< പ്രേരിതാഃ 25 >

1 അനന്തരം ഫീഷ്ടോ നിജരാജ്യമ് ആഗത്യ ദിനത്രയാത് പരം കൈസരിയാതോ യിരൂശാലമ്നഗരമ് ആഗമത്|
ఫేస్తు అధికారానికి వచ్చిన మూడు రోజులకు కైసరయ నుండి యెరూషలేము వెళ్ళాడు.
2 തദാ മഹായാജകോ യിഹൂദീയാനാം പ്രധാനലോകാശ്ച തസ്യ സമക്ഷം പൗലമ് അപാവദന്ത|
అప్పుడు ప్రధాన యాజకులూ, యూదుల పెద్దలూ, పౌలు మీద తమ ఫిర్యాదు సంగతి అతనికి తెలియజేశారు.
3 ഭവാൻ തം യിരൂശാലമമ് ആനേതുമ് ആജ്ഞാപയത്വിതി വിനീയ തേ തസ്മാദ് അനുഗ്രഹം വാഞ്ഛിതവന്തഃ|
“దయచేసి పౌలును యెరూషలేముకు పిలిపించండి” అని ఫేస్తును వారు కోరారు. ఎందుకంటే వారు అతణ్ణి దారిలో చంపడానికి కాచుకుని ఉన్నారు.
4 യതഃ പഥിമധ്യേ ഗോപനേന പൗലം ഹന്തും തൈ ർഘാതകാ നിയുക്താഃ| ഫീഷ്ട ഉത്തരം ദത്തവാൻ പൗലഃ കൈസരിയായാം സ്ഥാസ്യതി പുനരൽപദിനാത് പരമ് അഹം തത്ര യാസ്യാമി|
అందుకు ఫేస్తు, “పౌలు కైసరయలో ఖైదీగా ఉన్నాడు. నేను త్వరలో అక్కడికి వెళ్ళబోతున్నాను.
5 തതസ്തസ്യ മാനുഷസ്യ യദി കശ്ചിദ് അപരാധസ്തിഷ്ഠതി തർഹി യുഷ്മാകം യേ ശക്നുവന്തി തേ മയാ സഹ തത്ര ഗത്വാ തമപവദന്തു സ ഏതാം കഥാം കഥിതവാൻ|
కాబట్టి మీలో సమర్థులు నాతో వచ్చి అతని మీద నేరమేదైనా ఉంటే మోపవచ్చు” అని జవాబిచ్చాడు.
6 ദശദിവസേഭ്യോഽധികം വിലമ്ബ്യ ഫീഷ്ടസ്തസ്മാത് കൈസരിയാനഗരം ഗത്വാ പരസ്മിൻ ദിവസേ വിചാരാസന ഉപദിശ്യ പൗലമ് ആനേതുമ് ആജ്ഞാപയത്|
అతడు వారి దగ్గర ఎనిమిది లేక పది రోజులు గడిపి కైసరయ వెళ్ళి మరునాడు న్యాయపీఠం మీద కూర్చుని పౌలును తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు.
7 പൗലേ സമുപസ്ഥിതേ സതി യിരൂശാലമ്നഗരാദ് ആഗതാ യിഹൂദീയലോകാസ്തം ചതുർദിശി സംവേഷ്ട്യ തസ്യ വിരുദ്ധം ബഹൂൻ മഹാദോഷാൻ ഉത്ഥാപിതവന്തഃ കിന്തു തേഷാം കിമപി പ്രമാണം ദാതും ന ശക്നുവന്തഃ|
పౌలు వచ్చినప్పుడు యెరూషలేము నుండి వచ్చిన యూదులు అతని చుట్టూ నిలబడి, ఎన్నో తీవ్ర నేరాలు మోపారు గాని వాటిని రుజువు చేయలేక పోయారు.
8 തതഃ പൗലഃ സ്വസ്മിൻ ഉത്തരമിദമ് ഉദിതവാൻ, യിഹൂദീയാനാം വ്യവസ്ഥായാ മന്ദിരസ്യ കൈസരസ്യ വാ പ്രതികൂലം കിമപി കർമ്മ നാഹം കൃതവാൻ|
పౌలు, “యూదుల ధర్మశాస్త్రం గూర్చి గానీ, దేవాలయం గూర్చి గానీ, సీజరును గూర్చి గానీ నేనే తప్పూ చేయలేదు” అని జవాబు చెప్పాడు.
