< మార్కః 6 >
1 అనన్తరం స తత్స్థానాత్ ప్రస్థాయ స్వప్రదేశమాగతః శిష్యాశ్చ తత్పశ్చాద్ గతాః|
౧యేసు అక్కడ నుండి తన శిష్యులతో కలసి తన స్వగ్రామానికి వచ్చాడు
2 అథ విశ్రామవారే సతి స భజనగృహే ఉపదేష్టుమారబ్ధవాన్ తతోఽనేకే లోకాస్తత్కథాం శ్రుత్వా విస్మిత్య జగదుః, అస్య మనుజస్య ఈదృశీ ఆశ్చర్య్యక్రియా కస్మాజ్ జాతా? తథా స్వకరాభ్యామ్ ఇత్థమద్భుతం కర్మ్మ కర్త్తామ్ ఏతస్మై కథం జ్ఞానం దత్తమ్?
౨విశ్రాంతి దినాన సమాజ మందిరంలో ఉపదేశించడం మొదలు పెట్టాడు. చాలామంది ఆయన ఉపదేశం విని ఎంతో ఆశ్చర్యపడ్డారు. “ఈ సంగతులన్నీ ఇతనికెలా తెలుసు? దేవుడు ఇతనికి ఎంతటి జ్ఞానం ఇచ్చాడు! ఇతని చేతుల ద్వారా ఇన్ని మహత్కార్యాలు ఎలా జరుగుతున్నాయి?
3 కిమయం మరియమః పుత్రస్తజ్ఞా నో? కిమయం యాకూబ్-యోసి-యిహుదా-శిమోనాం భ్రాతా నో? అస్య భగిన్యః కిమిహాస్మాభిః సహ నో? ఇత్థం తే తదర్థే ప్రత్యూహం గతాః|
౩ఇతడు వడ్రంగి కదూ! మరియ కొడుకు కదూ! యాకోబు, యోసే, యూదా, సీమోనులకు ఇతడు అన్న కదూ! ఇతడి చెల్లెళ్ళు అందరూ ఇక్కడ మనతోనే ఉన్నారు కదా!” అని చెప్పుకుంటూ ఆయన విషయంలో చాలా అభ్యంతరపడ్డారు.
4 తదా యీశుస్తేభ్యోఽకథయత్ స్వదేశం స్వకుటుమ్బాన్ స్వపరిజనాంశ్చ వినా కుత్రాపి భవిష్యద్వాదీ అసత్కృతో న భవతి|
౪యేసు వారితో, “ప్రవక్తకు తన సొంత ఊరిలో, సొంత వారి మధ్య, సొంత ఇంట్లో తప్ప అన్ని చోట్లా గౌరవం లభిస్తుంది” అని అన్నాడు.
5 అపరఞ్చ తేషామప్రత్యయాత్ స విస్మితః కియతాం రోగిణాం వపుఃషు హస్తమ్ అర్పయిత్వా కేవలం తేషామారోగ్యకరణాద్ అన్యత్ కిమపి చిత్రకార్య్యం కర్త్తాం న శక్తః|
౫అక్కడ యేసు కొద్దిమంది రోగుల మీద తన చేతులుంచి వారిని బాగుచేయడం తప్ప ఏ మహత్కార్యాలూ చేయలేకపోయాడు.
6 అథ స చతుర్దిక్స్థ గ్రామాన్ భ్రమిత్వా ఉపదిష్టవాన్
౬వారి అపనమ్మకానికి ఆయన ఆశ్చర్యపడ్డాడు. ఆ తరువాత యేసు చుట్టుపక్కల గ్రామాలు తిరుగుతూ ఉపదేశం చేశాడు.
7 ద్వాదశశిష్యాన్ ఆహూయ అమేధ్యభూతాన్ వశీకర్త్తాం శక్తిం దత్త్వా తేషాం ద్వౌ ద్వౌ జనో ప్రేషితవాన్|
౭యేసు తన పన్నెండుమంది శిష్యులను దగ్గరికి పిలుచుకుని, వారికి దయ్యాల మీద అధికారమిచ్చి ఇద్దరిద్దరిగా పంపుతూ ఇలా ఆజ్ఞ ఇచ్చాడు.
