< မထိး 7 >
1 ယထာ ယူယံ ဒေါၐီကၖတာ န ဘဝထ, တတ္ကၖတေ'နျံ ဒေါၐိဏံ မာ ကုရုတ၊
౧“ఇతరులకు తీర్పు తీర్చవద్దు. అప్పుడు మిమ్మల్నీ తీర్పు తీర్చరు.
2 ယတော ယာဒၖၑေန ဒေါၐေဏ ယူယံ ပရာန် ဒေါၐိဏး ကုရုထ, တာဒၖၑေန ဒေါၐေဏ ယူယမပိ ဒေါၐီကၖတာ ဘဝိၐျထ, အနျဉ္စ ယေန ပရိမာဏေန ယုၐ္မာဘိး ပရိမီယတေ, တေနဲဝ ပရိမာဏေန ယုၐ္မတ္ကၖတေ ပရိမာယိၐျတေ၊
౨మీరు ఎలా తీర్పు తీరుస్తారో అలాగే మీకూ తీర్పు జరుగుతుంది. మీరు ఏ కొలతతో కొలుస్తారో ఆ కొలత ప్రకారమే మీకూ దొరుకుతుంది.
3 အပရဉ္စ နိဇနယနေ ယာ နာသာ ဝိဒျတေ, တာမ် အနာလောစျ တဝ သဟဇသျ လောစနေ ယတ် တၖဏမ် အာသ္တေ, တဒေဝ ကုတော ဝီက္ၐသေ?
౩నీ కంటిలో ఉన్న దుంగను గమనించుకోకుండా నీ సాటి మనిషి కంటిలోని నలుసు ఎందుకు చూస్తావు?
4 တဝ နိဇလောစနေ နာသာယာံ ဝိဒျမာနာယာံ, ဟေ ဘြာတး, တဝ နယနာတ် တၖဏံ ဗဟိၐျရ္တုံ အနုဇာနီဟိ, ကထာမေတာံ နိဇသဟဇာယ ကထံ ကထယိတုံ ၑက္နောၐိ?
౪నీ కంటిలో దుంగను ఉంచుకుని నీ సోదరునితో, ‘నీ కంటిలోని నలుసు తీయనివ్వు’ అని ఎలా చెబుతావు?
5 ဟေ ကပဋိန်, အာဒေါ် နိဇနယနာတ် နာသာံ ဗဟိၐ္ကုရု တတော နိဇဒၖၐ္ဋော် သုပြသန္နာယာံ တဝ ဘြာတၖ ရ္လောစနာတ် တၖဏံ ဗဟိၐ္ကရ္တုံ ၑက္ၐျသိ၊
౫కపట వేషధారీ! మొదట నీ కంటిలో ఉన్న దుంగను తీసివేసికో, అప్పుడు నీ సోదరుని కంటిలో ఉన్న నలుసు తీసివేయడానికి అది నీకు స్పష్టంగా కనబడుతుంది.
6 အနျဉ္စ သာရမေယေဘျး ပဝိတြဝသ္တူနိ မာ ဝိတရတ, ဝရာဟာဏာံ သမက္ၐဉ္စ မုက္တာ မာ နိက္ၐိပတ; နိက္ၐေပဏာတ် တေ တား သရွွား ပဒဲ ရ္ဒလယိၐျန္တိ, ပရာဝၖတျ ယုၐ္မာနပိ ဝိဒါရယိၐျန္တိ၊
౬పవిత్రమైనదాన్ని కుక్కలకు పెట్టవద్దు. మీ ముత్యాలు పందుల ముందు వేయవద్దు. అలా చేస్తే అవి వాటిని కాళ్ళతో తొక్కేసి, తరువాత మీమీద పడి మిమ్మల్ని చీల్చి వేస్తాయేమో.
