< ဣဗြိဏး 4 >

1 အပရံ တဒွိၑြာမပြာပ္တေး ပြတိဇ္ဉာ ယဒိ တိၐ္ဌတိ တရှျသ္မာကံ ကၑ္စိတ် စေတ် တသျား ဖလေန ဝဉ္စိတော ဘဝေတ် ဝယမ် ဧတသ္မာဒ် ဗိဘီမး၊
అందుచేత, ‘దేవుని విశ్రాంతిలో ప్రవేశిస్తాం’ అన్న వాగ్దానం ఇంకా కొనసాగుతూ ఉన్నప్పుడే, మీలో ఎవరికైనా ఆ వాగ్దానం దక్కకుండా పోతుందేమో అని జాగ్రత్త పడండి.
2 ယတော 'သ္မာကံ သမီပေ ယဒွတ် တဒွတ် တေၐာံ သမီပေ'ပိ သုသံဝါဒး ပြစာရိတော 'ဘဝတ် ကိန္တု တဲး ၑြုတံ ဝါကျံ တာန် ပြတိ နိၐ္ဖလမ် အဘဝတ်, ယတသ္တေ ၑြောတာရော ဝိၑွာသေန သာရ္ဒ္ဓံ တန္နာမိၑြယန်၊
విశ్రాంతిని గూర్చిన సువార్త ఇశ్రాయేలీయులకు ప్రకటించినట్టే మనకూ ప్రకటించడం జరిగింది. కానీ విన్న దానికి తమ విశ్వాసం జోడించని వారికి ఆ ప్రకటన వ్యర్ధమై పోయింది.
3 တဒ် ဝိၑြာမသ္ထာနံ ဝိၑွာသိဘိရသ္မာဘိး ပြဝိၑျတေ ယတသ္တေနောက္တံ, "အဟံ ကောပါတ် ၑပထံ ကၖတဝါန် ဣမံ, ပြဝေက္ၐျတေ ဇနဲရေတဲ ရ္န ဝိၑြာမသ္ထလံ မမ၊ " ကိန္တု တသျ ကရ္မ္မာဏိ ဇဂတး သၖၐ္ဋိကာလာတ် သမာပ္တာနိ သန္တိ၊
అయితే విశ్వసించిన మనమే ఆ విశ్రాంతిలో ప్రవేశించేది. రాసి ఉన్న దాని ప్రకారం లోకం ఆరంభం నుండి తన సృష్టి కార్యమంతా ముగిసినా ఆయన, “నేను నా తీవ్ర ఆగ్రహంతో శపథం చేశాను. వారు నా విశ్రాంతిలో ప్రవేశించరు” అన్నాడు.
4 ယတး ကသ္မိံၑ္စိတ် သ္ထာနေ သပ္တမံ ဒိနမဓိ တေနေဒမ် ဥက္တံ, ယထာ, "ဤၑွရး သပ္တမေ ဒိနေ သွကၖတေဘျး သရွွကရ္မ္မဘျော ဝိၑၑြာမ၊ "
మరో చోట ఏడవ దినం గూర్చి చెబుతూ, “దేవుడు ఏడవ రోజు తన పనులన్నీ ముగించి, విశ్రాంతి తీసుకున్నాడు” అన్నాడు.
5 ကိန္တွေတသ္မိန် သ္ထာနေ ပုနသ္တေနောစျတေ, ယထာ, "ပြဝေက္ၐျတေ ဇနဲရေတဲ ရ္န ဝိၑြာမသ္ထလံ မမ၊ "
మళ్లీ “వారు నా విశ్రాంతిలో ప్రవేశించరు” అని చెప్పాడు.
6 ဖလတသ္တတ် သ္ထာနံ ကဲၑ္စိတ် ပြဝေၐ္ဋဝျံ ကိန္တု ယေ ပုရာ သုသံဝါဒံ ၑြုတဝန္တသ္တဲရဝိၑွာသာတ် တန္န ပြဝိၐ္ဋမ်,
దేవుని విశ్రాంతి కొందరు ప్రవేశించడానికి ఏర్పడిందన్నది స్పష్టం. కాబట్టి, ఎవరికైతే సువార్త ముందుగా ప్రకటించబడిందో వారు తమ అవిధేయత కారణంగా దానిలో ప్రవేశించలేక పోయారు.
7 ဣတိ ဟေတေား သ ပုနရဒျနာမကံ ဒိနံ နိရူပျ ဒီရ္ဃကာလေ ဂတေ'ပိ ပူရွွောက္တာံ ဝါစံ ဒါယူဒါ ကထယတိ, ယထာ, "အဒျ ယူယံ ကထာံ တသျ ယဒိ သံၑြောတုမိစ္ဆထ, တရှိ မာ ကုရုတေဒါနီံ ကဌိနာနိ မနာံသိ ဝး၊ "
కాబట్టి దేవుడు, “ఈ దినం” అనే ఒక ప్రత్యేక దినాన్ని నిర్ణయించాడు. మొదట దీన్ని గూర్చిన ప్రస్తావన జరిగిన చాలా కాలానికి, తిరిగి దావీదు ద్వారా ఆయన మాట్లాడినప్పుడు, ఆయన ఇలా అన్నాడు, “మీరు మీ హృదయాలను కఠినపరచుకోకుండా నేడు ఆయన స్వరం వింటే మేలు.”
