< പ്രേരിതാഃ 17 >

1 പൗലസീലൗ ആമ്ഫിപല്യാപല്ലോനിയാനഗരാഭ്യാം ഗത്വാ യത്ര യിഹൂദീയാനാം ഭജനഭവനമേകമ് ആസ്തേ തത്ര ഥിഷലനീകീനഗര ഉപസ്ഥിതൗ|
వారు అంఫిపొలి, అపొల్లోనియ పట్టణాల మీదుగా తెస్సలోనిక పట్టణానికి వచ్చారు. అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉంది.
2 തദാ പൗലഃ സ്വാചാരാനുസാരേണ തേഷാം സമീപം ഗത്വാ വിശ്രാമവാരത്രയേ തൈഃ സാർദ്ധം ധർമ്മപുസ്തകീയകഥായാ വിചാരം കൃതവാൻ|
పౌలు తన అలవాటు ప్రకారం అలవాటు ప్రకారం మూడు విశ్రాంతి దినాలు లేఖనాల్లో నుండి వారితో తర్కించాడు.
3 ഫലതഃ ഖ്രീഷ്ടേന ദുഃഖഭോഗഃ കർത്തവ്യഃ ശ്മശാനദുത്ഥാനഞ്ച കർത്തവ്യം യുഷ്മാകം സന്നിധൗ യസ്യ യീശോഃ പ്രസ്താവം കരോമി സ ഈശ്വരേണാഭിഷിക്തഃ സ ഏതാഃ കഥാഃ പ്രകാശ്യ പ്രമാണം ദത്വാ സ്ഥിരീകൃതവാൻ|
క్రీస్తు హింసలు అనుభవించి మృతుల్లో నుండి లేవడం తప్పనిసరి అని లేఖనాలను విప్పి వివరించాడు. “నేను మీకు ప్రకటించే యేసే క్రీస్తు” అని తెలియజేశాడు.
4 തസ്മാത് തേഷാം കതിപയജനാ അന്യദേശീയാ ബഹവോ ഭക്തലോകാ ബഹ്യഃ പ്രധാനനാര്യ്യശ്ച വിശ്വസ്യ പൗലസീലയോഃ പശ്ചാദ്ഗാമിനോ ജാതാഃ|
కొంతమంది యూదులు ఒప్పుకుని పౌలు సీలలతో కలిశారు. వారిలో భక్తిపరులైన గ్రీకు వారూ, చాలమంది ప్రముఖులైన స్త్రీలు కూడా ఉన్నారు.
5 കിന്തു വിശ്വാസഹീനാ യിഹൂദീയലോകാ ഈർഷ്യയാ പരിപൂർണാഃ സന്തോ ഹടട്സ്യ കതിനയലമ്പടലോകാൻ സങ്ഗിനഃ കൃത്വാ ജനതയാ നഗരമധ്യേ മഹാകലഹം കൃത്വാ യാസോനോ ഗൃഹമ് ആക്രമ്യ പ്രേരിതാൻ ധൃത്വാ ലോകനിവഹസ്യ സമീപമ് ആനേതും ചേഷ്ടിതവന്തഃ|
అయితే ఆ బోధను నమ్మని యూదులు అసూయతో నిండిపోయి, వ్యాపార వీధుల్లో తిరిగే కొంతమంది పోకిరీ వాళ్ళను వెంటబెట్టుకుని గుంపు కూర్చి పట్టణమంతా పెద్ద అల్లరి సృష్టించారు. వారు యాసోను ఇంటి మీద దాడి చేసి, పౌలు సీలలను జనం మధ్యకు తీసుకు వెళ్ళాలనుకున్నారు.
6 തേഷാമുദ്ദേശമ് അപ്രാപ്യ ച യാസോനം കതിപയാൻ ഭ്രാതൃംശ്ച ധൃത്വാ നഗരാധിപതീനാം നികടമാനീയ പ്രോച്ചൈഃ കഥിതവന്തോ യേ മനുഷ്യാ ജഗദുദ്വാടിതവന്തസ്തേ ഽത്രാപ്യുപസ്ഥിതാഃ സന്തി,
అయితే వారు కనబడక పోయేసరికి యాసోనునూ మరి కొంతమంది సోదరులనూ ఆ పట్టణ అధికారుల దగ్గరికి ఈడ్చుకుపోయి, “భూలోకాన్ని తలకిందులు చేసిన వారు ఇక్కడికి కూడా వచ్చారు. యాసోను వీరిని తన ఇంట్లో పెట్టుకున్నాడు.
