< မာရ္ကး 1 >
1 ဤၑွရပုတြသျ ယီၑုခြီၐ္ဋသျ သုသံဝါဒါရမ္ဘး၊
౧దేవుని కుమారుడు యేసు క్రీస్తు గురించిన సువార్త ఆరంభం.
2 ဘဝိၐျဒွါဒိနာံ ဂြန္ထေၐု လိပိရိတ္ထမာသ္တေ, ပၑျ သွကီယဒူတန္တု တဝါဂြေ ပြေၐယာမျဟမ်၊ ဂတွာ တွဒီယပန္ထာနံ သ ဟိ ပရိၐ္ကရိၐျတိ၊
౨యెషయా ప్రవక్త రాసిన గ్రంథంలో ఇలా ఉంది, “ఇదిగో, నా దూతను నీకు ముందుగా పంపుతున్నాను. అతడు నీ మార్గం సిద్ధపరుస్తాడు.
3 "ပရမေၑသျ ပန္ထာနံ ပရိၐ္ကုရုတ သရွွတး၊ တသျ ရာဇပထဉ္စဲဝ သမာနံ ကုရုတာဓုနာ၊ " ဣတျေတတ် ပြာန္တရေ ဝါကျံ ဝဒတး ကသျစိဒြဝး။
౩‘ప్రభువు మార్గం సిద్ధం చేయండి, ఆయన దారులు తిన్నగా చేయండి’ అని అరణ్యంలో ఒకడి కేక వినిపిస్తూ ఉంది.”
4 သဧဝ ယောဟန် ပြာန္တရေ မဇ္ဇိတဝါန် တထာ ပါပမာရ္ဇနနိမိတ္တံ မနောဝျာဝရ္တ္တကမဇ္ဇနသျ ကထာဉ္စ ပြစာရိတဝါန်၊
౪యోహాను వచ్చినపుడు అరణ్య ప్రాంతంలో బాప్తిసం ఇస్తూ, పాప క్షమాపణ కోసం పశ్చాత్తాపానికి సూచనగా ఉన్న బాప్తిసం గురించి ప్రకటించాడు.
5 တတော ယိဟူဒါဒေၑယိရူၑာလမ္နဂရနိဝါသိနး သရွွေ လောကာ ဗဟိ ရ္ဘူတွာ တသျ သမီပမာဂတျ သွာနိ သွာနိ ပါပါနျင်္ဂီကၖတျ ယရ္ဒ္ဒနနဒျာံ တေန မဇ္ဇိတာ ဗဘူဝုး၊
౫యూదయ ప్రాంతం, యెరూషలేము పట్టణం వారంతా, యోహాను దగ్గరికి వెళ్లి, తమ పాపాలు ఒప్పుకుని, యొర్దాను నదిలో అతని చేత బాప్తిసం పొందారు.
6 အသျ ယောဟနး ပရိဓေယာနိ ကြမေလကလောမဇာနိ, တသျ ကဋိဗန္ဓနံ စရ္မ္မဇာတမ်, တသျ ဘက္ၐျာဏိ စ ၑူကကီဋာ ဝနျမဓူနိ စာသန်၊
౬యోహాను ఒంటె వెంట్రుకలతో చేసిన బట్టలు వేసుకుని, నడుముకు తోలు నడికట్టు కట్టుకునేవాడు. అడవి తేనె, మిడతలు అతని ఆహారం.
7 သ ပြစာရယန် ကထယာဉ္စကြေ, အဟံ နမြီဘူယ ယသျ ပါဒုကာဗန္ဓနံ မောစယိတုမပိ န ယောဂျောသ္မိ, တာဒၖၑော မတ္တော ဂုရုတရ ဧကး ပုရုၐော မတ္ပၑ္စာဒါဂစ္ဆတိ၊
౭యోహాను, “నాకంటే శక్తి గలవాడు నా తరువాత వస్తున్నాడు. నేను వంగి ఆయన చెప్పులు విప్పడానికి కూడా తగను” అని ప్రకటించాడు.
