< లూకః 12 >
1 తదానీం లోకాః సహస్రం సహస్రమ్ ఆగత్య సముపస్థితాస్తత ఏకైకో ఽన్యేషాముపరి పతితుమ్ ఉపచక్రమే; తదా యీశుః శిష్యాన్ బభాషే, యూయం ఫిరూశినాం కిణ్వరూపకాపట్యే విశేషేణ సావధానాస్తిష్ఠత|
౧అంతలో వేలకొద్దీ ప్రజలు పోగయి ఒకరినొకరు తొక్కుకుంటూ ఉన్నారు. అప్పుడు ఆయన మొదట తన శిష్యులతో ఇలా చెప్పనారంభించాడు. “పరిసయ్యుల పులిసిన పిండిని గురించి అంటే వారి వేషధారణ విషయం జాగ్రత్త పడండి.
2 యతో యన్న ప్రకాశయిష్యతే తదాచ్ఛన్నం వస్తు కిమపి నాస్తి; తథా యన్న జ్ఞాస్యతే తద్ గుప్తం వస్తు కిమపి నాస్తి|
౨కప్పి పెట్టింది ఏదీ బట్టబయలు కాకపోదు. రహస్యమైనదేదీ తెలియకుండా ఉండదు.
3 అన్ధకారే తిష్ఠనతో యాః కథా అకథయత తాః సర్వ్వాః కథా దీప్తౌ శ్రోష్యన్తే నిర్జనే కర్ణే చ యదకథయత గృహపృష్ఠాత్ తత్ ప్రచారయిష్యతే|
౩అందుకని మీరు చీకటిలో మాట్లాడేవి వెలుగులో వినబడతాయి. గదుల్లో చెప్పుకునేవి ఇంటి కప్పుల పైన చాటిస్తారు.
4 హే బన్ధవో యుష్మానహం వదామి, యే శరీరస్య నాశం వినా కిమప్యపరం కర్త్తుం న శక్రువన్తి తేభ్యో మా భైష్ట|
౪నా స్నేహితులైన మీకు నేను చెప్పేదేమిటంటే దేహాన్ని చంపడం మినహా మరేమీ చేయలేని వాడికి భయపడవద్దు.
5 తర్హి కస్మాద్ భేతవ్యమ్ ఇత్యహం వదామి, యః శరీరం నాశయిత్వా నరకం నిక్షేప్తుం శక్నోతి తస్మాదేవ భయం కురుత, పునరపి వదామి తస్మాదేవ భయం కురుత| (Geenna )
౫ఎవరికి మీరు భయపడాలో చెబుతాను. చంపిన తరువాత నరకంలో పడవేసే శక్తి గల వాడికి భయపడండి. ఆయనకే భయపడమని మీకు చెబుతున్నాను. (Geenna )
6 పఞ్చ చటకపక్షిణః కిం ద్వాభ్యాం తామ్రఖణ్డాభ్యాం న విక్రీయన్తే? తథాపీశ్వరస్తేషామ్ ఏకమపి న విస్మరతి|
౬ఐదు పిచ్చుకలను రెండు కాసులకు అమ్ముతారు కదా. అయినా వాటిలో ఒక్కదాన్ని కూడా దేవుడు మర్చిపోడు.
7 యుష్మాకం శిరఃకేశా అపి గణితాః సన్తి తస్మాత్ మా విభీత బహుచటకపక్షిభ్యోపి యూయం బహుమూల్యాః|
౭మీ తలవెంట్రుకలన్నిటికీ లెక్క ఉంది. భయపడకండి. మీరు ఎన్నో పిచ్చుకల కంటే విలువైన వారు కదా.
8 అపరం యుష్మభ్యం కథయామి యః కశ్చిన్ మానుషాణాం సాక్షాన్ మాం స్వీకరోతి మనుష్యపుత్ర ఈశ్వరదూతానాం సాక్షాత్ తం స్వీకరిష్యతి|
౮ఇంకా మీతో చెప్పేదేమిటంటే, నన్ను మనుషుల ముందు ఎవరు అంగీకరిస్తాడో వాణ్ణి మనుష్య కుమారుడు దేవుని దూతల ముందు అంగీకరిస్తాడు.