7 ယာစဓွံ တတော ယုၐ္မဘျံ ဒါယိၐျတေ; မၖဂယဓွံ တတ ဥဒ္ဒေၑံ လပ္သျဓွေ; ဒွါရမ် အာဟတ, တတော ယုၐ္မတ္ကၖတေ မုက္တံ ဘဝိၐျတိ၊
౭“అడగండి, మీకు ఇవ్వబడుతుంది. వెదకండి, మీకు దొరుకుతుంది. తట్టండి, మీకు తలుపు తీయబడుతుంది.
8 ယသ္မာဒ် ယေန ယာစျတေ, တေန လဘျတေ; ယေန မၖဂျတေ တေနောဒ္ဒေၑး ပြာပျတေ; ယေန စ ဒွါရမ် အာဟနျတေ, တတ္ကၖတေ ဒွါရံ မောစျတေ၊
౮అడిగే ప్రతివాడికీ లభిస్తుంది. వెదికే వాడికి దొరుకుతుంది. తట్టే వాడికి తలుపు తెరుచుకుంటుంది.
9 အာတ္မဇေန ပူပေ ပြာရ္ထိတေ တသ္မဲ ပါၐာဏံ ဝိၑြာဏယတိ,
౯మీలో ఎవరైనా, తన కొడుకు రొట్టె అడిగితే వాడికి రాయినిస్తాడా?
10 မီနေ ယာစိတေ စ တသ္မဲ ဘုဇဂံ ဝိတရတိ, ဧတာဒၖၑး ပိတာ ယုၐ္မာကံ မဓျေ က အာသ္တေ?
౧౦లేక వాడు చేపను అడిగితే పామునిస్తాడా?
11 တသ္မာဒ် ယူယမ် အဘဒြား သန္တော'ပိ ယဒိ နိဇဗာလကေဘျ ဥတ္တမံ ဒြဝျံ ဒါတုံ ဇာနီထ, တရှိ ယုၐ္မာကံ သွရ္ဂသ္ထး ပိတာ သွီယယာစကေဘျး ကိမုတ္တမာနိ ဝသ္တူနိ န ဒါသျတိ?
౧౧మీరు చెడ్డ వారు అయినా మీ పిల్లలకు మంచి బహుమతులు ఇవ్వాలన్న సంగతి తెలుసు గదా! అలాంటప్పుడు పరలోకంలో ఉన్న మీ తండ్రి తనను అడిగే వారికి అంతకంటే మంచి బహుమతులు కచ్చితంగా ఇస్తాడు.
12 ယူၐ္မာန် ပြတီတရေၐာံ ယာဒၖၑော ဝျဝဟာရော ယုၐ္မာကံ ပြိယး, ယူယံ တာန် ပြတိ တာဒၖၑာနေဝ ဝျဝဟာရာန် ဝိဓတ္တ; ယသ္မာဒ် ဝျဝသ္ထာဘဝိၐျဒွါဒိနာံ ဝစနာနာမ် ဣတိ သာရမ်၊
౧౨“కాబట్టి మనుషులు మీకు ఏమి చేయాలని మీరు కోరుకుంటారో అలాగే మీరూ వారికి చేయండి. ధర్మశాస్త్రమూ ప్రవక్తల ఉపదేశమూ ఇదే.
13 သင်္ကီရ္ဏဒွါရေဏ ပြဝိၑတ; ယတော နရကဂမနာယ ယဒ် ဒွါရံ တဒ် ဝိသ္တီရ္ဏံ ယစ္စ ဝရ္တ္မ တဒ် ဗၖဟတ် တေန ဗဟဝး ပြဝိၑန္တိ၊
౧౩ఇరుకు ద్వారం గుండా ప్రవేశించండి. నాశనానికి పోయే ద్వారం వెడల్పు. దారి విశాలం. దాని ద్వారా చాలా మంది ప్రవేశిస్తారు.
14 အပရံ သွရ္ဂဂမနာယ ယဒ် ဒွါရံ တတ် ကီဒၖက် သံကီရ္ဏံ၊ ယစ္စ ဝရ္တ္မ တတ် ကီဒၖဂ် ဒုရ္ဂမမ်၊ တဒုဒ္ဒေၐ္ဋာရး ကိယန္တော'လ္ပား၊
౧౪జీవానికి దారి తీసే ద్వారం ఇరుకు. దారికష్టమైనది. దాన్ని కనుగొనే వారు కొంతమందే.