8 పునరిత్యాదిశద్ యూయమ్ ఏకైకాం యష్టిం వినా వస్త్రసంపుటః పూపః కటిబన్ధే తామ్రఖణ్డఞ్చ ఏషాం కిమపి మా గ్రహ్లీత,
౮“ప్రయాణం కోసం చేతికర్ర తప్ప ఇంకేదీ తీసుకు వెళ్ళకండి. ఆహారం గాని, చేతి సంచిగాని, నడికట్టులో డబ్బుగాని, తీసుకు వెళ్ళకండి.
9 మార్గయాత్రాయై పాదేషూపానహౌ దత్త్వా ద్వే ఉత్తరీయే మా పరిధద్వ్వం|
౯చెప్పులు వేసుకోండి గాని, మారు దుస్తులు తీసుకు వెళ్ళకండి.
10 అపరమప్యుక్తం తేన యూయం యస్యాం పుర్య్యాం యస్య నివేశనం ప్రవేక్ష్యథ తాం పురీం యావన్న త్యక్ష్యథ తావత్ తన్నివేశనే స్థాస్యథ|
౧౦ఒకరి ఇంటికి వెళ్ళాక ఆ గ్రామం విడిచే వరకూ ఆ ఇంట్లోనే ఉండండి.
11 తత్ర యది కేపి యుష్మాకమాతిథ్యం న విదధతి యుష్మాకం కథాశ్చ న శృణ్వన్తి తర్హి తత్స్థానాత్ ప్రస్థానసమయే తేషాం విరుద్ధం సాక్ష్యం దాతుం స్వపాదానాస్ఫాల్య రజః సమ్పాతయత; అహం యుష్మాన్ యథార్థం వచ్మి విచారదినే తన్నగరస్యావస్థాతః సిదోమామోరయో ర్నగరయోరవస్థా సహ్యతరా భవిష్యతి|
౧౧ఏ గ్రామం వారైనా మిమ్మల్ని స్వీకరించకపోతే, మీ మాటలు వినకపోతే, మీరు ఆ గ్రామం వదిలే ముందు వారి వ్యతిరేక సాక్షంగా మీ పాద ధూళిని దులిపి వేయండి.”
12 అథ తే గత్వా లోకానాం మనఃపరావర్త్తనీః కథా ప్రచారితవన్తః|
౧౨శిష్యులు వెళ్ళి ‘పశ్చాత్తాప పడండి’ అంటూ ప్రకటించారు.
13 ఏవమనేకాన్ భూతాంశ్చ త్యాజితవన్తస్తథా తైలేన మర్ద్దయిత్వా బహూన్ జనానరోగానకార్షుః|
౧౩ఎన్నో దయ్యాలను వదిలించారు. శిష్యులు అనేకమంది రోగులను నూనె రాసి బాగుచేశారు.
14 ఇత్థం తస్య సుఖ్యాతిశ్చతుర్దిశో వ్యాప్తా తదా హేరోద్ రాజా తన్నిశమ్య కథితవాన్, యోహన్ మజ్జకః శ్మశానాద్ ఉత్థిత అతోహేతోస్తేన సర్వ్వా ఏతా అద్భుతక్రియాః ప్రకాశన్తే|
౧౪యేసు పేరు ప్రసిద్ధి కావడం వల్ల ఆ సంగతి హేరోదు రాజుకు తెలిసింది. బాప్తిసం ఇచ్చే యోహాను బతికి వచ్చాడని, అందుకే యేసులో మహత్కార్యాలు చేసే శక్తి ఉన్నదని కొందరు అన్నారు.
15 అన్యేఽకథయన్ అయమ్ ఏలియః, కేపి కథితవన్త ఏష భవిష్యద్వాదీ యద్వా భవిష్యద్వాదినాం సదృశ ఏకోయమ్|
౧౫ఇతరులు, “ఈయన ఏలీయా” అన్నారు. ఇంకొందరు, “పూర్వకాలపు ప్రవక్తల వంటి ప్రవక్త” అన్నారు.