9 కిన్తు యః కశ్చిన్మానుషాణాం సాక్షాన్మామ్ అస్వీకరోతి తమ్ ఈశ్వరస్య దూతానాం సాక్షాద్ అహమ్ అస్వీకరిష్యామి|
౯మనుషుల ముందు నేనెవరో తెలియదు అనే వారి గురించి నేను కూడా దేవుని దూతల ముందు వారెవరో నాకు తెలియదు అని చెబుతాను.
10 అన్యచ్చ యః కశ్చిన్ మనుజసుతస్య నిన్దాభావేన కాఞ్చిత్ కథాం కథయతి తస్య తత్పాపస్య మోచనం భవిష్యతి కిన్తు యది కశ్చిత్ పవిత్రమ్ ఆత్మానం నిన్దతి తర్హి తస్య తత్పాపస్య మోచనం న భవిష్యతి|
౧౦మనుష్య కుమారుడికి వ్యతిరేకంగా ఏదన్నా మాట అనే వాడికి పాపక్షమాపణ కలుగుతుంది గానీ పరిశుద్ధాత్మను దూషిస్తే వాడికి క్షమాపణ లేదు.
11 యదా లోకా యుష్మాన్ భజనగేహం విచారకర్తృరాజ్యకర్తృణాం సమ్ముఖఞ్చ నేష్యన్తి తదా కేన ప్రకారేణ కిముత్తరం వదిష్యథ కిం కథయిష్యథ చేత్యత్ర మా చిన్తయత;
౧౧వారు సమాజమందిరాల్లో పెద్దల దగ్గరకూ అధిపతుల దగ్గరకూ అధికారుల దగ్గరకూ మిమ్మల్ని తీసుకు వెళ్ళేటప్పుడు అక్కడ ఎలా జవాబివ్వాలా, ఏం మాట్లాడాలా అని చింత పడవద్దు.
12 యతో యుష్మాభిర్యద్ యద్ వక్తవ్యం తత్ తస్మిన్ సమయఏవ పవిత్ర ఆత్మా యుష్మాన్ శిక్షయిష్యతి|
౧౨మీరు ఏం చెప్పాలో ఆ సమయంలోనే పరిశుద్ధాత్మ మీకు నేర్పిస్తాడు.”
13 తతః పరం జనతామధ్యస్థః కశ్చిజ్జనస్తం జగాద హే గురో మయా సహ పైతృకం ధనం విభక్తుం మమ భ్రాతరమాజ్ఞాపయతు భవాన్|
౧౩ఆ జనసమూహంలో ఒకడు, “ఉపదేశకా, వారసత్వంగా వచ్చిన ఆస్తిలో నాకు భాగం పంచమని మా అన్నయ్యతో చెప్పండి” అన్నాడు.
14 కిన్తు స తమవదత్ హే మనుష్య యువయో ర్విచారం విభాగఞ్చ కర్త్తుం మాం కో నియుక్తవాన్?
౧౪అందుకు ఆయన, “ఏమయ్యా, మీ మీద పెద్దమనిషిగా మధ్యవర్తిగానో నన్నెవరు నియమించారు?” అన్నాడు.
15 అనన్తరం స లోకానవదత్ లోభే సావధానాః సతర్కాశ్చ తిష్ఠత, యతో బహుసమ్పత్తిప్రాప్త్యా మనుష్యస్యాయు ర్న భవతి|
౧౫ఆయన ఇంకా వారితో ఇలా అన్నాడు, “మీరు అత్యాశకు చోటివ్వకండి. జీవం అంటే సంపదలు విస్తరించడం కాదు.”
16 పశ్చాద్ దృష్టాన్తకథాముత్థాప్య కథయామాస, ఏకస్య ధనినో భూమౌ బహూని శస్యాని జాతాని|
౧౬తరువాత ఆయన వారికి ఈ ఉపమానం చెప్పాడు. “ఒక ధనవంతుడి భూమి బాగా దిగుబడి ఇచ్చింది.
17 తతః స మనసా చిన్తయిత్వా కథయామ్బభూవ మమైతాని సముత్పన్నాని ద్రవ్యాణి స్థాపయితుం స్థానం నాస్తి కిం కరిష్యామి?
౧౭అప్పుడు అతడు ఇలా ఆలోచించాడు, ‘నా పంట సమకూర్చుకోడానికి నాకు స్థలం చాలదు. కాబట్టి నేనేం చేయాలి? ఇలా చేస్తాను.
