< မထိး 26 >

1 ယီၑုရေတာန် ပြသ္တာဝါန် သမာပျ ၑိၐျာနူစေ,
యేసు ఈ మాటలు చెప్పడం ముగించిన తరువాత ఆయన తన శిష్యులతో,
2 ယုၐ္မာဘိ ရ္ဇ္ဉာတံ ဒိနဒွယာတ် ပရံ နိသ္တာရမဟ ဥပသ္ထာသျတိ, တတြ မနုဇသုတး ကြုၑေန ဟန္တုံ ပရကရေၐု သမရ္ပိၐျတေ၊
“రెండు రోజుల తరువాత పస్కా పండగ వస్తుందని మీకు తెలుసు. అప్పుడు మనుష్య కుమారుణ్ణి సిలువ వేయడానికి అప్పగిస్తారు” అని చెప్పాడు.
3 တတး ပရံ ပြဓာနယာဇကာဓျာပကပြာဉ္စး ကိယဖာနာမ္နော မဟာယာဇကသျာဋ္ဋာလိကာယာံ မိလိတွာ
ఆ సమయంలోనే ముఖ్య యాజకులు, ప్రజల పెద్దలు కయప అనే ప్రధాన యాజకుడి నివాసంలో సమావేశమయ్యారు.
4 ကေနောပါယေန ယီၑုံ ဓၖတွာ ဟန္တုံ ၑက္နုယုရိတိ မန္တြယာဉ္စကြုး၊
వారంతా ఏకమై కుట్ర చేసి యేసును పట్టుకుని, చంపాలని కుయుక్తులు పన్నారు.
5 ကိန္တု တဲရုက္တံ မဟကာလေ န ဓရ္တ္တဝျး, ဓၖတေ ပြဇာနာံ ကလဟေန ဘဝိတုံ ၑကျတေ၊
అయితే ప్రజల్లో అల్లరి జరుగుతుందేమో అని “పండగ సమయంలో వద్దు” అని చెప్పుకున్నారు.
6 တတော ဗဲထနိယာပုရေ ၑိမောနာချသျ ကုၐ္ဌိနော ဝေၑ္မနိ ယီၑော် တိၐ္ဌတိ
యేసు బేతనీలో కుష్టురోగి సీమోను ఇంట్లో ఉన్నాడు.
7 ကာစန ယောၐာ ၑွေတောပလဘာဇနေန မဟာရ္ဃျံ သုဂန္ဓိ တဲလမာနီယ ဘောဇနာယောပဝိၑတသ္တသျ ၑိရောဘျၐေစတ်၊
ఆ సమయంలో ఒక స్త్రీ పాలరాతి సీసాలో బాగా ఖరీదైన అత్తరు తెచ్చి, ఆయన భోజనానికి కూర్చుని ఉన్నప్పుడు ఆయన తలమీద ఆ అత్తరు పోసింది.
8 ကိန္တု တဒါလောကျ တစ္ဆိၐျဲး ကုပိတဲရုက္တံ, ကုတ ဣတ္ထမပဝျယတေ?
అది చూసి శిష్యులకు కోపం వచ్చింది. వారు ఆమెతో, “ఎంత నష్టం!
9 စေဒိဒံ ဝျကြေၐျတ, တရှိ ဘူရိမူလျံ ပြာပျ ဒရိဒြေဘျော ဝျတာရိၐျတ၊
దీన్ని మంచి ధరకు అమ్మి ఆ సొమ్మును పేదలకు దానం చెయ్యవచ్చు కదా?” అన్నారు.
10 ယီၑုနာ တဒဝဂတျ တေ သမုဒိတား, ယောၐာမေနာံ ကုတော ဒုးခိနီံ ကုရုထ, သာ မာံ ပြတိ သာဓု ကရ္မ္မာကာရ္ၐီတ်၊
౧౦యేసు ఆ సంగతి గ్రహించి, “ఈ స్త్రీని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ఈమె నా విషయంలో ఒక మంచి పని చేసింది.
11 ယုၐ္မာကမံ သမီပေ ဒရိဒြား သတတမေဝါသတေ, ကိန္တု ယုၐ္မာကမန္တိကေဟံ နာသေ သတတံ၊
౧౧బీదవారు మీ దగ్గర ఎప్పుడూ ఉంటారు. కానీ నేను ఎల్లకాలం మీతో ఉండను.
12 သာ မမ ကာယောပရိ သုဂန္ဓိတဲလံ သိက္တွာ မမ ၑ္မၑာနဒါနကရ္မ္မာကာရ္ၐီတ်၊
౧౨ఈమె ఈ అత్తరు నా శరీరంపై పోసి నా భూస్థాపన కోసం సిద్ధం చేసింది.
