< ရောမိဏး 7 >
1 ဟေ ဘြာတၖဂဏ ဝျဝသ္ထာဝိဒး ပြတိ မမေဒံ နိဝေဒနံ၊ ဝိဓိး ကေဝလံ ယာဝဇ္ဇီဝံ မာနဝေါပရျျဓိပတိတွံ ကရောတီတိ ယူယံ ကိံ န ဇာနီထ?
౧సోదరులారా, ధర్మశాస్త్రం మనిషి జీవించి ఉన్నంత వరకే అధికారం చెలాయిస్తుందని మీకు తెలియదా? ధర్మశాస్త్రం తెలిసిన మీతో మాట్లాడుతున్నాను.
2 ယာဝတ္ကာလံ ပတိ ရ္ဇီဝတိ တာဝတ္ကာလမ် ဦဎာ ဘာရျျာ ဝျဝသ္ထယာ တသ္မိန် ဗဒ္ဓါ တိၐ္ဌတိ ကိန္တု ယဒိ ပတိ ရ္မြိယတေ တရှိ သာ နာရီ ပတျု ရွျဝသ္ထာတော မုစျတေ၊
౨వివాహిత అయిన స్త్రీ, తన భర్త జీవించి ఉన్నంత వరకే ధర్మశాస్త్రం వలన అతనికి బద్ధురాలు గాని, భర్త చనిపోతే వివాహ సంబంధమైన ధర్మశాస్త్ర నియమం నుండి ఆమె స్వేచ్ఛ పొందుతుంది.
3 ဧတတ္ကာရဏာတ် ပတျုရ္ဇီဝနကာလေ နာရီ ယဒျနျံ ပုရုၐံ ဝိဝဟတိ တရှိ သာ ဝျဘိစာရိဏီ ဘဝတိ ကိန္တု ယဒိ သ ပတိ ရ္မြိယတေ တရှိ သာ တသျာ ဝျဝသ္ထာယာ မုက္တာ သတီ ပုရုၐာန္တရေဏ ဝျူဎာပိ ဝျဘိစာရိဏီ န ဘဝတိ၊
౩కాబట్టి భర్త జీవించి ఉండగా ఆమె వేరే పురుషుణ్ణి కలిస్తే ఆమె వ్యభిచారి అవుతుంది గాని, భర్త చనిపోతే ఆమె ధర్మశాస్త్రం నుండి స్వేచ్ఛ పొందింది కాబట్టి వేరొక పురుషుణ్ణి పెళ్ళి చేసికొన్నప్పటికీ ఆమె వ్యభిచారిణి కాదు.
4 ဟေ မမ ဘြာတၖဂဏ, ဤၑွရနိမိတ္တံ ယဒသ္မာကံ ဖလံ ဇာယတေ တဒရ္ထံ ၑ္မၑာနာဒ် ဥတ္ထာပိတေန ပုရုၐေဏ သဟ ယုၐ္မာကံ ဝိဝါဟော ယဒ် ဘဝေတ် တဒရ္ထံ ခြီၐ္ဋသျ ၑရီရေဏ ယူယံ ဝျဝသ္ထာံ ပြတိ မၖတဝန္တး၊
౪కాబట్టి నా సోదరులారా, మనం దేవుని కోసం ఫలించ గలిగేలా చనిపోయి తిరిగి లేచిన క్రీస్తును చేరుకోడానికి మీరు కూడా ఆయన శరీరం ద్వారా ధర్మశాస్త్ర విషయంలో చనిపోయారు.
5 ယတော'သ္မာကံ ၑာရီရိကာစရဏသမယေ မရဏနိမိတ္တံ ဖလမ် ဥတ္ပာဒယိတုံ ဝျဝသ္ထယာ ဒူၐိတး ပါပါဘိလာၐော'သ္မာကမ် အင်္ဂေၐု ဇီဝန် အာသီတ်၊
౫ఎందుకంటే మనం శరీర సంబంధులుగా ఉన్నప్పుడు చావు ఫలాన్ని ఫలించడానికి ధర్మశాస్త్రం ద్వారా కలిగే పాపపు కోరికలు మన అవయవాల్లో పని చేస్తూ ఉండేవి.
