< માર્કઃ 9 >
1 અથ સ તાનવાદીત્ યુષ્મભ્યમહં યથાર્થં કથયામિ, ઈશ્વરરાજ્યં પરાક્રમેણોપસ્થિતં ન દૃષ્ટ્વા મૃત્યું નાસ્વાદિષ્યન્તે, અત્ર દણ્ડાયમાનાનાં મધ્યેપિ તાદૃશા લોકાઃ સન્તિ|
౧ఆయన వారితో, “నేను మీతో కచ్చితంగా చెప్తున్నాను. ఇక్కడ నిలుచున్న వారిలో కొంతమంది దేవుని రాజ్యం శక్తితో రావడం చూస్తారు. దానికంటే ముందు వారు మరణించరు” అని అన్నాడు.
2 અથ ષડ્દિનેભ્યઃ પરં યીશુઃ પિતરં યાકૂબં યોહનઞ્ચ ગૃહીત્વા ગિરેરુચ્ચસ્ય નિર્જનસ્થાનં ગત્વા તેષાં પ્રત્યક્ષે મૂર્ત્યન્તરં દધાર|
౨ఆరు రోజుల తరవాత యేసు పేతురు, యాకోబు, యోహానులను తీసుకుని ఏకాంతంగా ఒక ఎతైన కొండ మీదికి వెళ్ళాడు. అక్కడ వారి ముందు యేసు రూపాంతరం చెందాడు.
3 તતસ્તસ્ય પરિધેયમ્ ઈદૃશમ્ ઉજ્જ્વલહિમપાણડરં જાતં યદ્ જગતિ કોપિ રજકો ન તાદૃક્ પાણડરં કર્ત્તાં શક્નોતિ|
౩ఆయన వస్త్రాలు ధగధగా మెరవసాగాయి. ప్రపంచంలో ఏ చాకలీ ఉతకలేనంత తెల్లగా మారిపోయాయి.
4 અપરઞ્ચ એલિયો મૂસાશ્ચ તેભ્યો દર્શનં દત્ત્વા યીશુના સહ કથનં કર્ત્તુમારેભાતે|
౪అప్పుడు ఏలీయా, మోషేలు అక్కడ ప్రత్యక్షమై యేసుతో మాటలాడడం శిష్యులు చూశారు.
5 તદા પિતરો યીશુમવાદીત્ હે ગુરોઽસ્માકમત્ર સ્થિતિરુત્તમા, તતએવ વયં ત્વત્કૃતે એકાં મૂસાકૃતે એકામ્ એલિયકૃતે ચૈકાં, એતાસ્તિસ્રઃ કુટી ર્નિર્મ્મામ|
౫పేతురు యేసుతో, “రబ్బీ! మనం ఇక్కడే ఉండడం మంచిది. మేము మూడు పాకలు వేస్తాం, ఒకటి నీకు, ఒకటి మోషేకి, ఒకటి ఏలీయాకి” అన్నాడు.
6 કિન્તુ સ યદુક્તવાન્ તત્ સ્વયં ન બુબુધે તતઃ સર્વ્વે બિભયાઞ્ચક્રુઃ|
౬తానేమి అంటున్నాడో అతనికి తెలియలేదు. ఆ శిష్యులంతా తీవ్రమైన భయానికి లోనయ్యారు.
7 એતર્હિ પયોદસ્તાન્ છાદયામાસ, મમયાં પ્રિયઃ પુત્રઃ કથાસુ તસ્ય મનાંસિ નિવેશયતેતિ નભોવાણી તન્મેદ્યાન્નિર્યયૌ|
౭అప్పుడు ఒక మేఘం వచ్చి వారిని కప్పివేసింది. ఆ మేఘం నుండి ఒక స్వరం ఇలా వినిపించింది. “ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన మాట వినండి.”
8 અથ હઠાત્તે ચતુર્દિશો દૃષ્ટ્વા યીશું વિના સ્વૈઃ સહિતં કમપિ ન દદૃશુઃ|
౮వెంటనే వారు తమ చుట్టూ చూశారు, యేసు తప్ప మరెవ్వరూ వారికి కనిపించలేదు.