8 အဟံ ယုၐ္မာန် ဇလေ မဇ္ဇိတဝါန် ကိန္တု သ ပဝိတြ အာတ္မာနိ သံမဇ္ဇယိၐျတိ၊
౮“నేను మీకు నీళ్లలో బాప్తిసం ఇచ్చాను గాని ఆయన మీకు దేవుని పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇస్తాడు” అన్నాడు.
9 အပရဉ္စ တသ္မိန္နေဝ ကာလေ ဂါလီလ္ပြဒေၑသျ နာသရဒ္ဂြာမာဒ် ယီၑုရာဂတျ ယောဟနာ ယရ္ဒ္ဒနနဒျာံ မဇ္ဇိတော'ဘူတ်၊
౯యోహాను ఇలా ప్రకటిస్తున్న రోజుల్లో గలిలయ ప్రాంతంలోని నజరేతు నుండి యేసు వచ్చి యోహాను చేత యొర్దాను నదిలో బాప్తిసం తీసుకున్నాడు.
10 သ ဇလာဒုတ္ထိတမာတြော မေဃဒွါရံ မုက္တံ ကပေါတဝတ် သွသျောပရိ အဝရောဟန္တမာတ္မာနဉ္စ ဒၖၐ္ဋဝါန်၊
౧౦యేసు నీళ్లలో నుండి ఒడ్డుకు వచ్చినప్పుడు ఆకాశం చీలి, దేవుని ఆత్మ పావురం రూపంలో తన మీదికి దిగి రావడం చూశాడు.
11 တွံ မမ ပြိယး ပုတြသ္တွယျေဝ မမမဟာသန္တောၐ ဣယမာကာၑီယာ ဝါဏီ ဗဘူဝ၊
౧౧అప్పుడు ఆకాశం నుండి ఒక స్వరం ఇలా వినిపించింది, “నీవు నా ప్రియ కుమారుడివి, నీ విషయం నాకెంతో ఆనందం.”
12 တသ္မိန် ကာလေ အာတ္မာ တံ ပြာန္တရမဓျံ နိနာယ၊
౧౨వెంటనే దేవుని ఆత్మ ఆయనను అరణ్య ప్రాంతానికి తీసుకు వెళ్ళాడు.
13 အထ သ စတွာရိံၑဒ္ဒိနာနိ တသ္မိန် သ္ထာနေ ဝနျပၑုဘိး သဟ တိၐ္ဌန် ၑဲတာနာ ပရီက္ၐိတး; ပၑ္စာတ် သွရ္ဂီယဒူတာသ္တံ သိၐေဝိရေ၊
౧౩ఆయన అక్కడ నలభై రోజులుండి సైతాను చేత పరీక్షలకు గురయ్యాడు. అడవి మృగాల మధ్య జీవించాడు. దేవుని దూతలు ఆయనకు సపర్యలు చేశారు.
14 အနန္တရံ ယောဟနိ ဗန္ဓနာလယေ ဗဒ္ဓေ သတိ ယီၑု ရ္ဂာလီလ္ပြဒေၑမာဂတျ ဤၑွရရာဇျသျ သုသံဝါဒံ ပြစာရယန် ကထယာမာသ,
౧౪యోహానును చెరసాలలో వేసిన తరవాత యేసు గలిలయ ప్రాంతానికి వచ్చి దేవుని రాజ్య సువార్తను బోధిస్తూ,
15 ကာလး သမ္ပူရ္ဏ ဤၑွရရာဇျဉ္စ သမီပမာဂတံ; အတောဟေတော ရျူယံ မနာံသိ ဝျာဝရ္တ္တယဓွံ သုသံဝါဒေ စ ဝိၑွာသိတ၊
౧౫“కాలం సమీపించింది, దేవుని రాజ్యం దగ్గర పడింది. పశ్చాత్తాపపడి సువార్తను నమ్మండి” అని ప్రకటించాడు.