16 కిన్తు హేరోద్ ఇత్యాకర్ణ్య భాషితవాన్ యస్యాహం శిరశ్ఛిన్నవాన్ స ఏవ యోహనయం స శ్మశానాదుదతిష్ఠత్|
౧౬కాని, హేరోదైతే, “నేను తల నరికించిన యోహాను మళ్ళీ బతికి వచ్చాడు” అన్నాడు.
17 పూర్వ్వం స్వభ్రాతుః ఫిలిపస్య పత్న్యా ఉద్వాహం కృతవన్తం హేరోదం యోహనవాదీత్ స్వభాతృవధూ ర్న వివాహ్యా|
౧౭ఇంతకు ముందు హేరోదు స్వయంగా యోహానును బంధించి, ఖైదులో వేయించాడు. తాను వివాహం చేసుకున్న హేరోదియ కారణంగా అతడు ఈ పని చేయవలసి వచ్చింది. ఈమె హేరోదు సోదరుడైన ఫిలిప్పు భార్య.
18 అతః కారణాత్ హేరోద్ లోకం ప్రహిత్య యోహనం ధృత్వా బన్ధనాలయే బద్ధవాన్|
౧౮ఎందుకంటే యోహాను హేరోదుతో, “నీ సోదరుని భార్యను తెచ్చుకోవడం అన్యాయం” అని హెచ్చరించాడు.
19 హేరోదియా తస్మై యోహనే ప్రకుప్య తం హన్తుమ్ ఐచ్ఛత్ కిన్తు న శక్తా,
౧౯అందుచేత హేరోదియ యోహాను మీద పగపట్టి, అతణ్ణి చంపాలని ఆశించింది కానీ అలా చెయ్యలేకపోయింది.
20 యస్మాద్ హేరోద్ తం ధార్మ్మికం సత్పురుషఞ్చ జ్ఞాత్వా సమ్మన్య రక్షితవాన్; తత్కథాం శ్రుత్వా తదనుసారేణ బహూని కర్మ్మాణి కృతవాన్ హృష్టమనాస్తదుపదేశం శ్రుతవాంశ్చ|
౨౦ఎందుకంటే హేరోదు యోహానుకు భయపడేవాడు. యోహాను నీతిమంతుడు, పవిత్రమైనవాడు అని హేరోదుకు తెలుసు కనుక అతణ్ణి కాపాడుతూ వచ్చాడు. హేరోదు యోహాను మాటలు విన్నప్పుడు ఎంతో కలవర పడేవాడు. అయినా అతని మాటలు వినడానికి ఇష్టపడేవాడు.
21 కిన్తు హేరోద్ యదా స్వజన్మదినే ప్రధానలోకేభ్యః సేనానీభ్యశ్చ గాలీల్ప్రదేశీయశ్రేష్ఠలోకేభ్యశ్చ రాత్రౌ భోజ్యమేకం కృతవాన్
౨౧ఒక రోజు హేరోదియకు అవకాశం దొరికింది. హేరోదు తన రాజ్యంలోని అధికారులను, సైన్యాధిపతులను, గలిలయలోని గొప్పవారిని పిలిచి తన పుట్టిన రోజు విందు చేశాడు.
22 తస్మిన్ శుభదినే హేరోదియాయాః కన్యా సమేత్య తేషాం సమక్షం సంనృత్య హేరోదస్తేన సహోపవిష్టానాఞ్చ తోషమజీజనత్ తతా నృపః కన్యామాహ స్మ మత్తో యద్ యాచసే తదేవ తుభ్యం దాస్యే|
౨౨హేరోదియ కూతురు వచ్చి నాట్యం చేసి, హేరోదును అతని అతిధులను మెప్పించింది. అప్పుడు హేరోదు ఆమెతో, “నీకు ఏది ఇష్టమో అది అడుగు, ఇస్తాను!” అని అన్నాడు.