9 കിന്തു ഫീഷ്ടോ യിഹൂദീയാൻ സന്തുഷ്ടാൻ കർത്തുമ് അഭിലഷൻ പൗലമ് അഭാഷത ത്വം കിം യിരൂശാലമം ഗത്വാസ്മിൻ അഭിയോഗേ മമ സാക്ഷാദ് വിചാരിതോ ഭവിഷ്യസി?
అయితే ఫేస్తు యూదుల చేత మంచి వాడని అనిపించుకోవాలని, “యెరూషలేముకు వచ్చి అక్కడ నా ముందు ఈ సంగతులను గూర్చి విచారణకు నిలవడం నీకిష్టమేనా?” అని పౌలును అడిగాడు.
10 തതഃ പൗല ഉത്തരം പ്രോക്തവാൻ, യത്ര മമ വിചാരോ ഭവിതും യോഗ്യഃ കൈസരസ്യ തത്ര വിചാരാസന ഏവ സമുപസ്ഥിതോസ്മി; അഹം യിഹൂദീയാനാം കാമപി ഹാനിം നാകാർഷമ് ഇതി ഭവാൻ യഥാർഥതോ വിജാനാതി|
౧౦అందుకు పౌలు, “సీజరు న్యాయపీఠం ముందు నిలబడి ఉన్నాను. నన్ను విచారణ చేయవలసిన స్థలం ఇదే, యూదులకు నేను ఏ అన్యాయమూ చేయలేదని మీకు బాగా తెలుసు.
11 കഞ്ചിദപരാധം കിഞ്ചന വധാർഹം കർമ്മ വാ യദ്യഹമ് അകരിഷ്യം തർഹി പ്രാണഹനനദണ്ഡമപി ഭോക്തുമ് ഉദ്യതോഽഭവിഷ്യം, കിന്തു തേ മമ സമപവാദം കുർവ്വന്തി സ യദി കൽപിതമാത്രോ ഭവതി തർഹി തേഷാം കരേഷു മാം സമർപയിതും കസ്യാപ്യധികാരോ നാസ്തി, കൈസരസ്യ നികടേ മമ വിചാരോ ഭവതു|
౧౧నేను న్యాయం తప్పి మరణానికి తగిన పని ఏదైనా చేసి ఉంటే మరణానికి భయపడను. వీరు నా మీద మోపుతున్న నేరాల్లో ఏదీ నిజం కానప్పుడు నన్ను వారికి ఎవరూ అప్పగించడానికి వీలు లేదు. నేను సీజరు ముందే చెప్పుకొంటాను” అన్నాడు.
12 തദാ ഫീഷ്ടോ മന്ത്രിഭിഃ സാർദ്ധം സംമന്ത്ര്യ പൗലായ കഥിതവാൻ, കൈസരസ്യ നികടേ കിം തവ വിചാരോ ഭവിഷ്യതി? കൈസരസ്യ സമീപം ഗമിഷ്യസി|
౧౨అప్పుడు ఫేస్తు తన సలహాదారులతో ఆలోచించి, “సీజరు ముందు చెప్పుకొంటాను అన్నావు కదా, సీజరు దగ్గరకే పంపిస్తాను” అని జవాబిచ్చాడు.
13 കിയദ്ദിനേഭ്യഃ പരമ് ആഗ്രിപ്പരാജാ ബർണീകീ ച ഫീഷ്ടം സാക്ഷാത് കർത്തും കൈസരിയാനഗരമ് ആഗതവന്തൗ|
౧౩ఆ తరవాత కొన్ని రోజులకు రాజైన అగ్రిప్ప, బెర్నీకే ఫేస్తును దర్శించడానికి కైసరయ వచ్చారు.
14 തദാ തൗ ബഹുദിനാനി തത്ര സ്ഥിതൗ തതഃ ഫീഷ്ടസ്തം രാജാനം പൗലസ്യ കഥാം വിജ്ഞാപ്യ കഥയിതുമ് ആരഭത പൗലനാമാനമ് ഏകം ബന്ദി ഫീലിക്ഷോ ബദ്ധം സംസ്ഥാപ്യ ഗതവാൻ|
౧౪వారక్కడ చాలా రోజులున్న తరువాత, ఫేస్తు పౌలు గురించి రాజుకు ఇలా చెప్పాడు, “ఫేలిక్సు విడిచిపెట్టి పోయిన ఖైదీ ఒకడు నా దగ్గర ఉన్నాడు.