15 အပရဉ္စ ယေ ဇနာ မေၐဝေၑေန ယုၐ္မာကံ သမီပမ် အာဂစ္ဆန္တိ, ကိန္တွန္တရ္ဒုရန္တာ ဝၖကာ ဧတာဒၖၑေဘျော ဘဝိၐျဒွါဒိဘျး သာဝဓာနာ ဘဝတ, ယူယံ ဖလေန တာန် ပရိစေတုံ ၑက္နုထ၊
౧౫“అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్తగా ఉండండి. వారు గొర్రె తోలు కప్పుకుని మీ దగ్గరికి వస్తారు. కాని లోలోపల వారు క్రూరమైన తోడేళ్ళు.
16 မနုဇား ကိံ ကဏ္ဋကိနော ဝၖက္ၐာဒ် ဒြာက္ၐာဖလာနိ ၑၖဂါလကောလိတၑ္စ ဥဍုမ္ဗရဖလာနိ ၑာတယန္တိ?
౧౬వారి ఫలాలను బట్టి వారిని తెలుసు కోవచ్చు. ముళ్ళ పొదల్లో ద్రాక్షపండ్లు గానీ పల్లేరు మొక్కల్లో అంజూరపండ్లు గానీ కోస్తారా?
17 တဒွဒ် ဥတ္တမ ဧဝ ပါဒပ ဥတ္တမဖလာနိ ဇနယတိ, အဓမပါဒပဧဝါဓမဖလာနိ ဇနယတိ၊
౧౭అలాగే ప్రతి మంచి చెట్టు మంచి పండ్లు కాస్తుంది. పనికిమాలిన చెట్టు పనికిమాలిన పండ్లు కాస్తుంది.
18 ကိန္တူတ္တမပါဒပး ကဒါပျဓမဖလာနိ ဇနယိတုံ န ၑက္နောတိ, တထာဓမောပိ ပါဒပ ဥတ္တမဖလာနိ ဇနယိတုံ န ၑက္နောတိ၊
౧౮మంచి చెట్టు పనికిమాలిన పండ్లు కాయదు. పనికిమాలిన చెట్టు మంచి పండ్లు కాయదు.
19 အပရံ ယေ ယေ ပါဒပါ အဓမဖလာနိ ဇနယန္တိ, တေ ကၖတ္တာ ဝဟ္နော် က္ၐိပျန္တေ၊
౧౯మంచి పండ్లు కాయని ప్రతి చెట్టునూ నరికి మంటల్లో వేస్తారు.
20 အတဧဝ ယူယံ ဖလေန တာန် ပရိစေၐျထ၊
౨౦ఈ విధంగా మీరు వారి ఫలం వలన వారిని తెలుసుకుంటారు.
21 ယေ ဇနာ မာံ ပြဘုံ ဝဒန္တိ, တေ သရွွေ သွရ္ဂရာဇျံ ပြဝေက္ၐျန္တိ တန္န, ကိန္တု ယော မာနဝေါ မမ သွရ္ဂသ္ထသျ ပိတုရိၐ္ဋံ ကရ္မ္မ ကရောတိ သ ဧဝ ပြဝေက္ၐျတိ၊
౨౧“‘ప్రభూ, ప్రభూ,’ అని నన్ను పిలిచేవారందరూ పరలోకరాజ్యంలో ప్రవేశించరు. పరలోకంలో ఉన్న నా తండ్రి ఇష్ట ప్రకారం చేసే వారే ప్రవేశిస్తారు.
22 တဒ် ဒိနေ ဗဟဝေါ မာံ ဝဒိၐျန္တိ, ဟေ ပြဘော ဟေ ပြဘော, တဝ နာမ္နာ ကိမသ္မာမိ ရ္ဘဝိၐျဒွါကျံ န ဝျာဟၖတံ? တဝ နာမ္နာ ဘူတား ကိံ န တျာဇိတား? တဝ နာမ္နာ ကိံ နာနာဒ္ဘုတာနိ ကရ္မ္မာဏိ န ကၖတာနိ?