13 အတောဟံ ယုၐ္မာန် တထျံ ဝဒါမိ သရွွသ္မိန် ဇဂတိ ယတြ ယတြဲၐ သုသမာစာရး ပြစာရိၐျတေ, တတြ တတြဲတသျာ နာရျျား သ္မရဏာရ္ထမ် ကရ္မ္မေဒံ ပြစာရိၐျတေ၊
౧౩నేను కచ్చితంగా చెప్పేదేమంటే, ఈ లోకమంతటిలో సువార్త ప్రకటన ఎక్కడెక్కడ జరుగుతుందో అక్కడ ఈమెనూ, ఈమె చేసిన పనినీ అందరూ గుర్తు చేసుకుని ప్రశంసిస్తారు.”
14 တတော ဒွါဒၑၑိၐျာဏာမ် ဤၐ္ကရိယောတီယယိဟူဒါနာမက ဧကး ၑိၐျး ပြဓာနယာဇကာနာမန္တိကံ ဂတွာ ကထိတဝါန်,
౧౪అప్పుడు పన్నెండు మందిలో ఒకడైన ఇస్కరియోతు యూదా, ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళాడు.
15 ယဒိ ယုၐ္မာကံ ကရေၐု ယီၑုံ သမရ္ပယာမိ, တရှိ ကိံ ဒါသျထ? တဒါနီံ တေ တသ္မဲ တြိံၑန္မုဒြာ ဒါတုံ သ္ထိရီကၖတဝန္တး၊
౧౫“యేసును మీకు పట్టిస్తే నాకేమిస్తారు?” అని అతడు వారినడిగాడు. వారు ముప్ఫై వెండి నాణాలు లెక్కపెట్టి అతనికి ఇచ్చారు.
16 သ တဒါရဘျ တံ ပရကရေၐု သမရ္ပယိတုံ သုယောဂံ စေၐ္ဋိတဝါန်၊
౧౬అతడు అప్పటి నుండి ఆయనను వారికి పట్టివ్వడానికి తగిన సమయం కోసం ఎదురు చూస్తున్నాడు.
17 အနန္တရံ ကိဏွၑူနျပူပပရွွဏး ပြထမေဟ္နိ ၑိၐျာ ယီၑုမ် ဥပဂတျ ပပြစ္ဆုး ဘဝတ္ကၖတေ ကုတြ ဝယံ နိသ္တာရမဟဘောဇျမ် အာယောဇယိၐျာမး? ဘဝတး ကေစ္ဆာ?
౧౭పొంగని రొట్టెల పండగలో మొదటి రోజు శిష్యులు యేసు దగ్గరికి వచ్చి, “మనం పస్కా భోజనాన్ని ఆచరించడానికి ఏర్పాట్లు ఎక్కడ చేయమంటావు?” అని అడిగారు.
18 တဒါ သ ဂဒိတဝါန်, မဓျေနဂရမမုကပုံသး သမီပံ ဝြဇိတွာ ဝဒတ, ဂုရု ရ္ဂဒိတဝါန်, မတ္ကာလး သဝိဓး, သဟ ၑိၐျဲသ္တွဒါလယေ နိသ္တာရမဟဘောဇျံ ဘောက္ၐျေ၊
౧౮అందుకాయన, “మీరు పట్టణంలో ఫలాని వ్యక్తి దగ్గరికి వెళ్ళి, నా కాలం సమీపించింది. నా శిష్యులతో కలిసి నీ ఇంట్లో పస్కా భోజనం చేస్తాను, అని మా గురువు అంటున్నాడని అతనితో చెప్పండి” అన్నాడు.
19 တဒါ ၑိၐျာ ယီၑောသ္တာဒၖၑနိဒေၑာနုရူပကရ္မ္မ ဝိဓာယ တတြ နိသ္တာရမဟဘောဇျမာသာဒယာမာသုး၊
౧౯యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి శిష్యులు పస్కాను సిద్ధం చేశారు.
20 တတး သန္ဓျာယာံ သတျာံ ဒွါဒၑဘိး ၑိၐျဲး သာကံ သ နျဝိၑတ်၊
౨౦సాయంకాలం యేసు తన పన్నెండు మంది శిష్యులతో భోజనానికి కూర్చున్నాడు.
21 အပရံ ဘုဉ္ဇာန ဥက္တဝါန် ယုၐ္မာန် တထျံ ဝဒါမိ, ယုၐ္မာကမေကော မာံ ပရကရေၐု သမရ္ပယိၐျတိ၊
౨౧వారు భోజనం చేస్తుండగా ఆయన, “మీలో ఒకడు నన్ను శత్రువులకు అప్పగిస్తాడని మీతో కచ్చితంగా చెబుతున్నాను” అన్నాడు.
22 တဒါ တေ'တီဝ ဒုးခိတာ ဧကဲကၑော ဝက္တုမာရေဘိရေ, ဟေ ပြဘော, သ ကိမဟံ?
౨౨అందుకు వారు చాలా దుఃఖంలో మునిగిపోయారు. ప్రతి ఒక్కడూ, “ప్రభూ, అది నేనా?” అని ఆయనను అడగడం ప్రారంభించారు.