18 తతోవదద్ ఇత్థం కరిష్యామి, మమ సర్వ్వభాణ్డాగారాణి భఙ్క్త్వా బృహద్భాణ్డాగారాణి నిర్మ్మాయ తన్మధ్యే సర్వ్వఫలాని ద్రవ్యాణి చ స్థాపయిష్యామి|
౧౮నా గిడ్డంగులు పడగొట్టి ఇంకా పెద్దవి కట్టిస్తాను. వాటిలో నా ధాన్యమంతటినీ, నా ఆస్తి అంతటినీ నిల్వ చేస్తాను.
19 అపరం నిజమనో వదిష్యామి, హే మనో బహువత్సరార్థం నానాద్రవ్యాణి సఞ్చితాని సన్తి విశ్రామం కురు భుక్త్వా పీత్వా కౌతుకఞ్చ కురు| కిన్త్వీశ్వరస్తమ్ అవదత్,
౧౯అప్పుడు నా ప్రాణంతో ‘ప్రాణమా, ఎన్నో సంవత్సరాలకు సరిపడే తరగని ఆస్తి నీ కోసం సమకూర్చాను. సుఖపడు, తిను, తాగు, సంతోషంగా ఉండు’ అని చెబుతాను’ అనుకున్నాడు.
20 రే నిర్బోధ అద్య రాత్రౌ తవ ప్రాణాస్త్వత్తో నేష్యన్తే తత ఏతాని యాని ద్రవ్యాణి త్వయాసాదితాని తాని కస్య భవిష్యన్తి?
౨౦అయితే దేవుడు అతడితో, ‘మూర్ఖుడా! ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నాను. నువ్వు కూడబెట్టినవి ఎవరివి అవుతాయి?’ అని అతనితో అన్నాడు.
21 అతఏవ యః కశ్చిద్ ఈశ్వరస్య సమీపే ధనసఞ్చయమకృత్వా కేవలం స్వనికటే సఞ్చయం కరోతి సోపి తాదృశః|
౨౧దేవుని విషయంలో ధనవంతుడు కాకుండా తన కోసమే సమకూర్చుకునే వాడు అలాగే ఉంటాడు” అన్నాడు.
22 అథ స శిష్యేభ్యః కథయామాస, యుష్మానహం వదామి, కిం ఖాదిష్యామః? కిం పరిధాస్యామః? ఇత్యుక్త్వా జీవనస్య శరీరస్య చార్థం చిన్తాం మా కార్ష్ట|
౨౨తరువాత యేసు తన శిష్యులతో ఇలా చెప్పాడు, “అందుచేత ఏం తింటామని మీ ప్రాణం కోసమో, ఏం కట్టుకుంటామని మీ శరీరం కోసమో మధన పడవద్దు.
23 భక్ష్యాజ్జీవనం భూషణాచ్ఛరీరఞ్చ శ్రేష్ఠం భవతి|
౨౩ఆహారం కంటే ప్రాణం, వస్త్రం కంటే దేహం గొప్పవి కావా?
24 కాకపక్షిణాం కార్య్యం విచారయత, తే న వపన్తి శస్యాని చ న ఛిన్దన్తి, తేషాం భాణ్డాగారాణి న సన్తి కోషాశ్చ న సన్తి, తథాపీశ్వరస్తేభ్యో భక్ష్యాణి దదాతి, యూయం పక్షిభ్యః శ్రేష్ఠతరా న కిం?
౨౪కాకుల గురించి ఆలోచించండి. అవి విత్తనాలు చల్లవు, కోయవు, వాటికి గిడ్డంగులూ, కొట్లూ లేవు. అయినా వాటిని దేవుడు పోషిస్తున్నాడు. మీరు పక్షులకంటే ఎంతో ఉన్నతమైన వారు.
25 అపరఞ్చ భావయిత్వా నిజాయుషః క్షణమాత్రం వర్ద్ధయితుం శక్నోతి, ఏతాదృశో లాకో యుష్మాకం మధ్యే కోస్తి?
౨౫పైగా మీలో ఎవడు చింత పడడం వల్ల తన ఎత్తును ఒక మూరెడు ఎక్కువ చేసుకోగలడు?
26 అతఏవ క్షుద్రం కార్య్యం సాధయితుమ్ అసమర్థా యూయమ్ అన్యస్మిన్ కార్య్యే కుతో భావయథ?