15 യിരൂശാലമി മമ സ്ഥിതികാലേ മഹായാജകോ യിഹൂദീയാനാം പ്രാചീനലോകാശ്ച തമ് അപോദ്യ തമ്പ്രതി ദണ്ഡാജ്ഞാം പ്രാർഥയന്ത|
౧౫నేను యెరూషలేములో ఉన్నప్పుడు ప్రధాన యాజకులూ, యూదుల పెద్దలూ, అతని మీద ఫిర్యాదు చేసి అతణ్ణి శిక్షించమని కోరారు.
16 തതോഹമ് ഇത്യുത്തരമ് അവദം യാവദ് അപോദിതോ ജനഃ സ്വാപവാദകാൻ സാക്ഷാത് കൃത്വാ സ്വസ്മിൻ യോഽപരാധ ആരോപിതസ്തസ്യ പ്രത്യുത്തരം ദാതും സുയോഗം ന പ്രാപ്നോതി, താവത്കാലം കസ്യാപി മാനുഷസ്യ പ്രാണനാശാജ്ഞാപനം രോമിലോകാനാം രീതി ർനഹി|
౧౬అందుకు నేను, ‘నేరం ఎవరి మీద మోపారో ఆ వ్యక్తి నేరం మోపిన వారికి ముఖాముఖిగా, తన మీద వారు మోపిన నేరం గూర్చి సమాధానం చెప్పుకోడానికి అవకాశం ఇవ్వాలి. అది లేకుండా ఏ మనిషికీ తీర్పు తీర్చడం రోమీయుల పద్ధతి కాదు’ అని జవాబిచ్చాను.
17 തതസ്തേഷ്വത്രാഗതേഷു പരസ്മിൻ ദിവസേഽഹമ് അവിലമ്ബം വിചാരാസന ഉപവിശ്യ തം മാനുഷമ് ആനേതുമ് ആജ്ഞാപയമ്|
౧౭వారిక్కడికి వచ్చినప్పుడు నేను ఆలస్యమేమీ చేయకుండా, మరునాడే న్యాయపీఠం మీద కూర్చుని ఆ వ్యక్తిని తీసుకురమ్మని ఆజ్ఞాపించాను.
18 തദനന്തരം തസ്യാപവാദകാ ഉപസ്ഥായ യാദൃശമ് അഹം ചിന്തിതവാൻ താദൃശം കഞ്ചന മഹാപവാദം നോത്ഥാപ്യ
౧౮అయితే నేరం మోపినవారు నేను ఊహించిన నేరాల్లో ఒక్కటి కూడా అతని మీద మోపలేదు.
19 സ്വേഷാം മതേ തഥാ പൗലോ യം സജീവം വദതി തസ്മിൻ യീശുനാമനി മൃതജനേ ച തസ്യ വിരുദ്ധം കഥിതവന്തഃ|
౧౯కానీ మీ మతం గూర్చీ, చనిపోయిన యేసు అనే ఒకడి గూర్చీ ఇతనితో వారికి కొన్ని వివాదాలున్నట్టు కనబడింది. ఆ యేసు బతికే ఉన్నాడని పౌలు చెబుతున్నాడు.
20 തതോഹം താദൃഗ്വിചാരേ സംശയാനഃ സൻ കഥിതവാൻ ത്വം യിരൂശാലമം ഗത്വാ കിം തത്ര വിചാരിതോ ഭവിതുമ് ഇച്ഛസി?
౨౦నేనలాటి వాదాల విషయం ఏ విధంగా విచారించాలో తోచక, యెరూషలేముకు వెళ్ళి అక్కడ వీటిని గూర్చి విచారించడం అతనికి ఇష్టమవుతుందేమోనని అడిగాను.
21 തദാ പൗലോ മഹാരാജസ്യ നികടേ വിചാരിതോ ഭവിതും പ്രാർഥയത, തസ്മാദ് യാവത്കാലം തം കൈസരസ്യ സമീപം പ്രേഷയിതും ന ശക്നോമി താവത്കാലം തമത്ര സ്ഥാപയിതുമ് ആദിഷ്ടവാൻ|
౨౧అయితే పౌలు, చక్రవర్తి నిర్ణయం వచ్చేదాకా తనను కావలిలో ఉంచాలని చెప్పడం చేత నేనతణ్ణి సీజరు దగ్గరికి పంపించే వరకూ కావలిలో ఉంచమని ఆజ్ఞాపించాను.”
22 തത ആഗ്രിപ്പഃ ഫീഷ്ടമ് ഉക്തവാൻ, അഹമപി തസ്യ മാനുഷസ്യ കഥാം ശ്രോതുമ് അഭിലഷാമി| തദാ ഫീഷ്ടോ വ്യാഹരത് ശ്വസ്തദീയാം കഥാം ത്വം ശ്രോഷ്യസി|
౨౨అందుకు అగ్రిప్ప, “ఆ వ్యక్తి చెప్పుకొనేది నాక్కూడా వినాలనుంది” అన్నాడు. దానికి ఫేస్తు, “రేపు వినవచ్చు” అని చెప్పాడు.