23 တတး သ ဇဂါဒ, မယာ သာကံ ယော ဇနော ဘောဇနပါတြေ ကရံ သံက္ၐိပတိ, သ ဧဝ မာံ ပရကရေၐု သမရ္ပယိၐျတိ၊
౨౩ఆయన, “నాతో కలిసి పాత్రలో చెయ్యి ముంచి భోజనం చేసేవాడే నన్ను పట్టిస్తాడు.
24 မနုဇသုတမဓိ ယာဒၖၑံ လိခိတမာသ္တေ, တဒနုရူပါ တဒ္ဂတိ ရ္ဘဝိၐျတိ; ကိန္တု ယေန ပုံသာ သ ပရကရေၐု သမရ္ပယိၐျတေ, ဟာ ဟာ စေတ် သ နာဇနိၐျတ, တဒါ တသျ က္ၐေမမဘဝိၐျတ်၊
౨౪మనుష్య కుమారుణ్ణి గురించి రాసి ఉన్న ప్రకారం ఆయన చనిపోవలసిందే గాని ఆయనను ఎవరు పట్టిస్తాడో ఆ వ్యక్తికి యాతన తప్పదు. ఆ వ్యక్తి అసలు పుట్టి ఉండకపోతే అతనికి మంచిది” అని వారితో చెప్పాడు.
25 တဒါ ယိဟူဒါနာမာ ယော ဇနသ္တံ ပရကရေၐု သမရ္ပယိၐျတိ, သ ဥက္တဝါန်, ဟေ ဂုရော, သ ကိမဟံ? တတး သ ပြတျုက္တဝါန်, တွယာ သတျံ ဂဒိတမ်၊
౨౫ఆయనను అప్పగించబోయే యూదా, “ప్రభూ, నేను కాదు కదా?” అని అడగ్గానే ఆయన, “నీవే చెబుతున్నావు కదా?” అన్నాడు.
26 အနန္တရံ တေၐာမၑနကာလေ ယီၑုး ပူပမာဒါယေၑွရီယဂုဏာနနူဒျ ဘံက္တွာ ၑိၐျေဘျး ပြဒါယ ဇဂါဒ, မဒွပုးသွရူပမိမံ ဂၖဟီတွာ ခါဒတ၊
౨౬వారు భోజనం చేస్తుండగా యేసు ఒక రొట్టె తీసుకుని స్తుతులు చెల్లించి, విరిచి తన శిష్యులకు ఇస్తూ, “దీన్ని మీరు తీసుకుని తినండి. ఇది నా శరీరం” అని చెప్పాడు.
27 ပၑ္စာတ် သ ကံသံ ဂၖဟ္လန် ဤၑွရီယဂုဏာနနူဒျ တေဘျး ပြဒါယ ကထိတဝါန်, သရွွဲ ရျုၐ္မာဘိရနေန ပါတဝျံ,
౨౭తరువాత ఆయన ద్రాక్ష రసం పాత్ర తీసుకుని కృతజ్ఞతలు చెల్లించి వారికిచ్చి, “దీనిలోనిది మీరంతా తాగండి.
28 ယသ္မာဒနေကေၐာံ ပါပမရ္ၐဏာယ ပါတိတံ ယန္မန္နူတ္နနိယမရူပၑောဏိတံ တဒေတတ်၊
౨౮ఇది నా రక్తం. అంటే పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కోసం నేను చిందించబోతున్న కొత్త నిబంధన రక్తం.
29 အပရမဟံ နူတ္နဂေါသ္တနီရသံ န ပါသျာမိ, တာဝတ် ဂေါသ္တနီဖလရသံ ပုနး ကဒါပိ န ပါသျာမိ၊
౨౯నా తండ్రి రాజ్యంలో మీతో కలిసి ఇలాటి ద్రాక్షరసం మళ్ళీ తాగే రోజు వరకూ నేనిక దాన్ని తాగనని మీతో చెబుతున్నాను” అన్నాడు.
30 ပၑ္စာတ် တေ ဂီတမေကံ သံဂီယ ဇဲတုနာချဂိရိံ ဂတဝန္တး၊
౩౦అప్పుడు వారు ఒక కీర్తన పాడి ఒలీవ కొండకు వెళ్ళారు.
31 တဒါနီံ ယီၑုသ္တာနဝေါစတ်, အသျာံ ရဇနျာမဟံ ယုၐ္မာကံ သရွွေၐာံ ဝိဃ္နရူပေါ ဘဝိၐျာမိ, ယတော လိခိတမာသ္တေ, "မေၐာဏာံ ရက္ၐကော ယသ္တံ ပြဟရိၐျာမျဟံ တတး၊ မေၐာဏာံ နိဝဟော နူနံ ပြဝိကီရ္ဏော ဘဝိၐျတိ"။
౩౧అప్పుడు యేసు వారితో, “ఈ రాత్రి మీరంతా నా విషయంలో తొట్రుపడతారు. ఎందుకంటే, ‘కాపరిని దెబ్బ తీస్తాను, మందలోని గొర్రెలు చెదరిపోతాయి’ అని రాసి ఉంది కదా!