9 તતઃ પરં ગિરેરવરોહણકાલે સ તાન્ ગાઢમ્ દૂત્યાદિદેશ યાવન્નરસૂનોઃ શ્મશાનાદુત્થાનં ન ભવતિ, તાવત્ દર્શનસ્યાસ્ય વાર્ત્તા યુષ્માભિઃ કસ્મૈચિદપિ ન વક્તવ્યા|
౯వారు కొండ దిగి వస్తూ ఉండగా యేసు, “మనుష్య కుమారుడు చనిపోయి తిరిగి బతికే వరకూ మీరు చూసిన ఈ దృశ్యాన్ని ఎవ్వరికీ చెప్పకండి” అని ఆజ్ఞాపించాడు.
10 તદા શ્મશાનાદુત્થાનસ્ય કોભિપ્રાય ઇતિ વિચાર્ય્ય તે તદ્વાક્યં સ્વેષુ ગોપાયાઞ્ચક્રિરે|
౧౦అందువల్ల వారు ఆ విషయం తమలోనే దాచుకుని, “చనిపోయి తిరిగి బ్రతకడం” గురించి తమలో తాము చర్చించుకున్నారు.
11 અથ તે યીશું પપ્રચ્છુઃ પ્રથમત એલિયેનાગન્તવ્યમ્ ઇતિ વાક્યં કુત ઉપાધ્યાયા આહુઃ?
౧౧అప్పుడు వారు, “ఏలీయా మొదట రావాలని ధర్మశాస్త్ర పండితులు ఎందుకు అంటున్నారు?” అని ఆయనను అడిగారు.
12 તદા સ પ્રત્યુવાચ, એલિયઃ પ્રથમમેત્ય સર્વ્વકાર્ય્યાણિ સાધયિષ્યતિ; નરપુત્રે ચ લિપિ ર્યથાસ્તે તથૈવ સોપિ બહુદુઃખં પ્રાપ્યાવજ્ઞાસ્યતે|
౧౨యేసు జవాబు చెబుతూ, “ఏలీయా మొదట వచ్చి అన్నిటినీ సరిచేస్తాడన్న మాట నిజమే. కాని, మనుష్య కుమారుడు అనేక బాధలు అనుభవిస్తాడనీ తిరస్కారానికి గురి అవుతాడనీ లేఖనాల్లో ఎందుకు రాసి ఉంది?
13 કિન્ત્વહં યુષ્માન્ વદામિ, એલિયાર્થે લિપિ ર્યથાસ્તે તથૈવ સ એત્ય યયૌ, લોકા: સ્વેચ્છાનુરૂપં તમભિવ્યવહરન્તિ સ્મ|
౧౩నేను మీతో చెప్పేదేమంటే, ఏలీయా వచ్చాడు, అతని గురించి రాసి ఉన్న ప్రకారం ప్రజలు తమకు ఇష్టం వచ్చినట్టు అతనికి చేశారు” అన్నాడు.
14 અનન્તરં સ શિષ્યસમીપમેત્ય તેષાં ચતુઃપાર્શ્વે તૈઃ સહ બહુજનાન્ વિવદમાનાન્ અધ્યાપકાંશ્ચ દૃષ્ટવાન્;
౧౪మిగిలిన శిష్యుల దగ్గరికి ఆయన రాగానే వారి చుట్టూ పెద్ద జనసమూహం ఉండడం, కొందరు ధర్మశాస్త్ర పండితులు వారితో వాదిస్తుండడం చూశాడు.
15 કિન્તુ સર્વ્વલોકાસ્તં દૃષ્ટ્વૈવ ચમત્કૃત્ય તદાસન્નં ધાવન્તસ્તં પ્રણેમુઃ|
౧౫ఆ ప్రజలు యేసును చూసిన వెంటనే ఆశ్చర్యానందానికి లోనయ్యారు. వారంతా ఆయన దగ్గరికి పరుగెత్తి వచ్చి ఆయనకు నమస్కరించారు.
16 તદા યીશુરધ્યાપકાનપ્રાક્ષીદ્ એતૈઃ સહ યૂયં કિં વિવદધ્વે?
౧౬యేసు, “దేనిని గురించి వారితో వాదిస్తున్నారు?” అని వారిని అడిగాడు.
17 તતો લોકાનાં કશ્ચિદેકઃ પ્રત્યવાદીત્ હે ગુરો મમ સૂનું મૂકં ભૂતધૃતઞ્ચ ભવદાસન્નમ્ આનયં|
౧౭ఆ ప్రజల్లో ఒకడు ఆయనతో, “బోధకుడా! దయ్యం పట్టి మూగవాడైన నా కుమారుణ్ణి మీ దగ్గరికి తీసుకు వచ్చాను.