౨౬కాబట్టి చిన్న చిన్న విషయాలే మీరు చేయలేకపోతే పెద్దవాటిని గురించి ఆలోచించడం ఎందుకు? పువ్వులు ఎలా పూస్తున్నాయో చూడండి.
27 అన్యచ్చ కామ్పిలపుష్పం కథం వర్ద్ధతే తదాపి విచారయత, తత్ కఞ్చన శ్రమం న కరోతి తన్తూంశ్చ న జనయతి కిన్తు యుష్మభ్యం యథార్థం కథయామి సులేమాన్ బహ్వైశ్వర్య్యాన్వితోపి పుష్పస్యాస్య సదృశో విభూషితో నాసీత్|
౨౭అవి కష్టపడవు, బట్టలు నేయవు. అయినా తన వైభవమంతటితో సహా సొలొమోనుకున్న అలంకరణ ఈ పూలలో ఏ ఒక్కదాని అలంకరణకీ సరి తూగదని మీకు చెబుతున్నాను.
28 అద్య క్షేత్రే వర్త్తమానం శ్వశ్చూల్ల్యాం క్షేప్స్యమానం యత్ తృణం, తస్మై యదీశ్వర ఇత్థం భూషయతి తర్హి హే అల్పప్రత్యయినో యుష్మాన కిం న పరిధాపయిష్యతి?
౨౮అల్ప విశ్వాసులారా, ఈ వేళ పొలంలో ఉండి, రేపు పొయ్యిలో వేసే అడవి గడ్డినే దేవుడిలా అలంకరిస్తే మీకు మరి ఎంతో ఖాయంగా బట్టలిస్తాడు గదా.
29 అతఏవ కిం ఖాదిష్యామః? కిం పరిధాస్యామః? ఏతదర్థం మా చేష్టధ్వం మా సందిగ్ధ్వఞ్చ|
౨౯ఏం తింటాం, ఏం తాగుతాం అని దిగులు పెట్టుకోకండి. చింతించకండి.
30 జగతో దేవార్చ్చకా ఏతాని సర్వ్వాణి చేష్టనతే; ఏషు వస్తుషు యుష్మాకం ప్రయోజనమాస్తే ఇతి యుష్మాకం పితా జానాతి|
౩౦లోకులు వీటిని వెతుకుతారు. ఇవి మీకు కావాలని మీ తండ్రికి తెలుసు.
31 అతఏవేశ్వరస్య రాజ్యార్థం సచేష్టా భవత తథా కృతే సర్వ్వాణ్యేతాని ద్రవ్యాణి యుష్మభ్యం ప్రదాయిష్యన్తే|
౩౧మీరు మాత్రం ఆయన రాజ్యాన్ని వెదకండి. దానితోపాటుగా ఇవి కూడా మీకు లభిస్తాయి.
32 హే క్షుద్రమేషవ్రజ యూయం మా భైష్ట యుష్మభ్యం రాజ్యం దాతుం యుష్మాకం పితుః సమ్మతిరస్తి|
౩౨చిన్న మందా, భయపడకండి. మీకు రాజ్యాన్నివ్వడం మీ తండ్రికి ఇష్టం.
33 అతఏవ యుష్మాకం యా యా సమ్పత్తిరస్తి తాం తాం విక్రీయ వితరత, యత్ స్థానం చౌరా నాగచ్ఛన్తి, కీటాశ్చ న క్షాయయన్తి తాదృశే స్వర్గే నిజార్థమ్ అజరే సమ్పుటకే ఽక్షయం ధనం సఞ్చినుత చ;
౩౩మీకు ఉన్నవాటిని అమ్మి దాన ధర్మాలు చేయండి. పరలోకంలో పాతగిలిపోని డబ్బు సంచులనూ, నాశనం కాని ధనాన్నీ సంపాదించుకోండి. అక్కడికి దొంగ రాడు, పురుగు పట్టదు.
34 యతో యత్ర యుష్మాకం ధనం వర్త్తతే తత్రేవ యుష్మాకం మనః|
౩౪మీ డబ్బు ఎక్కడ ఉంటుందో మీ హృదయం అక్కడే ఉంటుంది.
35 అపరఞ్చ యూయం ప్రదీపం జ్వాలయిత్వా బద్ధకటయస్తిష్ఠత;
౩౫“మీ నడుము బిగించుకుని ఉండండి. మీ దీపాలు వెలుగుతూ ఉండనివ్వండి.
