< Jezekilj 14 >
1 Potom doðoše k meni neki od starješina Izrailjevijeh i sjedoše preda me.
౧తరువాత ఇశ్రాయేలు ప్రజల పెద్దల్లో కొందరు నా దగ్గరకి వచ్చి నా ఎదుట కూర్చున్నారు.
2 I doðe mi rijeè Gospodnja govoreæi:
౨యెహోవా వాక్కు నా దగ్గరకి వచ్చింది. ఆయన నాతో ఇలా చెప్పాడు.
3 Sine èovjeèji, ovi su ljudi stavili u srca svoja gadne bogove svoje, i metnuli su preda se o što se spotièu na bezakonje svoje; traže li me doista?
౩“నరపుత్రుడా, ఈ మనుషులు విగ్రహాలను తమ హృదయాల్లో ప్రతిష్టించుకున్నారు. తమకు అడ్డుబండగా తమ అతిక్రమాలను నిలుపుకున్నారు. వీళ్ళని నా దగ్గర విచారణ చేయనియ్యాలా?
4 Zato govori im i reci im: ovako veli Gospod Gospod: ko je god od doma Izrailjeva stavio u srce svoje gadne bogove svoje i metnuo preda se o što se spotièe na bezakonje svoje, pa doðe k proroku, ja Gospod odgovoriæu mu kad doðe za mnoštvo gadnijeh bogova njegovijeh,
౪కాబట్టి నువ్వు ప్రకటన చేసి వాళ్లకి ఈ సంగతి చెప్పు. కాబట్టి నీవు వాళ్లకి సంగతి తెలియజేసి ఇలా చెప్పు. ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజల్లో విగ్రహాలను హృదయంలో ప్రతిష్టించుకున్న వారెవరైనా, లేదా తమకు అడ్డుబండగా తమ అతిక్రమాలను నిలుపుకున్న ఎవరైనా, ఆ తరువాత ప్రవక్త దగ్గరికి వస్తే యెహోవానైన నేను వాడు పెట్టుకున్న విగ్రహాల సంఖ్యను బట్టి వాడికి జవాబిస్తాను.
5 Da uhvatim dom Izrailjev za srce njihovo što su se odvratili od mene svi za gadnijem bogovima svojim.
౫వాళ్ళు పెట్టుకున్న విగ్రహాల కారణంగా నాకు దూరమయ్యారు కాబట్టి తిరిగి వాళ్ళ హృదయాలను వశం చేసుకోడానికి నేనలా చేస్తాను.
6 Zato reci domu Izrailjevu: ovako veli Gospod Gospod: obratite se i otstupite od gadnijeh bogova svojih, odvratite lice svoje od svijeh gadova svojih.
౬కాబట్టి ఇశ్రాయేలు ప్రజలకు ఈ మాట చెప్పు. ‘పశ్చాత్తాప పడండి. విగ్రహాలను విడిచిపెట్టండి. మీరు చేస్తున్న అసహ్యమైన పనులు మాని వేయండి.’
7 Jer ko bi god od doma Izrailjeva ili od inostranaca koji žive u Izrailju otstupio od mene, i stavio u srce svoje gadne bogove svoje, i metnuo preda se o što æe se spoticati na bezakonje svoje, pa bi došao k proroku da me upita preko njega, njemu æu odgovoriti ja sam Gospod sobom.
౭ఇశ్రాయేలు ప్రజల్లో ఎవరైనా, వాళ్ళ మధ్య నివసించే విదేశీయుల్లో ఎవరైనా నన్ను విడిచి తమ హృదయాల్లో విగ్రహాలను ప్రతిష్టించుకుని, తమకు అడ్డుబండగా తమ అతిక్రమాలను నిలుపుకుని ప్రవక్త దగ్గరికి వస్తే నేనే సూటిగా వాళ్ళకి జవాబిస్తాను.
8 I okrenuæu lice svoje prema tom èovjeku, i uèiniæu od njega znak i prièu, i istrijebiæu ga iz naroda svojega, te æete poznati da sam ja Gospod.
౮అలాంటి వ్యక్తికి నేను విరోధంగా ఉండి అతణ్ణి సూచనగానో, సామెతగానో మారుస్తాను. ఎందుకంటే నేను అతణ్ణి నా ప్రజల్లో నుండి కొట్టివేస్తాను. నేను యెహోవాను అని మీరు తెలుసుకుంటారు.