18 યદાસૌ ભૂતસ્તમાક્રમતે તદૈવ પાતસતિ તથા સ ફેણાયતે, દન્તૈર્દન્તાન્ ઘર્ષતિ ક્ષીણો ભવતિ ચ; તતો હેતોસ્તં ભૂતં ત્યાજયિતું ભવચ્છિષ્યાન્ નિવેદિતવાન્ કિન્તુ તે ન શેકુઃ|
౧౮ఆ దయ్యం వాడి మీదికి వచ్చినప్పుడెల్లా అతన్ని కింద పడేస్తుంది. అతని నోటి వెంట నురగ కారుతుంది, పళ్ళు కొరుకుతాడు, శరీరమంతా బిగిసిపోతుంది. ఈ దయ్యాన్ని వదిలించమని మీ శిష్యులను అడిగాను. కాని, వారు చేయలేకపోయారు” అన్నాడు.
19 તદા સ તમવાદીત્, રે અવિશ્વાસિનઃ સન્તાના યુષ્માભિઃ સહ કતિ કાલાનહં સ્થાસ્યામિ? અપરાન્ કતિ કાલાન્ વા વ આચારાન્ સહિષ્યે? તં મદાસન્નમાનયત|
౧౯అందుకు యేసు, “విశ్వాసం లేని తరమా! నేనెంత కాలం మీతో ఉంటాను? ఎంత కాలం మిమ్మల్ని భరించాలి? ఆ పిల్లవాడిని నా దగ్గరికి తీసుకుని రండి” అన్నాడు.
20 તતસ્તત્સન્નિધિં સ આનીયત કિન્તુ તં દૃષ્ટ્વૈવ ભૂતો બાલકં ધૃતવાન્; સ ચ ભૂમૌ પતિત્વા ફેણાયમાનો લુલોઠ|
౨౦వారు తీసుకు వచ్చారు. ఆ దయ్యం యేసును చూసిన వెంటనే ఆ పిల్లవాడిని విలవిల లాడించింది. వాడు నేల మీద పడి గిల గిలా కొట్టుకుంటూ నురగ కక్కుతున్నాడు.
21 તદા સ તત્પિતરં પપ્રચ્છ, અસ્યેદૃશી દશા કતિ દિનાનિ ભૂતા? તતઃ સોવાદીત્ બાલ્યકાલાત્|
౨౧యేసు వాడి తండ్రితో, “ఇతనికి ఇది ఎంత కాలం నుండి ఉంది?” అని అడిగాడు. ఆ తండ్రి, “వాడి బాల్యం నుండి.
22 ભૂતોયં તં નાશયિતું બહુવારાન્ વહ્નૌ જલે ચ ન્યક્ષિપત્ કિન્તુ યદિ ભવાન કિમપિ કર્ત્તાં શક્નોતિ તર્હિ દયાં કૃત્વાસ્માન્ ઉપકરોતુ|
౨౨ఈ దయ్యం అతన్ని చంపాలని ఎన్నోసార్లు నిప్పుల్లో, నీళ్ళలో పడేసింది. నీవేమైనా చేయగలిగితే కనికరించి సహాయం చెయ్యి” అని వేడుకున్నాడు.
23 તદા યીશુસ્તમવદત્ યદિ પ્રત્યેતું શક્નોષિ તર્હિ પ્રત્યયિને જનાય સર્વ્વં સાધ્યમ્|
౨౩యేసు అతనితో, “నీవు నమ్మగలిగితే, నమ్మిన వ్యక్తికి అన్నీ సాధ్యమే” అన్నాడు.
24 તતસ્તત્ક્ષણં તદ્બાલકસ્ય પિતા પ્રોચ્ચૈ રૂવન્ સાશ્રુનેત્રઃ પ્રોવાચ, પ્રભો પ્રત્યેમિ મમાપ્રત્યયં પ્રતિકુરુ|
౨౪వెంటనే ఆ పిల్లవాడి తండ్రి, “నేను నమ్ముతున్నాను. నాలో అపనమ్మకం లేకుండా సహాయం చెయ్యి” అన్నాడు.
