< 1 karinthinaH 2 >
1 he bhrAtaro yuSmatsamIpe mamAgamanakAle'haM vaktRtAyA vidyAyA vA naipuNyenezvarasya sAkSyaM pracAritavAn tannahi;
౧సోదరీ సోదరులారా, నేను మీ దగ్గరికి వచ్చి దేవుని మర్మం గూర్చి బోధించినప్పుడు మాటకారితనాన్నీ లేక గొప్ప తెలివినీ ఉపయోగించలేదు.
2 yato yIzukhrISTaM tasya kruze hatatvaJca vinA nAnyat kimapi yuSmanmadhye jJApayituM vihitaM buddhavAn|
౨మీతో ఉన్న సమయంలో నేను యేసు క్రీస్తును తప్ప, అంటే సిలువను అనుభవించిన యేసు క్రీస్తును తప్ప, మరేదీ తెలియనివాణ్ణయి ఉండాలని తీర్మానించుకున్నాను.
3 aparaJcAtIva daurbbalyabhItikampayukto yuSmAbhiH sArddhamAsaM|
౩బలహీనుడుగా, భయంతో, వణకుతూ మీ దగ్గర గడిపాను.
4 aparaM yuSmAkaM vizvAso yat mAnuSikajJAnasya phalaM na bhavet kintvIzvarIyazakteH phalaM bhavet,
౪మీ విశ్వాసం మానవ జ్ఞానంపై కాక, దేవుని శక్తిపై ఆధారపడి ఉండాలని నా ఆశ.
5 tadarthaM mama vaktRtA madIyapracArazca mAnuSikajJAnasya madhuravAkyasambalitau nAstAM kintvAtmanaH zaktezca pramANayuktAvAstAM|
౫అందుకే నేను మాట్లాడినా, సువార్త ప్రకటించినా, జ్ఞానంతో నిండిన తియ్యని మాటలు వాడక, పరిశుద్ధాత్మ శక్తినే ప్రదర్శించాను.
6 vayaM jJAnaM bhASAmahe tacca siddhalokai rjJAnamiva manyate, tadihalokasya jJAnaM nahi, ihalokasya nazvarANAm adhipatInAM vA jJAnaM nahi; (aiōn )
౬ఆధ్యాత్మిక పరిణతి గలిగిన వారికి జ్ఞానాన్ని బోధిస్తున్నాం. అది ఈ లోకానికి చెందిన జ్ఞానమూ కాదు, వ్యర్ధమైపోయే ఈ లోకాధికారుల జ్ఞానమూ కాదు. (aiōn )
7 kintu kAlAvasthAyAH pUrvvasmAd yat jJAnam asmAkaM vibhavArtham IzvareNa nizcitya pracchannaM tannigUDham IzvarIyajJAnaM prabhASAmahe| (aiōn )
౭అది దేవుని రహస్య జ్ఞానం. ఈ రహస్య జ్ఞానాన్ని దేవుడు ఈ లోకం ఉనికిలోకి రాక మునుపే మన ఘనత కోసం నియమించాడు. (aiōn )
8 ihalokasyAdhipatInAM kenApi tat jJAnaM na labdhaM, labdhe sati te prabhAvaviziSTaM prabhuM kruze nAhaniSyan| (aiōn )
౮దాని గురించి ఈ యుగానికి చెందిన లోకాధికారుల్లో ఎవరికీ తెలియదు. అది వారికి తెలిసి ఉంటే మహిమాస్వరూపి అయిన ప్రభువును సిలువ వేసేవారు కాదు. (aiōn )
9 tadvallikhitamAste, netreNa kkApi no dRSTaM karNenApi ca na zrutaM| manomadhye tu kasyApi na praviSTaM kadApi yat|Izvare prIyamANAnAM kRte tat tena saJcitaM|
౯దీన్ని గూర్చి ‘దేవుడు తనను ప్రేమించే వారికోసం ఏం సిద్ధపరిచాడో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మానవ హృదయం ఊహకు అందలేదు’ అని రాసి ఉంది.
10 aparamIzvaraH svAtmanA tadasmAkaM sAkSAt prAkAzayat; yata AtmA sarvvamevAnusandhatte tena cezvarasya marmmatattvamapi budhyate|
౧౦మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ ద్వారా వెల్లడి చేశాడు. ఆ ఆత్మ అన్నిటినీ, చివరికి దేవుని లోతైన రహస్యాలను కూడ పరిశోధిస్తాడు.
11 manujasyAntaHsthamAtmAnaM vinA kena manujena tasya manujasya tattvaM budhyate? tadvadIzvarasyAtmAnaM vinA kenApIzvarasya tattvaM na budhyate|
౧౧ఒక వ్యక్తి విషయాలు ఆ వ్యక్తిలోని ఆత్మకే తెలుస్తాయి గానీ వేరొక వ్యక్తికెలా తెలుస్తాయి? ఆలాగే దేవుని విషయాలు దేవుని ఆత్మకు తప్ప మరెవరికీ తెలియవు.
12 vayaJcehalokasyAtmAnaM labdhavantastannahi kintvIzvarasyaivAtmAnaM labdhavantaH, tato hetorIzvareNa svaprasAdAd asmabhyaM yad yad dattaM tatsarvvam asmAbhi rjJAtuM zakyate|
౧౨దేవుడు మనకు ఉచితంగా దయచేసిన వాటిని తెలుసుకోవడం కోసం మనం లౌకికాత్మను కాక దేవుని నుండి వచ్చిన ఆత్మను పొందాము.
13 taccAsmAbhi rmAnuSikajJAnasya vAkyAni zikSitvA kathyata iti nahi kintvAtmato vAkyAni zikSitvAtmikai rvAkyairAtmikaM bhAvaM prakAzayadbhiH kathyate|
౧౩వాటిని మేము మానవ జ్ఞానం నేర్పగలిగే మాటలతో గాక ఆత్మసంబంధమైన విషయాలను ఆత్మసంబంధమైన వాటితో సరి చూసుకుంటూ, ఆత్మ నేర్పే మాటలతోనే బోధిస్తున్నాం.
14 prANI manuSya IzvarIyAtmanaH zikSAM na gRhlAti yata AtmikavicAreNa sA vicAryyeti hetoH sa tAM pralApamiva manyate boddhuJca na zaknoti|
౧౪సహజ సిద్ధమైన మనిషి దేవుని ఆత్మ విషయాలను అంగీకరించడు. ఎందుకంటే అవి అతనికి తెలివితక్కువగా కనిపిస్తాయి. వాటిని ఆధ్యాత్మికంగానే వివేచించగలం. కాబట్టి అతడు వాటిని గ్రహించలేడు.
15 Atmiko mAnavaH sarvvANi vicArayati kintu svayaM kenApi na vicAryyate|
౧౫ఆత్మ సంబంధి అన్నిటినీ సరిగా అంచనా వేయగలడు గాని అతణ్ణి ఎవరూ సరిగా అంచనా వేయలేరు.
16 yata Izvarasya mano jJAtvA tamupadeSTuM kaH zaknoti? kintu khrISTasya mano'smAbhi rlabdhaM|
౧౬ప్రభువు మనసు గ్రహించి ఆయనకు ఎవరు ఉపదేశించ గలరు? మనకైతే క్రీస్తు మనసు ఉంది.