౨౨ఆ రోజున చాలామంది నాతో, ‘ప్రభూ, ప్రభూ, మేము నీ పేరున ప్రవచించలేదా? నీ నామంలో దయ్యాలను వెళ్ళగొట్టలేదా? నీ నామంలో చాలా అద్భుతాలు చేయలేదా?’ అంటారు.
23 တဒါဟံ ဝဒိၐျာမိ, ဟေ ကုကရ္မ္မကာရိဏော ယုၐ္မာန် အဟံ န ဝေဒ္မိ, ယူယံ မတ္သမီပါဒ် ဒူရီဘဝတ၊
౨౩అప్పుడు నేను, ‘దుర్మార్గులారా, నేను మీరెవరో నాకు తెలియనే తెలియదు. నా దగ్గర నుండి వెళ్ళిపొండి’ అంటాను.
24 ယး ကၑ္စိတ် မမဲတား ကထား ၑြုတွာ ပါလယတိ, သ ပါၐာဏောပရိ ဂၖဟနိရ္မ္မာတြာ ဇ္ဉာနိနာ သဟ မယောပမီယတေ၊
౨౪“కాబట్టి ఈ నా మాటలు విని వాటి ప్రకారం జీవించేవాడు రాతి నేల మీద తన ఇల్లు కట్టుకున్న తెలివిగల వాడిలాగా ఉంటాడు.
25 ယတော ဝၖၐ္ဋော် သတျာမ် အာပ္လာဝ အာဂတေ ဝါယော် ဝါတေ စ တေၐု တဒ္ဂေဟံ လဂ္နေၐု ပါၐာဏောပရိ တသျ ဘိတ္တေသ္တန္န ပတတိ
౨౫వాన కురిసింది. వరదలు వచ్చాయి. పెనుగాలులు ఆ ఇంటి మీద వీచాయి. దాని పునాది బండ మీద వేశారు కాబట్టి అది పడిపోలేదు.
26 ကိန္တု ယး ကၑ္စိတ် မမဲတား ကထား ၑြုတွာ န ပါလယတိ သ သဲကတေ ဂေဟနိရ္မ္မာတြာ 'ဇ္ဉာနိနာ ဥပမီယတေ၊
౨౬నా ఈ మాటలు విని వాటి ప్రకారం చేయని ప్రతివాడూ ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న తెలివిలేని వాడిలా ఉంటాడు.
27 ယတော ဇလဝၖၐ္ဋော် သတျာမ် အာပ္လာဝ အာဂတေ ပဝနေ ဝါတေ စ တဲ ရ္ဂၖဟေ သမာဃာတေ တတ် ပတတိ တတ္ပတနံ မဟဒ် ဘဝတိ၊
౨౭వాన కురిసింది. వరదలు వచ్చాయి. గాలులు వీచి ఆ ఇంటి మీద కొట్టాయి. అప్పుడది కూలిపోయింది. అది ఘోరమైన పతనం.”
28 ယီၑုနဲတေၐု ဝါကျေၐု သမာပိတေၐု မာနဝါသ္တဒီယောပဒေၑမ် အာၑ္စရျျံ မေနိရေ၊
౨౮యేసు ఈ మాటలు చెప్పి ముగించినపుడు ప్రజలు ఆయన బోధకు ఆశ్చర్యపడ్డారు.
29 ယသ္မာတ် သ ဥပါဓျာယာ ဣဝ တာန် နောပဒိဒေၑ ကိန္တု သမရ္ထပုရုၐဣဝ သမုပဒိဒေၑ၊
౨౯ఎందుకంటే ఆయన వారి ధర్మశాస్త్ర పండితుల్లా కాక అధికారం గల వాడిలాగా వారికి బోధించాడు.