6 ကိန္တု တဒါ ယသျာ ဝျဝသ္ထာယာ ဝၑေ အာသ္မဟိ သာမ္ပြတံ တာံ ပြတိ မၖတတွာဒ် ဝယံ တသျာ အဓီနတွာတ် မုက္တာ ဣတိ ဟေတောရီၑွရော'သ္မာဘိး ပုရာတနလိခိတာနုသာရာတ် န သေဝိတဝျး ကိန္တု နဝီနသွဘာဝေနဲဝ သေဝိတဝျး
౬ఇప్పుడైతే ఏది మనలను బంధించి ఉంచిందో దాని విషయంలో చనిపోయి, ధర్మశాస్త్రం నుండి స్వేచ్ఛ పొందాము. కాబట్టి మనం దాని అక్షరార్ధమైన పాత విధానంలో కాక దేవుని ఆత్మానుసారమైన కొత్త విధానంలో సేవ చేస్తున్నాము.
7 တရှိ ဝယံ ကိံ ဗြူမး? ဝျဝသ္ထာ ကိံ ပါပဇနိကာ ဘဝတိ? နေတ္ထံ ဘဝတု၊ ဝျဝသ္ထာမ် အဝိဒျမာနာယာံ ပါပံ ကိမ် ဣတျဟံ နာဝေဒံ; ကိဉ္စ လောဘံ မာ ကာရ္ၐီရိတိ စေဒ် ဝျဝသ္ထာဂြန္ထေ လိခိတံ နာဘဝိၐျတ် တရှိ လောဘး ကိမ္ဘူတသ္တဒဟံ နာဇ္ဉာသျံ၊
౭కాబట్టి ఏం చెప్పాలి? ధర్మశాస్త్రం పాపమా? కానే కాదు. ధర్మశాస్త్రం వలన కాకపోతే నాకు పాపమంటే ఏమిటో తెలిసేది కాదు. ఇతరులకు చెందిన దాన్ని ఆశించవద్దని ధర్మశాస్త్రం చెప్పకపోతే దురాశ అంటే ఏమిటో నాకు తెలిసేది కాదు.
8 ကိန္တု ဝျဝသ္ထယာ ပါပံ ဆိဒြံ ပြာပျာသ္မာကမ် အန္တး သရွွဝိဓံ ကုတ္သိတာဘိလာၐမ် အဇနယတ်; ယတော ဝျဝသ္ထာယာမ် အဝိဒျမာနာယာံ ပါပံ မၖတံ၊
౮అయితే పాపం ఆజ్ఞను ఆధారంగా చేసుకుని అన్ని రకాల దురాశలను నాలో పుట్టించింది. ధర్మశాస్త్రం లేకపోతే పాపం చనిపోయినట్టే.
9 အပရံ ပူရွွံ ဝျဝသ္ထာယာမ် အဝိဒျမာနာယာမ် အဟမ် အဇီဝံ တတး ပရမ် အာဇ္ဉာယာမ် ဥပသ္ထိတာယာမ် ပါပမ် အဇီဝတ် တဒါဟမ် အမြိယေ၊
౯ఒకప్పుడు నేను ధర్మశాస్త్రం లేనప్పుడు జీవంతోనే ఉన్నాను గాని, ఆజ్ఞ రావడంతోనే పాపానికి మళ్ళీ జీవం వచ్చి నేను చనిపోయాను.
10 ဣတ္ထံ သတိ ဇီဝနနိမိတ္တာ ယာဇ္ဉာ သာ မမ မၖတျုဇနိကာဘဝတ်၊
౧౦అప్పుడు జీవాన్ని తెచ్చే ఆజ్ఞ నాకు చావును కలిగించేదిగా కనబడింది.