32 ကိန္တု ၑ္မၑာနာတ် သမုတ္ထာယ ယုၐ္မာကမဂြေ'ဟံ ဂါလီလံ ဂမိၐျာမိ၊
౩౨కాని నేను మరణం నుండి తిరిగి లేచిన తరువాత మీకంటే ముందుగా గలిలయకి వెళ్తాను” అన్నాడు.
33 ပိတရသ္တံ ပြောဝါစ, ဘဝါံၑ္စေတ် သရွွေၐာံ ဝိဃ္နရူပေါ ဘဝတိ, တထာပိ မမ န ဘဝိၐျတိ၊
౩౩అందుకు పేతురు, “నీ విషయంలో అందరూ వెనుకంజ వేసినా సరే నేను మాత్రం ఎన్నటికీ వెనుకంజ వేయను” అని యేసుతో చెప్పాడు.
34 တတော ယီၑုနာ သ ဥက္တး, တုဘျမဟံ တထျံ ကထယာမိ, ယာမိနျာမသျာံ စရဏာယုဓသျ ရဝါတ် ပူရွွံ တွံ မာံ တြိ ရ္နာင်္ဂီကရိၐျသိ၊
౩౪యేసు అతణ్ణి చూసి, “నేను నీతో కచ్చితంగా చెప్పేదేమంటే, ఈ రాత్రి కోడి కూసే ముందే నేనెవరో తెలియదని నీవు మూడుసార్లు చెబుతావు” అన్నాడు.
35 တတး ပိတရ ဥဒိတဝါန်, ယဒျပိ တွယာ သမံ မရ္တ္တဝျံ, တထာပိ ကဒါပိ တွာံ န နာင်္ဂီကရိၐျာမိ; တထဲဝ သရွွေ ၑိၐျာၑ္စောစုး၊
౩౫పేతురు ఆయనతో, “నేను నీతో కలిసి చావాల్సి వచ్చినా సరే, నిన్ను ఎరగనని చెప్పను” అన్నాడు. మిగిలిన శిష్యులందరూ అవే మాటలు పలికారు.
36 အနန္တရံ ယီၑုး ၑိၐျဲး သာကံ ဂေတ္ၑိမာနီနာမကံ သ္ထာနံ ပြသ္ထာယ တေဘျး ကထိတဝါန်, အဒး သ္ထာနံ ဂတွာ ယာဝဒဟံ ပြာရ္ထယိၐျေ တာဝဒ် ယူယမတြောပဝိၑတ၊
౩౬ఆ తరువాత, యేసు వారితో కలిసి గేత్సేమనే అనే చోటికి వచ్చాడు. ఆయన, “నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి తిరిగి వచ్చే వరకూ మీరు ఇక్కడే కూర్చోండి” అని వారితో చెప్పాడు.
37 ပၑ္စာတ် သ ပိတရံ သိဝဒိယသုတော် စ သင်္ဂိနး ကၖတွာ ဂတဝါန်, ၑောကာကုလော'တီဝ ဝျထိတၑ္စ ဗဘူဝ၊
౩౭పేతురును, జెబెదయి ఇద్దరు కొడుకులను తన వెంట తీసుకు వెళ్ళి తీవ్రమైన దుఃఖంలో, కలతలో మునిగిపోయాడు.
38 တာနဝါဒီစ္စ မၖတိယာတနေဝ မတ္ပြာဏာနာံ ယာတနာ ဇာယတေ, ယူယမတြ မယာ သာရ္ဒ္ဓံ ဇာဂၖတ၊
౩౮అప్పుడు ఆయన వారితో, “నా ప్రాణం పోయేటంతగా నాకు దుఃఖం ముంచుకొస్తూ ఉంది. మీరు ఇక్కడే నిలిచి నాతో కలిసి మెలకువగా ఉండండి” అని చెప్పాడు.
39 တတး သ ကိဉ္စိဒ္ဒူရံ ဂတွာဓောမုခး ပတန် ပြာရ္ထယာဉ္စကြေ, ဟေ မတ္ပိတရျဒိ ဘဝိတုံ ၑက္နောတိ, တရှိ ကံသော'ယံ မတ္တော ဒူရံ ယာတု; ကိန္တု မဒိစ္ဆာဝတ် န ဘဝတု, တွဒိစ္ဆာဝဒ် ဘဝတု၊
౩౯ఆయన కొంత దూరం వెళ్ళి, సాగిలపడి, “నా తండ్రీ, సాధ్యమైతే ఈ గిన్నె నా దగ్గర నుండి తీసివేయి. అయినా నీ ఇష్టమే నెరవేరాలి, నా ఇష్టం కాదు” అని ప్రార్థన చేశాడు.
40 တတး သ ၑိၐျာနုပေတျ တာန် နိဒြတော နိရီက္ၐျ ပိတရာယ ကထယာမာသ, ယူယံ မယာ သာကံ ဒဏ္ဍမေကမပိ ဇာဂရိတုံ နာၑန္ကုတ?