23 శపథం కృత్వాకథయత్ చేద్ రాజ్యార్ద్ధమపి యాచసే తదపి తుభ్యం దాస్యే|
౨౩“నువ్వు ఏది అడిగినా ఇస్తాను, నా రాజ్యంలో సగమైనా సరే!” అని ప్రమాణం చేశాడు.
24 తతః సా బహి ర్గత్వా స్వమాతరం పప్రచ్ఛ కిమహం యాచిష్యే? తదా సాకథయత్ యోహనో మజ్జకస్య శిరః|
౨౪ఆమె బయటకి వెళ్ళి తన తల్లితో, “నన్నేమి కోరుకోమంటావు?” అని అడిగింది. ఆమె, “బాప్తిసం ఇచ్చే యోహాను తల కోరుకో” అని చెప్పింది.
25 అథ తూర్ణం భూపసమీపమ్ ఏత్య యాచమానావదత్ క్షణేస్మిన్ యోహనో మజ్జకస్య శిరః పాత్రే నిధాయ దేహి, ఏతద్ యాచేఽహం|
౨౫వెంటనే ఆమె రాజు దగ్గరికి త్వరగా వెళ్ళి, “బాప్తిసం ఇచ్చే యోహాను తలను పళ్ళెంలో పెట్టి ఇప్పుడే నాకు ఇప్పించండి, నాకు కావలసింది అదే” అని అడిగింది.
26 తస్మాత్ భూపోఽతిదుఃఖితః, తథాపి స్వశపథస్య సహభోజినాఞ్చానురోధాత్ తదనఙ్గీకర్త్తుం న శక్తః|
౨౬రాజుకు చాలా దుఃఖం కలిగింది గాని, తాను చేసిన ప్రమాణం కారణంగా తనతో కూర్చుని ఉన్నవారిని బట్టి ఆమె కోరికను తోసిపుచ్చలేక పోయాడు.
27 తత్క్షణం రాజా ఘాతకం ప్రేష్య తస్య శిర ఆనేతుమాదిష్టవాన్|
౨౭అందువల్ల అతడు వెంటనే యోహాను తల తీసుకు రమ్మని ఆజ్ఞాపించి భటుణ్ణి పంపాడు. ఆ భటుడు వెళ్ళి ఖైదులోనే యోహాను తల నరికి
28 తతః స కారాగారం గత్వా తచ్ఛిరశ్ఛిత్వా పాత్రే నిధాయానీయ తస్యై కన్యాయై దత్తవాన్ కన్యా చ స్వమాత్రే దదౌ|
౨౮దాన్ని ఒక పళ్ళెంలో పెట్టి, తీసుకు వచ్చి ఆమెకు కానుకగా ఇచ్చాడు. ఆమె దాన్ని తన తల్లికి ఇచ్చింది.
29 అననతరం యోహనః శిష్యాస్తద్వార్త్తాం ప్రాప్యాగత్య తస్య కుణపం శ్మశానేఽస్థాపయన్|
౨౯యోహాను శిష్యులు ఈ సంగతి విని వచ్చి అతని శవాన్ని తీసుకుపోయి సమాధి చేశారు.
30 అథ ప్రేషితా యీశోః సన్నిధౌ మిలితా యద్ యచ్ చక్రుః శిక్షయామాసుశ్చ తత్సర్వ్వవార్త్తాస్తస్మై కథితవన్తః|
౩౦అపొస్తలులు యేసు దగ్గరికి తిరిగి వచ్చి తాము చేసిన వాటి గురించీ బోధించిన వాటి గురించీ వివరంగా ఆయనకు చెప్పారు.
31 స తానువాచ యూయం విజనస్థానం గత్వా విశ్రామ్యత యతస్తత్సన్నిధౌ బహులోకానాం సమాగమాత్ తే భోక్తుం నావకాశం ప్రాప్తాః|
౩౧వారి దగ్గరికి అనేకమంది వస్తూ పోతూ ఉండడం వల్ల వారికి భోజనం తినడానికి కూడా సమయం లేకపోయింది. యేసు వారితో, “నాతో మీరు మాత్రమే ఒక నిర్జన ప్రదేశానికి వచ్చి, కొంత విశ్రాంతి తీసుకోండి” అని అన్నాడు.