11 ယတး ပါပံ ဆိဒြံ ပြာပျ ဝျဝသ္ထိတာဒေၑေန မာံ ဝဉ္စယိတွာ တေန မာမ် အဟန်၊
౧౧ఎందుకంటే పాపం ఆజ్ఞను ఆధారంగా చేసుకుని మోసం చేసి నన్ను చంపింది.
12 အတဧဝ ဝျဝသ္ထာ ပဝိတြာ, အာဒေၑၑ္စ ပဝိတြော နျာယျော ဟိတကာရီ စ ဘဝတိ၊
౧౨కాబట్టి ధర్మశాస్త్రం పవిత్రం. ఆజ్ఞ కూడా పవిత్రం, నీతివంతం, ఉత్తమం.
13 တရှိ ယတ် သွယံ ဟိတကၖတ် တတ် ကိံ မမ မၖတျုဇနကမ် အဘဝတ်? နေတ္ထံ ဘဝတု; ကိန္တု ပါပံ ယတ် ပါတကမိဝ ပြကာၑတေ တထာ နိဒေၑေန ပါပံ ယဒတီဝ ပါတကမိဝ ပြကာၑတေ တဒရ္ထံ ဟိတောပါယေန မမ မရဏမ် အဇနယတ်၊
౧౩మరి ఉత్తమమైంది నాకు చావును తెచ్చిందా? కానే కాదు. అయితే పాపం ఉత్తమమైన దాని ద్వారా పాపంగా కనిపించాలని, అది నాకు చావును తీసుకు వచ్చింది. అంటే పాపం ఆజ్ఞ మూలంగా మరింత ఎక్కువ పాపం కావడం కోసం, అది నాకు చావును తెచ్చిపెట్టింది.
14 ဝျဝသ္ထာတ္မဗောဓိကေတိ ဝယံ ဇာနီမး ကိန္တွဟံ ၑာရီရတာစာရီ ပါပသျ ကြီတကိင်္ကရော ဝိဒျေ၊
౧౪ధర్మశాస్త్రం ఆత్మ సంబంధమైందని మనకు తెలుసు. అయితే నేను పాపానికి అమ్ముడుబోయిన శరీర సంబంధిని.
15 ယတော ယတ် ကရ္မ္မ ကရောမိ တတ် မမ မနော'ဘိမတံ နဟိ; အပရံ ယန် မမ မနော'ဘိမတံ တန္န ကရောမိ ကိန္တု ယဒ် ၒတီယေ တတ် ကရောမိ၊
౧౫ఎందుకంటే నేను చేసేది నాకు తెలియదు. నేను దేనిని ఇష్టపడతానో దాన్ని కాక దేన్ని ద్వేషిస్తానో దానినే చేస్తున్నాను.
16 တထာတွေ ယန် မမာနဘိမတံ တဒ် ယဒိ ကရောမိ တရှိ ဝျဝသ္ထာ သူတ္တမေတိ သွီကရောမိ၊
౧౬నేను ఇష్టపడని దాన్ని చేస్తున్నట్టయితే ధర్మశాస్త్రం మంచిదే అని ఒప్పుకుంటున్నాను.
17 အတဧဝ သမ္ပြတိ တတ် ကရ္မ္မ မယာ ကြိယတ ဣတိ နဟိ ကိန္တု မမ ၑရီရသ္ထေန ပါပေနဲဝ ကြိယတေ၊
౧౭కాబట్టి దాన్ని చేసేది నాలోని పాపమే గాని నేను కాదు.
18 ယတော မယိ, အရ္ထတော မမ ၑရီရေ, ကိမပျုတ္တမံ န ဝသတိ, ဧတဒ် အဟံ ဇာနာမိ; မမေစ္ဆုကတာယာံ တိၐ္ဌန္တျာမပျဟမ် ဥတ္တမကရ္မ္မသာဓနေ သမရ္ထော န ဘဝါမိ၊
౧౮నాలో, అంటే నా శరీరంలో మంచిదేదీ లేదని నాకు తెలుసు. మంచిని చేయాలనే కోరిక నాకు కలుగుతుంది గాని, దాన్ని చేయడం నా వల్ల కావడం లేదు.