౪౦శిష్యుల దగ్గరికి వచ్చి, వారు నిద్ర పోతుండడం చూసి, “నాతో కలిసి ఒక్క గంట కూడా మెలకువగా ఉండలేరా?
41 ပရီက္ၐာယာံ န ပတိတုံ ဇာဂၖတ ပြာရ္ထယဓွဉ္စ; အာတ္မာ သမုဒျတောသ္တိ, ကိန္တု ဝပု ရ္ဒုရ္ဗ္ဗလံ၊
౪౧మీరు పరీక్షలో పడకుండా ఉండేందుకు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆత్మ సిద్ధమేగానీ శరీరం బలహీనం” అని పేతురుతో అన్నాడు.
42 သ ဒွိတီယဝါရံ ပြာရ္ထယာဉ္စကြေ, ဟေ မတ္တာတ, န ပီတေ ယဒိ ကံသမိဒံ မတ္တော ဒူရံ ယာတုံ န ၑက္နောတိ, တရှိ တွဒိစ္ဆာဝဒ် ဘဝတု၊
౪౨యేసు రెండవ సారి దూరంగా వెళ్ళి, “నా తండ్రీ, నేను దీన్ని తాగితేనే తప్ప నా నుండి తీసివేయడం సాధ్యం కాదనుకుంటే, నీ చిత్తమే నెరవేరనీ!” అని ప్రార్థన చేశాడు.
43 သ ပုနရေတျ တာန် နိဒြတော ဒဒရ္ၑ, ယတသ္တေၐာံ နေတြာဏိ နိဒြယာ ပူရ္ဏာနျာသန်၊
౪౩ఆయన తిరిగి వచ్చి, వారు ఇంకా నిద్రపోతూ ఉండడం చూశాడు. వారి కళ్ళు నిద్రాభారంతో మూతలు పడుతున్నాయి.
44 ပၑ္စာတ် သ တာန် ဝိဟာယ ဝြဇိတွာ တၖတီယဝါရံ ပူရွွဝတ် ကထယန် ပြာရ္ထိတဝါန်၊
౪౪ఆయన వారిని మళ్ళీ విడిచి వెళ్ళి, ఆ మాటలే తిరిగి చెబుతూ మూడోసారి ప్రార్థన చేశాడు.
45 တတး ၑိၐျာနုပါဂတျ ဂဒိတဝါန်, သာမ္ပြတံ ၑယာနား ကိံ ဝိၑြာမျထ? ပၑျတ, သမယ ဥပါသ္ထာတ်, မနုဇသုတး ပါပိနာံ ကရေၐု သမရ္ပျတေ၊
౪౫అప్పుడాయన తన శిష్యుల దగ్గరికి తిరిగి వచ్చి ఇలా అన్నాడు, “మీరింకా విశ్రాంతిగా నిద్రపోతున్నారా? వినండి, మనుష్య కుమారుణ్ణి పాపాత్ముల చేతులకు అప్పగించే సమయం వచ్చేసింది.
46 ဥတ္တိၐ္ဌတ, ဝယံ ယာမး, ယော မာံ ပရကရေၐု မသရ္ပယိၐျတိ, ပၑျတ, သ သမီပမာယာတိ၊
౪౬ఇంక వెళ్దాం, లేవండి. నన్ను వారికి పట్టిచ్చేవాడు సమీపించాడు.”
47 ဧတတ္ကထာကထနကာလေ ဒွါဒၑၑိၐျာဏာမေကော ယိဟူဒါနာမကော မုချယာဇကလောကပြာစီနဲး ပြဟိတာန် အသိဓာရိယၐ္ဋိဓာရိဏော မနုဇာန် ဂၖဟီတွာ တတ္သမီပမုပတသ္ထော်၊
౪౭ఆయన ఇంకా మాట్లాడుతూ ఉండగానే పన్నెండు మంది శిష్యుల్లో ఒకడైన యూదా వచ్చాడు. అతనితో ప్రధాన యాజకుల దగ్గర నుంచీ, ప్రజల పెద్దల నుంచీ వచ్చిన పెద్ద గుంపు ఉంది. వారి చేతుల్లో కత్తులు, గదలు ఉన్నాయి.
48 အသော် ပရကရေၐွရ္ပယိတာ ပူရွွံ တာန် ဣတ္ထံ သင်္ကေတယာမာသ, ယမဟံ စုမ္ဗိၐျေ, သော'သော် မနုဇး, သဧဝ ယုၐ္မာဘိ ရ္ဓာရျျတာံ၊
౪౮ఆయనను పట్టి ఇచ్చేవాడు, “నేనెవరికి ముద్దు పెడతానో ఆయనే యేసు. ఆయనను మీరు పట్టుకోండి” అని వారికి ముందుగానే ఒక గుర్తు చెప్పాడు.