16 တဒနန္တရံ သ ဂါလီလီယသမုဒြသျ တီရေ ဂစ္ဆန် ၑိမောန် တသျ ဘြာတာ အန္ဒြိယနာမာ စ ဣမော် ဒွေါ် ဇနော် မတ္သျဓာရိဏော် သာဂရမဓျေ ဇာလံ ပြက္ၐိပန္တော် ဒၖၐ္ဋွာ တာဝဝဒတ်,
౧౬ఆయన గలిలయ సరస్సు ఒడ్డున నడుస్తూ ఉండగా, జాలరులైన సీమోను, అతని సోదరుడు అంద్రెయ సరస్సులో వలవేయడం చూశాడు.
17 ယုဝါံ မမ ပၑ္စာဒါဂစ္ဆတံ, ယုဝါမဟံ မနုၐျဓာရိဏော် ကရိၐျာမိ၊
౧౭యేసు, “నాతో రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టే జాలరులుగా చేస్తాను” అని వారితో అన్నాడు.
18 တတသ္တော် တတ္က္ၐဏမေဝ ဇာလာနိ ပရိတျဇျ တသျ ပၑ္စာတ် ဇဂ္မတုး၊
౧౮వారు వెంటనే వలలను వదిలిపెట్టి ఆయన వెంట వెళ్ళారు.
19 တတး ပရံ တတ္သ္ထာနာတ် ကိဉ္စိဒ် ဒူရံ ဂတွာ သ သိဝဒီပုတြယာကူဗ် တဒ္ဘြာတၖယောဟန် စ ဣမော် နော်ကာယာံ ဇာလာနာံ ဇီရ္ဏမုဒ္ဓါရယန္တော် ဒၖၐ္ဋွာ တာဝါဟူယတ်၊
౧౯ఆయన ఇంకా కొంతదూరం వెళ్ళి జెబెదయి కుమారుడు యాకోబునూ, అతని సోదరుడు యోహానునూ చూశాడు. వారు పడవలో ఉండి వారి వలలు బాగు చేసుకుంటున్నారు.
20 တတသ္တော် နော်ကာယာံ ဝေတနဘုဂ္ဘိး သဟိတံ သွပိတရံ ဝိဟာယ တတ္ပၑ္စာဒီယတုး၊
౨౦వారిని చూసిన వెంటనే తన వెంట రమ్మని యేసు వారిని పిలిచాడు. వారు తమ తండ్రి జెబెదయిని పడవలో పనివారి దగ్గర విడిచిపెట్టి యేసు వెంట వచ్చారు.
21 တတး ပရံ ကဖရ္နာဟူမ္နာမကံ နဂရမုပသ္ထာယ သ ဝိၑြာမဒိဝသေ ဘဇနဂြဟံ ပြဝိၑျ သမုပဒိဒေၑ၊
౨౧తరువాత వారందరూ కపెర్నహూము అనే పట్టణంలో విశ్రాంతి దినాన ఆయన యూదుల సమాజ మందిరంలోకి వెళ్ళి వారికి బోధించాడు.
22 တသျောပဒေၑာလ္လောကာ အာၑ္စရျျံ မေနိရေ ယတး သောဓျာပကာဣဝ နောပဒိၑန် ပြဘာဝဝါနိဝ ပြောပဒိဒေၑ၊
౨౨ధర్మశాస్త్ర పండితుల్లాగా కాకుండా అధికారం కలిగిన వాడిలాగా వారికి బోధించడం చూసి వారంతా ఆయన ఉపదేశానికి ఆశ్చర్యపడ్డారు.