7 ഏഷ യാസോൻ ആതിഥ്യം കൃത്വാ താൻ ഗൃഹീതവാൻ| യീശുനാമക ഏകോ രാജസ്തീതി കഥയന്തസ്തേ കൈസരസ്യാജ്ഞാവിരുദ്ധം കർമ്മ കുർവ്വതി|
వీరంతా యేసు అనే వేరొక రాజున్నాడని చెబుతూ సీజరు చట్టాలకు విరోధంగా నడుచుకుంటున్నారు” అని కేకలు వేశారు.
8 തേഷാം കഥാമിമാം ശ്രുത്വാ ലോകനിവഹോ നഗരാധിപതയശ്ച സമുദ്വിഗ്നാ അഭവൻ|
జనసమూహం అధికారులూ ఈ మాటలు విని ఆందోళనపడ్డారు.
9 തദാ യാസോനസ്തദന്യേഷാഞ്ച ധനദണ്ഡം ഗൃഹീത്വാ താൻ പരിത്യക്തവന്തഃ|
వారు యాసోను దగ్గరా మిగతావారి దగ్గరా జామీను తీసుకుని వారిని విడుదల చేశారు.
10 തതഃ പരം ഭ്രാതൃഗണോ രജന്യാം പൗലസീലൗ ശീഘ്രം ബിരയാനഗരം പ്രേഷിതവാൻ തൗ തത്രോപസ്ഥായ യിഹൂദീയാനാം ഭജനഭവനം ഗതവന്തൗ|
౧౦సోదరులు అదే రాత్రి పౌలునూ సీలనూ బెరయ ఊరికి పంపించారు. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలోకి వెళ్ళారు.
11 തത്രസ്ഥാ ലോകാഃ ഥിഷലനീകീസ്ഥലോകേഭ്യോ മഹാത്മാന ആസൻ യത ഇത്ഥം ഭവതി ന വേതി ജ്ഞാതും ദിനേ ദിനേ ധർമ്മഗ്രന്ഥസ്യാലോചനാം കൃത്വാ സ്വൈരം കഥാമ് അഗൃഹ്ലൻ|
౧౧వీరు తెస్సలోనికలో ఉన్నవారి కంటే ఉన్నత భావాలు గలవారు. ఎందుకంటే వీరు శ్రద్ధతో వాక్యాన్ని అంగీకరించి, పౌలు, సీలలు చెప్పిన సంగతులు అలా ఉన్నాయో లేవో అని ప్రతి రోజూ లేఖనాలను తరచి చూస్తూ వచ్చారు.
12 തസ്മാദ് അനേകേ യിഹൂദീയാ അന്യദേശീയാനാം മാന്യാ സ്ത്രിയഃ പുരുഷാശ്ചാനേകേ വ്യശ്വസൻ|
౧౨అందుచేత వారిలో చాలామంది నమ్మారు. ప్రముఖ గ్రీకు స్త్రీలూ, పురుషులూ విశ్వసించారు.
13 കിന്തു ബിരയാനഗരേ പൗലേനേശ്വരീയാ കഥാ പ്രചാര്യ്യത ഇതി ഥിഷലനീകീസ്ഥാ യിഹൂദീയാ ജ്ഞാത്വാ തത്സ്ഥാനമപ്യാഗത്യ ലോകാനാം കുപ്രവൃത്തിമ് അജനയൻ|
౧౩అయితే బెరయలో కూడా పౌలు దేవుని వాక్కు ప్రకటిస్తున్నాడని తెస్సలోనికలోని యూదులు తెలుసుకుని అక్కడికి కూడా వచ్చి జనాన్ని రెచ్చగొట్టి అల్లరి రేపారు.
14 അതഏവ തസ്മാത് സ്ഥാനാത് സമുദ്രേണ യാന്തീതി ദർശയിത്വാ ഭ്രാതരഃ ക്ഷിപ്രം പൗലം പ്രാഹിണ്വൻ കിന്തു സീലതീമഥിയൗ തത്ര സ്ഥിതവന്തൗ|
౧౪వెంటనే సోదరులు పౌలును సముద్రం వరకూ పంపారు. సీల, తిమోతి, అక్కడే ఉండిపోయారు.
