాట్లాడుకున్నారు.
5 A Gospod siðe da vidi grad i kulu, što zidahu sinovi èovjeèiji.
౫యెహోవా ఆదాము సంతానం కట్టిన పట్టణాన్ని, గోపురాన్ని, చూడడానికి దిగి వచ్చాడు.
6 I reèe Gospod: gle, narod jedan, i jedan jezik u svijeh, i to poèeše raditi, i neæe im smetati ništa da ne urade što su naumili.
౬యెహోవా “ఇదిగో, ఒకే భాష ఉన్న ఈ మనుషులు పని చేయడం ప్రారంభించారు! ఇకముందు వాళ్ళు చెయ్యాలనుకున్న ఏ పనైనా వాళ్లకు అసాధ్యం కాదు.
7 Hajde da siðemo, i da im pometemo jezik, da ne razumiju jedan drugoga što govore.
౭కాబట్టి మనం కిందికి వెళ్లి, వాళ్ళల్లో ఒకరి మాట ఒకరికి తెలియకుండా అక్కడ వాళ్ళ భాషను తారుమారు చేద్దాం రండి” అనుకున్నాడు.
8 Tako ih Gospod rasu odande po svoj zemlji, te ne sazidaše grada.
౮ఆ విధంగా యెహోవా వారు అక్కడ నుంచి భూమి అంతటా చెదిరిపోయేలా చేశాడు. ఆ పట్టణ నిర్మాణం ఆగిపోయింది.
9 Zato se prozva Vavilon, jer ondje pomete Gospod jezik cijele zemlje, i odande ih rasu Gospod po svoj zemlji.
౯అందువల్ల దానికి బాబెలు అనే పేరు పెట్టారు. ఎందుకంటే, అక్కడ యెహోవా భూమి మీద ఉన్న ప్రజలందరి భాషను తారుమారు చేశాడు. అక్కడ నుంచి యెహోవా వాళ్ళను భూమి మీద అనేక ప్రదేశాలకు చెదరగొట్టాడు.
10 Ovo je pleme Simovo: bijaše Simu sto godina, kad rodi Arfaksada, druge godine poslije potopa.
౧౦షేము వంశావళి ఇది. షేముకు వంద సంవత్సరాల వయస్సులో, జలప్రళయం తరువాత రెండు సంవత్సరాలకు అర్పక్షదు పుట్టాడు.
11 A rodiv Arfaksada poživje Sim pet stotina godina, raðajuæi sinove i kæeri.
౧౧షేముకు అర్పక్షదు పుట్టిన తరువాత ఇంకా అతనికి కొడుకులు, కూతుళ్ళు పుట్టారు. అతడు ఐదు వందల సంవత్సరాలు బ్రతికాడు.
12 A Arfaksad poživje trideset i pet godina, i rodi Salu;
౧౨అర్పక్షదుకు ముప్ఫై ఐదు సంవత్సరాల వయస్సులో షేలహు పుట్టాడు.
13 A rodiv Salu poživje Arfaksad èetiri stotine i tri godine, raðajuæi sinove i kæeri.
౧౩అర్పక్షదుకు షేలహు పుట్టిన తరువాత ఇంకా అతనికి కొడుకులు, కూతుళ్ళు పుట్టారు. అతడు నాలుగు వందల మూడు సంవత్సరాలు బతికాడు.
14 A Sala poživje trideset godina, i rodi Evera;
౧౪షేలహుకు ముప్ఫై సంవత్సరాల వయస్సులో ఏబెరు పుట్టాడు.
15 A rodiv Evera poživje Sala èetiri stotine i tri godine, raðajuæi sinove i kæeri.
౧౫షేలహుకు ఏబెరు పుట్టిన తరువాత ఇంకా అతనికి కొడుకులు, కూతుళ్ళు పుట్టారు. అతడు నాలుగు వందల మూడు సంవత్సరాలు బతికాడు.
16 A Ever poživje trideset i èetiri godine, i rodi Faleka;
౧౬ఏబెరుకు ముప్ఫై నాలుగు సంవత్సరాల వయస్సులో పెలెగు పుట్టాడు.
17 A rodiv Faleka poživje Ever èetiri stotine i trideset godina, raðajuæi sinove i kæeri.
౧౭ఏబెరుకు పెలెగు పుట్టిన తరువాత ఇంకా అతనికి కొడుకులు, కూతుళ్ళు పుట్టారు. అతడు నాలుగు వందల ముప్ఫైసంవత్సరాలు బతికాడు.
18 A Falek poživje trideset godina i rodi Ragava;
౧౮పెలెగుకు ముప్ఫై సంవత్సరాల వయస్సులో రయూ పుట్టాడు.