23 အပရဉ္စ တသ္မိန် ဘဇနဂၖဟေ အပဝိတြဘူတေန ဂြသ္တ ဧကော မာနုၐ အာသီတ်၊ သ စီတ္ၑဗ္ဒံ ကၖတွာ ကထယာဉ္စကေ
౨౩అదే సమయంలో దయ్యం పట్టిన వాడొకడు ఆ సమాజ మందిరంలో ఉన్నాడు.
24 ဘော နာသရတီယ ယီၑော တွမသ္မာန် တျဇ, တွယာ သဟာသ္မာကံ ကး သမ္ဗန္ဓး? တွံ ကိမသ္မာန် နာၑယိတုံ သမာဂတး? တွမီၑွရသျ ပဝိတြလောက ဣတျဟံ ဇာနာမိ၊
౨౪వాడు, “నజరేతువాడవైన యేసూ, మాతో నీకేం పని? మమ్మల్ని నాశనం చెయ్యడానికి వచ్చావా? నీవెవరివో నాకు తెలుసు. నీవు దేవుని పరిశుద్ధుడివి!” అని కేకలు వేశాడు.
25 တဒါ ယီၑုသ္တံ တရ္ဇယိတွာ ဇဂါဒ တူၐ္ဏီံ ဘဝ ဣတော ဗဟိရ္ဘဝ စ၊
౨౫యేసు దురాత్మను గద్దిస్తూ, “మాట్లాడకు, ఇతన్ని వదిలి వెళ్ళు” అన్నాడు.
26 တတး သော'ပဝိတြဘူတသ္တံ သမ္ပီဍျ အတျုစဲၑ္စီတ္ကၖတျ နိရ္ဇဂါမ၊
౨౬ఆ దయ్యం అతన్ని గిజగిజలాడించి పెద్దగా కేకలు పెట్టి అతనిలో నుంచి బయటకు వెళ్ళిపోయింది.
27 တေနဲဝ သရွွေ စမတ္ကၖတျ ပရသ္ပရံ ကထယာဉ္စကြိရေ, အဟော ကိမိဒံ? ကီဒၖၑော'ယံ နဝျ ဥပဒေၑး? အနေန ပြဘာဝေနာပဝိတြဘူတေၐွာဇ္ဉာပိတေၐု တေ တဒါဇ္ဉာနုဝရ္တ္တိနော ဘဝန္တိ၊
౨౭ప్రజలంతా ఆశ్చర్యపోయారు. వారు, “ఇదేమిటి? అధికార పూర్వకమైన ఈ కొత్త ఉపదేశం! ఈయన దయ్యాలను కూడా ఆజ్ఞాపిస్తున్నాడు! అవి కూడా ఈయన మాటకు లొంగుతున్నాయి!” అని తమలో తాము చర్చించుకున్నారు.
28 တဒါ တသျ ယၑော ဂါလီလၑ္စတုရ္ဒိက္သ္ထသရွွဒေၑာန် ဝျာပ္နောတ်၊
౨౮ఆయన్ని గూర్చిన సమాచారం గలిలయ ప్రాంతమంతా త్వరగా వ్యాపించింది.
29 အပရဉ္စ တေ ဘဇနဂၖဟာဒ် ဗဟိ ရ္ဘူတွာ ယာကူဗျောဟန္ဘျာံ သဟ ၑိမောန အာန္ဒြိယသျ စ နိဝေၑနံ ပြဝိဝိၑုး၊
౨౯సమాజ మందిరం నుండి బయటకు వచ్చిన వెంటనే వారు సీమోను, అంద్రెయల ఇంట్లో ప్రవేశించారు. యాకోబు, యోహాను కూడా వారితో ఉన్నారు.
30 တဒါ ပိတရသျ ၑွၑြူရ္ဇွရပီဍိတာ ၑယျာယာမာသ္တ ဣတိ တေ တံ ဈဋိတိ ဝိဇ္ဉာပယာဉ္စကြုး၊
౩౦సీమోను అత్త జ్వరంతో మంచం పట్టి ఉంది. వెంటనే వారు ఆమె గురించి ఆయనతో చెప్పారు.