49 တဒါ သ သပဒိ ယီၑုမုပါဂတျ ဟေ ဂုရော, ပြဏမာမီတျုက္တွာ တံ စုစုမ္ဗေ၊
౪౯అతడు యేసు దగ్గరికి వచ్చి, “బోధకా, నీకు శుభం!” అంటూ ఆయనకు ముద్దు పెట్టాడు.
50 တဒါ ယီၑုသ္တမုဝါစ, ဟေ မိတြံ ကိမရ္ထမာဂတောသိ? တဒါ တဲရာဂတျ ယီၑုရာကြမျ ဒဃြေ၊
౫౦యేసు, “మిత్రమా, నీవేం చేయాలనుకున్నావో అది చెయ్యి” అని అతనితో చెప్పగానే వారు దగ్గరికి వచ్చి ఆయనను ఒడిసి పట్టుకున్నారు.
51 တတော ယီၑေား သင်္ဂိနာမေကး ကရံ ပြသာရျျ ကောၐာဒသိံ ဗဟိၐ္ကၖတျ မဟာယာဇကသျ ဒါသမေကမာဟတျ တသျ ကရ္ဏံ စိစ္ဆေဒ၊
౫౧వెంటనే యేసుతో ఉన్నవారిలో ఒకడు తన చెయ్యి చాపి, కత్తి బయటికి తీసి ప్రధాన యాజకుడి సేవకుణ్ణి కొట్టి, అతని చెవి నరికేశాడు.
52 တတော ယီၑုသ္တံ ဇဂါဒ, ခဍ္ဂံ သွသ္ထာနေ နိဓေဟိ ယတော ယေ ယေ ဇနာ အသိံ ဓာရယန္တိ, တဧဝါသိနာ ဝိနၑျန္တိ၊
౫౨అప్పుడు యేసు, “నీ కత్తి నీ వరలో తిరిగి పెట్టు. కత్తి వాడేవారంతా కత్తితోనే నాశనం అవుతారు.
53 အပရံ ပိတာ ယထာ မဒန္တိကံ သွရ္ဂီယဒူတာနာံ ဒွါဒၑဝါဟိနီတော'ဓိကံ ပြဟိဏုယာတ် မယာ တမုဒ္ဒိၑျေဒါနီမေဝ တထာ ပြာရ္ထယိတုံ န ၑကျတေ, တွယာ ကိမိတ္ထံ ဇ္ဉာယတေ?
౫౩ఇప్పుడు నేను నా తండ్రిని వేడుకుంటే ఆయన పన్నెండు సేనా వ్యూహాలకంటే ఎక్కువ మంది దేవదూతలను వెంటనే పంపడనుకుంటున్నావా?
54 တထာ သတီတ္ထံ ဃဋိၐျတေ ဓရ္မ္မပုသ္တကသျ ယဒိဒံ ဝါကျံ တတ် ကထံ သိဓျေတ်?
౫౪నేనలా వేడుకుంటే అంతా ఈ విధంగా జరగాలని ఉన్న లేఖనం ఎలా నెరవేరుతుంది?” అని అతనితో అన్నాడు.
55 တဒါနီံ ယီၑု ရ္ဇနနိဝဟံ ဇဂါဒ, ယူယံ ခဍ္ဂယၐ္ဋီန် အာဒါယ မာံ ကိံ စော်ရံ ဓရ္တ္တုမာယာတား? အဟံ ပြတျဟံ ယုၐ္မာဘိး သာကမုပဝိၑျ သမုပါဒိၑံ, တဒါ မာံ နာဓရတ;
౫౫తరువాత యేసు ఆ గుంపు వైపు చూసి, “ఒక దోపిడీ దొంగ మీదికి వచ్చినట్టు నన్ను పట్టుకోడానికి మీరు కత్తులు, గదలతో వచ్చారా? ప్రతి రోజూ నేను దేవాలయంలో బోధించేటప్పుడు నన్ను పట్టుకోలేదే,
56 ကိန္တု ဘဝိၐျဒွါဒိနာံ ဝါကျာနာံ သံသိဒ္ဓယေ သရွွမေတဒဘူတ်၊ တဒါ သရွွေ ၑိၐျာသ္တံ ဝိဟာယ ပလာယန္တ၊
౫౬ప్రవక్తల లేఖనాలు నెరవేరడం కోసమే ఈ విధంగా జరిగింది” అని చెప్పాడు. అప్పుడు శిష్యులంతా ఆయనను విడిచిపెట్టి పారిపోయారు.
57 အနန္တရံ တေ မနုဇာ ယီၑုံ ဓၖတွာ ယတြာဓျာပကပြာဉ္စး ပရိၐဒံ ကုရွွန္တ ဥပါဝိၑန် တတြ ကိယဖာနာမကမဟာယာဇကသျာန္တိကံ နိနျုး၊
౫౭యేసును పట్టుకున్న వారు ఆయనను ప్రధాన యాజకుడు కయప దగ్గరికి తీసుకుపోయారు. అక్కడ ధర్మశాస్త్ర పండితులు, పెద్దలు సమావేశమై ఉన్నారు.