25 અથ યીશુ ર્લોકસઙ્ઘં ધાવિત્વાયાન્તં દૃષ્ટ્વા તમપૂતભૂતં તર્જયિત્વા જગાદ, રે બધિર મૂક ભૂત ત્વમેતસ્માદ્ બહિર્ભવ પુનઃ કદાપિ માશ્રયૈનં ત્વામહમ્ ઇત્યાદિશામિ|
౨౫యేసు జనసమూహం తన దగ్గరికి పరుగెత్తుకుంటూ రావడం చూసి ఆ దయ్యాన్ని గద్దించి, “మూగ చెవిటి దయ్యమా! ఇతనిలో నుండి బయటకు రా! ఇంకెప్పుడూ ఇతనిలో ప్రవేశించవద్దని నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను” అన్నాడు.
26 તદા સ ભૂતશ્ચીત્શબ્દં કૃત્વા તમાપીડ્ય બહિર્જજામ, તતો બાલકો મૃતકલ્પો બભૂવ તસ્માદયં મૃતઇત્યનેકે કથયામાસુઃ|
౨౬ఆ దయ్యం పెద్ద కేకలు పెట్టి, ఆ పిల్లవాణ్ణి విలవిలలాడించి అతనిలో నుండి బయటకు వచ్చింది. ఆ పిల్లవాడు శవంలా పడి ఉండడం వల్ల చాలా మంది అతడు చనిపోయాడనుకున్నారు.
27 કિન્તુ કરં ધૃત્વા યીશુનોત્થાપિતઃ સ ઉત્તસ્થૌ|
౨౭కాని, యేసు అతని చెయ్యి పట్టుకుని లేవనెత్తాడు. ఆ పిల్లవాడు లేచి నిలబడ్డాడు.
28 અથ યીશૌ ગૃહં પ્રવિષ્ટે શિષ્યા ગુપ્તં તં પપ્રચ્છુઃ, વયમેનં ભૂતં ત્યાજયિતું કુતો ન શક્તાઃ?
౨౮యేసు ఇంట్లోకి వచ్చిన తరవాత ఇతరులెవ్వరూ లేనప్పుడు శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి, “ఆ దయ్యాన్ని మేమెందుకు వెళ్ళగొట్టలేకపోయాం?” అని అడిగారు.
29 સ ઉવાચ, પ્રાર્થનોપવાસૌ વિના કેનાપ્યન્યેન કર્મ્મણા ભૂતમીદૃશં ત્યાજયિતું ન શક્યં|
౨౯ఆయన వారితో, “ఈ రకమైన దయ్యాన్ని ప్రార్థన వల్ల మాత్రమే వెళ్ళగొట్టగలం” అని జవాబు చెప్పాడు.
30 અનન્તરં સ તત્સ્થાનાદિત્વા ગાલીલ્મધ્યેન યયૌ, કિન્તુ તત્ કોપિ જાનીયાદિતિ સ નૈચ્છત્|
౩౦వారు అక్కడ నుండి బయలుదేరి గలిలయ ప్రాంతం మీదుగా దాటిపోయారు. ఆ సంగతి ఎవరికీ తెలియకూడదని యేసు ఆశించాడు.
31 અપરઞ્ચ સ શિષ્યાનુપદિશન્ બભાષે, નરપુત્રો નરહસ્તેષુ સમર્પયિષ્યતે તે ચ તં હનિષ્યન્તિ તૈસ્તસ્મિન્ હતે તૃતીયદિને સ ઉત્થાસ્યતીતિ|
౩౧ఆయన వాళ్లతో, “మనుష్య కుమారుణ్ణి శత్రువుల చేతికి అప్పగిస్తారు. వారు ఆయనను చంపుతారు. మూడు రోజుల తరువాత ఆయన తిరిగి బతికి వస్తాడు” అని అన్నాడు.
32 કિન્તુ તત્કથાં તે નાબુધ્યન્ત પ્રષ્ટુઞ્ચ બિભ્યઃ|
౩౨కానీ యేసు చెప్పింది శిష్యులు గ్రహించలేదు. దాని గురించి యేసును అడగడానికి వారు భయపడ్డారు.
33 અથ યીશુઃ કફર્નાહૂમ્પુરમાગત્ય મધ્યેગૃહઞ્ચેત્ય તાનપૃચ્છદ્ વર્ત્મમધ્યે યૂયમન્યોન્યં કિં વિવદધ્વે સ્મ?
౩౩వారు కపెర్నహూము చేరారు. అందరూ ఇంట్లో చేరాక యేసు వారితో, “దారిలో మీరు దేని గురించి చర్చించుకుంటున్నారు?” అని అడిగాడు.