31 တတး သ အာဂတျ တသျာ ဟသ္တံ ဓၖတွာ တာမုဒသ္ထာပယတ်; တဒဲဝ တာံ ဇွရော'တျာက္ၐီတ် တတး ပရံ သာ တာန် သိၐေဝေ၊
౩౧ఆయన ఆమె దగ్గరికి వచ్చి, ఆమె చెయ్యి పట్టుకుని లేవనెత్తిన వెంటనే జ్వరం ఆమెను వదిలిపోయి, ఆమె అందరికీ సపర్యలు చేయసాగింది.
32 အထာသ္တံ ဂတေ ရဝေါ် သန္ဓျာကာလေ သတိ လောကာသ္တတ္သမီပံ သရွွာန် ရောဂိဏော ဘူတဓၖတာံၑ္စ သမာနိနျုး၊
౩౨సాయంకాలం, సూర్యుడు అస్తమించిన తరువాత ప్రజలు రోగులనూ, దయ్యాలు పట్టిన వారినీ ఆయన దగ్గరికి తీసుకువచ్చారు.
33 သရွွေ နာဂရိကာ လောကာ ဒွါရိ သံမိလိတာၑ္စ၊
౩౩ఆ పట్టణమంతా ఆ ఇంటి దగ్గర గుమిగూడారు.
34 တတး သ နာနာဝိဓရောဂိဏော ဗဟူန် မနုဇာနရောဂိဏၑ္စကာရ တထာ ဗဟူန် ဘူတာန် တျာဇယာဉ္စကာရ တာန် ဘူတာန် ကိမပိ ဝါကျံ ဝက္တုံ နိၐိၐေဓ စ ယတောဟေတောသ္တေ တမဇာနန်၊
౩౪రకరకాల రోగాలతో ఉన్న వారిని యేసు బాగు చేశాడు. ఎన్నో దయ్యాలను వెళ్ళగొట్టాడు. తాను ఎవరో ఆ దయ్యాలకు తెలుసు గనుక ఆయన వాటిని మాట్లాడనివ్వలేదు.
35 အပရဉ္စ သော'တိပြတျူၐေ ဝသ္တုတသ္တု ရာတြိၑေၐေ သမုတ္ထာယ ဗဟိရ္ဘူယ နိရ္ဇနံ သ္ထာနံ ဂတွာ တတြ ပြာရ္ထယာဉ္စကြေ၊
౩౫ఇంకా తెల్లవారక ముందే యేసు లేచి ఆ పట్టణం బయట ఏకాంత ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రార్థనలో గడిపాడు.
36 အနန္တရံ ၑိမောန် တတ္သင်္ဂိနၑ္စ တသျ ပၑ္စာဒ် ဂတဝန္တး၊
౩౬సీమోను, అతనితో ఉన్నవారు యేసును వెదకడానికి వెళ్ళారు.
37 တဒုဒ္ဒေၑံ ပြာပျ တမဝဒန် သရွွေ လောကာသ္တွာံ မၖဂယန္တေ၊
౩౭ఆయన కనబడినప్పుడు, “అందరూ నీ కోసం వెదుకుతున్నారు” అని ఆయనతో అన్నారు.
38 တဒါ သော'ကထယတ် အာဂစ္ဆတ ဝယံ သမီပသ္ထာနိ နဂရာဏိ ယာမး, ယတော'ဟံ တတြ ကထာံ ပြစာရယိတုံ ဗဟိရာဂမမ်၊
౩౮ఆయన వారితో, “చుట్టుపక్కల గ్రామాలకు వెళ్దాం పదండి. అక్కడ కూడా నేను ప్రకటించాలి. నేను ఈ లోకానికి వచ్చింది అందుకే” అన్నాడు.