32 తతస్తే నావా విజనస్థానం గుప్తం గగ్ముః|
౩౨అందువల్ల వారు మాత్రమే పడవలో ఏకాంతంగా నిర్జన ప్రదేశానికి వెళ్ళారు.
33 తతో లోకనివహస్తేషాం స్థానాన్తరయానం దదర్శ, అనేకే తం పరిచిత్య నానాపురేభ్యః పదైర్వ్రజిత్వా జవేన తైషామగ్రే యీశోః సమీప ఉపతస్థుః|
౩౩అయితే వారు వెళ్తూ ఉండగా జనసమూహాలు ఆయనను గుర్తుపట్టి వివిధ గ్రామాల నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళి వారికన్నా ముందే ఆ నిర్జన ప్రదేశానికి చేరుకున్నారు.
34 తదా యీశు ర్నావో బహిర్గత్య లోకారణ్యానీం దృష్ట్వా తేషు కరుణాం కృతవాన్ యతస్తేఽరక్షకమేషా ఇవాసన్ తదా స తాన నానాప్రసఙ్గాన్ ఉపదిష్టవాన్|
౩౪పడవలో యేసు అక్కడికి చేరినప్పుడు పెద్ద జనసమూహం ఆయనకు కనిపించింది. కాపరి లేని గొర్రెల్లా ఉన్న ఆ ప్రజలను చూసి ఆయనకు జాలి కలిగింది. అందుచేత ఆయన వారికి అనేక విషయాలు ఉపదేశించ సాగాడు.
35 అథ దివాన్తే సతి శిష్యా ఏత్య యీశుమూచిరే, ఇదం విజనస్థానం దినఞ్చావసన్నం|
౩౫చాలా పొద్దుపోయిన తరువాత ఆయన శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి, “ఇది నిర్జన ప్రదేశం, ఇప్పటికే పొద్దుపోయింది.
36 లోకానాం కిమపి ఖాద్యం నాస్తి, అతశ్చతుర్దిక్షు గ్రామాన్ గన్తుం భోజ్యద్రవ్యాణి క్రేతుఞ్చ భవాన్ తాన్ విసృజతు|
౩౬ఈ ప్రజలకు తినడానికి ఏమీ లేదు కాబట్టి వారు చుట్టూ ఉన్న పల్లెలకో గ్రామాలకో వెళ్ళి ఏదైనా కొనుక్కోడానికి వారిని పంపివెయ్యి” అన్నారు.
37 తదా స తానువాచ యూయమేవ తాన్ భోజయత; తతస్తే జగదు ర్వయం గత్వా ద్విశతసంఖ్యకై ర్ముద్రాపాదైః పూపాన్ క్రీత్వా కిం తాన్ భోజయిష్యామః?
౩౭అయితే యేసు వారితో, “మీరే వారికి ఆహారం పెట్టండి!” అన్నాడు. అందుకు వారు ఆయనతో, “రెండు వందల దేనారాలకు రొట్టెలు కొని, వారికి పంచి పెట్టమంటావా” అని ఆయనను అడిగారు.
38 తదా స తాన్ పృష్ఠవాన్ యుష్మాకం సన్నిధౌ కతి పూపా ఆసతే? గత్వా పశ్యత; తతస్తే దృష్ట్వా తమవదన్ పఞ్చ పూపా ద్వౌ మత్స్యౌ చ సన్తి|
౩౮ఆయన వారితో “మీ దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయో చూడండి” అన్నాడు. వారు వెళ్ళి చూసి, “ఐదు రొట్టెలు, రెండు చిన్న చేపలు ఉన్నాయి” అని అన్నారు.