34 કિન્તુ તે નિરુત્તરાસ્તસ્થુ ર્યસ્માત્તેષાં કો મુખ્ય ઇતિ વર્ત્માનિ તેઽન્યોન્યં વ્યવદન્ત|
౩౪అందరూ మౌనంగా ఉండిపోయారు. ఎందుకంటే దారిలో వారు తమలో ఎవరు గొప్ప, అని వాదించుకున్నారు.
35 તતઃ સ ઉપવિશ્ય દ્વાદશશિષ્યાન્ આહૂય બભાષે યઃ કશ્ચિત્ મુખ્યો ભવિતુમિચ્છતિ સ સર્વ્વેભ્યો ગૌણઃ સર્વ્વેષાં સેવકશ્ચ ભવતુ|
౩౫యేసు కూర్చుని పన్నెండు మందిని పిలిచి, “మీలో ఎవడైనా ముఖ్యుడుగా ఉండాలంటే అతడు అందరికన్నా చివరివాడై అందరికీ సేవకుడై ఉండాలి” అని వారితో అన్నాడు.
36 તદા સ બાલકમેકં ગૃહીત્વા મધ્યે સમુપાવેશયત્ તતસ્તં ક્રોડે કૃત્વા તાનવાદાત્
౩౬అప్పుడాయన ఒక చిన్న బిడ్డను తీసుకుని వారి మధ్య నిలబెట్టాడు. ఆ బిడ్డను ఎత్తుకుని ఇలా అన్నాడు,
37 યઃ કશ્ચિદીદૃશસ્ય કસ્યાપિ બાલસ્યાતિથ્યં કરોતિ સ મમાતિથ્યં કરોતિ; યઃ કશ્ચિન્મમાતિથ્યં કરોતિ સ કેવલમ્ મમાતિથ્યં કરોતિ તન્ન મત્પ્રેરકસ્યાપ્યાતિથ્યં કરોતિ|
౩౭“నా పేరిట ఇలాంటి చిన్నవారిలో ఒకరిని ఎవరైనా స్వీకరిస్తే నన్ను స్వీకరించినట్టే. నన్ను స్వీకరించేవారు నన్ను కాదు, నన్ను పంపిన ఆయనను కూడా స్వీకరిస్తున్నారు.”
38 અથ યોહન્ તમબ્રવીત્ હે ગુરો, અસ્માકમનનુગામિનમ્ એકં ત્વાન્નામ્ના ભૂતાન્ ત્યાજયન્તં વયં દૃષ્ટવન્તઃ, અસ્માકમપશ્ચાદ્ગામિત્વાચ્ચ તં ન્યષેધામ|
౩౮యోహాను ఆయనతో, “బోధకా! ఒకడు నీ పేరట దయ్యాలను వెళ్ళగొట్టడం చూశాం. అతడు మనవాడు కాదు. అందువల్ల అతన్ని అడ్డగించాం” అన్నాడు.
39 કિન્તુ યીશુરવદત્ તં મા નિષેધત્, યતો યઃ કશ્ચિન્ મન્નામ્ના ચિત્રં કર્મ્મ કરોતિ સ સહસા માં નિન્દિતું ન શક્નોતિ|
౩౯అయితే యేసు, “అతనిని ఆపకండి. నా పేరట అద్భుతం చేసే వాడెవడూ నా గురించి అంత తేలికగా చెడు మాట్లాడలేడు.
40 તથા યઃ કશ્ચિદ્ યુષ્માકં વિપક્ષતાં ન કરોતિ સ યુષ્માકમેવ સપક્ષઃ|
౪౦మనకు వ్యతిరేకంగా లేని వాడు మన పక్షంగా ఉన్నవాడే.
41 યઃ કશ્ચિદ્ યુષ્માન્ ખ્રીષ્ટશિષ્યાન્ જ્ઞાત્વા મન્નામ્ના કંસૈકેન પાનીયં પાતું દદાતિ, યુષ્માનહં યથાર્થં વચ્મિ, સ ફલેન વઞ્ચિતો ન ભવિષ્યતિ|
౪౧మీతో కచ్చితంగా చెప్పేదేమంటే, మీరు క్రీస్తుకు చెందిన వారని గుర్తించి నా పేరట ఒక గిన్నెడు నీళ్ళు ఎవరైనా మీకు తాగడానికి ఇస్తే అతడు తప్పక దాని ఫలం పొందుతాడు.