19 A rodiv Ragava poživje Falek dvjesta i devet godina, raðajuæi sinove i kæeri.
౧౯పెలెగుకు రయూ పుట్టిన తరువాత ఇంకా అతనికి కొడుకులు, కూతుళ్ళు పుట్టారు. అతడు రెండువందల తొమ్మిది సంవత్సరాలు బతికాడు.
20 A Ragav poživje trideset i dvije godine i rodi Seruha;
౨౦రయూకు ముప్ఫై రెండు సంవత్సరాల వయస్సులో సెరూగు పుట్టాడు.
21 A rodiv Seruha poživje Ragav dvjesta i sedam godina, raðajuæi sinove i kæeri.
౨౧రయూకు సెరూగు పుట్టిన తరువాత ఇంకా అతనికి కొడుకులు, కూతుళ్ళు పుట్టారు. అతడు రెండు వందల ఏడు సంవత్సరాలు బతికాడు.
22 A Seruh poživje trideset godina, i rodi Nahora;
౨౨సెరూగుకు ముప్ఫై సంవత్సరాల వయస్సులో నాహోరు పుట్టాడు.
23 A rodiv Nahora poživje Seruh dvjesta godina, raðajuæi sinove i kæeri.
౨౩సెరూగుకు నాహోరు పుట్టిన తరువాత ఇంకా అతనికి కొడుకులు, కూతుళ్ళు పుట్టారు, అతడు రెండువందల సంవత్సరాలు బతికాడు.
24 A Nahor poživje dvadeset i devet godina, i rodi Taru;
౨౪నాహోరుకు ఇరవై తొమ్మిది సంవత్సరాల వయస్సులో తెరహు పుట్టాడు.
25 A rodiv Taru poživje Nahor sto i devetnaest godina, raðajuæi sinove i kæeri.
౨౫నాహోరుకు తెరహు పుట్టిన తరువాత ఇంకా అతనికి కొడుకులు, కూతుళ్ళు పుట్టారు. అతడు నూట పంతొమ్మిది సంవత్సరాలు బతికాడు.
26 A Tara poživje sedamdeset godina, i rodi Avrama, Nahora i Arana.
౨౬తెరహుకు డెబ్భై సంవత్సరాల వయస్సులో అబ్రాము, నాహోరు, హారానులు పుట్టారు.
27 A ovo je pleme Tarino: Tara rodi Avrama, Nahora i Arana; a Aran rodi Lota.
౨౭తెరహు వంశావళి ఇది: తెరహుకు అబ్రాము, నాహోరు, హారానులు పుట్టారు. హారానుకు లోతు పుట్టాడు.
28 I umrije Aran prije Tare oca svojega na postojbini svojoj, u Uru Haldejskom.
౨౮హారాను, తాను పుట్టిన ప్రదేశంలో ఊరు అనే కల్దీయుల పట్టణంలో తన తండ్రి తెరహు కంటే ముందే చనిపోయాడు.
29 I oženi se Avram i Nahor, i ženi Avramovoj bješe ime Sara a ženi Nahorovoj ime Melha, kæi Arama oca Melhe i Jeshe.
౨౯అబ్రాము, నాహోరు పెళ్ళిళ్ళు చేసుకున్నారు. అబ్రాము భార్య శారయి. నాహోరు భార్య పేరు మిల్కా. ఆమె మిల్కా, ఇస్కాలకు తండ్రి అయిన హారాను కూతురు.
30 A Sara bješe nerotkinja, i ne imaše poroda.
౩౦శారయి గొడ్రాలు. ఆమెకు పిల్లలు లేరు.
31 I uze Tara sina svojega Avrama i Lota sina Aranova, unuka svojega, i Saru snahu svoju, ženu Avrama sina svojega; i poðoše zajedno iz Ura Haldejskoga da idu u zemlju Hanansku, i doðoše do Harana, i ondje se nastaniše.
౩౧తెరహు తన కొడుకు అబ్రామును, తన మనుమడు, హారాను కొడుకు లోతును, తన కోడలు శారయిని తీసుకు కనానుకు బయలుదేరాడు. ఊరు అనే కల్దీయుల పట్టణంలో నుంచి వాళ్ళతోపాటు బయలుదేరి హారాను వరకూ వచ్చి అక్కడ నివాసం ఉన్నాడు.
32 I poživje Tara svega dvjesta i pet godina; i umrije Tara u Haranu.
౩౨తెరహు రెండు వందల ఐదు సంవత్సరాలు బతికి, హారానులో చనిపోయాడు.