39 తదా స లోకాన్ శస్పోపరి పంక్తిభిరుపవేశయితుమ్ ఆదిష్టవాన్,
౩౯అప్పుడాయన అందరినీ గుంపులు గుంపులుగా పచ్చగడ్డి మీద కూర్చోబెట్టమని శిష్యులతో చెప్పాడు.
40 తతస్తే శతం శతం జనాః పఞ్చాశత్ పఞ్చాశజ్జనాశ్చ పంక్తిభి ర్భువి సముపవివిశుః|
౪౦ప్రజలు గుంపుకు యాభైమంది, వందమంది చొప్పున కూర్చున్నారు.
41 అథ స తాన్ పఞ్చపూపాన్ మత్స్యద్వయఞ్చ ధృత్వా స్వర్గం పశ్యన్ ఈశ్వరగుణాన్ అన్వకీర్త్తయత్ తాన్ పూపాన్ భంక్త్వా లోకేభ్యః పరివేషయితుం శిష్యేభ్యో దత్తవాన్ ద్వా మత్స్యౌ చ విభజ్య సర్వ్వేభ్యో దత్తవాన్|
౪౧యేసు ఆ ఐదు రొట్టెలు, రెండు చేపలు చేతపట్టుకుని ఆకాశం వైపు చూసి, దేవునికి కృతజ్ఞత చెప్పి రొట్టెలు విరిచి, జనసమూహానికి వడ్డించడానికి శిష్యులకు అందించాడు. అదే విధంగా ఆ రెండు చేపలను కూడా భాగాలు చేసి అందరికీ పంచాడు.
42 తతః సర్వ్వే భుక్త్వాతృప్యన్|
౪౨అందరూ తిని సంతృప్తి చెందారు.
43 అనన్తరం శిష్యా అవశిష్టైః పూపై ర్మత్స్యైశ్చ పూర్ణాన్ ద్వదశ డల్లకాన్ జగృహుః|
౪౩శిష్యులు మిగిలిన రొట్టె ముక్కలను, చేప ముక్కలను పన్నెండు గంపల నిండా నింపారు.
44 తే భోక్తారః ప్రాయః పఞ్చ సహస్రాణి పురుషా ఆసన్|
౪౪ఆ రోజు అక్కడ రొట్టెలు తిన్న పురుషులు ఐదు వేల మంది.
45 అథ స లోకాన్ విసృజన్నేవ నావమారోఢుం స్వస్మాదగ్రే పారే బైత్సైదాపురం యాతుఞ్చ శ్ష్యిన్ వాఢమాదిష్టవాన్|
౪౫ఆ తరువాత యేసు తన శిష్యులను తనకన్నా ముందు బేత్సయిదాకు వెళ్ళమని చెప్పి వారిని పడవ ఎక్కించాడు.
46 తదా స సర్వ్వాన్ విసృజ్య ప్రార్థయితుం పర్వ్వతం గతః|
౪౬జనసమూహాన్ని పంపివేసిన తరువాత ఆయన ప్రార్థించడానికి కొండకు వెళ్ళాడు.
47 తతః సన్ధ్యాయాం సత్యాం నౌః సిన్ధుమధ్య ఉపస్థితా కిన్తు స ఏకాకీ స్థలే స్థితః|
౪౭చీకటి పడుతూ ఉన్న సమయంలో శిష్యులు ఉన్న పడవ సముద్రం మధ్యలో ఉంది. యేసు మాత్రమే ఒడ్డున ఉన్నాడు.
48 అథ సమ్ముఖవాతవహనాత్ శిష్యా నావం వాహయిత్వా పరిశ్రాన్తా ఇతి జ్ఞాత్వా స నిశాచతుర్థయామే సిన్ధూపరి పద్భ్యాం వ్రజన్ తేషాం సమీపమేత్య తేషామగ్రే యాతుమ్ ఉద్యతః|
౪౮ఎదురుగాలి వీస్తూ ఉండడం వల్ల శిష్యులు చాలా కష్టంగా పడవ నడపడం చూసి యేసు తెల్లవారుజామున సరస్సు మీద నడుస్తూ వారి దగ్గరికి వెళ్ళాడు. ఆయన వారిని దాటి వెళ్ళబోతూ ఉండగా,
49 కిన్తు శిష్యాః సిన్ధూపరి తం వ్రజన్తం దృష్ట్వా భూతమనుమాయ రురువుః,
౪౯ఆయన శిష్యులు ఆయన నీళ్ళ మీద నడవడం చూసి, దయ్యం అనుకుని భయపడి బిగ్గరగా కేకలు వేశారు.