15 തതഃ പരം പൗലസ്യ മാർഗദർശകാസ്തമ് ആഥീനീനഗര ഉപസ്ഥാപയൻ പശ്ചാദ് യുവാം തൂർണമ് ഏതത് സ്ഥാനം ആഗമിഷ്യഥഃ സീലതീമഥിയൗ പ്രതീമാമ് ആജ്ഞാം പ്രാപ്യ തേ പ്രത്യാഗതാഃ|
౧౫పౌలును సాగనంపడానికి వెళ్ళిన వారు అతనిని ఏతెన్సు పట్టణం వరకూ తెచ్చారు. సీల, తిమోతి సాధ్యమైనంత తొందరగా తన దగ్గరికి రావాలని పౌలు, వారి ద్వారా కబురు పంపాడు.
16 പൗല ആഥീനീനഗരേ താവപേക്ഷ്യ തിഷ്ഠൻ തന്നഗരം പ്രതിമാഭിഃ പരിപൂർണം ദൃഷ്ട്വാ സന്തപ്തഹൃദയോ ഽഭവത്|
౧౬పౌలు ఏతెన్సులో వారి కోసం ఎదురుచూస్తున్నాడు. ఆ పట్టణం నిండా ఉన్న విగ్రహాలను గమనించి అతని ఆత్మ పరితపించింది.
17 തതഃ സ ഭജനഭവനേ യാൻ യിഹൂദീയാൻ ഭക്തലോകാംശ്ച ഹട്ടേ ച യാൻ അപശ്യത് തൈഃ സഹ പ്രതിദിനം വിചാരിതവാൻ|
౧౭అందుచేత సమాజ మందిరంలో యూదులతోనూ దేవుణ్ణి ఆరాధించే వారితోనూ, వ్యాపార వీధుల్లో ప్రతి రోజూ వచ్చిపోయే వారితోనూ చర్చిస్తూ వచ్చాడు.
18 കിന്ത്വിപികൂരീയമതഗ്രഹിണഃ സ്തോയികീയമതഗ്രാഹിണശ്ച കിയന്തോ ജനാസ്തേന സാർദ്ധം വ്യവദന്ത| തത്ര കേചിദ് അകഥയൻ ഏഷ വാചാലഃ കിം വക്തുമ് ഇച്ഛതി? അപരേ കേചിദ് ഏഷ ജനഃ കേഷാഞ്ചിദ് വിദേശീയദേവാനാം പ്രചാരക ഇത്യനുമീയതേ യതഃ സ യീശുമ് ഉത്ഥിതിഞ്ച പ്രചാരയത്|
౧౮ఎపికూరీయుల స్తోయికుల వర్గానికి చెందిన కొంతమంది తత్వవేత్తలు అతనితో వాదించారు. కొంతమంది, “ఈ వాగుడుకాయ చెప్పేది ఏమిటి” అని చెప్పుకున్నారు. అతడు యేసుని గూర్చీ, చనిపోయిన వారు తిరిగి బ్రతకడం గూర్చీ ప్రకటించాడు కాబట్టి మరి కొంత మంది, “ఇతడు మనకు తెలియని దేవుళ్ళను ప్రచారం చేస్తున్నాడు” అని చెప్పుకున్నారు.
19 തേ തമ് അരേയപാഗനാമ വിചാരസ്ഥാനമ് ആനീയ പ്രാവോചൻ ഇദം യന്നവീനം മതം ത്വം പ്രാചീകശ ഇദം കീദൃശം ഏതദ് അസ്മാൻ ശ്രാവയ;
౧౯వారు అతనిని వెంటబెట్టుకుని అరియోపగు అనే సమాఖ్య దగ్గరికి తీసుకుపోయి, “నీవు చెబుతున్న ఈ కొత్త బోధ మేము తెలుసుకోవచ్చా?
20 യാമിമാമ് അസമ്ഭവകഥാമ് അസ്മാകം കർണഗോചരീകൃതവാൻ അസ്യാ ഭാവാർഥഃ ക ഇതി വയം ജ്ഞാതുമ് ഇച്ഛാമഃ|
౨౦నీవు కొన్ని వింత విషయాలు మాకు వినిపిస్తున్నావు. అందుచేత వీటి అర్థమేంటో మాకు తెలుసుకోవాలని ఉంది” అని చెప్పారు.