23 പരസ്മിൻ ദിവസേ ആഗ്രിപ്പോ ബർണീകീ ച മഹാസമാഗമം കൃത്വാ പ്രധാനവാഹിനീപതിഭി ർനഗരസ്ഥപ്രധാനലോകൈശ്ച സഹ മിലിത്വാ രാജഗൃഹമാഗത്യ സമുപസ്ഥിതൗ തദാ ഫീഷ്ടസ്യാജ്ഞയാ പൗല ആനീതോഽഭവത്|
౨౩మరునాడు అగ్రిప్ప, బెర్నీకే ఎంతో ఆడంబరంగా వచ్చి, సైనికాధిపతులతో, పురప్రముఖులతో అధికార మందిరంలో ప్రవేశించిన తరువాత ఫేస్తు ఆజ్ఞపై పౌలును తీసుకువచ్చారు.
24 തദാ ഫീഷ്ടഃ കഥിതവാൻ ഹേ രാജൻ ആഗ്രിപ്പ ഹേ ഉപസ്ഥിതാഃ സർവ്വേ ലോകാ യിരൂശാലമ്നഗരേ യിഹൂദീയലോകസമൂഹോ യസ്മിൻ മാനുഷേ മമ സമീപേ നിവേദനം കൃത്വാ പ്രോച്ചൈഃ കഥാമിമാം കഥിതവാൻ പുനരൽപകാലമപി തസ്യ ജീവനം നോചിതം തമേതം മാനുഷം പശ്യത|
౨౪అప్పుడు ఫేస్తు, “అగ్రిప్ప రాజా, ఇక్కడ ఉన్న సమస్త ప్రజలారా, మీరు ఈ వ్యక్తిని చూస్తున్నారు గదా. యెరూషలేములోనూ ఇక్కడా యూదులంతా వీడు ఇక బతకకూడదని కేకలు వేస్తూ అతనికి వ్యతిరేకంగా నాకు మనవి చేసుకున్నారు.
25 കിന്ത്വേഷ ജനഃ പ്രാണനാശർഹം കിമപി കർമ്മ ന കൃതവാൻ ഇത്യജാനാം തഥാപി സ മഹാരാജസ്യ സന്നിധൗ വിചാരിതോ ഭവിതും പ്രാർഥയത തസ്മാത് തസ്യ സമീപം തം പ്രേഷയിതും മതിമകരവമ്|
౨౫ఇతడు మరణానికి తగిన పని ఏదీ చేయలేదని నేను గ్రహించాను. కానీ ఇతడు చక్రవర్తి ముందు చెప్పుకొంటానని అనడం చేత ఇతనిని అక్కడికే పంపాలని నిశ్చయించాను.
26 കിന്തു ശ്രീയുക്തസ്യ സമീപമ് ഏതസ്മിൻ കിം ലേഖനീയമ് ഇത്യസ്യ കസ്യചിൻ നിർണയസ്യ ന ജാതത്വാദ് ഏതസ്യ വിചാരേ സതി യഥാഹം ലേഖിതും കിഞ്ചന നിശ്ചിതം പ്രാപ്നോമി തദർഥം യുഷ്മാകം സമക്ഷം വിശേഷതോ ഹേ ആഗ്രിപ്പരാജ ഭവതഃ സമക്ഷമ് ഏതമ് ആനയേ|
౨౬కానీ ఇతని గూర్చి మన చక్రవర్తికి రాయడానికి నాకు సరైన కారణం ఏమీ కనబడలేదు. కాబట్టి విచారణ అయిన తరువాత రాయడానికి ఏమైనా నాకు దొరకవచ్చని మీ అందరి ఎదుటికి, మరి ముఖ్యంగా అగ్రిప్ప రాజా, మీ ఎదుటికి ఇతనిని రప్పించాను.
27 യതോ ബന്ദിപ്രേഷണസമയേ തസ്യാഭിയോഗസ്യ കിഞ്ചിദലേഖനമ് അഹമ് അയുക്തം ജാനാമി|
౨౭ఖైదీ మీద మోపిన నేరాలను వివరించకుండా అతనిని పంపడం సమంజసం కాదని నా ఉద్దేశం” అని వారితో చెప్పాడు.

< പ്രേരിതാഃ 25 >