39 အထ သ တေၐာံ ဂါလီလ္ပြဒေၑသျ သရွွေၐု ဘဇနဂၖဟေၐု ကထား ပြစာရယာဉ္စကြေ ဘူတာနတျာဇယဉ္စ၊
౩౯ఆయన గలిలయ ప్రాంతమంతటా తిరుగుతూ, యూదుల సమాజ మందిరాల్లో బోధిస్తూ, దయ్యాలను వెళ్ళగొడుతూ ఉన్నాడు.
40 အနန္တရမေကး ကုၐ္ဌီ သမာဂတျ တတ္သမ္မုခေ ဇာနုပါတံ ဝိနယဉ္စ ကၖတွာ ကထိတဝါန် ယဒိ ဘဝါန် ဣစ္ဆတိ တရှိ မာံ ပရိၐ္ကရ္တ္တုံ ၑက္နောတိ၊
౪౦ఒక కుష్టురోగి ఆయన దగ్గరికి వచ్చి ఆయన ముందు మోకరిల్లి, “నీకిష్టమైతే నన్ను బాగు చేయగలవు” అని ఆయనను బతిమాలాడు.
41 တတး ကၖပါလု ရျီၑုး ကရော် ပြသာရျျ တံ သ္ပၐ္ဋွာ ကထယာမာသ
౪౧యేసు అతనిపై జాలిపడి, తన చెయ్యి చాపి అతన్ని తాకి “నిన్ను బాగు చేయడం నాకిష్టమే, స్వస్థత పొందు” అన్నాడు.
42 မမေစ္ဆာ ဝိဒျတေ တွံ ပရိၐ္ကၖတော ဘဝ၊ ဧတတ္ကထာယား ကထနမာတြာတ် သ ကုၐ္ဌီ ရောဂါန္မုက္တး ပရိၐ္ကၖတော'ဘဝတ်၊
౪౨వెంటనే కుష్టురోగం అతన్ని వదలిపోయింది. అతడు శుద్ధి అయ్యాడు.
43 တဒါ သ တံ ဝိသၖဇန် ဂါဎမာဒိၑျ ဇဂါဒ
౪౩ఆయన అతన్ని పంపివేస్తూ, “ఈ విషయం ఎవ్వరితో చెప్పవద్దు సుమా,” అని అతన్ని హెచ్చరించి,
44 သာဝဓာနော ဘဝ ကထာမိမာံ ကမပိ မာ ဝဒ; သွာတ္မာနံ ယာဇကံ ဒရ္ၑယ, လောကေဘျး သွပရိၐ္ကၖတေး ပြမာဏဒါနာယ မူသာနိရ္ဏီတံ ယဒ္ဒါနံ တဒုတ္သၖဇသွ စ၊
౪౪“నువ్వు శుద్ధుడివైనట్టు యాజకునికి కనిపించి మోషే ఆజ్ఞాపించిన ప్రకారం అర్పణలు అర్పించు” అన్నాడు.
45 ကိန္တု သ ဂတွာ တတ် ကရ္မ္မ ဣတ္ထံ ဝိသ္တာရျျ ပြစာရယိတုံ ပြာရေဘေ တေနဲဝ ယီၑုး ပုနး သပြကာၑံ နဂရံ ပြဝေၐ္ဋုံ နာၑက္နောတ် တတောဟေတောရ္ဗဟိး ကာနနသ္ထာနေ တသျော်; တထာပိ စတုရ္ဒ္ဒိဂ္ဘျော လောကာသ္တသျ သမီပမာယယုး၊
౪౫కానీ అతడు వెళ్ళి అందరికీ ఈ విషయం చాటించసాగాడు. ఆ కారణంగా యేసు ఆ పట్టణాల్లో బహిరంగంగా వెళ్ళలేక బయట నిర్జన ప్రదేశాల్లో ఉండిపోవలసి వచ్చింది. అందువలన వివిధ ప్రాంతాల నుండి ప్రజలే ఆయన దగ్గరికి వస్తూ ఉన్నారు.