36 ప్రభు ర్వివాహాదాగత్య యదైవ ద్వారమాహన్తి తదైవ ద్వారం మోచయితుం యథా భృత్యా అపేక్ష్య తిష్ఠన్తి తథా యూయమపి తిష్ఠత|
౩౬యజమాని ఎప్పుడు వస్తాడో అని అతని కోసం ఎదురు చూస్తూ అతడు పెండ్లి విందు నుండి వచ్చి తలుపు కొట్టగానే తలుపు తీసే సేవకుల్లా ఉండండి.
37 యతః ప్రభురాగత్య యాన్ దాసాన్ సచేతనాన్ తిష్ఠతో ద్రక్ష్యతి తఏవ ధన్యాః; అహం యుష్మాన్ యథార్థం వదామి ప్రభుస్తాన్ భోజనార్థమ్ ఉపవేశ్య స్వయం బద్ధకటిః సమీపమేత్య పరివేషయిష్యతి|
౩౭యజమాని వచ్చి ఏ సేవకులు మెలకువగా ఉండడం చూస్తాడో ఆ దాసులు ధన్యులు. అప్పుడు అతడు తన నడుం కట్టుకుని వారిని భోజనానికి కూర్చోబెట్టి, వారికి తానే పరిచర్య చేస్తాడని మీకు కచ్చితంగా చెబుతున్నాను.
38 యది ద్వితీయే తృతీయే వా ప్రహరే సమాగత్య తథైవ పశ్యతి, తర్హి తఏవ దాసా ధన్యాః|
౩౮అతడు రాత్రి రెండవ జాములో వచ్చినా, మూడవ జాములో వచ్చినా ఏ సేవకులు మెలకువగా ఉండడం చూస్తాడో ఆ సేవకులు ధన్యులు.
39 అపరఞ్చ కస్మిన్ క్షణే చౌరా ఆగమిష్యన్తి ఇతి యది గృహపతి ర్జ్ఞాతుం శక్నోతి తదావశ్యం జాగ్రన్ నిజగృహే సన్ధిం కర్త్తయితుం వారయతి యూయమేతద్ విత్త|
౩౯దొంగ ఏ సమయంలో వస్తాడో ఇంటి యజమానికి తెలిస్తే అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నం వేయనివ్వడని తెలుసుకోండి.
40 అతఏవ యూయమపి సజ్జమానాస్తిష్ఠత యతో యస్మిన్ క్షణే తం నాప్రేక్షధ్వే తస్మిన్నేవ క్షణే మనుష్యపుత్ర ఆగమిష్యతి|
౪౦మీరు ఊహించని సమయంలో మనుష్య కుమారుడు వస్తాడు కాబట్టి మీరు కూడా సిద్ధంగా ఉండండి” అని వారికి చెప్పాడు.
41 తదా పితరః పప్రచ్ఛ, హే ప్రభో భవాన్ కిమస్మాన్ ఉద్దిశ్య కిం సర్వ్వాన్ ఉద్దిశ్య దృష్టాన్తకథామిమాం వదతి?
౪౧అప్పుడు పేతురు, “ప్రభూ ఈ ఉపమానం మా కోసమే చెబుతున్నావా లేక అందరి కోసం చెబుతున్నావా?” అని ఆయనను అడిగాడు.
42 తతః ప్రభుః ప్రోవాచ, ప్రభుః సముచితకాలే నిజపరివారార్థం భోజ్యపరివేషణాయ యం తత్పదే నియోక్ష్యతి తాదృశో విశ్వాస్యో బోద్ధా కర్మ్మాధీశః కోస్తి?
౪౨దానికి ప్రభువు ఇలా అన్నాడు, “సరైన సమయంలో అందరికీ ఆహారం పెట్టడానికి యజమానుడు తన ఇంటిపై నియమించే నమ్మకమైన, బుద్ధిగల నిర్వాహకుడెవడు?
43 ప్రభురాగత్య యమ్ ఏతాదృశే కర్మ్మణి ప్రవృత్తం ద్రక్ష్యతి సఏవ దాసో ధన్యః|
౪౩యజమాని వచ్చి ఏ పనివాడు ఆ విధంగా చేయడం చూస్తాడో ఆ పనివాడు ధన్యుడు.