58 ကိန္တု ၑေၐေ ကိံ ဘဝိၐျတီတိ ဝေတ္တုံ ပိတရော ဒူရေ တတ္ပၑ္စာဒ် ဝြဇိတွာ မဟာယာဇကသျာဋ္ဋာလိကာံ ပြဝိၑျ ဒါသဲး သဟိတ ဥပါဝိၑတ်၊
౫౮పేతురు దూరం నుండి వెంబడిస్తూ, ప్రధాన యాజకుడి ఇంటి గుమ్మం వరకూ వచ్చి, లోపలికి వెళ్ళి ఏమి జరగబోతున్నదో చూడాలని అక్కడ ఉన్న సైనికులతో కలిసి కూర్చున్నాడు.
59 တဒါနီံ ပြဓာနယာဇကပြာစီနမန္တြိဏး သရွွေ ယီၑုံ ဟန္တုံ မၖၐာသာက္ၐျမ် အလိပ္သန္တ,
౫౯ముఖ్య యాజకులు, మహాసభ సభ్యులంతా యేసును చంపించాలని ఆయనకు వ్యతిరేకంగా దొంగసాక్ష్యం కోసం వెదికారు.
60 ကိန္တု န လေဘိရေ၊ အနေကေၐု မၖၐာသာက္ၐိၐွာဂတေၐွပိ တန္န ပြာပုး၊
౬౦అబద్ధ సాక్షులు చాలామంది వచ్చినా వారి సాక్ష్యం నిలబడలేదు.
61 ၑေၐေ ဒွေါ် မၖၐာသာက္ၐိဏာဝါဂတျ ဇဂဒတုး, ပုမာနယမကထယတ်, အဟမီၑွရမန္ဒိရံ ဘံက္တွာ ဒိနတြယမဓျေ တန္နိရ္မ္မာတုံ ၑက္နောမိ၊
౬౧చివరికి ఇద్దరు మనుషులు వచ్చి, “ఈ మనిషి దేవాలయాన్ని పడగొట్టి, మూడు రోజుల్లో దాన్ని తిరిగి కడతానని చెప్పాడు” అన్నారు.
62 တဒါ မဟာယာဇက ဥတ္ထာယ ယီၑုမ် အဝါဒီတ်၊ တွံ ကိမပိ န ပြတိဝဒသိ? တွာမဓိ ကိမေတေ သာက္ၐျံ ဝဒန္တိ?
౬౨అప్పుడు ప్రధాన యాజకుడు లేచి, “నీవు జవాబు చెప్పవేమిటి? వీరు నీకు వ్యతిరేకంగా పలికిన సాక్ష్యం విషయం ఏమంటావు?” అని అడిగాడు. యేసు మౌనం వహించాడు.
63 ကိန္တု ယီၑု ရ္မော်နီဘူယ တသျော်၊ တတော မဟာယာဇက ဥက္တဝါန်, တွာမ် အမရေၑွရနာမ္နာ ၑပယာမိ, တွမီၑွရသျ ပုတြော'ဘိၐိက္တော ဘဝသိ နဝေတိ ဝဒ၊
౬౩అందుకు ప్రధాన యాజకుడు ఆయనతో, “సజీవుడైన దేవుని నామంలో నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను, నీవు దేవుని కుమారుడు క్రీస్తువా? మాతో చెప్పు!” అన్నాడు.
64 ယီၑုး ပြတျဝဒတ်, တွံ သတျမုက္တဝါန်; အဟံ ယုၐ္မာန် တထျံ ဝဒါမိ, ဣတးပရံ မနုဇသုတံ သရွွၑက္တိမတော ဒက္ၐိဏပါရ္ၑွေ သ္ထာတုံ ဂဂဏသ္ထံ ဇလဓရာနာရုဟျာယာန္တံ ဝီက္ၐဓွေ၊
౬౪అందుకు యేసు, “నీకై నీవే ఆ మాట చెప్పావు కదా. నేను చెప్పేదేమంటే, ఇక నుండి మనుష్య కుమారుడు సర్వశక్తిమంతుని కుడి పక్కన కూర్చోవడమూ, ఆకాశ మేఘాల మీద ఆసీనుడై రావడమూ మీరు చూస్తారు” అన్నాడు.
65 တဒါ မဟာယာဇကော နိဇဝသနံ ဆိတ္တွာ ဇဂါဒ, ဧၐ ဤၑွရံ နိန္ဒိတဝါန်, အသ္မာကမပရသာက္ၐျေဏ ကိံ ပြယောဇနံ? ပၑျတ, ယူယမေဝါသျာသျာဒ် ဤၑွရနိန္ဒာံ ၑြုတဝန္တး,
౬౫వెంటనే ఆ ప్రధాన యాజకుడు తన వస్త్రం చింపుకున్నాడు. “వీడు దేవదూషణ చేశాడు. అతని దేవదూషణ మీరే విన్నారు కదా, మనకింక సాక్షులతో పనేముంది?