9 I ako bi se prorok prevario, te rekao što, ja Gospod prevarih onoga proroka, i dignuæu ruku svoju na nj, i istrijebiæu ga iz naroda svojega Izrailja.
౯ఒకవేళ ఎవరన్నా ఒక ప్రవక్త మోసపోయి ఒక సందేశం పలికితే యెహోవానైన నేను ఆ ప్రవక్తను మోసం చేస్తాను. అతనికి విరోధంగా నా చెయ్యి చాపి నా ప్రజలైన ఇశ్రాయేలు నుండి అతణ్ణి నాశనం చేస్తాను.
10 I ponijeæe obojica svoje bezakonje: kako je bezakonje onoga koji pita tako æe biti i prorokovo bezakonje,
౧౦ఇశ్రాయేలు ప్రజలు తమ అతిక్రమాల్లో కొనసాగుతారు. ఎందుకంటే ప్రవక్త దోషం ఎంతో అతడి దగ్గర ఆలోచన కోసం వచ్చేవాడిదీ అంతే దోషం అవుతుంది.
11 Da više dom Izrailjev ne otstupa od mene i da se više ne skvrne svakojakim prijestupima svojim, nego da mi budu narod, i ja da im budem Bog, govori Gospod Gospod.
౧౧దీని కారణంగా ఇశ్రాయేలు ప్రజలు ఇక మీదట నాకు దూరంగా వెళ్ళరు. తమ అతిక్రమాలన్నిటితో తమను తాము అపవిత్రం చేసుకోరు. వాళ్ళు నా ప్రజలై ఉంటారు. నేను వాళ్ళ దేవుడినై ఉంటాను.” ప్రభువైన యెహోవా చేస్తున్న ప్రకటన ఇది.
12 Opet mi doðe rijeè Gospodnja govoreæi:
౧౨యెహోవా వాక్కు నా దగ్గరకి వచ్చింది. ఆయన నాతో ఇలా చెప్పాడు.
13 Sine èovjeèji, ako mi koja zemlja zgriješi uèinivši nevjeru, i ja dignem ruku svoju na nju i slomim joj potporu u hljebu, i pustim na nju glad i istrijebim u njoj ljude i stoku,
౧౩“నరపుత్రుడా, ఒక దేశం నాకు విరోధంగా పాపం చేసినప్పుడు నేను దాన్ని శిక్షించడానికి నా హస్తం చాపి దాని ఆహార వనరులను నాశనం చేసి, దానిపై కరువు పంపి, దేశంలో మనుషులనూ పశువులనూ నిర్మూలం చేస్తాను.
14 Ako bi u njoj bila ova tri èovjeka: Noje, Danilo i Jov, oni æe pravdom svojom izbaviti duše svoje, govori Gospod Gospod.
౧౪అప్పుడు ఆ దేశంలో నోవహు, దానియేలు, యోబు-ఈ ముగ్గురూ ఉన్నప్పటికీ వాళ్ళు తమ నీతి చేత తమను తాము మాత్రమే రక్షించుకోగలుగుతారు. ప్రభువైన యెహోవా చేస్తున్న ప్రకటన ఇది.
15 Ako pustim ljute zvijeri u zemlju, te pomore ljude, i ona opusti da niko ne može prolaziti od zvijerja;
౧౫బాటసారులెవ్వరూ దానిగుండా ప్రయాణం చేయలేకుండా దేశాన్ని బంజరుగానూ నిర్జనం గానూ చేయడానికి అడవి మృగాలను నేను రప్పిస్తే
16 Ako bi u njoj bila ta tri èovjeka, tako ja živ bio, govori Gospod Gospod, neæe izbaviti sinova ni kæeri, nego æe se sami izbaviti, a zemlja æe opustjeti.
౧౬నా ప్రాణంపై ఒట్టేసి చెప్తున్నాను. ఆ ముగ్గురూ అక్కడే ఉన్నా వాళ్ళు తమ సొంత కొడుకులనూ కూతుళ్ళనూ కూడా రక్షించుకోలేరు. వాళ్ళ ప్రాణాలను మాత్రమే రక్షించుకోగలుగుతారు. దేశం వ్యర్ధమై పోతుంది. ఇది ప్రభువైన యెహోవా చేస్తున్న ప్రకటన.