50 యతః సర్వ్వే తం దృష్ట్వా వ్యాకులితాః| అతఏవ యీశుస్తత్క్షణం తైః సహాలప్య కథితవాన్, సుస్థిరా భూత, అయమహం మా భైష్ట|
౫౦వెంటనే యేసు వారితో, “ధైర్యంగా ఉండండి. నేనే! భయపడకండి!” అని అన్నాడు.
51 అథ నౌకామారుహ్య తస్మిన్ తేషాం సన్నిధిం గతే వాతో నివృత్తః; తస్మాత్తే మనఃసు విస్మితా ఆశ్చర్య్యం మేనిరే|
౫౧ఆయన వారి దగ్గరికి వచ్చి, పడవ ఎక్కగానే గాలి ఆగింది. వారు తమలో తాము ఆశ్చర్యపడుతూ అమితంగా విభ్రాంతి చెందారు.
52 యతస్తే మనసాం కాఠిన్యాత్ తత్ పూపీయమ్ ఆశ్చర్య్యం కర్మ్మ న వివిక్తవన్తః|
౫౨ఎందుకంటే రొట్టెలు పంచిన అద్భుతాన్ని వారు చూశారు కాని, వారి హృదయం బండబారి పోయింది కాబట్టి రొట్టెలను గురించిన సంగతి వారు గ్రహించలేదు.
53 అథ తే పారం గత్వా గినేషరత్ప్రదేశమేత్య తట ఉపస్థితాః|
౫౩వారు అవతలి ఒడ్డుకు వెళ్ళి గెన్నేసరెతు ప్రాంతానికి చేరి అక్కడ పడవ నిలిపారు.
54 తేషు నౌకాతో బహిర్గతేషు తత్ప్రదేశీయా లోకాస్తం పరిచిత్య
౫౪వారు పడవ దిగిన వెంటనే ప్రజలు యేసును గుర్తుపట్టారు.
55 చతుర్దిక్షు ధావన్తో యత్ర యత్ర రోగిణో నరా ఆసన్ తాన్ సర్వ్వాన ఖట్వోపరి నిధాయ యత్ర కుత్రచిత్ తద్వార్త్తాం ప్రాపుః తత్ స్థానమ్ ఆనేతుమ్ ఆరేభిరే|
౫౫ప్రజలు చుట్టు పక్కల ఉన్న ప్రాంతాలకు పరుగెత్తుకుంటూ వెళ్ళి రోగులను మంచాల మీద ఉంచి ఆయన ఉన్న చోటికి తీసుకు వచ్చారు.
56 తథా యత్ర యత్ర గ్రామే యత్ర యత్ర పురే యత్ర యత్ర పల్ల్యాఞ్చ తేన ప్రవేశః కృతస్తద్వర్త్మమధ్యే లోకాః పీడితాన్ స్థాపయిత్వా తస్య చేలగ్రన్థిమాత్రం స్ప్రష్టుమ్ తేషామర్థే తదనుజ్ఞాం ప్రార్థయన్తః యావన్తో లోకాః పస్పృశుస్తావన్త ఏవ గదాన్ముక్తాః|
౫౬యేసు ఏ గ్రామంలో, ఏ పట్టణంలో ఏ పల్లెలో ప్రవేశించినా వారు రోగులను వీధుల్లో పడుకోబెట్టి, ఆయన వస్త్రాన్నయినా తాకనియ్యమని ఆయనను బతిమాలారు. ఆయనను తాకిన వారంతా బాగుపడ్డారు.