8 အပရံ ယိဟောၑူယော ယဒိ တာန် ဝျၑြာမယိၐျတ် တရှိ တတး ပရမ် အပရသျ ဒိနသျ ဝါဂ် ဤၑွရေဏ နာကထယိၐျတ၊
ఒక వేళ యెహోషువ వారికి విశ్రాంతి ఇవ్వగలిగితే దేవుడు మరొక రోజు గూర్చి చెప్పేవాడు కాదు.
9 အတ ဤၑွရသျ ပြဇာဘိး ကရ္တ္တဝျ ဧကော ဝိၑြာမသ္တိၐ္ဌတိ၊
కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉంది.
10 အပရမ် ဤၑွရော ယဒွတ် သွကၖတကရ္မ္မဘျော ဝိၑၑြာမ တဒွတ် တသျ ဝိၑြာမသ္ထာနံ ပြဝိၐ္ဋော ဇနော'ပိ သွကၖတကရ္မ္မဘျော ဝိၑြာမျတိ၊
౧౦ఎందుకంటే దేవుడు తన పనులన్నీ చేసి ముగించి విశ్రాంతి తీసుకున్నట్లే ఆయన విశ్రాంతిలో ప్రవేశించేవాడు కూడా తన పనులన్నీ ముగించి విశ్రాంతిలో ప్రవేశిస్తాడు.
11 အတော ဝယံ တဒ် ဝိၑြာမသ္ထာနံ ပြဝေၐ္ဋုံ ယတာမဟဲ, တဒဝိၑွာသောဒါဟရဏေန ကော'ပိ န ပတတု၊
౧౧కాబట్టి, వారిలా అవిధేయతలో పడిపోకుండా, ఆ విశ్రాంతిలో ప్రవేశించడానికి ఆత్రుత పడదాం.
12 ဤၑွရသျ ဝါဒေါ'မရး ပြဘာဝဝိၑိၐ္ဋၑ္စ သရွွသ္မာဒ် ဒွိဓာရခင်္ဂါဒပိ တီက္ၐ္ဏး, အပရံ ပြာဏာတ္မနော ရ္ဂြန္ထိမဇ္ဇယောၑ္စ ပရိဘေဒါယ ဝိစ္ဆေဒကာရီ မနသၑ္စ သင်္ကလ္ပာနာမ် အဘိပြေတာနာဉ္စ ဝိစာရကး၊
౧౨ఎందుకంటే దేవుని వాక్కు సజీవమైనది, క్రియాశీలకమైనది, రెండంచులు ఉన్న ఎలాంటి కత్తి కంటే కూడా పదునుగా ఉండి ప్రాణం నుండి ఆత్మనూ, కీళ్ళ నుండి మూలుగనూ విభజించగలిగేంత శక్తి గలదిగా ఉంటుంది. అది హృదయంలోని ఆలోచనలపైనా ఉద్దేశాలపైనా తీర్పు చెప్పగలదు.
13 အပရံ ယသျ သမီပေ သွီယာ သွီယာ ကထာသ္မာဘိး ကထယိတဝျာ တသျာဂေါစရး ကော'ပိ ပြာဏီ နာသ္တိ တသျ ဒၖၐ္ဋော် သရွွမေဝါနာဝၖတံ ပြကာၑိတဉ္စာသ္တေ၊
౧౩సృష్టిలో ఆయనకు కనిపించనిది అంటూ ఏదీ లేదు. మనం లెక్క అప్పగించవలసిన దేవుని దృష్టికి అంతా స్పష్టంగా ఉంది.
14 အပရံ ယ ဥစ္စတမံ သွရ္ဂံ ပြဝိၐ္ဋ ဧတာဒၖၑ ဧကော ဝျက္တိရရ္ထတ ဤၑွရသျ ပုတြော ယီၑုရသ္မာကံ မဟာယာဇကော'သ္တိ, အတော ဟေတော ရွယံ ဓရ္မ္မပြတိဇ္ဉာံ ဒၖဎမ် အာလမ္ဗာမဟဲ၊
౧౪ఆకాశాలగుండా వెళ్ళిన దేవుని కుమారుడు యేసు అనే ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కాబట్టి మనం విశ్వసించినదాన్ని గట్టిగా పట్టుకుందాం.
15 အသ္မာကံ ယော မဟာယာဇကော 'သ္တိ သော'သ္မာကံ ဒုးခဲ ရ္ဒုးခိတော ဘဝိတုမ် အၑက္တော နဟိ ကိန္တု ပါပံ ဝိနာ သရွွဝိၐယေ ဝယမိဝ ပရီက္ၐိတး၊
౧౫మన ప్రధాన యాజకుడు మన బలహీనతల పట్ల సానుభూతి లేని వాడు కాడు. ఎందుకంటే ఆయన కూడా మనలాగే శోధన ఎదుర్కొన్నాడు. అయితే ఆయన పాపం లేని వాడుగా ఉన్నాడు.
16 အတဧဝ ကၖပါံ ဂြဟီတုံ ပြယောဇနီယောပကာရာရ္ထမ် အနုဂြဟံ ပြာပ္တုဉ္စ ဝယမ် ဥတ္သာဟေနာနုဂြဟသိံဟာသနသျ သမီပံ ယာမး၊
౧౬కాబట్టి మన అవసరాల్లో ఆయన కృపా కనికరాలకై ధైర్యంతో కృపా సింహాసనం దగ్గరికి వెళ్దాం.

< ဣဗြိဏး 4 >