17 Ili ako maè pustim na tu zemlju, i reèem: maèu, proði tu zemlju, da istrijebim u njoj ljude i stoku;
౧౭నేను దేశానికి విరోధంగా ఖడ్గాన్ని పంపి ‘ఖడ్గమా, దేశమంతా సంచరించి మనుషులనూ, పశువులనూ నిర్మూలం చెయ్యి’ అని ఆజ్ఞ ఇస్తే
18 Ako bi ta tri èovjeka bila u njoj, tako ja bio živ, govori Gospod Gospod, neæe izbaviti sinova ni kæeri, nego æe se sami izbaviti.
౧౮నా ప్రాణంపై ఒట్టేసి చెప్తున్నాను. ఆ ముగ్గురూ అక్కడే ఉన్నా వాళ్ళు తమ సొంత కొడుకులను, కూతుళ్ళను కూడా రక్షించుకోలేరు. తమ ప్రాణాలను మాత్రమే రక్షించుకోగలుగుతారు. ఇది ప్రభువైన యెహోవా చేస్తున్న ప్రకటన.
19 Ili ako pustim pomor na zemlju i izlijem gnjev svoj na nju da bi krv tekla da istrijebim u njoj ljude i stoku;
౧౯రక్తపాతం జరిగించడం ద్వారా నేను నా క్రోధాన్ని దేశంపై కుమ్మరించడానికి తెగులు పంపి మనుషులనూ, పశువులనూ నిర్మూలం చేయాలని చూస్తే
20 Ako bi Noje, Danilo i Jov bili u njoj, tako ja živ bio, govori Gospod Gospod, neæe izbaviti sina ni kæeri, nego æe svoje duše izbaviti pravdom svojom.
౨౦అప్పుడు నోవహు, దానియేలు, యోబు అనే ఆ ముగ్గురూ అక్కడే ఉన్నా నా ప్రాణంపై ఒట్టేసి చెప్తున్నాను. వాళ్ళు తమ సొంత కొడుకులను, కూతుళ్ళను కూడా రక్షించుకోలేరు. వాళ్ళు తమ నీతి వల్ల తమ ప్రాణాలను మాత్రమే రక్షించుకోగలుగుతారు.
21 Jer ovako veli Gospod Gospod: akamoli kad pustim èetiri ljuta zla svoja, maè i glad i zle zvijeri i pomor na Jerusalim, da istrijebim u njemu ljude i stoku.
౨౧ఎందుకంటే ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు. యెరూషలేముకు విరోధంగా దానిలోని మనుషులనూ, పశువులనూ నిర్మూలం చేయడానికి నేను కరువు, ఖడ్గం, క్రూర మృగాలు, తెగులు అనే నాలుగు శిక్షలను కచ్చితంగా పంపుతాను. మరింత గడ్డు పరిస్థితి కలిగిస్తాను.
22 I opet, gle, nekoliko æe ih ostati u njemu koji æe se izbaviti, sinovi ili kæeri, oni æe izaæi k vama, i vidjeæete put njihov i djela njihova, i utješiæete se za zlo koje æu pustiti na Jerusalim, za sve što æu pustiti na nj.
౨౨అయినా, వినండి! తమ కొడుకులతో కూతుళ్ళతో బయటకి వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఆ విధంగా దానిలో కొంత ‘శేషం’ మిగిలిపోతుంది. చూడండి! వాళ్ళ కొడుకులూ కూతుళ్ళూ తిరిగి నీ దగ్గరికి వస్తారు. నువ్వు వాళ్ళ ప్రవర్తననూ, పనులనూ చూస్తావు. అప్పుడు యెరూషలేముకు వ్యతిరేకంగా నేను పంపిన శిక్షల విషయంలోనూ, దేశానికి విరోధంగా నేను పంపిన వాటన్నిటి విషయంలోనూ నీకు ఆదరణ కలుగుతుంది.
23 I oni æe vas utješiti kad vidite put njihov i djela njihova; i poznaæete da nijesam bez uzroka uèinio što sam god uèinio u njemu, govori Gospod Gospod.
౨౩మిగిలి ఉన్న వాళ్ళ ప్రవర్తన, పనులు చూసినప్పుడు నీకు ఆదరణ కలుగుతుంది. వాళ్ళు నిన్ను ఆదరిస్తారు. నేను ఆమెకి వ్యతిరేకంగా చేసినదేదీ నిష్కారణంగా చేయలేదని మీరు తెలుసుకుంటారు. ఇది ప్రభువైన యెహోవా చేస్తున్న ప్రకటన.”