42 કિન્તુ યદિ કશ્ચિન્ મયિ વિશ્વાસિનામેષાં ક્ષુદ્રપ્રાણિનામ્ એકસ્યાપિ વિઘ્નં જનયતિ, તર્હિ તસ્યૈતત્કર્મ્મ કરણાત્ કણ્ઠબદ્ધપેષણીકસ્ય તસ્ય સાગરાગાધજલ મજ્જનં ભદ્રં|
౪౨“కాని, నన్ను నమ్ముకున్న ఇలాంటి ఒక చిన్నబిడ్డకి ఎవరైనా అడ్డుబండగా ఉంటే అతని మెడకు పెద్ద తిరగలి రాయి కట్టి, అతన్ని సముద్రంలో పడవేయడం అతనికి మేలు.
43 અતઃ સ્વકરો યદિ ત્વાં બાધતે તર્હિ તં છિન્ધિ;
౪౩మీరు పాపం చేయడానికి మీ చెయ్యి కారణమైతే దాన్ని నరికివేయండి! రెండు చేతులుండి, నరకంలోని ఆరని అగ్నిలోకి పోవడం కంటే ఒక చెయ్యి లేకుండా నిత్యజీవంలో ప్రవేశించడం మీకు మేలు. (Geenna )
44 યસ્માત્ યત્ર કીટા ન મ્રિયન્તે વહ્નિશ્ચ ન નિર્વ્વાતિ, તસ્મિન્ અનિર્વ્વાણાનલનરકે કરદ્વયવસ્તવ ગમનાત્ કરહીનસ્ય સ્વર્ગપ્રવેશસ્તવ ક્ષેમં| (Geenna )
౪౪
45 યદિ તવ પાદો વિઘ્નં જનયતિ તર્હિ તં છિન્ધિ,
౪౫ఒకవేళ మీరు పాపం చేయడానికి మీ కాలు కారణమైతే దాన్ని నరికివేయండి. రెండు కాళ్ళు ఉండి నరకంలో ఆరని అగ్నిలోకి పోవడం కంటే ఒక కాలు లేకుండా నిత్యజీవంలో ప్రవేశించడం మీకు మేలు. (Geenna )
46 યતો યત્ર કીટા ન મ્રિયન્તે વહ્નિશ્ચ ન નિર્વ્વાતિ, તસ્મિન્ ઽનિર્વ્વાણવહ્નૌ નરકે દ્વિપાદવતસ્તવ નિક્ષેપાત્ પાદહીનસ્ય સ્વર્ગપ્રવેશસ્તવ ક્ષેમં| (Geenna )
౪౬
47 સ્વનેત્રં યદિ ત્વાં બાધતે તર્હિ તદપ્યુત્પાટય, યતો યત્ર કીટા ન મ્રિયન્તે વહ્નિશ્ચ ન નિર્વ્વાતિ,
౪౭అలాగే మీరు పాపం చేయడానికి మీ కన్ను కారణమైతే దాన్ని పీకి పారవేయండి. రెండు కళ్ళు ఉండి నరకంలో పడడం కంటే ఒకే కన్నుతో దేవుని రాజ్యంలో ప్రవేశించడం మీకు మేలు. (Geenna )
48 તસ્મિન ઽનિર્વ્વાણવહ્નૌ નરકે દ્વિનેત્રસ્ય તવ નિક્ષેપાદ્ એકનેત્રવત ઈશ્વરરાજ્યે પ્રવેશસ્તવ ક્ષેમં| (Geenna )
౪౮నరకంలో వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. ()
49 યથા સર્વ્વો બલિ ર્લવણાક્તઃ ક્રિયતે તથા સર્વ્વો જનો વહ્નિરૂપેણ લવણાક્તઃ કારિષ્યતે|
౪౯ప్రతి ఒక్కరూ మంటల మూలంగా ఉప్పు సారం పొందుతారు.
50 લવણં ભદ્રં કિન્તુ યદિ લવણે સ્વાદુતા ન તિષ્ઠતિ, તર્હિ કથમ્ આસ્વાદ્યુક્તં કરિષ્યથ? યૂયં લવણયુક્તા ભવત પરસ્પરં પ્રેમ કુરુત|
౫౦ఉప్పు మంచిదే కాని దానిలో ఉన్న ఉప్పదనం పోతే ఆ స్వభావం తిరిగి ఎలా వస్తుంది? మీలో ఉప్పదనం కలిగి ఉండండి, ఒకరితో ఒకరు సామరస్యంగా ఉండండి” అని చెప్పాడు.