21 തദാഥീനീനിവാസിനസ്തന്നഗരപ്രവാസിനശ്ച കേവലം കസ്യാശ്ചന നവീനകഥായാഃ ശ്രവണേന പ്രചാരണേന ച കാലമ് അയാപയൻ|
౨౧ఏతెన్సు ప్రజలూ, అక్కడ నివసించే విదేశీయులూ ఏదో ఒక కొత్త విషయం చెప్పడంలో, వినడంలో మాత్రమే తమ సమయాన్ని గడిపేవారు.
22 പൗലോഽരേയപാഗസ്യ മധ്യേ തിഷ്ഠൻ ഏതാം കഥാം പ്രചാരിതവാൻ, ഹേ ആഥീനീയലോകാ യൂയം സർവ്വഥാ ദേവപൂജായാമ് ആസക്താ ഇത്യഹ പ്രത്യക്ഷം പശ്യാമി|
౨౨పౌలు అరియోపగు సభనుద్దేశించి, “ఏతెన్సు వాసులారా, మీరు అన్ని విషయాల్లో చాలా మతభక్తి గలవారని నేను గమనిస్తున్నాను.
23 യതഃ പര്യ്യടനകാലേ യുഷ്മാകം പൂജനീയാനി പശ്യൻ ‘അവിജ്ഞാതേശ്വരായ’ ഏതല്ലിപിയുക്താം യജ്ഞവേദീമേകാം ദൃഷ്ടവാൻ; അതോ ന വിദിത്വാ യം പൂജയധ്വേ തസ്യൈവ തത്വം യുഷ്മാൻ പ്രതി പ്രചാരയാമി|
౨౩నేను దారిన పోతుంటే మీరు పూజించే వాటిని చూశాను. అక్కడ ఒక బలిపీఠం నాకు కనబడింది. దాని మీద “తెలియని దేవునికి” అని రాసి ఉంది. కాబట్టి మీరు తెలియకుండా దేనిని ఆరాధిస్తున్నారో దానినే నేను మీకు తెలియజేస్తున్నాను.
24 ജഗതോ ജഗത്സ്ഥാനാം സർവ്വവസ്തൂനാഞ്ച സ്രഷ്ടാ യ ഈശ്വരഃ സ സ്വർഗപൃഥിവ്യോരേകാധിപതിഃ സൻ കരനിർമ്മിതമന്ദിരേഷു ന നിവസതി;
౨౪విశ్వాన్నీ, దానిలోని సమస్తాన్నీ చేసిన దేవుడు, తానే ఆకాశానికీ భూమికీ ప్రభువు కాబట్టి చేతులతో చేసిన ఆలయాల్లో నివసించడు.
25 സ ഏവ സർവ്വേഭ്യോ ജീവനം പ്രാണാൻ സർവ്വസാമഗ്രീശ്ച പ്രദദാതി; അതഏവ സ കസ്യാശ്ചിത് സാമഗ്യ്രാ അഭാവഹേതോ ർമനുഷ്യാണാം ഹസ്തൈഃ സേവിതോ ഭവതീതി ന|
౨౫ఆయనే అందరికీ జీవాన్నీ ఊపిరినీ తక్కిన అన్నింటినీ దయచేసేవాడు. కాబట్టి తనకు ఏదో అక్కర ఉన్నట్టుగా మనుషులు చేతులతో చేసే సేవలు అందుకోడు.
26 സ ഭൂമണ്ഡലേ നിവാസാർഥമ് ഏകസ്മാത് ശോണിതാത് സർവ്വാൻ മനുഷ്യാൻ സൃഷ്ട്വാ തേഷാം പൂർവ്വനിരൂപിതസമയം വസതിസീമാഞ്ച നിരചിനോത്;
౨౬ఆయన ఒక్క మనిషి నుండి లోకమంతటిలో నివసించే అన్ని జాతుల మనుషులను చేసి, వారి కోసం కాలాలను నియమించాడు. నివసించే సరిహద్దులను ఏర్పరిచాడు.