19 ယတော ယာမုတ္တမာံ ကြိယာံ ကရ္တ္တုမဟံ ဝါဉ္ဆာမိ တာံ န ကရောမိ ကိန္တု ယတ် ကုတ္သိတံ ကရ္မ္မ ကရ္တ္တုမ် အနိစ္ဆုကော'သ္မိ တဒေဝ ကရောမိ၊
౧౯నేను చేయాలని కోరే మంచిని చేయకుండా, నేను చేయగోరని చెడును జరిగిస్తున్నాను.
20 အတဧဝ ယဒျတ် ကရ္မ္မ ကရ္တ္တုံ မမေစ္ဆာ န ဘဝတိ တဒ် ယဒိ ကရောမိ တရှိ တတ် မယာ န ကြိယတေ, မမာန္တရွရ္တ္တိနာ ပါပေနဲဝ ကြိယတေ၊
౨౦నేను కోరని దాన్ని చేస్తే అది నాలోని పాపమే గాని నేను కాదు.
21 ဘဒြံ ကရ္တ္တုမ် ဣစ္ဆုကံ မာံ ယော 'ဘဒြံ ကရ္တ္တုံ ပြဝရ္တ္တယတိ တာဒၖၑံ သွဘာဝမေကံ မယိ ပၑျာမိ၊
౨౧అందువల్ల, “నేను మంచి చెయ్యాలని అనుకొన్నప్పుడు చెడు నాలోనే ఉంటుంది” అనే ఈ నియమం నాలో పని చేస్తున్నట్లు గమనిస్తున్నాను.
22 အဟမ် အာန္တရိကပုရုၐေဏေၑွရဝျဝသ္ထာယာံ သန္တုၐ္ဋ အာသေ;
౨౨అంతరంగ పురుషుణ్ణి బట్టి దేవుని ధర్మశాస్త్రంలో నేను ఆనందిస్తున్నాను.
23 ကိန္တု တဒွိပရီတံ ယုဓျန္တံ တဒနျမေကံ သွဘာဝံ မဒီယာင်္ဂသ္ထိတံ ပြပၑျာမိ, သ မဒီယာင်္ဂသ္ထိတပါပသွဘာဝသျာယတ္တံ မာံ ကရ္တ္တုံ စေၐ္ဋတေ၊
౨౩కానీ వేరొక నియమం నా అవయవాల్లో ఉన్నట్టు నాకు కనబడుతున్నది. అది నా మనసులోని ధర్మశాస్త్రంతో పోరాడుతూ నా అవయవాల్లోని పాప నియమానికి నన్ను బందీగా చేస్తున్నది.
24 ဟာ ဟာ ယော'ဟံ ဒုရ္ဘာဂျော မနုဇသ္တံ မာမ် ဧတသ္မာန် မၖတာစ္ဆရီရာတ် ကော နိသ္တာရယိၐျတိ?
౨౪అయ్యో, నేనెంత నికృష్టుణ్ణి? చావుకు లోనైన ఈ శరీరం నుండి నన్నెవరు విడిపిస్తారు?
25 အသ္မာကံ ပြဘုဏာ ယီၑုခြီၐ္ဋေန နိသ္တာရယိတာရမ် ဤၑွရံ ဓနျံ ဝဒါမိ၊ အတဧဝ ၑရီရေဏ ပါပဝျဝသ္ထာယာ မနသာ တု ဤၑွရဝျဝသ္ထာယား သေဝနံ ကရောမိ၊
౨౫మన ప్రభు యేసు క్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెబుతున్నాను. కాగా మనసు విషయంలో నేను దైవనియమానికీ, శరీర విషయంలో పాప నియమానికీ దాసుణ్ణి.