44 అహం యుష్మాన్ యథార్థం వదామి స తం నిజసర్వ్వస్వస్యాధిపతిం కరిష్యతి|
౪౪అప్పుడు ఆ యజమాని తన ఆస్తి అంతటి మీదా అతణ్ణి ఉంచుతాడని మీకు చెబుతున్నాను.
45 కిన్తు ప్రభుర్విలమ్బేనాగమిష్యతి, ఇతి విచిన్త్య స దాసో యది తదన్యదాసీదాసాన్ ప్రహర్త్తుమ్ భోక్తుం పాతుం మదితుఞ్చ ప్రారభతే,
౪౫అయితే ఆ పనివాడు నా యజమాని ఆలస్యం చేస్తున్నాడని మనసులో అనుకుని తోటి దాసదాసీలను కొట్టడం, తిని తాగి మత్తెక్కి ఉండడం చేస్తే
46 తర్హి యదా ప్రభుం నాపేక్షిష్యతే యస్మిన్ క్షణే సోఽచేతనశ్చ స్థాస్యతి తస్మిన్నేవ క్షణే తస్య ప్రభురాగత్య తం పదభ్రష్టం కృత్వా విశ్వాసహీనైః సహ తస్య అంశం నిరూపయిష్యతి|
౪౬వాడు ఎదురు చూడని రోజున తెలియని సమయంలో యజమాని వస్తాడు. వాణ్ణి కఠినంగా శిక్షించి నమ్మదగని వారి గతే వాడికి పట్టేలా చేస్తాడు.
47 యో దాసః ప్రభేరాజ్ఞాం జ్ఞాత్వాపి సజ్జితో న తిష్ఠతి తదాజ్ఞానుసారేణ చ కార్య్యం న కరోతి సోనేకాన్ ప్రహారాన్ ప్రాప్స్యతి;
౪౭తన యజమాని ఇష్టం తెలిసి కూడా సిద్ధపడకుండా, ఆయన ఇష్ట ప్రకారం చేయకుండా ఉండే సేవకుడికి చాలా దెబ్బలు తగులుతాయి.
48 కిన్తు యో జనోఽజ్ఞాత్వా ప్రహారార్హం కర్మ్మ కరోతి సోల్పప్రహారాన్ ప్రాప్స్యతి| యతో యస్మై బాహుల్యేన దత్తం తస్మాదేవ బాహుల్యేన గ్రహీష్యతే, మానుషా యస్య నికటే బహు సమర్పయన్తి తస్మాద్ బహు యాచన్తే|
౪౮దెబ్బలకు తగిన పనులు చేసినా తెలియక చేసిన వాడికి తక్కువ దెబ్బలే తగులుతాయి. ఎవరికి ఎక్కువగా ఇచ్చారో అతని దగ్గర ఎక్కువగా తీసుకుంటారు. మనుషులు ఎవరికి ఎక్కువ అప్పగిస్తారో వారి దగ్గరే ఎక్కువగా అడుగుతారు.
49 అహం పృథివ్యామ్ అనైక్యరూపం వహ్ని నిక్షేప్తుమ్ ఆగతోస్మి, స చేద్ ఇదానీమేవ ప్రజ్వలతి తత్ర మమ కా చిన్తా?
౪౯“నేను భూమి మీద అగ్ని వేయడానికి వచ్చాను. అది ఇప్పటికే రగులుకుని మండాలని ఎంతగానో కోరుతున్నాను.
50 కిన్తు యేన మజ్జనేనాహం మగ్నో భవిష్యామి యావత్కాలం తస్య సిద్ధి ర్న భవిష్యతి తావదహం కతికష్టం ప్రాప్స్యామి|
౫౦అయితే నేను పొందాల్సిన బాప్తిసం ఉంది. అది జరిగే వరకూ నేను చాలా ఇబ్బంది పడుతున్నాను.
51 మేలనం కర్త్తుం జగద్ ఆగతోస్మి యూయం కిమిత్థం బోధధ్వే? యుష్మాన్ వదామి న తథా, కిన్త్వహం మేలనాభావం కర్త్తుంమ్ ఆగతోస్మి|
౫౧నేను భూమి మీద శాంతిని స్థాపించడానికి వచ్చానని మీరు అనుకుంటున్నారా? కానే కాదు. నేను చీలికలు కలగజేయడానికే వచ్చానని మీకు చెబుతున్నాను.