66 ယုၐ္မာဘိး ကိံ ဝိဝိစျတေ? တေ ပြတျူစုး, ဝဓာရှော'ယံ၊
౬౬మీరేమంటారు?” అని సభవారిని అడిగాడు. అందుకు వారు, “వీడు చావుకు తగినవాడు!” అన్నారు.
67 တတော လောကဲသ္တဒါသျေ နိၐ္ဌီဝိတံ ကေစိတ် ပြတလမာဟတျ ကေစိစ္စ စပေဋမာဟတျ ဗဘာၐိရေ,
౬౭అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్మి వేసి, ఆయనను గుద్దారు.
68 ဟေ ခြီၐ္ဋ တွာံ ကၑ္စပေဋမာဟတဝါန်? ဣတိ ဂဏယိတွာ ဝဒါသ္မာန်၊
౬౮కొందరు ఆయనను అరచేతులతో కొట్టి, “క్రీస్తూ! నిన్ను కొట్టింది ఎవరో ప్రవచించు!” అన్నారు.
69 ပိတရော ဗဟိရင်္ဂန ဥပဝိၑတိ, တဒါနီမေကာ ဒါသီ တမုပါဂတျ ဗဘာၐေ, တွံ ဂါလီလီယယီၑေား သဟစရဧကး၊
౬౯పేతురు బయట వసారాలో కూర్చుని ఉన్నాడు. ఒక పనిపిల్ల అతని దగ్గరికి వచ్చి, “నీవు గలిలయ వాడైన యేసుతో ఉన్నావు కదా?” అని అడిగింది.
70 ကိန္တု သ သရွွေၐာံ သမက္ၐမ် အနင်္ဂီကၖတျာဝါဒီတ်, တွယာ ယဒုစျတေ, တဒရ္ထမဟံ န ဝေဒ္မိ၊
౭౦అందుకు అతడు, “నీవు చెప్పే సంగతి నాకు తెలియదు” అని అందరి ముందూ అన్నాడు.
71 တဒါ တသ္မိန် ဗဟိရ္ဒွါရံ ဂတေ 'နျာ ဒါသီ တံ နိရီက္ၐျ တတြတျဇနာနဝဒတ်, အယမပိ နာသရတီယယီၑုနာ သာရ္ဒ္ဓမ် အာသီတ်၊
౭౧అతడు నడవలోకి వెళ్ళినపుడు మరొక పని పిల్ల అతణ్ణి చూసి, “ఇతడు కూడా నజరేతు వాడైన యేసుతో కలిసి ఉండేవాడు” అని అక్కడున్న వారితో చెప్పింది.
72 တတး သ ၑပထေန ပုနရနင်္ဂီကၖတျ ကထိတဝါန်, တံ နရံ န ပရိစိနောမိ၊
౭౨పేతురు మళ్ళీ ఒప్పుకోక ఈసారి ఒట్టు పెట్టుకుంటూ, “ఆ మనిషి ఎవరో నాకు తెలియదు” అన్నాడు.
73 က္ၐဏာတ် ပရံ တိၐ္ဌန္တော ဇနာ ဧတျ ပိတရမ် အဝဒန်, တွမဝၑျံ တေၐာမေက ဣတိ တွဒုစ္စာရဏမေဝ ဒျောတယတိ၊
౭౩కొంతసేపటి తరువాత అక్కడ నిలబడిన కొందరు పేతురు దగ్గరికి వచ్చి, “నిజమే, నువ్వు కూడా వారిలో ఒకడివే. నీ మాట్లాడే విధానం వల్ల అది తెలిసిపోతున్నది” అన్నారు.
74 ကိန္တု သော'ဘိၑပျ ကထိတဝါန်, တံ ဇနံ နာဟံ ပရိစိနောမိ, တဒါ သပဒိ ကုက္ကုဋော ရုရာဝ၊
౭౪దానితో పేతురు, “ఆ మనిషిని నేను ఎరగనే ఎరగను” అంటూ, ఒట్లు, శాపనార్ధాలూ పెట్టుకోవడం ప్రారంభించాడు. ఆ వెంటనే కోడి కూసింది.
75 ကုက္ကုဋရဝါတ် ပြာက် တွံ မာံ တြိရပါဟ္နောၐျသေ, ယဲၐာ ဝါဂ် ယီၑုနာဝါဒိ တာံ ပိတရး သံသ္မၖတျ ဗဟိရိတွာ ခေဒါဒ် ဘၖၑံ စကြန္ဒ၊
౭౫“ఈ రాత్రి కోడి కూసే ముందే నేనెవరో తెలియదని నువ్వు మూడుసార్లు చెబుతావు” అని యేసు తనతో చెప్పిన సంగతి జ్ఞాపకం చేసుకుని పేతురు బయటికి వెళ్ళి ఎంతో దుఃఖంతో పెద్దగా ఏడ్చాడు.

< မထိး 26 >