27 തസ്മാത് ലോകൈഃ കേനാപി പ്രകാരേണ മൃഗയിത്വാ പരമേശ്വരസ്യ തത്വം പ്രാപ്തും തസ്യ ഗവേഷണം കരണീയമ്|
౨౭అందుచేత వారు దేవుణ్ణి వెతికి తమకై తాము ఆయనను కనుగొనాలి. వాస్తవానికి ఆయన మనలో ఎవరికీ దూరంగా ఉండేవాడు కాదు. ఎందుకంటే,
28 കിന്തു സോഽസ്മാകം കസ്മാച്ചിദപി ദൂരേ തിഷ്ഠതീതി നഹി, വയം തേന നിശ്വസനപ്രശ്വസനഗമനാഗമനപ്രാണധാരണാനി കുർമ്മഃ, പുനശ്ച യുഷ്മാകമേവ കതിപയാഃ കവയഃ കഥയന്തി ‘തസ്യ വംശാ വയം സ്മോ ഹി’ ഇതി|
౨౮మనం ఆయనలో బతుకుతున్నాం, ఆయనలోనే మన కదలికలూ ఉనికీ ఉన్నాయి. ‘మనమాయన సంతానం,’ అని మీ కవులు కూడా కొందరు చెప్పారు.
29 അതഏവ യദി വയമ് ഈശ്വരസ്യ വംശാ ഭവാമസ്തർഹി മനുഷ്യൈ ർവിദ്യയാ കൗശലേന ച തക്ഷിതം സ്വർണം രൂപ്യം ദൃഷദ് വൈതേഷാമീശ്വരത്വമ് അസ്മാഭി ർന ജ്ഞാതവ്യം|
౨౯కాబట్టి మనం దేవుని సంతానం గదా, దేవత్వం అనేది మనుషులు తమ ఆలోచనా నైపుణ్యాలతో చెక్కిన బంగారు, వెండి, రాతి బొమ్మలను పోలి ఉంటుందని అనుకోకూడదు.
30 തേഷാം പൂർവ്വീയലോകാനാമ് അജ്ഞാനതാം പ്രതീശ്വരോ യദ്യപി നാവാധത്ത തഥാപീദാനീം സർവ്വത്ര സർവ്വാൻ മനഃ പരിവർത്തയിതുമ് ആജ്ഞാപയതി,
౩౦ఆ ఆజ్ఞాన కాలాలను దేవుడు చూసీ చూడనట్టుగా ఉన్నాడు. ఇప్పుడైతే మానవులందరూ అంతటా పశ్చాత్తాప పడాలని అందరికీ ఆజ్ఞాపిస్తున్నాడు.
31 യതഃ സ്വനിയുക്തേന പുരുഷേണ യദാ സ പൃഥിവീസ്ഥാനാം സർവ്വലോകാനാം വിചാരം കരിഷ്യതി തദ്ദിനം ന്യരൂപയത്; തസ്യ ശ്മശാനോത്ഥാപനേന തസ്മിൻ സർവ്വേഭ്യഃ പ്രമാണം പ്രാദാത്|
౩౧ఎందుకంటే తాను నియమించిన వ్యక్తితో నీతిని బట్టి లోకానికి తీర్పు తీర్చే ఒక రోజు నిర్ణయించాడు. మృతుల్లో నుండి ఆయనను లేపాడు కాబట్టి దీన్ని నమ్మడానికి అందరికీ ఆధారం కలగజేశాడు.”
32 തദാ ശ്മശാനാദ് ഉത്ഥാനസ്യ കഥാം ശ്രുത്വാ കേചിദ് ഉപാഹമൻ, കേചിദവദൻ ഏനാം കഥാം പുനരപി ത്വത്തഃ ശ്രോഷ്യാമഃ|
౩౨మృతులు చనిపోయి తిరిగి లేవడం గురించి ఎతెన్సు వారు విన్నప్పుడు కొంతమంది ఎగతాళి చేశారు. మరి కొంతమంది దీన్ని గురించి నీవు చెప్పేది మరొకసారి వింటామని చెప్పారు.
33 തതഃ പൗലസ്തേഷാം സമീപാത് പ്രസ്ഥിതവാൻ|
౩౩ఆ తరువాత పౌలు వారి దగ్గర నుండి వెళ్ళిపోయాడు.
34 തഥാപി കേചില്ലോകാസ്തേന സാർദ്ധം മിലിത്വാ വ്യശ്വസൻ തേഷാം മധ്യേ ഽരേയപാഗീയദിയനുസിയോ ദാമാരീനാമാ കാചിന്നാരീ കിയന്തോ നരാശ്ചാസൻ|
౩౪అయితే కొంతమంది అతనితో చేరి విశ్వసించారు. వారిలో అరియోపగీతు వాడైన దియొనూసియ, దమరి అనే ఒక స్త్రీ, వీరితోబాటు మరి కొంతమంది కూడా ఉన్నారు.

< പ്രേരിതാഃ 17 >