52 యస్మాదేతత్కాలమారభ్య ఏకత్రస్థపరిజనానాం మధ్యే పఞ్చజనాః పృథగ్ భూత్వా త్రయో జనా ద్వయోర్జనయోః ప్రతికూలా ద్వౌ జనౌ చ త్రయాణాం జనానాం ప్రతికూలౌ భవిష్యన్తి|
౫౨ఇక నుండి ఒక ఇంట్లో ఉండే ఐదుగురు వేరుపడి ఇద్దరికి విరోధంగా ముగ్గురూ, ముగ్గురికి విరోధంగా ఇద్దరూ ఉంటారు.
53 పితా పుత్రస్య విపక్షః పుత్రశ్చ పితు ర్విపక్షో భవిష్యతి మాతా కన్యాయా విపక్షా కన్యా చ మాతు ర్విపక్షా భవిష్యతి, తథా శ్వశ్రూర్బధ్వా విపక్షా బధూశ్చ శ్వశ్ర్వా విపక్షా భవిష్యతి|
౫౩తండ్రి కొడుక్కీ, కొడుకు తండ్రికీ, తల్లి కూతురుకీ, కూతురు తల్లికీ, అత్త కోడలికీ, కోడలు అత్తకూ విరోధులుగా ఉంటారు” అని చెప్పాడు.
54 స లోకేభ్యోపరమపి కథయామాస, పశ్చిమదిశి మేఘోద్గమం దృష్ట్వా యూయం హఠాద్ వదథ వృష్టి ర్భవిష్యతి తతస్తథైవ జాయతే|
౫౪తరవాత ఆయన జనసమూహాలతో ఇలా అన్నాడు, “మీరు పడమర నుండి మబ్బు పైకి రావడం చూసేటప్పుడు వాన వస్తుందని వెంటనే చెప్పేస్తారు. అలాగే జరుగుతుంది.
55 అపరం దక్షిణతో వాయౌ వాతి సతి వదథ నిదాఘో భవిష్యతి తతః సోపి జాయతే|
౫౫దక్షిణపు గాలి వీయడం చూసేటప్పుడు వడగాలి కొడుతుందని చెబుతారు. అలాగే జరుగుతుంది.
56 రే రే కపటిన ఆకాశస్య భూమ్యాశ్చ లక్షణం బోద్ధుం శక్నుథ,
౫౬కపట భక్తులారా, మీరు భూమి, ఆకాశాల ధోరణులను గుర్తిస్తారు గానీ ఇప్పటి కాలం తీరు గుర్తించలేక పోతున్నారు.
57 కిన్తు కాలస్యాస్య లక్షణం కుతో బోద్ధుం న శక్నుథ? యూయఞ్చ స్వయం కుతో న న్యాష్యం విచారయథ?
౫౭ఏది న్యాయమో మీ అంతట మీరే ఎందుకు ఆలోచించరు?
58 అపరఞ్చ వివాదినా సార్ద్ధం విచారయితుః సమీపం గచ్ఛన్ పథి తస్మాదుద్ధారం ప్రాప్తుం యతస్వ నోచేత్ స త్వాం ధృత్వా విచారయితుః సమీపం నయతి| విచారయితా యది త్వాం ప్రహర్త్తుః సమీపం సమర్పయతి ప్రహర్త్తా త్వాం కారాయాం బధ్నాతి
౫౮మీపై నేరారోపణ చేసే వాడితో కలసి న్యాయాధికారి దగ్గరికి వెళ్తున్నప్పుడు దారిలోనే అతనితో రాజీపడే ప్రయత్నం చెయ్యి. లేకుంటే అతడు నిన్ను న్యాయాధిపతి దగ్గరికి లాక్కుపోతాడు. ఆ న్యాయాధిపతి నిన్ను భటుడికి అప్పగిస్తాడు. ఆ భటుడు నిన్ను జైల్లో పెడతాడు.
59 తర్హి త్వామహం వదామి త్వయా నిఃశేషం కపర్దకేషు న పరిశోధితేషు త్వం తతో ముక్తిం ప్రాప్తుం న శక్ష్యసి|
౫౯చివరి పైసా చెల్లించేంత వరకూ నువ్వు బయటకు రానే రావని నీకు చెబుతున్నాను.” అన్నాడు.